Friday 28 September 2018

గులాబీ పార్టీకి గులాములుగా పోలీసులు .....శ్రవణ్ దాసోజు

గులాబీ పార్టీకి గులాములుగా పోలీసులు .....శ్రవణ్ దాసోజు
నాయకుల గొంతును నొక్కేందుకు కేసులతో బెదిరిస్తున్నారని ఆరోపణ
తక్షణమే ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకొని కేసీఆర్ చేతిలోబందీ అయిన పోలీసు వ్యవస్ధకు  విముక్తి కలిగించాలని డిమాండ్.


టీఆర్ ఎస్ పాలనలో తెలంగాణా రాష్ట్రం బంగారు తెలంగాణా గా మారుతదనుకుంటే మర్డర్ ల తెలంగాణాగా మారిపోయిందని, పోలీసుల సమక్షంలోనే విచ్చుకత్తులతో నేరస్తులు స్వైరవిహారం చేస్తుంటే అడ్డుకోవాల్సిన యంత్రాంగం నిస్తేజంగా వ్యవహస్తుండడం ప్రమాదకరమని టీపిసిసి కాంపైనింగ్ కమిటీ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిది డాక్టర్  శ్రవణ్ దాసోజు ఆందోళన వ్యక్తంచేశారు.ఇవాళ గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు గులాబీ పార్టీకి గులామ్ లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  

బంగారు తెలంగాణా నా మర్డర్ ల తెలంగాణానా
నేరస్తులు బహిరంగంగా పాశవికంగా హత్యలకు పాల్పడుతున్నా పోలీసుయంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. మిర్యాలగూడలో ప్రణయ్ అనే వ్యక్తిని వేట కత్తులతో మెడనరికినా, అత్తాపూర్లో రమేశ్ అనే వ్యక్తిపై గొడ్డలితో దాడిచేసి హత్య చేసినా, ఎర్రగడ్డలో హత్యాప్రయత్నాలుచేసినా పోలీసుల యంత్రాంగం పసిగట్టే పరిస్థితిలో లేకపోవడం ,పక్కనే ఉండి కూడా రక్షించలేక పోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. నేరస్తులు పోలీసులను నెట్టుకుంటూ పోయి హత్యలకు పాల్పడుతున్నరంటే వారి పట్ల చులకన భావం ఏర్పడిదనడాకి నిదర్శనమన్నారు. నేషనల్ క్రైం బ్యూర్ ఆఫ్ రికార్డ్స్  నివేదిక ప్రకారం నేరాల్లో తెలంగాణా అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలవడం సిగ్గుచేటని, కాని ప్రభుత్వం ఇవేమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవడం దురదృష్టకరమన్నారు.

గులాబీ పార్టీకి గులామ్ లుగా పోలీసులు
తెలంగాలణా వ్యాప్తంగా దళితులపై, మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోవడంలేదని,నేరాలను పసిగట్టాల్సిన ఇంటలిజెన్స్ వ్యవస్థ కేవలం ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యంచేయాలని,కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఏయే ప్రణాళికలు వేయాలో ముఖ్యమంత్రికి సమాచారం చేరవేయడంలో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి  చేపట్టిన 11 సర్వేలకు ఇంటలిజెన్స్ వ్యవస్థను వాడుకున్నారని ఆరోపించారు. ట్రూ పోలీస్ గా వ్యవహరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగాన్నిదుర్వినియోగం చేశారని ఆరోపించారు. పోలీస్ యంత్రాంగం గులాబీ పార్టీకి గులామ్ గిరిచేస్తూ దిగజారిపోయిందన్నారు . ఏ పోలీస్ స్టేషన్ లో చూసిన వారు కూర్చున్న కుర్చీల్లోతిరుగుతున్న కార్లలో గులాబీ టవల్స్ దర్శన మిస్తున్నాయని శ్రవణ్ ఆరోపించారు. రాజ్యాంగానికి రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు గులాబీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేసీఆర్ కు భజన పరులుగా మారిపోయి ఆయనను ప్రసన్నంచేసుకుని పనిలో పోలీసులున్నారన్నారు.

నాయకుల గొంతును నొక్కేందుకు కేసులతో బెదిరిస్తున్నారు
దొంగలు నేరస్తుల ఆచూకి తెలుసుకోవాల్సిన పోలీసులు తమ వృత్తి ధర్మాన్ని మరిచిపోయారని, కేవలం ప్రతిపక్షపార్టీలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణా రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షకాంగ్రెస్  పార్టీ నేతలు తూర్పు జయప్రకాశ్ రెడ్డి,  శ్రీశైలం గౌడ్, బిక్షమయ్యగౌడ్ ల పై అక్రమ కేసులు బనాయించి  వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రజల మద్దతు కూడ గట్టుకున్న రేవంత్ రెడ్డి , క్రిషాంక్ లాంటి నేతల మీద  అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ ను తట్టుకోలేక పోలీస్ యంత్రాంగాన్ని ఉసిగొల్పుతు భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

టీఆర్ఎస్ పార్టీతో లాలూచి పడుతున్న పోలీస్ బాసులు
నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ రాజకీయ శిక్షణా తరగతులకు పోలీస్ బాస్ లు హాజరవడాన్ని శ్రవణ్ తప్పుపట్టారు. ఒక రాజకీయ పార్టీ శిక్షణ కార్యక్రమంలోపోలీసు బాసులు ఎలా పాల్గొంటారన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి  రావడానికి పరోక్షంగా దోహదం చేస్తున్నారని రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండాల్సిన పోలీసులు ఒక పార్టీ కొమ్ముకాయడమేంటని ప్రశ్నించారు. గతంలో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకుందంటే అందుకు పోలీస్ యంత్రాంగమే కారణమన్న సియం వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.  ధర్నాచౌక్ ఎత్తివేయడాన్ని  నిరసిస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు మహిళాపోలీసులను మఫ్టీపెట్టి వ్యతిరేకంగా ఫ్లకార్డుల ప్రదర్శన చేయించారని ,నయీం కేసుల్లో ఉన్న పోలీసులను తప్పించారని ఆరోపించారు. టెలీకాన్ఫరెన్సుల్లో టీఆర్ఎస్  పార్టీని అధికారంలోకి తేవడానికి కృషిచేయాలని చెప్పడం సరికాదన్నారు.

రాజకీయ ట్రాన్స్ ఫర్ లను రద్దుచేయాలని డిమాండ్
రాజకీయ అవసరాలకోసం ఇష్టారాజ్యంగా  పోలీసులను బదిలీలు చేసారన్నారు.కమీషనర్, డీజీపి తదితర పోలీస్ అధికారులు చేయాల్సిన ట్రాన్స్ ఫర్ లను ఎమ్మెల్యేల, మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో చేయడం అక్రమమన్నారు. రాబోయే  ఎన్నికలలో తిమ్మిని బమ్మిని చేసైనా గెలవాలని  పోలీసులను తాబేదార్లుగా మార్చుకుంటున్నారని  శ్రవణ్ ఆరోపించారు.  ఇటీవల చేసిన ట్రాన్ష్ ఫర్ లన్నీ  పొలిటికల్ పోస్టింగ్ లేనన్నారు. తక్షణమే ఎన్నికల కమీషన్  జోక్యం చేసుకోవాలని కేసీఆర్ చేతిలో బందీ అయిన  పోలీస్ వ్యవస్ధను విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు.

ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఎన్నికలు సజావుగా జరగవని శ్రవణ్ అనుమానం వ్యక్తంచేశారు. హంతకులు పెచ్చరిల్లుపోతుంటే ప్రేక్షకపాత్ర వహించడం , రాజ్యంగవ్యవస్దకు   రక్షకులుగా ఉండాల్సిన యంత్రాంగం తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు.ప్రజలకు పోలీసుల పట్లగౌరవం, కాస్త భయం  ఉండాలన్నారు. అట్లయితేనే సమాజంలో నేరాలు అదుపులో ఉంటాయన్నారు. ఖాకీ బట్టకున్న గౌరవం పెంపొందాలంటే ఏ రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరించకుండా పారదర్శకంగా వ్యవహరించి సమాజోద్దరణ కు పాల్పడాలని కోరారు.

No comments:

Post a Comment