Friday, 28 September 2018
Election Commision must relieve Telangana police from the clutches of TRS : Dr Sravan Dasoju
Election Commision must relieve Telangana police from the clutches of TRS : Sravan
Streets have turned into slaughter houses in TRS regime: Sravan
Hyderabad, September 27: Telangana
Pradesh Congress Committee (TPCC) Chief Spokesperson Dr. Sravan Dasoju
has alleged that instead of 'Bangaru Telangana', TRS regime has turned
the streets into slaughter houses.
Addressing
a press conference at Gandhi Bhavan on Thursday, Sravan strongly
condemned the murder of a youth in broad day light in full public view
at Attapur in Hyderabad on Wednesday. He said that the brutality and
fearlessness with which the murder was committed clearly shows that the
fear for law and police has vanished from the streets of Telangana. A
similar incident took place in broad day light in Erragadda a few days
ago. Instead of protecting the lives of common people, Telangana police
is busy in pleasing the bosses of 'pink party.
Citing
figures from National Crime Records Bureau, Sravan said that all types
of crimes were on the rise in Telangana State. There was a huge increase
in heinous crimes like rapes and atrocities on women. Instead of
allowing the police to perform its real duties, caretaker Chief Minister
K. Chandrashekhar Rao misused the force to harass political opponents.
AT THE BEHEST OF CARE TAKER CHIEF MINISTER KCR, the Intelligence
Department is misused to conduct 11 different elections surveys on
political situation and to know where TRS is strong or weak.
Intelligence department is failed to find the culprits, but only doing
political intelligence cornering opposition parties.
SRAVAN
QUESTIONED THAT WHAT AUDACITY POLICE BOSSES HAS TO TAKE PART IN
POLITICAL TRAINING CLASSES OF TRS. EVEN IN POLICE STATIONS AND POLICE
CARS, PINK TOWELS ARE BEING USED TO PLEASE PINK PARTY TRS. The present
police at the key positions are completely colluded with TRS party. And
failed to curb the criminals. friendly policing should be towards
victims but not towards criminals. Police should protect the respect and
honor of KHAKI DRESS by being apolitical and be the custodian of Indian
Constitution but not act as the slaves of TRS party.
Sravan
alleged that some police officials were used as a tool to book false
cases against Congress leaders like Jagga Reddy, Srisailam Goud,
Bikshamaiah Goud and others. Now KCR is trying to target TPCC Working
President A. Revanth Reddy by conducting IT raids on his house.
The
TPCC Chief Spokesperson demanded that the indiscriminate POLITICAL
transfers of police officials be stopped immediately. Sravan also
demanded the election commission to intervene and ensure that police is
relived out of the clutches of ruling TRS party or else there will be no
fair and free elections in Telangana (eom)
గులాబీ పార్టీకి గులాములుగా పోలీసులు .....శ్రవణ్ దాసోజు
గులాబీ పార్టీకి గులాములుగా పోలీసులు .....శ్రవణ్ దాసోజు
నాయకుల గొంతును నొక్కేందుకు కేసులతో బెదిరిస్తున్నారని ఆరోపణ
తక్షణమే ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకొని కేసీఆర్ చేతిలోబందీ అయిన పోలీసు వ్యవస్ధకు విముక్తి కలిగించాలని డిమాండ్.
టీఆర్
ఎస్ పాలనలో తెలంగాణా రాష్ట్రం బంగారు తెలంగాణా గా మారుతదనుకుంటే మర్డర్ ల
తెలంగాణాగా మారిపోయిందని, పోలీసుల సమక్షంలోనే విచ్చుకత్తులతో నేరస్తులు
స్వైరవిహారం చేస్తుంటే అడ్డుకోవాల్సిన యంత్రాంగం నిస్తేజంగా వ్యవహస్తుండడం
ప్రమాదకరమని టీపిసిసి కాంపైనింగ్ కమిటీ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిది
డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆందోళన వ్యక్తంచేశారు.ఇవాళ గాంధీభవన్ లో జరిగిన
మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు గులాబీ
పార్టీకి గులామ్ లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బంగారు తెలంగాణా నా మర్డర్ ల తెలంగాణానా
నేరస్తులు
బహిరంగంగా పాశవికంగా హత్యలకు పాల్పడుతున్నా పోలీసుయంత్రాంగం నిమ్మకు
నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. మిర్యాలగూడలో ప్రణయ్ అనే వ్యక్తిని
వేట కత్తులతో మెడనరికినా, అత్తాపూర్లో రమేశ్ అనే వ్యక్తిపై గొడ్డలితో
దాడిచేసి హత్య చేసినా, ఎర్రగడ్డలో హత్యాప్రయత్నాలుచేసినా పోలీసుల యంత్రాంగం
పసిగట్టే పరిస్థితిలో లేకపోవడం ,పక్కనే ఉండి కూడా రక్షించలేక పోవడం ఆందోళన
కలిగించే అంశమన్నారు. నేరస్తులు పోలీసులను నెట్టుకుంటూ పోయి హత్యలకు
పాల్పడుతున్నరంటే వారి పట్ల చులకన భావం ఏర్పడిదనడాకి నిదర్శనమన్నారు.
నేషనల్ క్రైం బ్యూర్ ఆఫ్ రికార్డ్స్ నివేదిక ప్రకారం నేరాల్లో తెలంగాణా
అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలవడం సిగ్గుచేటని, కాని ప్రభుత్వం ఇవేమీ
పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవడం దురదృష్టకరమన్నారు.
గులాబీ పార్టీకి గులామ్ లుగా పోలీసులు
తెలంగాలణా
వ్యాప్తంగా దళితులపై, మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగినా పోలీసులు
పట్టించుకోవడంలేదని,నేరాలను పసిగట్టాల్సిన ఇంటలిజెన్స్ వ్యవస్థ కేవలం
ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యంచేయాలని,కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఏయే
ప్రణాళికలు వేయాలో ముఖ్యమంత్రికి సమాచారం చేరవేయడంలో నిమగ్నమయ్యారని
ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చేపట్టిన 11 సర్వేలకు ఇంటలిజెన్స్ వ్యవస్థను
వాడుకున్నారని ఆరోపించారు. ట్రూ పోలీస్ గా వ్యవహరించాల్సిన ప్రభుత్వ
యంత్రాంగాన్నిదుర్వినియోగం చేశారని ఆరోపించారు. పోలీస్ యంత్రాంగం గులాబీ
పార్టీకి గులామ్ గిరిచేస్తూ దిగజారిపోయిందన్నారు . ఏ పోలీస్ స్టేషన్ లో
చూసిన వారు కూర్చున్న కుర్చీల్లో, తిరుగుతున్న
కార్లలో గులాబీ టవల్స్ దర్శన మిస్తున్నాయని శ్రవణ్ ఆరోపించారు.
రాజ్యాంగానికి రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు గులాబీ పార్టీకి అనుకూలంగా
వ్యవహరించడం సరికాదన్నారు. కేసీఆర్ కు భజన పరులుగా మారిపోయి ఆయనను
ప్రసన్నంచేసుకుని పనిలో పోలీసులున్నారన్నారు.
నాయకుల గొంతును నొక్కేందుకు కేసులతో బెదిరిస్తున్నారు
దొంగలు
నేరస్తుల ఆచూకి తెలుసుకోవాల్సిన పోలీసులు తమ వృత్తి ధర్మాన్ని
మరిచిపోయారని, కేవలం ప్రతిపక్షపార్టీలను నిర్వీర్యం చేసేందుకు
ప్రయత్నిస్తున్నారని, తెలంగాణా రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా
మారుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షకాంగ్రెస్ పార్టీ నేతలు తూర్పు
జయప్రకాశ్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, బిక్షమయ్యగౌడ్ ల పై అక్రమ కేసులు
బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రజల మద్దతు కూడ గట్టుకున్న
రేవంత్ రెడ్డి , క్రిషాంక్ లాంటి నేతల మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్
చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ ను
తట్టుకోలేక పోలీస్ యంత్రాంగాన్ని ఉసిగొల్పుతు భయభ్రాంతులకు
గురిచేస్తున్నారన్నారు.
