Saturday 8 September 2018

ఎన్నికలపై రెండునెలల్లోనే మాట మార్చిన మోసగాడు కేసీఆర్ : శ్రవణ్ దాసోజు

ఎన్నికలపై రెండునెలల్లోనే మాట మార్చిన మోసగాడు కేసీఆర్
జెమిలీ ఎన్నికలకు సిద్దమని లేఖ ఇచ్చి ముందస్తు ఎన్నికలు ఎందుకు..?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే వెన్నులో వణుకు పుట్టిన కేసీఆర్..
పదినెలల ముందే ప్రజల ఆశలను వమ్ము చేస్తూ ముందస్తుకు వెళ్లడం దుర్మార్గం.....శ్రవణ్ దాసోజు.





లోక్ సభ, అసెంబ్లీ లకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలపై ఆర్ధికభారం పడుతుందని, అభివృద్ది ఆగిపోతుందని, ప్రభుత్వ యంత్రాంగం  ఎన్నికల హడావుడిలో ఉండటం వల్ల పాలన అస్తవ్యస్తమవుతుందని, జూలై 6, 2018 న లా కమీషన్ కు లేఖ రాసిన కల్వకుంట చంద్రశేఖర్ రావు మాట మార్చి  రెండు నెలల వ్యవధిలో సెప్టెంబర్ 6, 2018 న ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నరో చెప్పాలని టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు డిమాండ్ చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన అభద్రత, కాంగ్రెస్ పార్టీ  ఎదుగుదలను చూసి భయంతో వెన్నులో వణుకు పుట్టి ముందస్తుకు వెళ్తున్నరని  అపహాస్యం చేశారు.

లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికలకు 4నుంచి 6 నెలల సమయం తీసుకుంటే  సుదీర్ఘకాలంగా ఎన్నికలు వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్డం మొచ్చి అభివృద్ది కుంటుపడుతుందని చెప్పిన కేసీఆర్ ఎవడబ్బసోమ్మని ముందస్తు ఎన్నికలకు వెళ్లుతూ  రాష్ట్రప్రజలపై  ఆర్ధిక భారం మోపుతున్నరని , ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నరని ప్రశ్నించారు. ఐదేళ్ల కాలంలోరెండు మార్లు రాజకీయ పార్టీలు, నేతలు పెద్దయెత్తున డబ్బులు ఖర్చు చేయాల్సివస్తుందని చెప్పి ముందస్తుకు వెళుతున్ననియంత పాలనకు చరమ గీతం పాడాలని, ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యార్ధులు, నిరుద్యోగులు పెద్దయెత్తున ఒక్క తాటిపై నిలబడ్డ విషయాన్ని గమనించి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలనుంచి వస్తున్న ఆదరణ,  అధికారంలోకి  వస్తుందన్న బలమైన సంకేతాలను చూసి తట్టుకోలేక , ముందస్తు ఎన్నికల పేరిట డ్రామాకు తెరలేపారన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అవకాశాన్ని కాలరాస్తూ.. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నయనే ముందస్తుకు పోతున్నానంటూ సరికొత్త డ్రామాకు కేసీఆర్ తెరలేపారని  శ్రవణ్ అన్నారు. పదినెలల కాలంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అవకాశమున్నా వారి  ఆశలను వమ్ముచేస్తూ పదవీ త్యాగంచేశామని చెప్పడం దుర్మార్గమన్నారు.
ఈ సం దర్భంగా కేసీఆర్ గతంలో హుస్నాబాద్ ఎన్నికల సభలో ప్రసంగించిన వీడియోలు, జెమిలీ ఎన్నికలకు అనుకూలంగా లా కమీషన్ కు లేఖ ఇచ్చామని  ఢిల్లీలో ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడిన వీడియోలను  శ్రవణ్ ప్రదర్శించారు.మీడియా సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, అధికార  ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి లుపాల్గొన్నారు.


Video Link :

No comments:

Post a Comment