Monday 8 October 2018

తిట్ల పురాణం వల్లించి బూతు ముఖ్యమంత్రిగా రికార్డు స్వంతం చేసుకున్నాడని ఎద్దేవా...శ్రవణ్ దాసోజు


పేద వర్గాల ఆశాజ్యోతి వైయస్ ను తిట్టడం తగదన్న శ్రవణ్ దాసోజు
తిట్ల పురాణం వల్లించి బూతు ముఖ్యమంత్రిగా రికార్డు స్వంతం చేసుకున్నాడని ఎద్దేవా...
కాంగ్రెస్ పార్టీ బంగారు పళ్లెంలో పెట్టితెలంగాణా ఇస్తే కుక్కులు చింపిన విస్తరిగా మార్చేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శ
ఆంధ్రా తెలంగాణా సెంటిమెంట్ రగిల్చి ఓట్లుదండుకోవాలని చూస్తున్నాడని ఆరోపణ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంద్రా ముద్దు ..ముందస్తు ఎన్నికల్లో ఎందుకు వద్దంటూ సూటి ప్రశ్న
అపరిచితుడు, గజిని లా వ్యవహరిస్తున్న కేసీఆర్,  చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు
టీఆర్ ఎస్ పార్టీకి కర్రుగాల్చి వాతపెట్టాలని ప్రజలకు పిలుపు



ఆపద్దర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన పాలనా కాలంలో  చేపట్టిన అంశాలేం లేక పోవడంతో ముందస్తు ఎన్నికల ప్రచారం లో ప్రజల మెప్పు పొందేందుకు తిట్ల పురాణం మొదలుపెట్టాడని టీపిసిసి కాంపైన్ కమిటీ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు.ఉద్యమసమయంలో ప్రజలను ఉద్యమోన్ముఖులను చేయడానికి కఠిన మైన భాష వాడి కొట్లాడి, తెలంగాణా సాధించుకున్నామని, నాలుగేళ్ల తర్వాత కూడా అదే రకమైన భాషను వాడడం సరికాదన్నారు. మిగులు బడ్జెట్ తో బంగారు పళ్లెంలో  పెట్టి తెలంగాణాను అప్పగిస్తే అభివృద్ది చేయకుండా, కుక్కలు చింపిన విస్తరిలా మార్చి ముందస్తు ఎన్నికలు కు పోయిండని, ఇదేంటని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై బూతులతో  విరుచుక పడుతున్నాడన్నారు. ముఖ్యమంత్రి  ఏదో తెలియని మానసిక వైకల్యంతో ఉన్నాడేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తంచేశారు.
తిట్ల పురాణం వల్లించి బూతు ముఖ్యమంత్రి రికార్డు స్వంతం చేసుకున్నడని ఎద్దేవా...
కొంగరకలాన్ సభలో కేసీఆర్ కటౌట్ కిందపడ్డప్పటినుంచి డిప్రషన్ లోకెళ్లిన కేసీఆర్ రానున్న ఎన్నికల్లో  టీఆర్ఎస్ పార్టీ అధోగతి పాలుకానుందన్న సంకేతం వచ్చినట్టుందని అందుకే వశపోక మసిపూసుకున్నచందంగా వ్యవహరిస్తున్నాడన్నారు. రోజురోజుకు బలోపేతమవుతున్న మహాకూటమి ధాటికి తన పార్టీ కూకటి వేళ్లతో కూలిపోక తప్పదన్న భయంతో నోటికొచ్చింది మాట్లాడుతున్నాడన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో  బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి లేడని, కేసీఆర్ బూతు ముఖ్యమంత్రిగా రికార్డు స్వంతం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. 
