Tuesday 25 September 2018

మోడీ గులాంగా మారి స్వీయఅస్తిత్వంపై మాట్లాడుతారా...
అబద్దాలు, మోసాలు చేయడంలో చార్లెస్ శోభారాజ్ వారసులంటూ శ్రవణ్ దాసోజు ఘాటువిమర్శ
పొత్తులనంగానే మీకు లాగులు ఎందుకు తడుస్తున్నాయి.
చచ్చుడో వచ్చుడో అంటూ ఉద్యమకారులను ఉసిగొల్పిన  హంతకుల పార్టీ టీఆర్ఎస్
ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిఅమరుల ఆత్మలను క్షోభ పెట్టింది మీరే
ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంట్ ,రీయంబర్స్ మెంట్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మంచి గుర్తొస్తుంది
ప్రజాస్వామ్యానికి పునాదిరాయి విమర్శ.... అలాంటి విమర్శలు చేస్తే ఎన్నికలకుపోతారా అంటూ
శ్రవణ్ దాసోజు ఎద్దేవా


అమరుల ఆకాంక్షలకు విరుద్దంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటోందని, అనైతిక పొత్తులకు పాల్పడుతోందని  కేటీఆర్ చేసిన విమర్శను టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు తిప్పికొట్టారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే తలనరుక్కుంటా, తెలంగాణా వచ్చుడో కేసీఆర్ చచ్చుడో, ప్రాణాలయినా అర్పిద్దాం. తెలంగాణా సాధిద్దాం, సిద్దిపేట దీక్షా స్థలంలో పెట్రోల్ చల్లుకోవడం, చావునోట్లో తలకాయపెడుతున్నం అంటూ అనేక సందర్భాల్లో చేసిన చిల్లర నినాదాల చేసి  ఉద్యమకారుల్లో భావోధ్వేగాలను రెచ్చగొట్టారన్నారు. అమరుల ఆకాంక్షలకు విరుద్దంగా ఉద్యమద్రోహులతోఅంటకాగుతున్న టీఆర్ఎస్ పార్టీ నేతలకు అమరుల గురించి మాట్లాడేనైతిక హక్కులేదని ,అమరుల ఆత్మలు క్షోభిస్తున్నాయన్నారు.
200 కోట్లతో ప్రగతి భవన్ కట్టారు కాని అమరులస్ధూపం ఎందుకు కట్టలేకపోయారు
అమరుల ఆత్మక్షోభలంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడే కేటీఆర్ 2లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం 200  కోట్లతో ప్రగతి భవన్  కట్టకోగలిగింది కాని 50 కోట్లతో  అమరుల స్ధూపం ఎందుకు కట్టలేకపోయారో చెప్పాలని
తెలంగాణా రావాలంటే బలిదానం చెయ్యాల్సిందేనన్నట్లు  భావోద్వేగాలను రెచ్చగొట్టారన్నారు.  ఉద్యమ సమయంలో 1500 మంది అమరులైనట్లు ప్రకటించి కేవలం 400 మందికి మాత్రమే ఇచ్చి మిగితా వారికి  డబుల్ బెడ్రూం ఇళ్ళు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని దుయ్యబట్టారు.
ఉద్యమద్రోహులకు అందలం అమరుల ఆకాంక్షలకు తిలోదకాలు
అమరుల ఆత్మక్షోభిస్తుందన్న మీకు ఏ అమరులు చెబితే కాపలా కుక్కలా ఉంటానన్న పెద్దమనిషి తానే ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడో , రాజకీయాలతో సంబంధంలేని కవితను ఎందుకు రాజకీయాల్లోకి తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో తిరిగనియ్యనని ముక్కునేలకు రాయిస్తానని హెచ్చరించిన తలసాని లాంటి ఉద్యమ ద్రోహులను ఎందుకు మంత్రిగా చేసారో చెప్పాలన్నారు. హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిని బూతులు తిట్టి,చంపుతా అని బెదిరించిన మహేందర్ రెడ్డిని ఎందుకు మంత్రి పదవి ఇచ్చారో చెప్పాలని తెలంగాణా ఉద్యమ సమయంలో ఖమ్మంలో దీక్షకుదిగిన కేసీఆర్ కు అండగా ఉన్న ఉద్యమకారులపై కేసులు పెట్టించిన తుమ్మలకు ఏ అమరుడు చెబితే మంత్రి పదవి ఇచ్చారో చెప్పాలని దాసోజు డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని అణిచేయాలని చూసిన మైనం పల్లి హన్మంతరావు కు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన ఎర్రోల్ల శ్రీనివాస్ ను కాదని ఉద్యమద్రోహులకు పెద్దపీట వేస్తున్నారని దుయ్యబట్టారు.
చార్లెస్ శోభారాజ్ ను మరిపిస్తున్నారు.
తెలంగాణా రాష్ట్ర సమితి కాదు తెలంగాణా రౌడి సమితిలా టీఆర్ఎస్ పార్టీ తయారయ్యిందని శ్రవణ్ ఎద్దేవా చేశారు, నగరబహిష్కరణ ఎదుర్కోన్నవారు..దొంగలు పార్టీలో నాయకులుగా చెలామణి అవుతున్నారని చార్లెస్ శోభారాజ్ ను తలపించేవిధంగా మోసాలకు అబద్దాలకు పాల్పడుతున్నారని శ్రవణ్ విమర్శించారు. న్నారు.
అమరావతికి,ఢిల్లీకి గులాములుగా మారింది మీరే
స్వీయ అస్తిత్వం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ ఢిల్లీలో మోడీకి, అమరావతిలో చంద్రబాబుకు గులాంలుగా మారారన్నార. జయశంకర్ సార్ స్వీయఅస్తిత్వం గురించి చెబితే  కమీషన్ ల  కోసం ఆంద్రాకాంట్రాక్టర్లకు తెలంగాణాను తాకట్టు పెట్టమని కాదని  వారికి గంపగుత్తగా కాంట్రాక్టులు అప్పగించనప్పుడు మీ స్వీయ అస్తిత్వం ఎక్కడబోయిందని శ్రవణ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు మాట్లాడే మాటలు వింటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆత్మ క్షోభిస్తుందన్నారు.
అహంకారం ఎవరిది
తెలంగాణా బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే మనసు చలించి తెలంగాణా రాష్ట్రం సాకారం చేసిన తల్లి సోనియాగాంధీ పై వారి కుటుంబం పై అవాకులు చెవాకులు పేలుతూ ఇష్టమొచ్చనట్టు మాట్లాడుతున్న మీకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇచ్చిందని చెబితే అహంకారం లా కనిపిస్తుందా అంటూ ప్రశ్నించారు. సెప్టెంబర్ 2 సభలో కేసీఆర్ తాను చెబితే జయశంకర్ సార్ రాసుకున్నడని చెప్పడం అహంకారం కాదా అని ప్రశ్నించారు.
జేఏసీ ఛైర్మన్ గా ప్రోఫెసర్ కోదండరామ్ ను తామే నియమించామని చెప్పడం మీ అహంకారపూరిత స్వభావానికి నిదర్శనమని విమర్శచేశారు. తెలంగాణా ప్రకటించినతర్వాత తల్లిసోనియా గాంధీ కాళ్లుమొక్కిన కేసీఆర్  ఆతర్వాత ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం అందితేజుట్టు లేకుంటే కాళ్లుపట్టకునే రకమని స్పష్టం చేసిందని శ్రవణ్ అన్నారు.
విమర్శిస్తే ఎన్నికలకు పోవడం మీ భావదారిద్రానికి నిదర్శనం
ప్రతిపక్షాలు విమర్శిస్తే ఎన్నికలకు పోయినమని చెప్పడం టీఆర్ఎస్ పార్టీ నేతల భావదారిద్ర్యానికి నిదర్శనమని శ్రవణ్ ఎద్దేవా చేశారు. ఉద్యమకాలంలో ఎన్నికలకు వెళితే ప్రజలు అర్ధం చేసుకున్నారని కాని ఐదేళ్లకాలం పాలించాలని ఎన్నుకుంటే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం చేతకాక ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ప్రతిపక్షాల వల్లే నంటూ దుష్ప్రచారానికి పూనుకుంటున్నరని రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెడుతారని హెచ్చరించారు. 2004 లో కాంగ్రెస్ తో 2009 లో టీడీపితో  సిపియం లాంటీ పార్టీలతో అవకాశవాద ఊసరవెల్లి లా పొత్తుపెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీనేతలు..  ఇతరపార్టీలు పొత్తులు పెట్టుకుంటే అనైతికమంటూ గగ్గోలు పెడుతుందని బలవంతమైన సర్పాన్ని చలిచీమలు చంపేందుకు ప్రజాస్వామ్యవాదులంతా కలిసి కట్టుగా పోరాడడం తప్పెలా అవుతుందన్నారు. వాలిని చంపిన రాముడిది యుద్దనీతి అయితే అదే యుద్దనీతిని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని, పొత్తులు పెట్టకుంటుందన్నారు. అశ్వధ్దామ హతో హత: న నరోవ కుంజర అన్నసిద్దాంతం సరైందే అయితే అదే సిద్దాంతాన్ని మేమే అవలంబిస్తామన్నారు.
పొలిటికల్ శాడిస్ట్ కేసీఆర్