టీఆర్ఎస్ పార్టీతో లాలూచి పడుతున్న పోలీస్ బాసులు
నాగార్జున
సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ రాజకీయ శిక్షణా తరగతులకు పోలీస్ బాస్ లు
హాజరవడాన్ని శ్రవణ్ తప్పుపట్టారు. ఒక రాజకీయ పార్టీ శిక్షణ
కార్యక్రమంలోపోలీసు బాసులు ఎలా పాల్గొంటారన్నారు. టీఆర్ఎస్ పార్టీ
అధికారంలోకి రావడానికి పరోక్షంగా దోహదం చేస్తున్నారని రాజ్యాంగ
పరిరక్షకులుగా ఉండాల్సిన పోలీసులు ఒక పార్టీ కొమ్ముకాయడమేంటని
ప్రశ్నించారు. గతంలో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకుందంటే
అందుకు పోలీస్ యంత్రాంగమే కారణమన్న సియం వ్యాఖ్యలే ఇందుకు
నిదర్శనమన్నారు. ధర్నాచౌక్ ఎత్తివేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు
చేపట్టిన నిరసన కార్యక్రమాలకు మహిళాపోలీసులను మఫ్టీపెట్టి వ్యతిరేకంగా
ఫ్లకార్డుల ప్రదర్శన చేయించారని ,నయీం కేసుల్లో ఉన్న పోలీసులను తప్పించారని
ఆరోపించారు. టెలీకాన్ఫరెన్సుల్లో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి
తేవడానికి కృషిచేయాలని చెప్పడం సరికాదన్నారు.
రాజకీయ ట్రాన్స్ ఫర్ లను రద్దుచేయాలని డిమాండ్
రాజకీయ
అవసరాలకోసం ఇష్టారాజ్యంగా పోలీసులను బదిలీలు చేసారన్నారు.కమీషనర్, డీజీపి
తదితర పోలీస్ అధికారులు చేయాల్సిన ట్రాన్స్ ఫర్ లను ఎమ్మెల్యేల, మంత్రి
కేటీఆర్ కనుసన్నల్లో చేయడం అక్రమమన్నారు. రాబోయే ఎన్నికలలో తిమ్మిని
బమ్మిని చేసైనా గెలవాలని పోలీసులను తాబేదార్లుగా
మార్చుకుంటున్నారని శ్రవణ్ ఆరోపించారు. ఇటీవల చేసిన ట్రాన్ష్ ఫర్
లన్నీ పొలిటికల్ పోస్టింగ్ లేనన్నారు. తక్షణమే ఎన్నికల కమీషన్ జోక్యం
చేసుకోవాలని కేసీఆర్ చేతిలో బందీ అయిన పోలీస్ వ్యవస్ధను విముక్తి
కలిగించాలని డిమాండ్ చేశారు.
ఇదే
పరిస్థితి కొనసాగితే రాబోయే ఎన్నికలు సజావుగా జరగవని శ్రవణ్ అనుమానం
వ్యక్తంచేశారు. హంతకులు పెచ్చరిల్లుపోతుంటే ప్రేక్షకపాత్ర వహించడం ,
రాజ్యంగవ్యవస్దకు రక్షకులుగా ఉండాల్సిన యంత్రాంగం తొత్తులుగా వ్యవహరించడం
సరికాదన్నారు.ప్రజలకు పోలీసుల పట్లగౌరవం, కాస్త భయం ఉండాలన్నారు.
అట్లయితేనే సమాజంలో నేరాలు అదుపులో ఉంటాయన్నారు. ఖాకీ బట్టకున్న గౌరవం
పెంపొందాలంటే ఏ రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరించకుండా పారదర్శకంగా
వ్యవహరించి సమాజోద్దరణ కు పాల్పడాలని కోరారు.
Tuesday, 25 September 2018
TRS is 'Telangana Rowdies Samithi', Says :Dr Sravan Dasoju
KCR is a 'political
sadist' and highly opportunist politician
*TRS has no moral right
to speak on TDP-Congress alliance
*TRS betrayed families of
Telangana martyrs: Sravan
Hyderabad, September 25: Telangana Pradesh Congress
Committee (TPCC) Chief Spokesperson Dr. Sravan Dasoju said that caretaker Chief
Minister K. Chandrashekhar Rao and his son Minister K. Tarakarama Rao have no
moral right to speak anything on martyrs of Telangana.
Addressing a press conference at Gandhi Bhavan on Tuesday,
Sravan said that it was due to the provocative statements made by KCR that led
hundreds of youth and students to suicide during statehood movement.
Calling the TRS as 'Telangana Rowdies Samithi', Sravan said
all betrayers of Telangana have assembled under the banner of TRS. He said
leaders like Srinivas Yadav, Tummala Nageshwara Rao and Mahender Reddy who had
attacked the statehood activists during Telangana movement have been rewarded
with posts of cabinet ministers. He said several anti-Telangana leaders have
been given tickets in Assembly and Parliament. He reminded that Srinivas Yadav
had once threatened KCR that he would not allow him to move freely in
Hyderabad. The same person was rewarded with a cabinet post. Similarly,
Mahender Reddy, who had openly abused Home Minister Nayani Narasimha Reddy in a
filthy language, was also made a minister. He said all 'rowdies' from Hyderabad
and other parts of Telangana have gathered in the TRS. Which family of
Telangana martyrs asked KCR to induct Talasani, Mahender Reddy or Tummala into State
cabinet? he asked.
Sravan said that the TRS leaders have no moral right to
speak anything on possible alliance between the Congress and TDP. He asked TRS
leaders to clarify as to why and from when TDP and its president Chandrababu
Naidu appeared anti-Telangana to them. He reminded that TRS has made an
alliance with the TDP in 2009 elections. Similarly, the TRS had allied with CPI
(M) which openly opposed Telangana formation. He said it was strange that when
TRS enters into an alliance with TDP it is called 'moral' tie-up and when
Congress and TDP join hands it is described as 'immoral' and 'unholy'. He said
though there was no clarity on whether or not Congress and TDP would have an
alliance, but the preliminary indications had created ripples in TRS circles.
Sensing that the TRS boat is about to sink, its leaders have started
criticising the proposed alliance so as to mislead the people, he said.
The Congress leader asked as to why Chandrababu Naidu didn't
look anti-Telangana when KCR visited his house in Amravathi to invite him for
Chandi Yagnam. Why KCR did not think of Telangana's self respect when he
enjoyed eating delicious lunch with Chandrababu Naidu in Amravathi, he said.
Sravan said that the TRS Government has not fulfilled a
single major electoral promise. He said the KCR Government could not even
construct a memorial for Telangana's martyrs during the last four-and-a-half
years by spending just Rs. 50 crore. However, KCR constructed a palatial
bungalow for himself at a cost of Rs. 500 crore. He said nearly 1500 martyrs of
Telangana remained unidentified and their families untraceable. He said
families of only 400 martyrs were paid Rs. 10 lakh financial assistance.
However, they are yet to get promised jobs, double bed room houses and three
acres of land. He said KCR Government did not spend just Rs. 150 crore on the
families of 1500 Telangana martyrs. But TRS Government paid Rs. 2-3 lakh crore
to Andhra contractors.
The TPCC Chief Spokesperson said that KCR has cheated the
Muslims and STs on the promise of 12% reservation. Similarly, he cheated all
other sections of the society. Instead of being accountable for his failures, KCR
has dissolved the Assembly nine months of ahead of schedule. People had given
TRS a mandate for 60 months. However, by advancing elections, KCR has betrayed
all the citizens who voted for TRS in 2014, he said.
Sravan said Congress party was making promises of waiving
off crop loans up to Rs. 2 lakh in a single take, unemployment allowance of Rs.
3,000 per month to jobless youth, etc., as it was focussed on people's welfare.
He described TRS as a gang of Charles Shobraj and said KCR and family remained
concentrated on benefitting contractors. He said unlike TRS, the Congress party
honours all the promises that it makes with the people.
Calling KCR a 'political sadist', he said that the TRS chief
was a highly opportunists politician in the country. He said KCR had entered
into a secret deal with the BJP to advance Assembly elections. He said KCR had
taken permissions from Prime Minister Narender Modi before making any move
including dissolution of Assembly. Despite being a slave to Modi himself, KCR
is advising people that they should not become a slave to Delhi, he said.
Sravan said that the Congress was a national party and
therefore, its High Command is in Delhi and it takes all decisions keeping
national interest in mind. He warned TRS leaders to have control over their
language and tone. Else, he said Congress leaders were capable of answering TRS
in much harsher tone and language. (eom)
మోడీ గులాంగా మారి స్వీయఅస్తిత్వంపై మాట్లాడుతారా...
అబద్దాలు, మోసాలు చేయడంలో చార్లెస్
శోభారాజ్ వారసులంటూ శ్రవణ్ దాసోజు ఘాటువిమర్శ
పొత్తులనంగానే మీకు లాగులు ఎందుకు తడుస్తున్నాయి.
చచ్చుడో వచ్చుడో అంటూ ఉద్యమకారులను
ఉసిగొల్పిన హంతకుల పార్టీ టీఆర్ఎస్
ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిఅమరుల ఆత్మలను
క్షోభ పెట్టింది మీరే
ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంట్ ,రీయంబర్స్
మెంట్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మంచి గుర్తొస్తుంది
ప్రజాస్వామ్యానికి పునాదిరాయి విమర్శ.... అలాంటి విమర్శలు చేస్తే ఎన్నికలకుపోతారా అంటూ
శ్రవణ్ దాసోజు ఎద్దేవా
అమరుల ఆకాంక్షలకు విరుద్దంగా కాంగ్రెస్ పార్టీ
ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటోందని, అనైతిక పొత్తులకు పాల్పడుతోందని కేటీఆర్ చేసిన విమర్శను టీపిసిసి ముఖ్య అధికార
ప్రతినిధి శ్రవణ్ దాసోజు తిప్పికొట్టారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో
మాట్లాడిన ఆయన దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే తలనరుక్కుంటా, తెలంగాణా వచ్చుడో
కేసీఆర్ చచ్చుడో, ప్రాణాలయినా అర్పిద్దాం. తెలంగాణా సాధిద్దాం, సిద్దిపేట దీక్షా
స్థలంలో పెట్రోల్ చల్లుకోవడం, చావునోట్లో తలకాయపెడుతున్నం అంటూ అనేక సందర్భాల్లో చేసిన
చిల్లర నినాదాల చేసి ఉద్యమకారుల్లో భావోధ్వేగాలను
రెచ్చగొట్టారన్నారు. అమరుల ఆకాంక్షలకు విరుద్దంగా ఉద్యమద్రోహులతోఅంటకాగుతున్న
టీఆర్ఎస్ పార్టీ నేతలకు అమరుల గురించి మాట్లాడేనైతిక హక్కులేదని ,అమరుల ఆత్మలు
క్షోభిస్తున్నాయన్నారు.
200 కోట్లతో ప్రగతి భవన్ కట్టారు కాని
అమరులస్ధూపం ఎందుకు కట్టలేకపోయారు
అమరుల
ఆత్మక్షోభలంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడే కేటీఆర్ 2లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన
ప్రభుత్వం 200 కోట్లతో ప్రగతి భవన్ కట్టకోగలిగింది కాని 50 కోట్లతో అమరుల స్ధూపం ఎందుకు కట్టలేకపోయారో చెప్పాలని
తెలంగాణా రావాలంటే బలిదానం చెయ్యాల్సిందేనన్నట్లు
భావోద్వేగాలను రెచ్చగొట్టారన్నారు. ఉద్యమ సమయంలో 1500 మంది అమరులైనట్లు ప్రకటించి
కేవలం 400 మందికి మాత్రమే ఇచ్చి మిగితా వారికి డబుల్ బెడ్రూం ఇళ్ళు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని
దుయ్యబట్టారు.
ఉద్యమద్రోహులకు అందలం అమరుల
ఆకాంక్షలకు తిలోదకాలు
అమరుల ఆత్మక్షోభిస్తుందన్న మీకు ఏ అమరులు చెబితే
కాపలా కుక్కలా ఉంటానన్న పెద్దమనిషి తానే ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడో , రాజకీయాలతో
సంబంధంలేని కవితను ఎందుకు రాజకీయాల్లోకి తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో తిరిగనియ్యనని ముక్కునేలకు రాయిస్తానని హెచ్చరించిన తలసాని లాంటి
ఉద్యమ ద్రోహులను ఎందుకు మంత్రిగా చేసారో చెప్పాలన్నారు. హోం మంత్రి నాయిని
నరసింహారెడ్డిని బూతులు తిట్టి,చంపుతా అని బెదిరించిన మహేందర్ రెడ్డిని ఎందుకు
మంత్రి పదవి ఇచ్చారో చెప్పాలని తెలంగాణా ఉద్యమ సమయంలో ఖమ్మంలో దీక్షకుదిగిన
కేసీఆర్ కు అండగా ఉన్న ఉద్యమకారులపై కేసులు పెట్టించిన తుమ్మలకు ఏ అమరుడు చెబితే
మంత్రి పదవి ఇచ్చారో చెప్పాలని దాసోజు డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని అణిచేయాలని
చూసిన మైనం పల్లి హన్మంతరావు కు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన ఎర్రోల్ల
శ్రీనివాస్ ను కాదని ఉద్యమద్రోహులకు పెద్దపీట వేస్తున్నారని దుయ్యబట్టారు.
చార్లెస్ శోభారాజ్ ను
మరిపిస్తున్నారు.
తెలంగాణా
రాష్ట్ర సమితి కాదు తెలంగాణా రౌడి సమితిలా టీఆర్ఎస్ పార్టీ తయారయ్యిందని శ్రవణ్
ఎద్దేవా చేశారు, నగరబహిష్కరణ ఎదుర్కోన్నవారు..దొంగలు పార్టీలో నాయకులుగా చెలామణి
అవుతున్నారని చార్లెస్ శోభారాజ్ ను తలపించేవిధంగా మోసాలకు అబద్దాలకు
పాల్పడుతున్నారని శ్రవణ్ విమర్శించారు. న్నారు.
అమరావతికి,ఢిల్లీకి గులాములుగా
మారింది మీరే
స్వీయ అస్తిత్వం గురించి పెద్ద పెద్ద మాటలు
మాట్లాడుతున్న కేటీఆర్ ఢిల్లీలో మోడీకి, అమరావతిలో చంద్రబాబుకు గులాంలుగా
మారారన్నార. జయశంకర్ సార్ స్వీయఅస్తిత్వం గురించి చెబితే కమీషన్ ల
కోసం ఆంద్రాకాంట్రాక్టర్లకు తెలంగాణాను తాకట్టు పెట్టమని కాదని వారికి గంపగుత్తగా కాంట్రాక్టులు
అప్పగించనప్పుడు మీ స్వీయ అస్తిత్వం ఎక్కడబోయిందని శ్రవణ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్
నేతలు మాట్లాడే మాటలు వింటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆత్మ క్షోభిస్తుందన్నారు.
అహంకారం ఎవరిది
తెలంగాణా బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే
మనసు చలించి తెలంగాణా రాష్ట్రం సాకారం చేసిన తల్లి సోనియాగాంధీ పై వారి కుటుంబం పై
అవాకులు చెవాకులు పేలుతూ ఇష్టమొచ్చనట్టు మాట్లాడుతున్న మీకు కాంగ్రెస్ పార్టీ
తెలంగాణా ఇచ్చిందని చెబితే అహంకారం లా కనిపిస్తుందా అంటూ ప్రశ్నించారు. సెప్టెంబర్
2 సభలో కేసీఆర్ తాను చెబితే జయశంకర్ సార్ రాసుకున్నడని చెప్పడం అహంకారం కాదా అని
ప్రశ్నించారు.
జేఏసీ ఛైర్మన్ గా ప్రోఫెసర్ కోదండరామ్ ను తామే నియమించామని
చెప్పడం మీ అహంకారపూరిత స్వభావానికి నిదర్శనమని విమర్శచేశారు. తెలంగాణా
ప్రకటించినతర్వాత తల్లిసోనియా గాంధీ కాళ్లుమొక్కిన కేసీఆర్ ఆతర్వాత ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం
అందితేజుట్టు లేకుంటే కాళ్లుపట్టకునే రకమని స్పష్టం చేసిందని శ్రవణ్ అన్నారు.
విమర్శిస్తే ఎన్నికలకు పోవడం మీ
భావదారిద్రానికి నిదర్శనం
ప్రతిపక్షాలు విమర్శిస్తే ఎన్నికలకు పోయినమని
చెప్పడం టీఆర్ఎస్ పార్టీ నేతల భావదారిద్ర్యానికి నిదర్శనమని శ్రవణ్ ఎద్దేవా
చేశారు. ఉద్యమకాలంలో ఎన్నికలకు వెళితే ప్రజలు అర్ధం చేసుకున్నారని కాని ఐదేళ్లకాలం
పాలించాలని ఎన్నుకుంటే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం చేతకాక ముందస్తు ఎన్నికలకు
వెళ్లడం ప్రతిపక్షాల వల్లే నంటూ దుష్ప్రచారానికి పూనుకుంటున్నరని రాబోయే
ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెడుతారని హెచ్చరించారు. 2004 లో కాంగ్రెస్ తో
2009 లో టీడీపితో సిపియం లాంటీ పార్టీలతో అవకాశవాద
ఊసరవెల్లి లా పొత్తుపెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీనేతలు.. ఇతరపార్టీలు పొత్తులు పెట్టుకుంటే అనైతికమంటూ
గగ్గోలు పెడుతుందని బలవంతమైన సర్పాన్ని చలిచీమలు చంపేందుకు ప్రజాస్వామ్యవాదులంతా
కలిసి కట్టుగా పోరాడడం తప్పెలా అవుతుందన్నారు. వాలిని చంపిన రాముడిది యుద్దనీతి
అయితే అదే యుద్దనీతిని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని, పొత్తులు
పెట్టకుంటుందన్నారు. అశ్వధ్దామ హతో హత: న నరోవ కుంజర అన్నసిద్దాంతం సరైందే అయితే
అదే సిద్దాంతాన్ని మేమే అవలంబిస్తామన్నారు.
పొలిటికల్ శాడిస్ట్ కేసీఆర్
చంద్రబాబు ద్రోహి అంటున్న మీకు
హెలీకాప్టర్లో అమరావతి కి పోయి పోలసచేపల
పులుసు, రోయ్యల వేపుడు ఉలవచారుతో లొట్టలేసుకుంటూ తినొచ్చినప్పడు గుర్తుకు రాలేదా
అంటూ ఎద్దేవా చేశారు.
చండీయాగానికి పిలిచి చంద్రబాబును సన్మానించినపుడు, తెలంగాణాలో
భూకబ్జాలకు పాల్పడ్డ పరిటాల రవి లాంటి వారి సమాధిపై సాగిల పడి మొక్కినప్పుడు మీకు
ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదని వారి ద్రోహాలు ఎందుకు గుర్తుకురాలేదో చెప్పాలని
శ్రవణ్ డిమాండ్ చేశారు.
దోపిడిలకు
పాల్పడ్డప్పు బూకబ్జాలకుపాల్పడ్డ వ్యక్తి సమాధిముందు తలవంచి నప్పుడు నీకు
గుర్తుకురాలేదా.. అంటూ ఘాటుగా విమర్శించారు. తాను ఏదైనా చేయొచ్చుకాని ఇతరులు
మాత్రం ఏం చేయొద్దనే పోలిటికల్ శాడిజం కేసీఆర్ చేస్తున్నారన్నారు.
కట్టుబానిసలు తెలంగాణా మంత్రులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీని ఢిల్లీకి కట్టుబానిసంటున్న
కేటీఆర్ బుద్దిలేదని ఎవరైనా తమ నాయకులకు కట్టుబడే ఉంటారన్న కనీస జ్నానం లేని
వ్యక్తని అభివర్ణించారు. తెలంగాణాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గరకు
వస్తున్నప్పుడు తాము ఢిల్లీలో ఉన్న తమ నాయకుల వద్దకు వెళితే కట్టుబానిసత్వం ఎలా
అవుతుందో కేటీఆర్ చెప్పాలన్నారు. ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి తేడా తెలియని
మూర్కుడు కేటీఆర్ అని దుయ్యబట్టారు. ఏసంబంధమూ లేని మోడీ కి మాటిమాటికి ఎందుకు
మోకరిల్లుతున్నరో, మీమధ్యఉన్న రహస్య ఒప్పందాలేంటో ప్రజలంతా గమనిస్తున్నారని
కర్రుగాల్చి వాతపెట్టేరోజు త్వరలోనే ఉందన్నారు.
పక్కా లెక్కలతో ముందుకు వస్తం..
మోసపూరిత మాటలతో మభ్యపెట్టిన టీఆరఎస్ సర్కార్ ను
దించేస్తామని , ప్రజలకు మాట ఇచ్చినట్లు ఒకేసారి
2 లక్షల రుణమాఫీ పక్కాగా అమలుచేస్తామని శ్రవణ్
అన్నారు. ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్ మెంట్ లాంటి పథకాల పేర్లు
చెబితే కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గుర్తుకువస్తుందని, అదే డబుల్ బెడ్రూం ఇండ్లు,
మూడెకరాల భూమి లాంటి పథకాల పేర్లు, చెబితే టీఆరఎస్ పార్టీ మోసాలు గుర్తుకు
వస్తాయని శ్రవణ్ ఎద్దేవా చేశారు. మోసపూరిత వాగ్దానాలు చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని హితవు
మోచేతి బెల్లం పూసి నాకమన్నట్లుందని,లక్షల మంది కి ఇళ్లిస్తమని మాట తప్పారని,ముస్లీం
మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు, గిరజనులలకు పది శాతం రిజర్వేషన్ల పేరిట
మోసం చేశారని ,కేజీటూపీజీ విద్య అందిస్తామన్న మాట అటకెక్కించారని,నియోజకవర్గానిక
లక్షఎకరాలకునీరు అందిస్తామన్న మోసాలన్ని టీఆర్ఎస్ పార్టీ నేతలను చూస్తే
గుర్తొస్తాయన్నారు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో పెరిగిపెద్దయిన విషయాన్ని
మరిచి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కేటీఆర్ మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల
ముందు గీత, ఖురాన్, బైబిల్ తో సమానమన్న టీఆర్ఎస్ మానిఫెస్టో ఎందుకు పూర్తిచేయలేకపోయారో ఐదేళ్ల పరిపాలనను అందిస్తే చేతకాక మధ్యలోనే కాడి వదిలేసి నిందలు
ప్రతిపక్షాలపై మోపుతున్నారని, కమీషన్లు దండుకునేందుకు కాంట్రాక్టర్లకు అడ్డగోలు
ప్రాజెక్ట్లను కట్టబెట్టేందుకు ఉన్న శ్రద్ద ప్రజాసమస్యలపై లేదన్నారు.
Video :
Saturday, 8 September 2018
ఎన్నికలపై రెండునెలల్లోనే మాట మార్చిన మోసగాడు కేసీఆర్ : శ్రవణ్ దాసోజు
ఎన్నికలపై రెండునెలల్లోనే మాట మార్చిన మోసగాడు కేసీఆర్
జెమిలీ ఎన్నికలకు సిద్దమని లేఖ ఇచ్చి ముందస్తు ఎన్నికలు ఎందుకు..?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే వెన్నులో వణుకు పుట్టిన కేసీఆర్..