దివంగత నేతలను తిట్టడం సరికాదని హితవు
తెలంగాణా ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు బతికున్నోళ్లందరిని తిట్టడం అయిపోయిందని, ఇక దివంగత నేతలపై  బూతుల తో విరుచుకు పడుతున్నాడన్నారు. నవభారత నిర్మాత, భారతరత్న, జన్మదినోత్సవం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటూ   చాచా నెహ్రూగా ఆప్యాయంగా  పిలుచుకునే జవహర్ లాల్ నెహ్రూ ను తూలనాడి సమాజానికేం సందేశం ఇస్తున్నారో చెప్పాలని అలాగే, గరీభీ హటావో నినాదం ఇచ్చి"అన్నమో రామచంద్రా" అంటూ ఆకలితో అలమటించిన పేదలందరికి  స్వాంతన కలిగించి దేశ పటిష్టతకు కృషి చేసిన శ్రీమతి ఇందిరాగాంధీని తిట్టడం చూస్తుంటే  కేసీఆర్ మానసిక స్థితి బాగాలేదోమో నని అనుమానం వస్తుందని శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశారు.
సెంటిమెంటు రగిలించి లబ్దిపొందేందుకు కుట్ర
తెలంగాణా ను బలవంతంగా ఆంధ్రాలో కలిపిన్రని భారతదేశానికి దిశానిర్ధేశ్యం చేసి ప్రపంచ దేశాల్లో స్థిరమైన స్ధానం కల్పించిన భారతరత్న నెహ్రూ ను తిట్టడం సరికాదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లిస్తానని, కేజీ టూ పీజీ అమలు చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తాననిఇవ్వలేక  తన అసమర్ధత, అవినీతితో పాలన కొనసాగించి మళ్లీ తగుదునమ్మా అంటూ ఎన్నికల కోసం తెలంగాణా, ఆంధ్రా బేధ భావాలను సృష్టించి సెంటిమెంటును రగిలించి లబ్ది పొందాలని చూస్తుండన్నారు. రజాకార్ల దాష్టీకాలకు అధోగతి పాలయిన తెలంగాణాను భారతదేశంలో భాగస్వామ్యం కల్పిస్తూ, తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కలిపారన్నారు. పరిస్థితులకు అనుగుణ్యంగా రెండు ప్రాంతాలను కలిపామని  ఇరుప్రాంతాల అభిప్రాయాలు కలవక పోతే ఎప్పుడైనా విడిపోవడానికి వెసులుబాటు కల్పించిన కారణంగా నే నేడు తెలంగాణా వచ్చిందన్న కనీస ఇంగితం ఆపద్దర్మ ముఖ్యమంత్రికి లేకపోవడం దారుణమన్నారు. దేశం కోసం 16 సంవత్సరాలపాటుజైలు శిక్ష అనుభవించిన భారత రత్నను తూలనాడడం కేసీఆర్ అహంకారానికి కండకావరానికి నిదర్శనమన్నారు.
బంగారు పళ్లెంలో తెలంగాణా ఇస్తే కుక్కలు చింపిన విస్తరిచేస్తారా..
బంగారు పళ్లెంలో తెలంగాణా రాష్ట్రం ఇస్తే కుక్కలు చింపిన విస్తరాకులా, గాదెకిందపందికొక్కులా రాష్ట్రాన్ని దోచుకుతిని, అధోగతి పాలు చేశారని శ్రవణ్ తీవ్రం గా విమర్శించారు. 60 నెలలు పాలించమని అధికారం కట్టబెడితే నలభైనెలలు కూడా పరిపాలించడం చేతకాక మధ్యలోనే కాడి వదిలేసిన దద్దమ్మ కేసీఆరేనన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజలనోళ్లలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులనోళ్లలో మన్నుగొట్టారన్నారు.
అపరిచితుడు కేసీఆర్  రామూలా. వెంటనే రెమోలా మారుతడిని దాసోజు ఎద్దేవా
అపరిచితుడు సినిమాలో  పాత్రలాగా  అప్పుడే "రామూ లా" మాట్లాడడం, ఆవెంటనే "రెమోలా" మారుతాడని
సినిమాలో  పాత్రకు ఉన్న రోగమేదో కేసీఆర్ కు ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు.  రెండు నాల్కల విధానంతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుండని, ఇలాంటి ఊసరవెల్లిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.  గజనీ సినిమాలో సూర్య కారెక్టర్ లా  చెప్పిన విషయాలను మరిచిపోయి, ఎప్పుడేం మాట్లాడుతుండో తెలియకుండా మాట్లాడుతున్నడని ఎద్దేవాచేసిన శ్రవణ్   రెండు బెడ్రూం ఇళ్లిస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఆతర్వాత నేనెందుకన్నానంటున్నడని విమర్శించారు.వాస్తుపేరిట బంగ్లాలు కూలుస్తానని చెప్పిన కేసీఆర్ నేనెప్పుడన్నానంటూ మాటమార్చిండని , రాజకీయనాయకులంటేనే అబద్దాలు, బూతులు మాట్లాడుతారన్నట్టు, ఏహ్య భావం పుట్టేట్టుగా దిగజారి వ్యవహరిస్తున్నడన్నాడన్నారు ఈసందర్భంగా  కేసీఆర్ పలు దఫాల్లో మాట్లాడిన వీడియోలను శ్రవణ్ ప్రదర్శించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంద్రా ముద్దు ముందస్తు ఎన్నికల్లో ఎందుకు వద్దంటూ సూటి ప్రశ్న
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతం వారు ఎందుకు ముద్దు.. ముందస్తు ఎన్నికల్లో ఎందుకు వద్దో స్పష్టం చేయాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా వారిని ఉద్దేశించి లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనన్న కేసీఆర్ జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రా వారంతా మావాళ్లేనని వారి కాళ్లలో ముల్లుకుచ్చుకుంటే పంటితో తీస్తానని  మాట్లాడిన్రన్నారు.నాగార్జున లాంటి సినిమా హీరోలను వాడుకుని అందరిని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు.  ముందస్తు ఎన్నికలల్లో మాత్రం  ఇక్కడున్నోళ్లు, ఆంధ్రా లో ఉన్నోళ్లు వేర్వేరంటూ మాట్లాడుతున్నారని తేడా చూపుతూ రెచ్చగొడుతున్నారన్నరు.
హైదరాబాద్ లో దేశంలోని అన్నిప్రాంతాలకు చెందిన వారు ప్రశాంతంగా జీవిస్తున్నారని భిన్నత్వంలో ఏకత్వం సాధించిన తెలంగాణాను ఓట్లకోసం పదేపదే ఇరు ప్రాంతాల మధ్య ఎవరికి లేని అభ్యంతరం ఆంద్రా వారిపట్ల ఎందుకని ప్రశ్నించారు.
విజ్ డమ్ ఆఫ్ ఎకానమీ అంటూ పొగడ్తలు .. చంద్రబాబు ఆంధ్రారాక్షసి అంటూ నేడు తిట్లు
విజ్ డమ్ ఆఫ్ ఎకానమీ కి చంద్రబాబు కారణమన్న నోటితోనే చంద్రబాబుతో పోత్తా థూ అంటూ తూలనాడిండన్నారు.  టీడిపి అంటేనే ఆంధ్రాపార్టీ అంటూ ఆంధ్రా తెలంగాణా బేధ భావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని,  
పేద వర్గాల ఆశాజ్యోతి వైయస్సేనన్నశ్రవణ్ దాసోజు
రిక్షాతొక్కుకునే, చెప్పులు కుట్టుకునే వారి పిల్లలు  సైతం ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్ధానానికి ఎదిగేలా చేసినందుకు  ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టిన వైయస్ తిట్టడానికి నోరెలా వచ్చిందని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలను తిడితే సహించేది లేదని ఖబర్ధార్ కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలందరికి కార్పోరేట్ వైద్యం అందించి ప్రాణదానం చేసిన గోప్పనేత వైయస్సేనన్నారు.  108 104 ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం ,అంబులెన్స్ అందుబాటులో ఉంచి ప్రాణాలను కాపాడితే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వాటిని కనుమరుగు చేసాడన్నారు.  2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 వేల కోట్ల రూపాయల బడ్జెట్ రూ.200 రూపాయల ఫించన్ ఇచ్చిన ఘనత వైయస్సార్ దేనని, ఆనాటి మార్కెట్ ధరల ప్రకారం బియ్యం ధర రూ. 10 ఉండగా నేడు అదే బియ్యం ధర 40 నుంచి 50 రూపాయలుందని నాటి దరలతో  పోల్చుకుంటే నేడు2లక్షల కోట్ల బడ్జెట్ లో  కేసీఆర్ ఇస్తున్న రూ.1000 రూపాయలు చాలా తక్కువన్నారు. నేటి ధరల ప్రకారం కాంగ్రెస్ పార్టీ రూ. 2000 పింఛన్ ఇస్తామంటే, అర్రాస్ పాట పాడుతున్నరని ఎద్దేవా చేస్తున్న కేసీఆర్ వైఖరి ని ప్రజలు గమనించాలన్నారు.
వైయస్ ను ఎందుకు తిడుతున్నవో చెప్పాలని  డిమాండ్
హైదరబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టినందుకు తిడుతున్నవా, లేక హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు కట్టినందుకు తిడుతున్నవా  అని ప్రశ్నించారు.  వందలాది ఐటీ కంపెనీలు తెచ్చినందుకు తిడుతున్నారా, లేక ఎంఎంటీఎస్, మెట్రో రైల్ లాంటి బృహత్తర పథకాలను అమలు చేస్తున్నందుకు తిడున్నావా , లేక జలయజ్నం పేరిట భారీ, మధ్యతరగతి నీటిపారుదల ప్రాజెక్ట్ లను నిర్మించి కోటి ఎకరాలకు నీరందిస్తున్నందుకు తిడుతున్నవా అంటూ సూటిగా ప్రశ్నించారు. విద్యార్దుల భవిష్యత్త్ కోసం తెలంగాణా వ్యాప్తంగా పది విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేశారని,, ఐఐటీ ట్రిపుల్ ఐటీ తెచ్చారని   ఆఖరుకు  టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు స్థలం కేటాయించిన నేతను తూలనాడేముందు జాగ్రత్తగా ఉండాలని, చరిత్రలో ఎందరో మట్టిలో కలిసిపోయారని మీరేం ఎల్లకాలం ఉండేందుకు రాలేదని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
ఉచిత విద్యుత్ ఇచ్చిన వ్యక్తిని ,లక్షల మంది గ్రాడ్యుయేట్ లు తయారయ్యేందుకు దోహదపడ్డ వ్యక్తిని, తిట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మనసులను గాయపరచడం సరికాదని హితవు పలికారు. ప్రజలకోసం ఏంజేసినవో చెప్పమంటే అది చెప్పకుండా తిట్లరాజకీయాలతో  కాలం వెళ్లదీస్తున్నడని చిల్లర రాజకీయాలకోసం తెలంగాణాను భ్రష్టుపట్టించొద్దని శ్రవణ్ హెచ్చరించారు.
తన గ్రాఫ్ పడిపోతుందన్న సమయంలో బూతు పురాణం మొదలు పెట్టి, సభ్యసమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నాడన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు తెలంగాణా పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ నేతగా, జాతీయ నేతగా ఎందుకు చెలామణి అయ్యిన్రో చెప్పాలని డిమాండ్ చేశారు. మానిన గాయాలను మళ్లీ రేపి ఆ మంటల్లో లబ్ది పొందాలని కేసీఆర్ చూస్తున్నాడని శ్రవణ్ ఆరోపించారు.  ఎవరూ శాశ్వతంగా జీవించలేరని చిల్లర రాజకీయాలకు పాల్పడవద్దని సూచించారు.
దొంగఓట్లతో గద్దెనెక్కాలని చూస్తున్న టీఆర్ఎస్, పట్టించుకోని  ఎలక్షన్ కమీషన్
తెలంగాణా వ్యాప్తంగా 30 లక్షల ఓట్లను తొలగించారని మర్రి శశిధర్ రెడ్డి కేసు వేస్తే కేవలం 14 లక్షల ఓట్లను పునరుద్దరించిన ఎన్నికల కమీషన్ అదే సమయంలో దొంగఓట్లను గుర్తించడం లేదన్నారు శ్రవణ్.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తెల పేరిట ఉన్న ఓట్ల జాబితాను మీడియాకు ప్రదర్శించారు.   రాష్ట్రంలో ఫేర్ అండ్ ఫ్రీ ఎన్నికలు జరిగేందుకు  తగిన వాతావరణం ఎన్నికల కమీషన్ కల్పించాలని శ్రవణ్ కోరారు  మీడియా సమావేశంలో శ్రవణ్ దాసోజు తో పాటు యువ నేత  కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నెక్రిషాంక్ పాల్గొన్నారు. 





No comments:

Post a Comment