Tuesday 25 December 2018

ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ రాష్ట్రాలు తిరుగుతూ స్వరాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించిన రాజ్యసభ ఎంపీ, ఏఐసిసి స్పోక్స్ పర్సన్ ఫ్రొఫెసర్ ఎం వీ రాజీవ్ గౌడ

ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ రాష్ట్రాలు తిరుగుతూ స్వరాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించిన  రాజ్యసభ ఎంపీ, ఏఐసిసి స్పోక్స్ పర్సన్  ఫ్రొఫెసర్ ఎం వీ రాజీవ్ గౌడ  
బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామంటూనే.. మోడీని కలువడమేంటో గమనించాలని ప్రజలకు సూచన.
వ్యవస్ధలన్నింటిని భ్రష్టు పట్టించిన బిజెపి  అధికారంలోకి వస్తే అక్రమాలకు అడ్డుండదని వ్యాఖ్య.
కరెప్షన్ కింగ్ లను దాచిపెడుతూ ప్రజలను మోడీ ప్రభుత్వం మోసగిస్తుందని ఆరోపణ.
కాంగ్రెస్ హయాంలో బలోపేతంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థను మోడీ చిన్నాభిన్నం చేశారన్న గౌడ.
న్యాయవ్యవస్ధ, డిఫెన్స్, ఇతర ఆర్ధిక సంస్ధల నిర్వీర్యానికి కుట్ర జరుగుతుందని ఆందోళన.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు చిత్తశుద్దితో వ్యవహరించిన  కాంగ్రెస్ పార్టీ.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా  ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపిన ప్రొఫెసర్ రాజీవ్ గౌ, డాక్టర్ శ్రవణ్ దాసోజు.