పదినెలల ముందే ప్రజల ఆశలను వమ్ము చేస్తూ ముందస్తుకు వెళ్లడం దుర్మార్గం.....శ్రవణ్ దాసోజు.
లోక్ సభ, అసెంబ్లీ లకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలపై ఆర్ధికభారం
పడుతుందని, అభివృద్ది ఆగిపోతుందని, ప్రభుత్వ
యంత్రాంగం ఎన్నికల హడావుడిలో ఉండటం వల్ల పాలన
అస్తవ్యస్తమవుతుందని, జూలై 6, 2018 న
లా కమీషన్ కు లేఖ రాసిన కల్వకుంట చంద్రశేఖర్ రావు మాట మార్చి రెండు నెలల వ్యవధిలో సెప్టెంబర్ 6, 2018 న ముందస్తు
ఎన్నికలకు ఎందుకు వెళుతున్నరో చెప్పాలని టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్
శ్రవణ్ దాసోజు డిమాండ్ చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన
మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన అభద్రత, కాంగ్రెస్
పార్టీ ఎదుగుదలను చూసి భయంతో వెన్నులో వణుకు
పుట్టి ముందస్తుకు వెళ్తున్నరని అపహాస్యం చేశారు.
లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికలకు 4నుంచి 6 నెలల సమయం తీసుకుంటే సుదీర్ఘకాలంగా ఎన్నికలు వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్డం మొచ్చి
అభివృద్ది కుంటుపడుతుందని చెప్పిన కేసీఆర్ ఎవడబ్బసోమ్మని
ముందస్తు ఎన్నికలకు వెళ్లుతూ రాష్ట్రప్రజలపై ఆర్ధిక భారం మోపుతున్నరని , ప్రజాధనం దుర్వినియోగం
చేస్తున్నరని ప్రశ్నించారు. ఐదేళ్ల కాలంలోరెండు మార్లు రాజకీయ పార్టీలు, నేతలు పెద్దయెత్తున డబ్బులు ఖర్చు చేయాల్సివస్తుందని చెప్పి ముందస్తుకు
వెళుతున్ననియంత పాలనకు చరమ గీతం పాడాలని, ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యార్ధులు, నిరుద్యోగులు
పెద్దయెత్తున ఒక్క తాటిపై నిలబడ్డ విషయాన్ని గమనించి, కాంగ్రెస్
పార్టీకి ప్రజలనుంచి వస్తున్న ఆదరణ, అధికారంలోకి వస్తుందన్న బలమైన సంకేతాలను చూసి తట్టుకోలేక , ముందస్తు
ఎన్నికల పేరిట డ్రామాకు తెరలేపారన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే
అవకాశాన్ని కాలరాస్తూ.. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నయనే ముందస్తుకు పోతున్నానంటూ
సరికొత్త డ్రామాకు కేసీఆర్ తెరలేపారని శ్రవణ్
అన్నారు. పదినెలల కాలంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అవకాశమున్నా వారి ఆశలను వమ్ముచేస్తూ పదవీ త్యాగంచేశామని చెప్పడం దుర్మార్గమన్నారు.
ఈ సం దర్భంగా కేసీఆర్ గతంలో
హుస్నాబాద్ ఎన్నికల సభలో ప్రసంగించిన వీడియోలు, జెమిలీ ఎన్నికలకు అనుకూలంగా లా కమీషన్ కు లేఖ ఇచ్చామని ఢిల్లీలో ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడిన వీడియోలను శ్రవణ్ ప్రదర్శించారు.మీడియా సమావేశంలో మాజీ ఎంపీ
పొన్నం ప్రభాకర్, అధికార ప్రతినిధి
మొగుళ్ల రాజిరెడ్డి లుపాల్గొన్నారు.
Video Link :
Tuesday, 4 September 2018
TPCC Chief Spokesperson Dr. Sravan Dasoju questions #KCR on Nayee Brahmin sops and offers to tonsure half hair if proved wrong.
Congress nails KCR's lies on incentives to 'Nayee Brahmins'
Hyderabad, September 4: The Congress party on Tuesday organised a novel protest to expose Chief Minister K. Chandrashekhar Rao's false claim that 'Nayee Brahmins' (barbers) were being charged domestic tariff for power supply to their saloons.
Led by Telangana Pradesh Congress Committee (TPCC) Chief Spokesperson Dr. Sravan Dasoju, along with leaders of Nayee Brahmin Association, held the protest near the statue of Mahatma Gandhi in Gandhi Bhavan premises. The Nayee Brahmin community members shaved the beard of a few persons while raising slogans against the KCR Government.
Addressing a press conference later, Sravan said that the GO MS No. 1 which was issued on January 6, 2016, by the Backward Classes Welfare Department converting power consumption charges from Commercial Category to Domestic Category for hair cutting saloons in Telangana State, has remained unimplemented. He said all the hair cutting saloons are still paying their power bills as per commercial tariff. Despite knowing the fact that the GO was not being implemented, the Chief Minister, while addressing the TRS public meeting on 2nd September, wrongly claimed that 'Nayee Brahmins' have been enjoying the domestic tariff, he said.
Sravan said that speaking utter lies does not suit the stature of a man who is holding the post of a Chief Minister. He said concession to 'Nayee Brahmins' was among several other lies spoken by KCR in his party's meeting. He said that the Chief Minister had also promised to constitute a Governing Council of Nayee Brahmin Federation. But this promise too remained a non-starter.
The TRS party, in its manifesto for 2014 elections, had promised Rs. 250 crore for the welfare of Nayee Brahmins and setting up of 25,000 ultra-modern saloons. These promises also remain unfulfilled. Sravan demanded that the State Government take immediate measures to implement GO MS No. 1 and also implement other promises made with the Nayee Brahmin community.
Sravan also appealed members of Nayee Brahmin community to realise that they have been cheated by TRS Government and asked them to stay cautious against KCR. He assured that the Congress party, after coming to power in next elections, would ensure the welfare and development of all Backward Classes, including Nayee Brahims. (eom)
గాంధీ విగ్రహం వద్ద గడ్డాలు గీసి శ్రవణ్ దాసోజు అధ్వర్యంలో నాయీబ్రాహ్మణుల వినూత్న నిరసన :
- గాంధీ విగ్రహం వద్ద గడ్డాలు గీసి శ్రవణ్ దాసోజు అధ్వర్యంలో నాయీబ్రాహ్మణుల వినూత్న నిరసన
- ప్రగతి నివేదన సభలో నాయీబ్రాహ్మణుల సంక్షేమం పై కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారు.
- జీవో ఎం ఎస్ నెంబర్ 1 ఇచ్చి రెండేళ్లయినా డొమెస్టిక్ టారిఫ్ అమలు కాలేదని శ్రవణ్ విమర్శ
- బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించి రూ. 25 కోట్లే ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపారని ఆరోపణ.
- ఇస్తామన్న25 వేల మాడ్రన్ సెలాన్ లు ఏమయ్యాయని సూటి ప్రశ్న
- నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ కు పాలక మండలి ని నియమించాలనిడిమాండ్
ప్రగతి నివేదన సభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని రాష్ట్రంలో నాయీబ్రాహ్మణులకు చేయని సాయాన్ని చేసినట్లు గా గొప్పలు చెప్పుకోవడమే దీనికి తార్కాణమని, ముఖ్యమంత్రి అబద్దాలకు ఇదో మచ్చుతునకని టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీభవన్ లో నాయీ బ్రాహ్మణ సంఘం నేతలతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి చెప్పిన మాటకు విలువ ఉండాలని అది రాజముద్ర లాంటిదన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మాట పైనిలబడాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి మాటలు చెట్లమీద ఇస్తరాకులు కుట్టినట్టిగా, బెల్లం లేకుండా బూరెచేసినట్లుగా ఉన్నాయిని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశానికి ముందు కేసీఆర్ తమ విషయంలో చెప్పిన అబద్దాలను నిరసిస్తూ శ్రవణ్ ఆధ్వర్యంలోపలు జిల్లాలను నుంచి తరలి వచ్చిన నాయీబ్రాహ్మణులు గాందీ భవన్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ముందు క్షవరాలు చేసి వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు.
ప్రగతి నివేదన సభలో కేసీఆర్ పచ్చి అబద్దాలు
సెప్టెంబర్ 2, 2018 న జరిగిన ప్రగతి నివేదన సభలో కులవృత్తుల గురించి మాట్లాడిన సియం కేసీఆర్ నాయీబ్రాహ్మణలకు పెద్దయెత్తున సహాయం అందిస్తున్నట్లు మాట్లాడడం హాస్యాస్పదమని, వారికి కమర్షియల్ టారిఫ్ నుంచి డొమెస్టిక్ టారిఫ్ కు కరెంటు బిల్లులు మార్చినట్టు అబద్దాలు చెప్పారని శ్రవణ్ విమర్శించారు. డొమెస్టిక్ టారిఫ్ అమలు చేస్తున్నట్లు తేదీ 6.01.2016 నాడు జీవోఎం ఎస్ నెంబర్ 1 ను విడుదల చేసినా నేటికి అమలు కాకపోవడం ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి, చిత్తశుద్దిలేని తనానికి నిదర్శనమన్నారు. తానిచ్చిన జీవో అమలుకు నోచుకోకున్నా సినిమాల్లో ఎదురుగా కోడిని చూపించి చికెన్ బిర్యాని తిన్నట్లు భావించినట్లు లక్షలాది మంది వచ్చిన సభలో చేయని పనిని చేసినట్లుగా ముఖ్యమంత్రి భ్రాంతికలిగించి పత్రికల్లో రాయించుకుంటున్నరని శ్రవణ్ ఎద్దేవా చేశారు.
కేటాయించింది రూ.250 కోట్లు విడుదల చేసింది రూ.25 కోట్లు.
2014 నుంచి నేటి వరకు నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి బడ్జెట్ లో రూ. 250 కోట్లు కేటాయించినా ఈనాలుగేళ్లుగా కేవలం 10 శాతం నిధులను మాత్రమే విడుదల చేశారన్నారు.
మానిఫెస్టోలో చెప్పిన 25000 వేల మాడ్రన్ సెలూలేవి..?
ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినట్లు నాయీబ్రాహ్మణులకు 25000 మంది కి మాడ్రన్ సెలూన్ లు ఇస్తామన్న విషయం ఏమైందని శ్రవణ్ ప్రశ్నించారు. ఎన్నికల్లో మాటలు కోటలు దాటిచ్చినా అది ఆచరణ లో మాత్రం శూన్యంగా ఉందన్నారు.
వేలాది మంది యువకులకు ఇవ్వాల్సిన స్కిల్ డెవలప్ మెంట్ కేవలం 600 మందికే ఇచ్చారన్నారు.
పాలక మండలి లేని ఫెడరేషన్
నామ మాత్రపు నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ ప్రకటించినా పాలక మండలి ని ప్రకటించలేదని, ఒక్క రూపాయీ కేటాయించలేదన్నారు.నాలుగేళ్లు గడిచినా ఫెడరేషన్ భవనాన్ని నిర్మించలేదన్నారు. అటు ఎండోమెంట్ బోర్డుల్లో ఉండాల్సిన సభ్యులను నియమించలేదని శ్రవణ్ నిలదీశారు.బీసిలకు పెద్దయెత్తున గొర్లు, బర్లు చేపలు పంపిణీ చేస్తున్నామన్న సియం కు 17 లక్షల మంది నాయీ బ్రాహ్మణులు ఎందుకు కనిపించడంలే దని ప్రశ్నించారు. తన పాలనా కాలం ముగిసే లోగా నాయీ బ్రాహ్మణులకు కేటాయించిన రూ. 250 కోట్లు విడుదల చేయాలని, జీవో నెంబర్ 1 ను యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మోసగిస్తున్న తీరును బీసీ సమాజమంతా ఎండగట్టాలని శ్రవణ్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కొప్పిలి సతీష్ నాయి ,లారియల్ సౌత్ ఇండియా టెక్నికల్ మేనేజర్ రమేశ్, వెంకటేశ్, అధికార ప్రతినిధులు విజయ్ కురువ, డాక్టర్ కేతూరి వెంకటేశ్ ,కైలాస్ నేత, బాలలక్ష్మి, పీసిసి సెక్రటరీ మెట్టుసాయి తదితరులు పాల్గొన్నారు.
Monday, 3 September 2018
ప్రగతి నివేదన సభ రాజకీయ పార్టీ సభలా కాకుండా తాగుబోతుల సభలా ఉందన్న శ్రవణ్ దాసోజు
- ప్రగతి నివేదన సభ రాజకీయ పార్టీ సభలా కాకుండా తాగుబోతుల సభ లా ఉందన్న శ్రవణ్ దాసోజు
- మోడీ కి గులామ్ గా మారిన కేసీఆర్ ముందస్తుకు వెనుకంజ వేసారని ఎద్దేవా
- ప్రొఫెసర్ జయశంకర్ ను అవమానించిన కేసీఆర్
- పాలకుడి మాట వేదంలా, దార్శనికతతో ఉండాలని హితవు
- ప్రగతి నివేదన పేరిట తరలించిన బస్సులను మొబైల్ బార్లుగా మార్చారు.
- తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలను మంటగలిపిన టీఆర్ఎస్ పార్టీ అంటూ ఆగ్రహం
తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వచ్చిన వారికి మందు సరఫరా చేసి మహిళలను, యువలకును మందుకు బానిసలను చేసి లక్షలాది మందిని తరలించడం సిగ్గుచేటని, టీపీసిసి ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు అన్నారు. తెలంగాణా అనగానే మందు, మటన్ తో చిందులేయడం తప్ప మరోటి కాదన్నట్లు, ఇక్కడి సంస్కృతిని సంప్రదాయాలను అవమాన పరిచే రీతిలో రాజకీయ సభను నిర్వహించడం కేసీఆర్ కు తగదని విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాజకీయ సభ పేరిట తాగుబోతుల సభ ను నిర్వహించారని ఎద్దేవా చేశారు. బస్సుల్లో కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు తాగుతుంటే మొబైల్ బార్లలా మారుస్తుంటే పట్టించుకోలేదని తక్షణమే ఆర్టీసి అధికారులు, ట్రాక్టర్లలో జనాన్ని తరలిస్తున్న పట్టించుకోని ఆర్టీయే అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ నాయకులకు డబ్బంటే లెక్కలేదని ఇష్టారీతిగా డబ్బులు గాల్లోకి వెదజల్లుతూ పైశాచికానందం పొందడం సరికాదన్నారు. ప్రకృతికూడా టీఆర్ఎస్ ఆగడాలను భరించడం ఇష్టం లేక వంద గోడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వాన కు నేలకూలినట్లు అట్టహాసంగా పెట్టిన ఫ్లెక్సీ నేలకూలిందన్నారు. కేవలం 47 నిమిషాల పసలేని ప్రసంగం కోసం లక్షలమంది జనాన్ని తరలించి కోట్లాది రూపాయల ఖర్చుచేసి ఈవెంట్ మానేజ్ మెంట్ చేయాల్సిన అవసరమేంటన ప్రశ్నించారు.
జనం రాక వెలవెలబోయిన కేసీఆర్
లక్షల మంది జనం సభకు వస్తున్నరంటూ ఊదరగొట్టిన టీఆర్ ఎస్ నేతలు తీరా సభ ప్రారంభం అయ్యే వరకు జనం కనిపించక పోయే సరికి కంగుతిన్నారని హెలీకాప్టర్ లో పైన తిరిగిన కేసీఆర్ మొహంలో భయం కనిపించిందని ఎద్దేవా చేశారు. తన ప్రసంగంలో ఢిల్లీ వర్సెస్ గల్లీ అంటూ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాములంటూ సెంటిమెంట్ పండించాలని చూసిన ప్రయత్నం బెడిసి కొట్టిందన్నారు. ఢిల్లీకి గులాములెవరో కేసీఆర్ కే బాగా తెలుసన్నారు. ఆనాడు తెలంగాణా బిల్లు పెట్టిన సమయంలో ప్రాణాలకు తెగించి పొన్నం ప్రబాకర్, తదితర నేతలు కొట్లాడక పోతే తెలంగాణా వచ్చేదా అంటూ నిలదీశారు.