చంద్రబాబు ద్రోహి అంటున్న మీకు హెలీకాప్టర్లో  అమరావతి కి పోయి పోలసచేపల పులుసు, రోయ్యల వేపుడు ఉలవచారుతో లొట్టలేసుకుంటూ తినొచ్చినప్పడు గుర్తుకు రాలేదా అంటూ ఎద్దేవా చేశారు.
చండీయాగానికి పిలిచి  చంద్రబాబును సన్మానించినపుడు, తెలంగాణాలో భూకబ్జాలకు పాల్పడ్డ పరిటాల రవి లాంటి వారి సమాధిపై సాగిల పడి మొక్కినప్పుడు మీకు ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదని వారి ద్రోహాలు ఎందుకు గుర్తుకురాలేదో చెప్పాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.
 దోపిడిలకు పాల్పడ్డప్పు బూకబ్జాలకుపాల్పడ్డ వ్యక్తి సమాధిముందు తలవంచి నప్పుడు నీకు గుర్తుకురాలేదా.. అంటూ ఘాటుగా విమర్శించారు. తాను ఏదైనా చేయొచ్చుకాని ఇతరులు మాత్రం ఏం చేయొద్దనే పోలిటికల్ శాడిజం కేసీఆర్ చేస్తున్నారన్నారు.
కట్టుబానిసలు తెలంగాణా మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీని ఢిల్లీకి కట్టుబానిసంటున్న కేటీఆర్ బుద్దిలేదని ఎవరైనా తమ నాయకులకు కట్టుబడే ఉంటారన్న కనీస జ్నానం లేని వ్యక్తని అభివర్ణించారు. తెలంగాణాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గరకు వస్తున్నప్పుడు తాము ఢిల్లీలో ఉన్న తమ నాయకుల వద్దకు వెళితే కట్టుబానిసత్వం ఎలా అవుతుందో కేటీఆర్ చెప్పాలన్నారు. ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి తేడా తెలియని మూర్కుడు కేటీఆర్ అని దుయ్యబట్టారు. ఏసంబంధమూ లేని మోడీ కి మాటిమాటికి ఎందుకు మోకరిల్లుతున్నరో, మీమధ్యఉన్న రహస్య ఒప్పందాలేంటో ప్రజలంతా గమనిస్తున్నారని కర్రుగాల్చి వాతపెట్టేరోజు త్వరలోనే ఉందన్నారు.
పక్కా లెక్కలతో ముందుకు వస్తం..
మోసపూరిత మాటలతో మభ్యపెట్టిన టీఆరఎస్ సర్కార్ ను దించేస్తామని , ప్రజలకు మాట ఇచ్చినట్లు ఒకేసారి
2 లక్షల రుణమాఫీ పక్కాగా అమలుచేస్తామని శ్రవణ్ అన్నారు. ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్ మెంట్ లాంటి పథకాల పేర్లు చెబితే కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గుర్తుకువస్తుందని, అదే డబుల్ బెడ్రూం ఇండ్లు, మూడెకరాల భూమి లాంటి పథకాల పేర్లు, చెబితే టీఆరఎస్ పార్టీ మోసాలు గుర్తుకు వస్తాయని శ్రవణ్ ఎద్దేవా చేశారు. మోసపూరిత వాగ్దానాలు చేసి  ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని హితవు మోచేతి బెల్లం పూసి నాకమన్నట్లుందని,లక్షల మంది కి ఇళ్లిస్తమని మాట తప్పారని,ముస్లీం మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు, గిరజనులలకు పది శాతం రిజర్వేషన్ల పేరిట మోసం చేశారని ,కేజీటూపీజీ విద్య అందిస్తామన్న మాట అటకెక్కించారని,నియోజకవర్గానిక లక్షఎకరాలకునీరు అందిస్తామన్న మోసాలన్ని టీఆర్ఎస్ పార్టీ నేతలను చూస్తే గుర్తొస్తాయన్నారు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో పెరిగిపెద్దయిన విషయాన్ని మరిచి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కేటీఆర్ మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ముందు గీత, ఖురాన్, బైబిల్ తో సమానమన్న టీఆర్ఎస్ మానిఫెస్టో  ఎందుకు పూర్తిచేయలేకపోయారో  ఐదేళ్ల పరిపాలనను అందిస్తే  చేతకాక మధ్యలోనే కాడి వదిలేసి నిందలు ప్రతిపక్షాలపై మోపుతున్నారని, కమీషన్లు దండుకునేందుకు కాంట్రాక్టర్లకు అడ్డగోలు ప్రాజెక్ట్లను కట్టబెట్టేందుకు ఉన్న శ్రద్ద ప్రజాసమస్యలపై లేదన్నారు.

 Video :

No comments:

Post a Comment