Wednesday 24 October 2018

పింక్ బూత్ ల ఏర్పాటును ఎన్నికల కమీషన్ నిలిపివేయడాన్ని స్వాగతిస్తున్నాం : శ్రవణ్ దాసోజు


*పింక్ బూత్ ల  ఏర్పాటును ఎన్నికల కమీషన్ నిలిపివేయడాన్ని స్వాగతిస్తున్నాం  శ్రవణ్ దాసోజు.
*ఆపద్దర్మ ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలు కోడ్ ను ఉల్లంఘిస్తున్నా కమీషన్ పట్టించుకోవడం లేదని ఆరోపణ
*అధికారుల ఫోన్లలో ప్రభుత్వ పథకాలకు చెందిన రింగ్ టోన్ లు మార్చాలని డిమాండ్
*టీఆర్ఎస్ పార్టీలో చేరాలని కాంగ్రెస్ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్న పోలీసుల పై చర్య తీసుకోవాలని కమీషన్ ను కోరిన శ్రవణ్

కర్ణాటక లో ఏర్పాటు చేసిన మాదిరిగానే తెలంగాణాలో పింక్ బూత్ ల ఏర్పాటు వల్ల టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతుందని, గులాబీ రంగుతో బూత్ లను ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్దమని  మంగళ వారం రోజున (నిన్న) కేంద్ర ఎన్నికల సంఘానికి తాను రాసిన లేఖ పై కమీషన్ స్పందన ఆహ్వానించదగ్గ పరిణామమని, పింక్ బూత్ ల ఏర్పాటు అంశాన్ని ఎన్నికల కమీషన్ వెనక్కి తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని, బుధవారం సాయంత్రం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపిసిసి ఎన్నికల కాంపైన్ కమిటీ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగ విలువలు పెంపొందించేలా ఎన్నికలు నిర్వహించేలా కమీషన్ వ్యవహరించాలని ఆయన కోరారు.
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్న ఆపద్దర్మ ప్రభుత్వం
మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఆపద్దర్మ ప్రభుత్వం ఎన్నికల నియమావళిని అడుగడుగునా ఉల్లంఘిస్తున్నా ఎన్నికల కమీషన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆపద్దర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సహా ఆపద్దర్మ మంత్రులు, ఎమ్మెల్యేలు యధేశ్చగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పలుమార్లు ఎన్నికల కమీషన్ దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదన్నారు.
అధికారుల ఫోన్లలో ప్రభుత్వ పథకాల రింగ్ టోన్లు మార్చాలి
కోడ్ అమలు లో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆపద్దర్మ ముఖ్యమంత్రి, మంత్రులతో కూడిన ఫోటోలను ప్రదర్శించడం,  ప్రభుత్వ పథకాల సందేశాలతో కూడిన టోన్ లు అధికారుల  ఫోన్ లలో మోగడం సైతం వెంటనే నిలిపివేయాలని శ్రవణ్  డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఆపాలి
ఆపద్దర్మముఖ్యమంత్రి. మంత్రులు, ఎమ్మెల్యేలు ,ప్రభుత్వ వాహనాలు, పోలీస్ యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని శ్రవణ్ ఆక్షేపించారు. మరో వైపు పోలీసులు  గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ ఎస్ కు అనుకూలంగా వ్యవహరించాలని, పార్టీలో చేరాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై  బెదిరింపులకు పాల్పడుతూ, కేసుల పెడుతామని వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజలు భయ భ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు తెలంగాణా,ఆంధ్రా బేధ భావాలు సృష్టిస్తున్నారన్నారు.  వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమీషన్ తక్షణమే ప్రభుత్వ వాహనాలను, పోలీస్ ప్రోటోకాల్ ను తొలగించాలని నియమావళిని ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. శ్రవణ్ దాసోజు తో పాటు మీడియా సెల్ కన్వీనర్, టీపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు.
ఇట్లు
డాక్టర్ శ్రవణ్ దాసోజు,
కాంపైన్ కమిటీ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిధి, టీపీసీసీ.
హైదారాబాద్, తెలంగాణా రాష్ట్రం


No comments:

Post a Comment