Tuesday 4 September 2018

గాంధీ విగ్రహం వద్ద గడ్డాలు గీసి శ్రవణ్ దాసోజు అధ్వర్యంలో నాయీబ్రాహ్మణుల వినూత్న నిరసన :

  • గాంధీ విగ్రహం వద్ద గడ్డాలు గీసి శ్రవణ్ దాసోజు అధ్వర్యంలో నాయీబ్రాహ్మణుల వినూత్న నిరసన
  • ప్రగతి నివేదన సభలో నాయీబ్రాహ్మణుల సంక్షేమం పై కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారు.
  • జీవో ఎం ఎస్ నెంబర్ 1 ఇచ్చి రెండేళ్లయినా డొమెస్టిక్ టారిఫ్ అమలు కాలేదని శ్రవణ్ విమర్శ  
  • బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించి రూ. 25 కోట్లే ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపారని  ఆరోపణ.
  • ఇస్తామన్న25 వేల మాడ్రన్ సెలాన్ లు ఏమయ్యాయని సూటి ప్రశ్న
  • నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ కు పాలక మండలి ని నియమించాలనిడిమాండ్
ప్రగతి నివేదన సభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని రాష్ట్రంలో నాయీబ్రాహ్మణులకు చేయని సాయాన్ని చేసినట్లు గా గొప్పలు చెప్పుకోవడమే దీనికి తార్కాణమని, ముఖ్యమంత్రి అబద్దాలకు ఇదో మచ్చుతునకని టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీభవన్  లో నాయీ బ్రాహ్మణ సంఘం నేతలతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన  ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి  చెప్పిన మాటకు విలువ ఉండాలని అది రాజముద్ర లాంటిదన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మాట పైనిలబడాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి మాటలు చెట్లమీద ఇస్తరాకులు కుట్టినట్టిగా, బెల్లం లేకుండా బూరెచేసినట్లుగా ఉన్నాయిని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశానికి ముందు కేసీఆర్ తమ విషయంలో చెప్పిన అబద్దాలను నిరసిస్తూ శ్రవణ్ ఆధ్వర్యంలోపలు జిల్లాలను నుంచి తరలి వచ్చిన నాయీబ్రాహ్మణులు గాందీ భవన్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ముందు క్షవరాలు చేసి వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు.



ప్రగతి నివేదన సభలో కేసీఆర్ పచ్చి అబద్దాలు
సెప్టెంబర్ 2,  2018 న జరిగిన ప్రగతి నివేదన సభలో కులవృత్తుల గురించి మాట్లాడిన సియం కేసీఆర్ నాయీబ్రాహ్మణలకు పెద్దయెత్తున సహాయం అందిస్తున్నట్లు మాట్లాడడం హాస్యాస్పదమని, వారికి  కమర్షియల్ టారిఫ్ నుంచి డొమెస్టిక్ టారిఫ్ కు కరెంటు బిల్లులు మార్చినట్టు అబద్దాలు చెప్పారని శ్రవణ్ విమర్శించారు. డొమెస్టిక్ టారిఫ్ అమలు చేస్తున్నట్లు తేదీ 6.01.2016 నాడు  జీవోఎం ఎస్  నెంబర్ 1 ను విడుదల చేసినా నేటికి అమలు కాకపోవడం ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి, చిత్తశుద్దిలేని తనానికి నిదర్శనమన్నారు. తానిచ్చిన జీవో అమలుకు నోచుకోకున్నా సినిమాల్లో ఎదురుగా కోడిని చూపించి చికెన్ బిర్యాని తిన్నట్లు భావించినట్లు లక్షలాది మంది వచ్చిన సభలో చేయని పనిని చేసినట్లుగా  ముఖ్యమంత్రి  భ్రాంతికలిగించి పత్రికల్లో రాయించుకుంటున్నరని  శ్రవణ్ ఎద్దేవా చేశారు. 


కేటాయించింది రూ.250 కోట్లు విడుదల చేసింది రూ.25 కోట్లు.
2014 నుంచి నేటి వరకు నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి బడ్జెట్ లో రూ. 250 కోట్లు కేటాయించినా ఈనాలుగేళ్లుగా కేవలం 10 శాతం నిధులను మాత్రమే  విడుదల చేశారన్నారు.

మానిఫెస్టోలో చెప్పిన 25000 వేల మాడ్రన్ సెలూలేవి..?
ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినట్లు నాయీబ్రాహ్మణులకు 25000 మంది కి మాడ్రన్ సెలూన్ లు ఇస్తామన్న విషయం ఏమైందని శ్రవణ్ ప్రశ్నించారు. ఎన్నికల్లో మాటలు కోటలు దాటిచ్చినా అది ఆచరణ లో మాత్రం శూన్యంగా ఉందన్నారు.
వేలాది మంది యువకులకు ఇవ్వాల్సిన స్కిల్  డెవలప్ మెంట్ కేవలం 600 మందికే ఇచ్చారన్నారు.

పాలక మండలి లేని ఫెడరేషన్
నామ మాత్రపు నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ ప్రకటించినా పాలక మండలి ని ప్రకటించలేదని, ఒక్క రూపాయీ కేటాయించలేదన్నారు.నాలుగేళ్లు గడిచినా ఫెడరేషన్ భవనాన్ని నిర్మించలేదన్నారు. అటు ఎండోమెంట్ బోర్డుల్లో ఉండాల్సిన సభ్యులను నియమించలేదని శ్రవణ్ నిలదీశారు.బీసిలకు పెద్దయెత్తున గొర్లు, బర్లు చేపలు పంపిణీ చేస్తున్నామన్న సియం కు 17 లక్షల మంది నాయీ బ్రాహ్మణులు ఎందుకు  కనిపించడంలే దని ప్రశ్నించారు. తన పాలనా కాలం ముగిసే లోగా నాయీ బ్రాహ్మణులకు కేటాయించిన రూ. 250 కోట్లు విడుదల చేయాలని, జీవో నెంబర్ 1 ను యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మోసగిస్తున్న తీరును బీసీ సమాజమంతా ఎండగట్టాలని శ్రవణ్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి  కొప్పిలి సతీష్ నాయి ,లారియల్  సౌత్ ఇండియా టెక్నికల్ మేనేజర్ రమేశ్, వెంకటేశ్, అధికార ప్రతినిధులు  విజయ్ కురువ, డాక్టర్ కేతూరి వెంకటేశ్ ,కైలాస్ నేత, బాలలక్ష్మి, పీసిసి సెక్రటరీ మెట్టుసాయి  తదితరులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment