Thursday 14 February 2019

Congress asks US to release Telugu students : All India Congress Committee Spokesperson Dr. Dasoju Sravan

Congress asks US to release Telugu students

Hyderabad, February 14: The Congress party on Thursday demanded immediate release of students hailing from Telugu States of Andhra Pradesh and Telangana who have been detained by the USA Immigration and Customs Enforcement (ICE) on the charges of taking admissions into University of Farmington.


In an open letter to US Consul General in Hyderabad Katherine B. Hadda, All India Congress Committee (AICC) Spokesperson Dr. Dasoju Sravan said that hundreds of students belonging to Telugu States had fallen victim to a trap laid by the US Home Land Security itself. "These students were deliberately lured by University of Farmington, a fake university, to taking admission by making them believe that they can start earning by working as soon as they join the college and that they need not attend classes and engage in off campus practical work," he said.

The Congress leader said that the students, if they have committed any mistake, it is purely out of their ignorance of law and more importantly due to the unawareness of the antecedents of the University of Farmington. They apparently seem to have believed that university of Farmington being established by USA government’s agency would not be a fraudulent university, he said.

"In any case ignorance of law is no bliss, however, the young students are in pursuit of their higher education and better career and it is pertinent to note that they are neither habitual criminals not perennial violators of law. They have no intention to cause any harm to USA and indulge in violating federal law. In fact by working part-time, the students have contributed to the growth of USA’s economy. Hence, It is unjustified to punish for an unproven alleged crime and it is against the principles of natural justice to not even grant them bail by posting a bond," he said.

"It has been nearly two weeks, the unfortunate incident of student detention took place, neither the students are being produced in the USA courts nor they are being allowed to post a bond and get released. They are being punished much before the crime is proved in the courts of law. These students belong to middle class families whose parents are teachers, farmers & small business owners. They have put their lifetime earnings for sending their Children for quality of education and better career," Sravan said in his letter.

Dr. Sravan alleged that the students were being subjected to severe harassment and being deprived of even quality food. As a result, most of the students seem to have lost their body weight and suffering with serious illness. "Due to the ill treatment and intimidation, most of the students seem to be emotionally depressed with intense mental agony and if this situation further worsens, they may be subjected to unwanted psychological disorders. Some of them have their weddings scheduled; some of them have pregnant wives and small children at home. Due to lack of communication and clarity with the detained students, their parents and families back in India are in severe distress and anxious about the consequences and overall future of their wards," he said.

Therefore, Sravan demanded that the US Consul General engage in a dialogue with the federal government of USA and rescue the students by taking immediate steps. Further, he said immediate measures must be taken to stop the intimidation and ill treatment in detention centers. He said the detained students must be permitted to post bond and help them to get out of detention centers immediately. He said a special team should be deployed to visit USA and ensure that they liaison and coordinate with USA federal govt to smoothen the procedure. He demanded that a communication cell be set uop to provide latest updates and help the parents to get relieved of their anxiety and mental agony. He also demanded that the students should be assisted to have transition back to normal life through necessary financial and legal help.

"In order to avoid these kinds of unfortunate circumstances, as a precautionary measure I request you to help publishing the list of Universities, which are flagged as fake and fraudulent by federal government of United States of America," he demanded.

Dr. Sravan also marked a copy of the letter to Union Minister for External Affairs Sushma Swaraj, Telangana Chief Minister K Chandrasekhar Rao and former IT Minister K Taraka Rama Rao seeking their intervention to get this matter resolved.

Dr. Sravan made a special appeal to Telangana Chief Minister to seek intervention of Ms Ivanka Trump in this matter whose meetings were hoisted before in Telangana. (eom)  

తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వెళ్లి ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయ కేసులో, అమెరికాలో జైల్లో చిక్కుకున్న విద్యార్థులను వెంటనే విడిపించాలి - ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు

Ø తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వెళ్లి  ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయ కేసులోఅమెరికాలో జైల్లో చిక్కుకున్న విద్యార్థులను వెంటనే విడిపించాలి  -  ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు.

Ø విదేశాంగ శాఖ మంత్రి శ్రీమతి సుష్మా గారికిహైదరాబాద్ అమెరికా కౌన్సిల్ జనరల్  క్యాథరిన్ బి హెడ్డా గారికితెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్ర శేఖర రావు గారికిబహిరంగ లేఖ రాసిన డాక్టర్ శ్రవణ్

Ø విద్యార్ధులను కాపాడేందుకు అవసరమైతే శ్రీమతి ఇవాంక ట్రంప్ ను సంప్రదించి తక్షణమే విద్యార్థులను కాపాడాలని ముఖ్యమంత్రికి విజ్నప్తి. 