హైదరాబాద్ : కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వంరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం  ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ రిసెర్చ్ డిపార్ట్ మెంట్  ఛైర్మెన్,   రాజ్యసభ ఎంపీ, ఏఐసిసి స్పోక్స్ పర్సన్  ఫ్రొఫెసర్ ఎం వీ రాజీవ్ గౌడ అన్నారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్ లో టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన భారత్ దేశంలో బలమైన ఆర్ధిక వ్యవస్థ ను పునరుద్దరించాల్సిన అవసరముందన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ హయాంలో బలోపేతంగా మారిన ఆర్దిక వ్యవస్ధను మోడీ, అమిత్ షాలు భ్రష్టు పట్టించారన్నారు.  మరికొద్ది నెలల్లో లోక్ సభ ఎన్నికల కు వెళ్ల బోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సెక్యులర్ దేశంలో కొన్ని మతాల పట్ల బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో అనిశ్చితి, అసహనం నెలకొందన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని మతాల పట్ల సమభావంతో కలిసి మెలిసి ఉండే అవకాశముందన్నారు.ఈ రోజు క్రిస్మస్ పర్వదినం జరుపుకుంటున్న వారందరికి శుభాకాంక్షలు తెలిపిన గౌడ.. భారతదేశ సెక్యులరిజానికి అన్ని మతాలను గౌరవించడమే నిదర్శనమన్నారు. దురదష్టవశాత్తూ అన్ని మతాలను అణిచివేసే కుట్ర జరుగుతుందన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ రాష్ట్రాలు తిరుగుతూ స్వరాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించిన  రాజ్యసభ ఎంపీ, ఏఐసిసి స్పోక్స్ పర్సన్  ఫ్రొఫెసర్ ఎం వీ రాజీవ్ గౌడ
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట రాష్ట్రాల్లో పర్యటిస్తూ తెలంగాణా ప్రజలను మోసగిస్తున్నారని రాజీవ్ గౌడ ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేద్దామంటూ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేసీఆర్ ప్రధాని మోడీని ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓవైపు మోడీ తో దోస్తీ చేస్తూనే మరో వైపు బీజెపి పార్టీకి వ్యతిరేకిగా మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తున్న వైనాన్ని గమనించాలని విజ్నప్తిచేశారు. దేశాన్ని,రాష్ట్రాన్ని రక్షించేది, ప్రజలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని రాజీవ్ గౌడ అన్నారు.
రాఫెల్ కుంభకోణం.. అనిల్ అంబానికి దోచిపెట్టేందుకేనన్న గౌడ.
దేశంలో అతిపెద్ద కుంభకోణానికి బిజెపి ప్రభుత్వం తెరలేపిందన్న రాజీవ్ గౌడ రాఫెల్ యుద్దవిమానాల దిగుమతి విషయంలో మూడింతల ధర చెల్లించడం అక్రమమన్నారు. రాఫెల్ ఒప్పందానికి పది రోజుల ముందే  ప్రారంభమయిన ఏమాత్రం అనుభవం లేని అనిల్ అంబాని కంపెనికి కట్టబెట్టి, అడ్డగోలుగా దోచిపెట్టేందుకు రాచబాట వేసిందని ఎద్దేవా చేశారు. డిఫెన్స్ మినిష్టర్ నిర్మలా సీతారామన్ రాఫెల్ యుద్దవిమానాల గురించి సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారన్నారు. కొందరికి లాభం చేకూర్చేందుకు గతంలో రాఫెల్ యుద్ద విమానాల తయారీ కి  సంబంధించిన టెక్నాలజీని స్వంతం చేసుకునే అవకాశాలను వదులుకున్నారని ఆరోపించారు. రాఫెల్ విషయంలో అబద్దాలతో సీల్డ్ రిపోర్ట్ ఇచ్చారని దాన్ని ఆధారంగా కోర్టులో తీర్పు వచ్చిందన్నారు. తీర్పు ను పరిశీలిస్తే మోడీ ప్రభుత్వం సమర్పించిన సీల్డ్ కవర్ రిపోర్ట్ అంతా తప్పుల తడకలా ఉందని మహాభారతంలో ధర్మరాజు వాడిన నీతి అశ్వద్దామ హతో హత: న నరోవ కుంజర “ అన్న నానుడిని ఉదహరించారు. అలాగే  మన్మోహన్ సర్కార్ ఎంతో శ్రమపడి అత్యుత్తమ ఆర్ధిక వ్యవస్థను నిర్మిస్తే. మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు.  ఆర్ధిక రంగ వ్యవస్థలైన ఆర్బీఐని ప్రభుత్వ అనవసర పెత్తనంతో భ్రష్టు పట్టించారన్నారు.  అలాగే న్యాయవ్యవస్ధలో జోక్యం చేసుకుంటున్నారని, ఎన్నికల సంఘంపై పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. సిబిఐ ని దుర్వినియోగ పరుస్తున్న మోడీ ప్రభుత్వం  కంప్ట్రోటర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక లను కూడా తప్పుదోవ పట్టిస్తు ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు.  గతంలో మన్మోహన్ సర్కార్ తెచ్చిన పారదర్శక పాలనకు మోడీ ప్రభుత్వం చరమగీతం పాడిందని విమర్శించారు.
కరెప్షన్ కింగ్ లను దాచిపెడుతూ ప్రజలను మోడీ ప్రభుత్వం మోసగిస్తుందని వ్యాఖ్య.
మోడీ ప్రభుత్వం కరెప్షన్ కింగ్ లను కాపాడుతుందన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి కరెప్షన్ కింగ్ లను దేశం దాటించారన్నారు. వారిని దేశం దాటించడం లో మోడీ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించిందన్నారు. నోట్ల రద్దు అంశంతో దేశ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన మోడీ ప్రజలకేం సమాధానం చెబుతారని నిలదీశారు.
అక్రమాలకు అకృత్యాలకు బిజెపి ప్రభుత్వం అడ్డాగా మారిందని వెల్లడి
ఆడపిల్లల పై అకృత్యాలు అత్యాచారాలు బీజెపి ప్రభుత్వంలో పెరిగిపోయాయని రాజీవ్ గౌడ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలు శాంతియుతంగా జీవించే పరిస్థితులు లేవన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన అత్యాచారాలపై కేసుల నమోదయితే బాధితులపైనే చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.
తెలంగాణా ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమయింది...
తెలంగాణా ప్రజల ఆకాంక్షలను గుర్తించిన సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణా రాష్ట్రం సాకారమయ్యిందన్నారు రాజీవ్ గౌడ.. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గుర్తించిన సోనియా గాంధీ రాజకీయంగా నష్టపోయినా ఫర్వాలేదని రాష్ట్రాన్ని సాకారం చేసారని కాని కేసీఆర్ తెలంగాణా ప్రాంత ప్రయోజనాలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. తెలంగాణా ప్రాంత ప్రయోజనాలు నెరవేర్చకుండా ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశపర్యటనకు వెళ్ళిన కేసీఆర్ తీరు ను రాజీవ్ గౌడ తప్పుపట్టారు. దేశ ప్రయోజనాలు నెరవేర్చాలంటే ప్రాంతీయ పార్టీల వల్ల సాద్యం కాదన్నారు.

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా  ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపిన ప్రొఫెసర్ రాజీవ్ గౌడ.డాక్టర్ శ్రవణ్ దాసోజు.




గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు తో కలిపి  పాల్గొన్న రాజీవ్ గౌడ కేక్ ను కట్ చేసి ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రొఫెసర్ గౌడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిపిసిసి అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్ నాయకులు డోకూరి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Video Link : 

No comments:

Post a Comment