మోడీ చేతిలో కీలుబొమ్మ కేసీఆర్
ముందస్తు ఎన్నికలంటూ వారం రోజుల పాటు పెద్ద యెత్తున హంగామా చేసిన కేసీఆర్ మోడీ చేతిలో కీలుబొమ్మలా మారారని , ఆయన వద్దన్నందుకే ఎన్నికల ప్రస్తావన తేలేదన్నారు. గులామ్ గా మారిన కేసీఆర్ విభజన హామీలను సాదించలేక పోయారని ఎద్దేవా చేశారు.
ఉద్యమకారులను అవమానించిన కేసీఆర్
తొలి తరం ఉద్యమంనుంచి కీలక పాత్ర పోషించిన ఆచార్య జయశంకర్ సారు ను గౌరవించలేదని సభలో ఆయన చిత్రపటం పెట్టలేకపోయారన్నారు. ఉద్యమ సమయంలో కొన్ని అంశాలు తాను చెబుతుంటే ఆయన డిక్టేట్ చేసుకునే వారని చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమని జయశంకర్ ను అవమానించడమేనన్నారు.
1500 మంది అమరుల చనిపోతే ఒక్కరినీ ఆదుకోలేదన్నారు. అమరులకు కుటుంబాలకు ఎందరికి ఉద్యోగావకాశాలు కల్పించారో గుండెపై చేయేసుకుని చెప్పాలన్నారు. తొలితరం ఉద్యమకారుడు దేశిని చినమల్లయ్య, కొండాలక్ష్మణ్ బాపూజీ, గూడ అంజన్న లాంటి ప్రముఖ ఉద్యమకారులు చనిపోతే కనీసం పరామర్శించలేదని ప్రభుత్వలాంఛనాలతో ఎందుకు వారి అంత్యక్రియలు జరిపించలేకపోయారని శ్రవణ్ ప్రశ్నించారు.
సభ సాక్షిగా ముఖ్యమంత్రి అబద్దాలు
పాడిందే పాట పాటరా పాసుపళ్ల అదేదో అన్నట్లు.. చెప్పిన విషయాలే చెప్పి బోరుకోట్టించడ మినహా సభలో కొత్త విషయాలేం లేవన్నారు. 2000 సంవత్సరంలో విద్యుత్ జరిగిన రైతుల పోరాటంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పోరాటం జరిగి 14 రోజులు నిరాహార దీక్ష చేపడితే.. తాపీగా నిద్రలేచిన కేసీఆర్ మూడు వారాల తర్వాత లేఖ రాసి తనవల్లే ప్రభుత్వం స్పందించిందనడం పచ్చి అబద్దమన్నారు. రాజకీయంగా నష్టపోయినా ఫర్వాలేదని కడుపుచించుకుని సోనియాగాంధీ ఇవ్వకపోతే తెలంగాణా రాష్ట్రం సిద్దించేదా అంటూ ప్రశ్నించారు.
వలసలు నివారించేందుకు చేసిందేంటి..?
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మహబూబ్ నగర్ వలసలు ఆగాయని అబద్దం చెప్పుతున్నారని నేటికి బొంబాయి తదితర ప్రాంతాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయని శ్రవణ్ అన్నారు. మహబూబ్ నగర్ లో 90 శాతం పూర్తయిన సాగునీటి ప్రాజెక్ట్ లు నెట్టెంపాడు,కల్వకుర్తి, భీమా కోయిల్ సాగర్ తదితర ప్రాజెక్ట్ పూర్తిచేస్తే వలసలు ఆగే అవకాశం ఉన్నా రీడిజైనింగ్ పేరిట కోట్లాది రూపాయలు దండుకున్నారే తప్ప ప్రాజెక్ట్ లుపూర్తిచేయలేదన్నారు. అట్టహాసంగా ఎన్నారై పాలసీ ప్రకటిస్తామని ఏటా వెయ్యి కోట్ల నిధిని ఏర్పరుస్తామంటూ ప్రగల్భాలు పలికి ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు.వలస కార్మికులను ఏనాడూ ఆదుకోలేదన్నారు.
కాంగ్రెస్ ముందుచూపుతోనే నిరంతర కరెంట్
గత యూపిఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముందుచూపుతో ఎన్నో కొత్త పవర్ ప్రాజెక్ట్ లను ప్రారంభిస్తే తద్వారా కరెంట్ ఉత్పత్తవుతోందని, నాలుగేళ్ల ప్రభుత్వంలో ఒక్క యూనిట్ ఉత్పత్తిచేయకుండా అదంతా తన ఘనతేనని కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. భూపాల్ పల్లి, జైపూర్ ప్లాంటులు కాంగ్రె స్ స్ధాపించవో కావో చర్చించేందుకు సిద్దమా అంటూ సూటిగా ప్రశ్నించారు. తక్కువ ధరలకే కరెంట్ అందుబాటులో ఉన్నా అధిక ధరలకు చత్తీస్ గఢ్ కరెంటు ఎందుకు కొంటున్నారో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు
కులవృత్తుల పై సవతి తల్లి ప్రేమ
తెలంగాణా పల్లెల్లో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి బిడ్డలు పనులు లేక పిట్టలు రాలినట్లు రాలుతుంటే బీసిలకు కోట్లాది రూపాయలతో ఆదుకుంటున్నమని దొంగమాటలు చెబుతున్నరని బీసీ ల నోట్ల మన్నుగొట్టి గొర్రెలు, బర్రెలు చేపలు ఇస్తూ అవమానిస్తున్నరన్నారు. సంచార జాతులకు ఎలాంటి న్యాయం చేయలేదని ఎంబీసి లకు వెయ్యికోట్లుకేటాయింపు ఉత్తదేనని కేటాయింపులున్నా ఒక్క రూపాయి ఖర్చుచేయకుండా నానుస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో గౌడన్నలకు నీర పేరిట సాఫ్ట్ డ్రింక్ లకు ఇస్తామన్న అనుమతేమయిందన్నారు. నాయా బ్రాహ్నణులకు డొమెస్టిక్ కరెంట్ పేరిట జీవో ఇచ్చినా నేటికి అమలుకు నోచుకోలేదని . నిజంగా అమలు చేస్తే తాను అరగుండుతో తిరుగుతానని మీరుసిద్దమా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజంగా జీవో ఇచ్చినా ముఖ్యమంత్రి మాట అధికారులు వినడం లేదోమోనని అపహాస్యం చేసారు.
మైనార్టీ ల నోట్లో మట్టిగొట్టిన కేసీఆర్
పాలకుల మాట వేదంలా ఉండాలని దార్శనికతతో ఉండాలని శ్రవణ్ అన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారిని నిండా ముంచి సభలో పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. ముస్లీంలకు దేశవ్యాప్తంగా 4వేల కోట్లు కేటాయిస్తే తాను మాత్రం ఏటా 2 వేలకోట్లు ఖర్చుచేశామనడం దారుణమన్నారు.కేటాయించారా ఖర్చుచేశారా స్పష్టంచేయాలన్నారు, 2014 -15 లో 1052 కోట్లు కేటాయించి 326 కోట్లు ఖర్చుచేశారని 2015- 16 లో1111 కోట్లు కేటాయించి , 556 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని, 2016-17 లో రూ.1343 కోట్లు కేటాయించి,రూ 859 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని, 2017- 18 లోరూ. 1249 కోట్లు కేటాయించి రూ 916 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని మొత్తం రూ. 4750 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది రూ.2658 కోట్లు మాత్రమేనన్నారు. మిగిలించుకుంది రూ.2100 కోట్లన్నారు. 45 శాతం కూడా ఖర్చు చేయలేదని చేసింది సగం కూడా లేదన్నారు. అట్టహాసంగా ప్రకటించి నాలుగు నెలల్లో తెస్తానని చెప్పిన 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు తేలేకపోయారో సభలో స్పష్టం చేయలేదన్నారు. వక్ఫ్ బోర్డుకు జ్యూడిషియల్ అధికారాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదన ప్రశ్నించారు. రూ.5000 వేల కోట్ల విలువయిన అన్యాక్రాంతమయిన భూములను ఎందుకు మళ్లించలేకపోయారో అడ్డుకున్నశక్తులేంటో స్పష్టంచేయాలని గల్లాపట్టి అడుగాలని ముస్లీం సోదరులకు పిలుపునిచ్చారు. ఓట్లకోసం పెద్దయెత్తున అబద్దాలు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆరే నని శ్రవణ్ దుయ్యబట్టారు.