విద్యాభ్యాసం కోసం అమెరికా లోని ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు పొందిన తెలంగాణాఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన  విద్యార్ధులను అక్కడి ప్రభుత్వం తమ ఇమ్మిగ్రేషన్ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నారన్న నెపంతో అరెస్ట్ చేయడాన్నిఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు తీవ్రంగా ఖండించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన వారిలో దిగువమధ్యతరగతికి చెందిన వారున్నారని వీరంతా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరిని తక్షణమే  విడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి శ్రీమతి సుష్మాస్వరాజ్హైదరాబాద్ లోని అమెరికన్ కౌన్సిల్ జనరల్  క్యాథరిన్ బి హెడ్డామరియు తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్ర శేఖర రావుగారికి ఆయన బహిరంగ లేఖలు రాసారు.
అమెరికాలో తెలుగు  విద్యార్ధుల నిర్భంధం విచారకరం..డాక్టర్ శ్రవణ్
రెండు వారల కిత్రం అమెరికా  ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దాదాపు వందలాది మంది  తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్ధులను నిర్భంధించారని వారంతా ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా దేశంలోని ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయంలో చేరారన్నారు. అమెరికా ప్రభుత్వంలోని హోంలాండ్ సెక్యూరిటీ ద్వారా ఏర్పాటయిన ఫార్మింగ్టన్ యూనివర్శిటీ,  నకిలీ యూనివర్శిటీ అని తెలియక అందులో చేరిన అమాయకులైన విద్యార్ధులు మోసానికి గురయ్యారన్నారు. యూనివర్శిటిలో చేరిన తర్వాత రోజు వారి తరగతులకు హాజరుకాకున్నాపార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటైనా విద్యాభ్యాసం కొనసాగించవచ్చన్న యూనివర్శిటీ అధికారుల మాటలు నమ్మి విద్యార్ధులంతా మోసపోయారన్నారు.
రెండు వారాలుగా విద్యార్ధులను వేధింపులకు గురిచేయడం సరికాదన్న డాక్టర్ శ్రవణ్
దాదాపు రెండు వారాలుగా విద్యార్దులంతా ప్రభుత్వం నిర్భందించినా ఇప్పటివరకు వారందరిని అమెరికన్ కోర్టులో ప్రవేశపెట్టకపోవడం దారుణమన్నారు. విద్యార్ధులను విడుదల చేయకుండా నిర్భందించి వేధించడం తగదని డాక్టర్ శ్రవణ్ అన్నారు. విద్యార్దులంతా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారని డాక్టర్ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్  కాబడిన విద్యార్ధులంతా దిగువమధ్య తరగతికి చెందిన వారేననివీరిలో రైతులుచిన్న స్ధాయి వ్యాపారాలు చేసుకునే కుటుంబాలకు చెందిన వారన్నారు. తమ బిడ్డలు బాగా చదువుకుని ఉత్తమ భవిష్యత్తు పొందే అవకాశం ఉందని వారంతా తమ వారిని అమెరికా కు పంపించారని గడిచిన రెండు నెలలుగా వారి బాగోగులు తెలియన తీవ్రమనోవేదనకు గురవుతున్నారని డాక్టర్ శ్రవణ్ తన లేఖలో పేర్కొన్నారు.
కేంద్రమంత్రితెలంగాణా ముఖ్యమంత్రి,మరియు కాన్సులేట్ జనరల్ కు దాసోజు లేఖలు
అరెస్ట్ కాబడ్డ విద్యార్ధులకు అధికారులు పెట్టే వేధింపులు భరించలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యే ప్రమాదముందన్నారు. సరైన వసతులు ఏర్పాటుచేయకుండా తగిన ఆహారం ఇవ్వకుండా వేధించడం తగదన్నారు. అలాగే చాలామంది విద్యార్ధుల్లో చిన్నపిల్లల తల్లితండ్రులుగర్భిణీలు కూడా ఉన్నట్లు తెలిసిందని వారందరిని వెంటనే విడుదల చేయించేందుకు కేంద్రవిదేశాంగ శాఖ మంత్రి శ్రీమతి సుష్మాస్వరాజ్హైదరాబాద్ లోని అమెరికన్ కౌన్సిల్ జనరల్   క్యాథరిన్ బి హెడ్డామరియు తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్ర శేఖర రావుగారు తగిన చొరవ చూపాలని దాసోజు లేఖలు రాసారు. తమ కుటుంబసభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించేందుకు తగిన కృషి చేయాలన్నారు. అక్కడి అధికారులతో మాట్లాడాలనుకుంటే భాషాపరమైన ఇబ్బందులు,చట్టాల పై సక్రమంగా అవగాహన లేమితో ఇక్కడి వారంతా అయోమయానికి గురవుతున్నారని తమ లేఖలో పేర్కొన్నారు.
ఫార్మింగ్టన్ యూనివర్శిటీ నకిలీదని తెలియక విద్యార్దులు అందులోచేరారన్న డాక్టర్ శ్రవణ్
ఫార్మింగ్లన్ విశ్వవిద్యాలయం పూర్వాపరాలు తెలియక విద్యార్ధులు అందులో చేరారని అది అమెరికా ప్రభుత్వమే స్ధాపించిందువల్ల  నకిలీ యూనివర్శిటీ గా దాన్ని విద్యార్ధులు గుర్తించలేకపోయారని దాసోజు అన్నరు. కేవలం తమకు ఉజ్వల మైన భవిష్యత్తు ఉంటుందన్న కారణంతో అందులో చేరారని వారెవరు నేరస్తులు కారని విద్యార్ధుల వల్ల అమెరికా దేశానికి ఎలంటి ప్రమాదం వాటిల్లే అవకాశం లేదని విద్యార్ధులను విడిపించేందకు తక్షణమే ఈ కింది చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రవణ్ తన లేఖలో డిమాండ్ చేశారు.
1.     విద్యార్దులను తక్షణమే విడిపించి వారికి తగిన వైద్య సహాకారం అందించేందుకు చర్యలు  తీసుకోవాలి.
2.     విద్యార్దులకు తక్షణమే బెయిల్ ఇచ్చి వారందరిని విడుదల చేయాలి.
3.     తెలంగాణా ప్రభుత్వం వెంటనే ఒక బృందాన్ని అమెరికా పంపించి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపాలి.
4.     విద్యార్ధుల కుటుంబాలతో మాట్లాడేందుకు తగిన సమాచార వ్యవస్ధను పటిష్టపరిచి వారిలో మనో ధైర్యాన్ని నింపాలి.
5.     విద్యార్దులు సాదారణ జీవితాన్ని గడిపేందుకు మరియు ఆర్ధికన్యాయ సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలి.
2017 లో తెలంగాణా ప్రభుత్వం ఆతిధ్యమిచ్చిన అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె శ్రీమతి ఇవాంకా ట్రంప్ సహకారం తీసుకునేందుకు కూడా కృషి చేయాలని డాక్టర్ దాసోజు తన లేఖలో పేర్కొన్నారు. అలాగే మోసపూరితంగా విద్యార్దులను చేర్చుకుంటున్న విశ్వవిద్యాలయాల పై చర్యలు తీసుకోవాలని అలాంటి సంస్ధల వివరాలను ప్రచురించాలని కోరుతున్నాము.విద్యార్ధులు,మరియు వారి తల్లితండ్రుల శ్రేయస్సు కోసం తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్దులను కాపాడాలని డాక్టర్ దాసోజు విజ్నప్తి చేశారు.




Sunday 3 February 2019

ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్య పరిచి ప్రైవేట్ పరంచేయడమే మేకిన్ ఇండియా,స్టార్టప్ ఇండియా సాధిస్తారా : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.


·   ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్య పరిచి ప్రైవేట్  పరంచేయడమే  మేకిన్ ఇండియా,స్టార్టప్ ఇండియా  సాధిస్తారా ..ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.
 ·     జియో సంస్ధకు రెడ్ కార్పెట్ పరిచిన మోడీ తల్లిలాంటి సంస్ధను నిర్వీర్యపరుస్తున్నారని విమర్శ
  ·     బిఎస్ ఎన్ ఎల్ స్వంత ఆస్తులను వారికివ్వడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారన్న డాక్టర్ శ్రవణ్
  ·        దేశానికి గర్వకారణమైన బిఎస్ ఎన్ ఎల్ సంస్ధను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ.


దేశానికి గర్వకారణంగా నిలిచి, గ్రామాగ్రామాన విస్తరించిన బిఎస్ఎన్ ఎల్ సంస్ధను నిర్వీర్యపరిచేందుకు ప్రధాని మోడి నేతృత్వంలో కుట్ర జరుగుతోందని, అలాంటి కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టేందుకు దేశ వ్యాప్తంగా బిఎస్ ఎన్ ఎల్ వర్కర్స్ పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటి జాతీయ అధికార ప్రతినిధి  డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు అన్నారు.  ఇవాళ ఉస్మానియా యూనివర్శిటీలోని  ఐఈటీఈ ఆడిటోరియంలో జరిగినఆల్ ఇండియా నేషనల్  బిఎస్ఎన్ ఎల్ వర్కర్స్ 5 వ కాన్ఫరెన్స్ సమావేశంలో తెలంగాణా శాసనసభ ప్రతిపక్షనేత మల్లు భట్టివిక్రమార్క తో కలిసి ముఖ్య అతిధిగా హాజరయిన దాసోజు కార్మికుల హక్కుల తో పాటు సంస్ధను మనుగడ కోసం  పోరాడాల్సిన సమయం ఆసన్న మైందన్నారు.దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్య పరిచి ఉద్దేశ్యపూర్వకంగా వాటి స్ధానంలో ప్రైవేట్ సంస్ధలను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నస్తున్నారని ఆరోపించారు.
కార్మికుల పై రిసెర్చ్ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా..దాసోజు
1999 లో ఉస్మానియాలో పర్సనల్ మేనేజ్ మెంటు ఆఫ్ ఇండస్ట్రియల్ లో ఎంబీఏ చేశానని, ఆతర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో దాదాపు2 వేల మంది పై పరిశోధన చేసే అవకాశం వచ్చిందని ఆసందర్భంలోనే ఎన్ ఎఫ్ టీ యూ పెద్దలు సంజీవరెడ్డిగారితో తనకు అనుబంధం ఏర్పడిందని నాటి నుంచి నేటి వరకు 90 సంవత్సరాల వయస్సులోకూడా ఆయన కార్మికుల సేవలో తరిస్తున్నారని డాక్టర్ శ్రవణ్  కొనియాడారు. సంజీవరెడ్డిలాంటి పెద్దలు కష్టపడి నిర్మించిన సౌధంలో ఇతరులు తిష్టవేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రభుత్వ రంగసంస్ధలను కాపాడడానికి చేసిన శ్రమను ప్రైవేట్ సంస్ధలకు దోచిపెట్టేందుకు మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం సహకరించడం దురదృష్టకరమన్నారు.
గ్రామగ్రామాన విస్తరించిన బీఎస్ఎన్ ఎల్ ను నిర్వీర్యం చేసి ప్రైవేట్ కు పట్టం కట్టడం అన్యాయం.శ్రవణ్
దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 5లక్షల 90 వేల గ్రామాల్లో 99 శాతం బిఎస్ ఎన్ ఎల్ సంస్ధ సర్వీసుల అందిస్తున్నారు. గ్రామాల్లో  సేవలందించేందుకు బిఎస్ ఎన్ ఎల్ సర్వీసులు కావాలి,  కాని లాభాలొచ్చే పట్టణాల్లో మాత్రం ఇతర ప్రైవేట్ కంపెనీలు ఎందుకని డాక్టర్ శ్రవణ్  ప్రశ్నించారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాల వల్లే బిఎస్ ఎన్ ఎల్ సంస్ధ నష్టాల్లో కూరుకు పోయిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసి, ఏళ్ళుగా కష్టపడి నిర్మించుకున్న బీఎస్ ఎన్ ఎల్ సౌధాన్నిజీయో లాంటి ప్రైవేట్ సంస్ధలు ఆక్రమించుకునేలా చేసిన ప్రభుత్వ చర్యలను ఖండించాలని  వారి కుట్రలను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు.  




ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్య పరిచి, మోడీ ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తున్నరని విమర్శ
దేశంలో ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్య పరిచి ప్రైవేట్ రంగాలను అభివృద్ది చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారని దేశానికి గర్వకారణంగా ఉన్న డిఫెన్స్ పరికరాలు తయారు చేసే కంపెనీలు, హెలీకాప్టర్లు, ఓడలు, తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్దలున్నా వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ ని కాదని  30 వేల కోట్ల రూపాయల రఫేల్ యుద్ద విమానాల కాంట్రాక్ట్ ను అనిల్ అంబాని కంపెనీకి ఇప్పించారని విమర్శించారు. దీని వల్ల ప్రభుత్వ రంగ సంస్ధ అయిన హాల్ కంపెనీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. అలాగే  బీఎన్ ఎన్ ఎల్ ను నాశనం చేసి జీయోను పైకి తేవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్య పరిచి మేకిన్ ఇండియా,స్టార్టప్ ఇండియా  ఎలా సాధిస్తారన్న దాసోజు.


అదాని సంస్దలను కాపాడడం కోసం ప్రభుత్వ రంగ సంస్ధలయిన సెయిల్ ను భూస్ధాపితం చేసారని, అలాగే  బిఎస్ ఎన్  ఎఎల్ నాశనం చేసి ముఖేశ్ అంబానినికాపాడారని, హాల్ ను నిర్వీర్యపరిచి అనిల్ అంబాని రక్షించారని ఇలా మొత్తం ప్రభుత్వ రంగ సంస్ధలను  అంబానీ అదాని చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ యావత్ దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం కొనసాగుతోందన్నారు.  ఇందుకోసం ముందుగా తల్లితో సమాన మైన ప్రభుత్వ సంస్ధలను కాపాడుకుకునేందు ప్రతి ఒక్కరూ నడుంకట్టాలని ఇందుకోసం నిరంతరం పోరాటం చేయాల్సినఅవసరం ఉందన్నారు. మోడీ ప్రభుత్వ కంపెనీలను నాశనం చేసి మేకిన్ ఇండియా స్టార్టప్ ఇండియా  ఎలా సాధిస్తారని దాసోజు అన్నారు. అదాని అంబానీలు లాభాల బాటలో నడవడం వల్ల మేకిన్ ఇండియా సాధిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగసంస్ధలకు ప్రభుత్వ పూచికత్తుతో రుణాలు ఇప్పించకుండా రిలయన్స్ జియో  కోసం జపాన్ బ్యాంకులో రూ.3225 కోట్లు  ఇప్పించడాన్ని చూస్తే మోడీ కి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్ధలపై ఉన్న ప్రేమ ఏపాటిదో అర్ధం అవుతోందన్నారు. ఉద్యోగులంతా చిన్న చిన్న విషయాలకోసం పోరాడకుండా సంస్ధ నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాలన్నారు.
రాహుల్ నేతృత్వంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్ధ లను కాపాడుకునేందుకు కృషి చేస్తామని హామీ
కాంగ్రెస్ పార్టీ చాలా లిబరలైజేషన్ జరిగిందని అదే సమయంలో భాద్యతాయుతంగా వ్యవహరించిందని గుర్తుచేశారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి అధ్వర్యంలో శ్యాం పిట్రోడ్ దేశానికి టెలికాం రంగాన్ని పరిచయం చేసారని, ఎక్కడా ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్యం చేయకుండానే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించిందని గుర్తుచేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో రైల్వేలు, బిఎస్ ఎన్ ఎల్ , ఓఎన్ జీసి, అన్ని సంస్ధలు నష్టాల బాట పట్టాయని విమర్శించారు. వీటన్నింటిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా రాహుల్ నేతృత్వంలో కార్మికులకు తోడుగా ఉంటుందని దాసోజు హామీ ఇచ్చారు, బిఎస్ ఎన్ ఎల్ వర్కర్స్ 5 వ వార్షిక సమావేశంలో ఎఫ్ ఎన్ టీ వో జనరల్ సెక్రటరీ జయప్రకాశ్ గారితో  ఇతర  ప్రముఖులు శ్రీ సంజీవరెడ్డి, చండీశ్వర్ సింగ్, కబీర్ దాస్, ఆర్ సి పటేల్, మరియు ఇతర రాష్ట్రలనుంచి వచ్చిన ప్రముఖులు. వర్కర్స్ తదితరులు పెద్దయెత్తున పాల్గొన్నారు


Saturday 2 February 2019

Union Budget has been disappointing for Telangana: AICC Spokesperson Dr. Dasoju Sravan


Hyderabad, February 2: All India Congress Committee (AICC) Spokesperson Dr. Dasoju Sravan has described the Union Budget, presented by Interim Finance Minister Piyush Goyal, as highly disappointing for Telangana State.


Addressing a press conference in New Delhi on Saturday, Sravan said that Friday's budget was no different from previous budgets of BJP-led NDA Government during the last five years. He alleged that BJP Government has denied Telangana its due share in Central Taxes and adequate financial assistances for various schemes. He said despite several requests, the Centre has failed to provide funds for Mission Kakatiya, Mission Bhagiratha, Kaleshwaram Project or other schemes for the welfare of farmers. He said that the Centre has even ignored the recommendations made by NITI Ayog proposing funds for various projects being implemented in Telangana.

Sravan said that the State Government had sought Rs. 24,000 crore for Mission Kakatiya, Rs. 34,000 crore for irrigation and drinking water projects and Rs. 10,000 crore out of Rs. 80,000 crore being spent on Kaleshwaram Project. However, these pleas were completely ignored. The Centre did not even grant National Status for the Kaleshwaram project.

The Congress leader said that the BJP Government did not respond to the requests made by Telangana seeking Rs. 39,000 crore in 2018-19 budget. Other requests seeking funds for infrastructure like roads, minority education, Gurukul Schools or higher education was ignored.

Sravan said that the Modi Government did not fulfill the promises made with Telangana State in the Andhra Pradesh Reorganisation Act at the time of bifurcation. He said the then Congress-led UPA Government had announced various sops for Telangana including a Railway Coach Factory in Qazipet, Bayyaram Steel Plant and setting up of national institutions. None of these promises have been fulfilled, he said.

Sravan said that Modi has cheated the farmers and unemployed youth across the country. He said people who had lot of expectations from this budget only faced disappointment.

Sravan said that Piyush Goyal's budget for not an 'Vote On Account', but 'Budget Only for Votes' aimed at cheating the people one last time. He said that the Modi Government has insulted farmers by making meager allocations. He said that the BJP Government owes an explanation over its failure to implement the recommendations of Swaminathan Commission which wanted the MSP to be at least 50% more than the weighted average cost of production. He said no efforts were made to support the farmers during the last five years. However, just in view of elections, he said that the BJP Government is promising Direct Cash Transfer of Rs. 6,000 for small and marginal farmers which is extremely negligible and would not help the farmers in any way. He said there was no mention of rising prices of seeds and fertilizers every year. Further, the Centre did not propose anything to deal with the supply of spurious seeds and fertilizers.

By not giving proper MSP, the Modi Government has cause immense damage to nearly 2.5 lakh crore farmers across the country. Tenant farmers, who constitute nearly 60% of farming community, have been ignored and Rs. 6,000 investment support has been announced for farmers holding less than 5 acres of land. He said while 1.15% of GDP was spent on agriculture in 2018-19, this time it has been reduced to just 1.08%. He said Modi Government must waive off crop loans of all farmers to prove its sincerity towards farmers.

Sravan alleged that the GST had a very negative impact on the farming community and led to an increase in prices of seeds, fertilizers and pesticides. Similarly, the rising fuel prices cause huge losses to the farmers. For instance, the diesel price in May 2014 was Rs. 56.71 which has no increased to Rs. 70 per litre. A bag of 50 kg DAP Fertilizers used to cost only Rs. 1075 in 2014 while now it cost Rs. 1450.

Sravan pointed out that the Modi Government has waived off Rs. 3.5 lakh crore debts of 15 rich industrialists. However, on an average, it gave only Rs. 17 to each farmer in the budget for 2019-20. (eom)

15 మంది నల్లకుబేరులకు 3.5 లక్షల కోట్లు రుణమాఫీ ప్రకటించిన మోడీ, రైతన్నకు రోజుకు 17 రూపాయలు ఇవ్వడం అన్నదాతను అవమానించడమే : ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు


           ·          కేంద్రం ప్రవేశ పెట్టింది ఓటాన్ బడ్జెట్ కాదు....రాబోయే ఎన్నికల్లో ఓట్ల వేటకోసం పెట్టిన బడ్జెట్టన్న...  ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.
           ·          15 మంది నల్లకుబేరులకు 3.5 లక్షల కోట్లు రుణమాఫీ ప్రకటించిన మోడీ, రైతన్నకు రోజుకు 17 రూపాయలు  ఇవ్వడం అన్నదాతను అవమానించడమే.. దాసోజు
           ·          ప్రతి రైతుపై తలసరి అప్పు రూ.47వేల రూపాయలు ఉంటె, ప్రభుత్వం ఇచ్చే రూ .6000వేల రూపాయలు సరిపోతాయా  ?
           ·          ఏడాదికి రెండు ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను ఊరించిన మోడీ, మొండి చేయి చూపారని విమర్శ.
           ·          విభజన హామీల్లో తెలంగాణాకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో స్పష్టం చేయాలని డిమాండ్. It is nothing but Failure of TRS MPs


ఎన్నికల నేపధ్యంలో ఇవాళ కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్  ఓటాన్ అకౌంట్ బడ్జెట్  కాదని కేవలం ఓట్ల వేట కోసం తాయిలాలు ప్రకటించి ప్రజలను మరో మారు మోసగించేందుకు మోడీ అండ్ కో చేసిన మోసపూరిత బడ్జెట్ అని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు విమర్శించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన 2014 ఎన్నికల సమయంలో రైతులను, నిరుద్యోగులను ఆశల పల్లకిలో ఊరేగించి అధికారంలోకి వచ్చిన మోడి అవేవీ తీర్చకుండానే మరో మారు ఎన్నికలకు సన్నద్దమవుతున్నారని అదే సమయంలో మరో మారు మోసపూరిత వాగ్ధానాలకు, బడ్జెట్ కేటాయింపులు అంటు నాటకాలాడుతున్నారన్నారు. వ్యవసాయ ప్రణాళికను అమలు చేస్తామని ఎందుకు అమలు చేయలేక పోయారో స్పష్టం  చేయాలన్నారు.  కేవలం 15 మంది నల్లకుబేరులకు 3.5 లక్షల కోట్లు రుణమాఫీ ప్రకటించిన మోడీ అన్నదాతకు రూ. 17 రూపాయలు కేటాయించడం వారిని అవమానించడమేనని విమర్శించారు.

స్వామినాధన్ సిఫారసులు ఎందుకు అమలు చేయలేదో స్పష్టం చేయండి.
2014 ఎన్నికల్లో ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని, రైతులకు 50 శాతం అదనపు మద్దతు ధరలు కల్పిస్తామని వాగ్ధానాలు చేశారని కాని కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలం అయ్యారని డాక్టర్ దాసోజు విమర్శించారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతుల మద్దతు పొందేందుకు ఏడాదికి రూ. 6 వేలు ఇస్తామని అది కూడా మూడు విడుతలుగా ఇస్తామని చెప్పడం రైతులను అవమానించడమేనని స్పష్టం చేశారు. గడిచిన కాలంలో కనీస మద్దతు ధర కల్పించక పోవడం వల్ల దేశ వ్యాప్తంగా ఒక్కో రైతు నెత్తిపై దాదాపు గా తలసరి అప్పు రూ.47వేల రూపాయలు ఉన్నాయని గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఏనాడు స్పందించని మోడీ ఎన్నికల వేళ తగుదునమ్మా అంటూ రైతులకు రూ. 6 వేలు ప్రకటించడం వెనుక ఎన్నికల్లో లబ్ది పొందాలనే కుట్ర దాగుందన్నారు. బడ్జెట్ లో ఏటా పెరుగుతున్న విత్తనాలు, ఎరువుల ధరల నియంత్రణ ప్రస్తావన లేదన్నారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో కల్తీ విత్తనాలు నకిలీ పురుగుల మందుల నివారణలో చేపట్టబోయే చర్యల ప్రస్తావనలేదన్నారు.  

ఎంఎస్పీ ధరలు పెంచాలని స్వామినాధన్ చేసిన సిఫారసులను తుంగలో తొక్కి తూతూ మంత్రంగా మద్దతు ధరలు ప్రకటించడం వల్ల  దేశవ్యాప్తంగా రైతులు సుమారు 2.5 లక్షల కోట్లు నష్టపోయారన్నారు. అదే సమయంలో దాదాపు 60 శాతం పైగా ఉన్న కౌలు రైతుల ప్రస్తావన బడ్జెట్ లో లేదని కేవలం 5 ఎకరాల లోపు ఉన్న రైతులకే రూ 6 వేల సహకారం అందిస్తే దేశవ్యాప్తంగా ఉన్న కౌలు రైతుల పరిస్ధితేంటని ప్రశ్నించారు. వ్యవసాయరంగంలో2017-18 లో మొత్తం జీడిపిలో 1.15  శాతం కేటాయిస్తే. 2018-19 కు వచ్చే సరికి 0.07 శాతం తగ్గించి కేవలం 1.08  శాతం నిధులు కేటాయించారన్నారు. కాని తామేదో రైతులను ఆదుకుంటున్నట్లు నటిస్తున్నారని, మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రైతు రుణమాఫీ ని అమలు చేసి తమ చిత్తశుద్దిని నిరూపించు కోవాలన్నారు. 180 కార్మిక సంఘాలున్న కిసాన్ సంఘర్ష్ సమితి వారు చేసిన సర్వేలో కేవలం  8 పంటలకు ఇచ్చిన మద్దతు ధరలను అంచనా వేస్తే దేశ వ్యాప్తంగా  రైతులు దాదాపు 2 లక్షల కోట్లు కోల్పోయినారని తేలిందన్నారు.

రైతు అనుబంధ రంగాల్లో జీఎస్టీ ప్రభావం...తల్లడిల్లుతున్న రైతాంగం
రైతు అనుబంధ రంగాల్లో ధరల పెరుగుదల జీఎస్టీ ప్రభావం బాగా పెరిగిపోయిందని దీంతో రైతాంగం కుదేలయ్యిందన్నారు. విత్తనాలు, ఫెర్టిలైజర్లు, పురుగుల మందుల ధరలు పెరగడం వల్ల రైతాంగంతీవ్రంగా నష్టపోయిందన్నారు. 
2014 మే నెలలో డీజిల్ ధర కేవలం రూ.56.71 పైసలుగా ఉంటే ప్రస్తుతం రూ.70 కి పైగా పెరిగిందన్నారు. అలాగే 50 కేజీల డిఎపీ ఫెర్టిలైజర్ ధర 2014 లో రూ.1075 ఉండగా ప్రస్తుతం రూ.1450 రూపాయలు పెరిగిందన్నారు. 
50 కిలోల పొటాష్ ధర 2014లో కేవలం రూ.450 ఉండగా.ప్రస్తుతం రూ.969 రూపాయలుగా ఉందన్నారు. అలాగే50కిలోల సూపర్ ఫెర్టిలైజర్ ధర 2014 లో రూ.260 రూపాయలుండగా రూ.310 గా పెరిగిందన్నారు.

అలాగే 50 కిలోల నీమ్ కోటెడ్ యూరియా బస్తాలోంచి 5 కిలోలు (దోపిడి చేసి) తగ్గించి రేటు మాత్రం యధాతధంగా పెంచేశారని ఆరోపించారు.
పురుగుల మందుల ధరలు కూడా 30 నుంచి 40 శాతం పెంచేశారన్నారు.
ఇలా రైతు సంబంధ రంగాల్లో ధరలు అడ్డగోలుగా పెరిగినందువల్ల రైతన్నలు పంటలు పండించలేని పరిస్థితికి దిగజారారన్నారు.
అలాగే ఫామ్ మెకనైజేషన్ లో బాగంగా రైతులకు ఇచ్చే
ట్రాక్టర్ల పై 12.5 శాతం జీఎస్టీ విధిస్తున్నారని,
ఫెర్టిలైజర్ల పై 5 శాతం జీఎస్టీ,
పురుగుల మందులు, ట్రాక్టర్ టైర్ల పై 18శాతం జీఎస్టీ వేశారని,
గడిచిన 71 సంవత్సరాలుగా ఏనాడు ఈ స్ధాయిలో టాక్స్ వేసిన దాఖలాలు లేవన్నారు.

రైతులకు సాయం చేస్తున్నారా లేక అవమానిస్తున్నారా కేంద్రానికి  దాసోజు సూటి ప్రశ్న.
అడ్డగోలుగా పెరిగిన ధరలను లెక్కిస్తే ప్రతి ఎకరాకు రూ. 6 వేల రూపాయలు, రెండు ఎకరాలకు రూ.12 వేలు, 2 హెక్టార్ లకు రూ.30 వేలుగా అదనపు భారం పడుతోందన్నారు.  కాని ప్రధాని మోడీ కేవలం రూ. 6 వేల రూపాయలు ఆర్ధిక సహకారం పేరిట ఇస్తే అవి ఏమూలకు సరిపోతాయన్నారు. ఇది ప్రతి రోజుకు లెక్కిస్తే ఒక్కో రైతుకు కేవలం రూ.17  మాత్రమే అందుతాయన్నారు. గడిచిన ఐదేళ్లుగా దేశంలో రైతులు ఆత్మహత్యల బాట పట్టినా మౌనం వహించి, ఏనాడూ  ఒక్క రైతుకుటుంబాన్ని పరామర్శించని మోడీ ఎన్నికల వేళ తగుదునమ్మా అంటూ రైతుల ఓట్లను గంపగుత్తగా కొట్టేయాలని సంవత్సరానికి రూ. 6 వేల ఆర్ధిక సాయం ప్రకటించారని ఇంత తక్కువ సాయం రైతులకు ఎలా మేలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు
దేశంలో కేవలం 15 మంది నల్లకుబేరుల కు ఏకంగా 3.5 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోడీకి అన్నం పెట్టే రైతన్నకు కేవలం రూ. 17 మాత్రమే ఇవ్వడం వారిని తీవ్రంగా అవమానించడమేనని దుయ్యబట్టారు. దేశంలో ఉన్న12 కోట్ల రైతులకు  కేవలం రూ. 75 వేల కోట్లు ఖర్చు చేయడమంటేనే వారిని ఆదుకునే ఉద్దేశ్యం లేదని అర్ధం చేసుకోవచ్చన్నారు. అంతే కాకుండా ఇచ్చే ఆర్ధిక సహకారం రూ. 6వేలను కూడా ఒక్కవిడతలో  కాకుండా మూడు విడతల్లో ఇవ్వనున్నారని రాబోయే పార్లమెంటు ఎన్నికల ముందు కేవలం రూ. 2 వేల రూపాయలు మాత్రమే ఇవ్వగలరని కాని రూ. 6 వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. అలాగే పంటలకు తగిన భీమా చెల్లించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యారన్నారు గడిచిన ఏడాది పంటలకు భీమా సొమ్మును ఇంకా చెల్లించలేదని రైతులంతా గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

పెచ్చరిల్లిన నిరుద్యోగం పట్టింపులేని మోడీ ప్రభుత్వం
నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఏటా రెండు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మోడీ గడిచిన నాలుగేళ్లలో కేవలం 2014-15 లో 1.55లక్షలు, 2015-16 లో 2.31 లక్షల ఉద్యోగాలు  మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఎన్నికల వాగ్దానాల్లో ఉద్యోగాలిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి ఉపాధి మాత్రమే కల్పిస్తామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. తాజా బడ్జెట్ లో అసలు ఉద్యోగాల ప్రస్తావన లేకుండానే నిరుద్యోగుల నోళ్లలో మన్ను కొట్టారని విమర్శించారు. గడిచిన 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగ సమస్య గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. 2017–2018 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ సమస్య 6.1 శాతానికి చేరుకుందని నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ నివేదిక ఇచ్చిందని, రానున్న రోజుల్లో ఈసమస్య మరింతగా పెరిగి 2019 చివరకు 8 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణ ప్రాంతాల్లో స్త్రీపురుషుల్లో నిరుద్యోగ శాతం గణనీయంగా పెరిగిందన్నారు. పురుషుల్లో నిరుద్యోగుల సంఖ్య 18.7 శాతానికి చేరుకోగామహిళల్లో ఏకంగా 27.2 శాతానికి చేరకుందన్నారు. ఇందుకు ఉదాహరణగా గతేడాది రైల్వేలో 63 వేల దిగువమధ్య స్థాయి ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా ఏకంగా కోటీ 90 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పీహెచ్‌డీలు కూడా చేసిన నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