తండాలకు బిల్డింగులేవి..?
తండాలను గ్రామపంచాయితీలుగా మార్చినా బిల్డింగులు నిర్మించకపోతే లాభమేంటని, ఆగమేఘాల మీద ప్రగతి భవన్, ఎమ్మెల్యేల భవన్ లు నిర్మించిన కేసీఆర్ గ్రామపంచాయితీ భవనాలెందుకు నిర్మించలేకపోయారో చెప్పాలన్నారు. గిరిజనులు, లంబాడాల మధ్య చిచ్చుపెట్టారని ప్రశాంతంగా ఉన్న తండాలను,గిరిజన గూడాలను అల్లకల్లోలంగా మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మిషన్ భగీరథ ఓ విఫల ప్రయత్నం
మిషన్ భగీరధ ద్వారా 22 వేల గ్రామాలకు నీరిచ్చినామని మరో 13వందల గ్రామాలకు పదిహేను రోజుల్లో నీరిస్తామనడం పెద్ద మోసమని, పచ్చి అబద్దమని శ్రవణ్ అన్నారు. తెలంగాణా లో మొత్తం 10 వేల గ్రామాలుంటే మిగితా గ్రామాలెక్కడివని ప్రశ్నించారు. గజ్వేల్ పరిసరాల్లో మినహా మరెక్కడా మిషన్ భగీరధ నీరు రాలేదని ఒకవేళ అధికారపార్టీ నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని.. మీరు సిద్దమేనా అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఇసుక మాఫియా ను ప్రోత్సహిస్తూ ఆదాయం అంటారా..?
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్యవరణ సమతుల్యత కోసం ఇసుకను ఇష్టారీతిగా తవ్వడం నేరమని ప్రభుత్వాది నేతలకు తెలియక పోవడం శోచనీయమని, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం ఇసుకనుంచి 19 కోట్ల ఆదాయం వస్తే తమ హాయాంలో 1900 కోట్లు వచ్చిందని చెప్పడం ముఖ్యమంత్రి అజ్నానానికి నిదర్శనం అన్నారు. అవగాహాన ఉన్నవారెవరూ సాండ్ మైనింగ్ పేరిట అడ్డగోలు తవ్వకాలు చేపట్టరాదని, రాష్ట్రానికి ఆదాయం కల్పిస్తున్నామన్న పేరిట వేలాది కోట్లు దండుకుని ఇసుక మాఫియాను ప్రోత్సహించారని అన్నారు. టీఆర్ఎస్ అడ్డగోలు దొపిడి వల్లే నేరెళ్లలో లారీ టైర్లకింద పడి అమాయకులు చనిపోయారన్నారు.
దయ్యాలు వేదాలు వల్లించినట్లు
రాజకీయ అవినీతిగురించి కేసీఆర్ చెప్పడం దయ్యలు వేదాలువల్లించినట్లుందని శ్రవణ్ ఎద్దేవా చేశారు. కలెక్టర్ స్ధాయి నుంచి అటెండర్ స్ధాయి వరకు అందరూ అవినీతిలో మునిగితేలుతున్నరన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి సిరిసిల్ల మున్సిపల్ మహిళా ఛైర్ పర్సన్ మాటలే నిదర్శనమన్నారు. ఆరోపణులు చేసిన ఆమెను వెంటనే పదవినుంచి తప్పించారని, డిప్యూటీ సియం రాజయ్య పై తప్ప మియాపూర్ ల్యాండ్ స్కాం నుంచి మొదలు ఎమ్మెల్యేలు అధికారులు చేసిన ఏ అవినీతి పై చర్యలు తీసుకోలేదన్నారు.
జోన్లు పెద్ద బోకస్
మోడీని ఇస్తవా సస్తవా అంటూ జోన్ల విషయం ప్రస్తావించిన కేసీఆర్ సాధించిందేమీ లేదన్నారు. కొత్తగా తెచ్చిన జీవో వల్ల ఇతర ప్రాంతాల వారు నాలుగు సంవత్సరాలు వరుసగా చదివితే లోకల్ గా మారే ప్రమాదముందన్నారు. దీని వల్లపరిగణించడంవల్ల అసలైన తెలంగాణా జిల్లాలకు చెందిన అభ్యర్దులకు తీవ్ర అన్యాయం జరగనుందన్నారు.
ఐటీఐఆర్ ను అటకెక్కించి ఐటీ అభివృద్ది చెందిందంటారా..?
ఐటీ ఇండస్ట్రీని ఆగం బట్టించి గొప్పగా ఉందని చెప్పడం సరికాదన్నారు. చిత్తశుద్ది ఉంటే 50 లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను ఎందుకు తేలేకపోయారని ముఖ్యమంత్రి. ఐటీ శాఖామంత్రి అసమర్ధతకు నిదర్శనమని చెప్పారు.
పేదల భూములు లాక్కొంటూ కేసులేస్తున్నమంటారా . ?
ప్రాజెక్ట్ లు కడుతుంటే కేసులేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పడాన్ని శ్రవణ్ తప్పుపట్టారు. ప్రాజెక్ట్ ల పేరిట పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యవసాయ భూములను అక్రమంగా లాక్కొంటుంటే కాంగ్రెస్ నేతలు దామోదర్ రాజనర్సింహ్మ, హర్షవర్ధన్ లాంటి నేతలు పేదల పక్షాన నిలిచి పోరాటం చేశారన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన పేదల పై లాఠీచార్జీలు చేయిస్తూ అధికారులను దళారులుగా మార్చుకున్నారని, బెదిరింపులకు పాల్పడ్డారని, కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయకుండా కోట్లాది నిధులు మంజూరుచేశామని చెప్పడం హాస్యాస్సదమన్నారు
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోమారు సెంటిమెంటు ను పండించాలని కేసీఆర్ చూస్తున్నారని ప్రజలెవరూ మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కవులు కళాకారులను మోసంచేసారని ఇందుకు చెరుకు సుధాకర్, విమలక్క లాంటి ఎందరో బలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. వేలాది మంది రైతులు చనిపోతే వారి గురించి మాట్లాడలేదన్నారు. కోట్లాది రూపాయలు అడ్వర్టయిజ్ మెంట్ల రూపంలో విచ్చల విడిగా ఖర్చుచేశారని కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని ప్రజాస్వామిక తెలంగాణా కోసం మరో మారు పోరాటం చేసేందుకు ప్రజలంతా సిద్దం కావాలని శ్రవణ్ పిలుపునిచ్చారు.
YouTube link : -
Subscribe to:
Posts (Atom)
-
- అనర్హుడికే అందలం - సీఎస్ ఎంపికపై దాసోజు ఫైర్ - రాష్ట్ర ప్రభుత్వం లో రిటైర్డ్ అధికారులదే హవా - పడకేసిన పాలన రాష్ట్రంలో పాలన...
-
ఆంధ్రా కేడర్ ఐపీఎస్ అంజనీ కుమార్ కు తెలంగాణాలో ఏం పని..? - ధ్వజమెత్తిన డాక్టర్ దాసోజు శ్రవణ్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమ...
-
Congress demands judicial probe into inter exams goof up Ø Sravan calls Minister Jagadish Reddy 'Munnabhai MBBS', want him s...