టాక్స్ ఎక్జ్సెంప్సన్ ఓ బూటకమన్న డాక్టర్ శ్రవణ్
ఆదాయ పన్ను పరిమితిలో గతంలో ఉన్న 2.50 లక్షలనుంచి 5 లక్షల వరకు 5 శాతం అంటే రూ. 12.500 రిబేట్ ఇచ్చారని, ఆపై ఒక్కరూపాయి పెరిగినా  20 శాతం  అంటే రూ. 20,000 మరియు ఇచ్చిన రిబేటు కలుపుకుని  మొత్తం రూ.32,500 గా చెల్లించాల్సి ఉంటుందని డాక్టర్ శ్రవణ్ అన్నారు. కేవలం 5 లక్షల లోపు ఉన్న వారికే లబ్దిచేకూరేలా ఉందని కాని ఆర్ధిక మంత్రి పీయూష్ గోయెల్  2.50 నుంచి 5 లక్షల వరకు టాక్స్ ఎక్జ్జెంపన్ ఉందని గొప్పగా ప్రకటించడం పెద్దమోసమన్నారు. 2014 ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు టాక్స్ ఎక్జ్సెంప్సన్ లిమిట్ 2.5 నుంచి 5 లక్షలకు పెంచుతామన్నారని కాని దురదృష్ట వశాత్తూ గడిచిన ఐదేళ్ళుగా పెంచలేదన్నారు. 6.5 లక్షల ఆదాయం ఉన్నవారికి టాక్స్ ఎక్జ్సెంప్సన్ ఉంటుదని ఆర్ధిక మంత్రి ప్రకటించారని అది పూర్తిగా అబద్దమన్నారు.  5 లక్షల నుంచి 10 లక్షల వరకు టాక్స్ పరిమితుల్లో ఎలాంటి మార్పులేదని, అలాగే సీనియర్ సిటిజెన్స్ కూడా ఎలాంటి లాభం లేదని ఆర్ధిక మంత్రి టాక్స్ టేబుల్ ను ప్రదర్శించారు.


అసంఘటిత రంగాలను ఆదుకోని మోడీ ప్రభుత్వం
అసంఘటిత రంగంలో దాదాపు 51.7 కోట్ల మంది పనిచేస్తున్నారని  వీరిలో కేవలం 20 శాతం ఫించన్ దారులుగా గుర్తించినా.దాదాపు 10.34 కోట్ల మందికి ఒక్కక్కరికి రూ. 3 వేల చొప్పున ఏడాదికి 36 వేల రూపాయలు అవుతాయని, మొత్తం 3,72,240 కోట్లు అవసరం కాగా కేవలం రూ.500 కోట్లు తక్కువగా కేటాయించారన్నారు.
అలాగే  స్వచ్చ భారత్ లో కేవలం 16 శాతం ఓడిఎఫ్ గ్రామాలు గా నిర్ధారించబడ్డాయని కాని ఆర్ధిక మంత్రి 98 శాతం గ్రామీణ సానిటేషన్ పూర్తయ్యిందని అవాస్తవాలు చెప్పారన్నారు.

143 కోట్ల ఎల్ ఈడి బల్బుల సరఫరా చేశామని  పచ్చి అబద్దాలు చెప్పారని కేవలం 32 కోట్ల ఎల్ ఈ డి బల్బులు మాత్రమే సరఫరా చేశారని దాసోజుఆరోపించారు.

Minister also mislead the nation on functioning of 14 AIMS in the country

కరెప్సన్ ఫ్రీగా దేశాన్ని తయారుచేశామని చెప్పిన మోడీ దేశ వ్యాప్తంగా అదాని స్కాం నుంచి మొదలు కొంటే బాల్కో స్కాం, చిక్కిస్కాం, దాల్ స్కాం, ఎర్త్ క్వేక్ రిలీఫ్ ఫండ్ స్కాం, వ్యాపం స్కాం, హడ్కో స్కాం, మెట్రోరైల్ స్కాం, పీడిఎస్ స్కాం, కేరళ మెడికల్ స్కాం, ఎడ్యూరప్పాస్కాం ఇలా బోలెడన్ని స్కాంల తో దేశంలో నెంబర్ వన్ స్కాం ప్రభుత్వంగా ముద్రపడ్డారని ఎద్దేవా చేశారు.


తెలంగాణ కు మొండిచెయ్యి .. తెరాస వైఫల్యం :

తెలంగాణకు కేంద్ర నుంచి సరైన ఆర్థిక తోడ్పాటు కరవవుతోంది. ఐదేళ్లుగా ప్రతి సారీ బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశే మిగులుతోంది. పన్నుల్లో వాటాగా అందాల్సిన మొత్తం, అలాగే గ్రాంట్ రూపంలో వివిధ పథకాలకు అందే నిధులు మినహా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎలాంటి ఆర్థిక తోడ్పాటూ అందలేదు.

మిషన్కాకతీయ, మిషన్భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో బాటు రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరినా ప్రయోజనం ఉండలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు బాగున్నాయని, కేంద్రం వీటికి ప్రత్యేక నిధులు అందించాలని రెండేళ్ల కిందటే నీతి ఆయోగ్సిఫారసు చేసింది

మిషన్భగీరథ, మిషన్కాకతీయలకు రూ.24 వేల కోట్ల ఇవ్వాలని సూచించింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు. తెలంగాణలో సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులకు రూ.34 వేల కోట్లు ఇవ్వాలని, దాదాపు రూ.80 వేల కోట్లు ఖర్చవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లయినా ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించిందికాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే విజ్ఞప్తి పట్టించుకోలేదు.

గత 2018-19 బడ్జెట్లో రూ.39 వేల కోట్లు అందించాలని కోరినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక రోడ్ల వంటి మౌలిక సదుపాయాలకు, ఇవి కాకుండా మైనార్టీ విద్య, గురుకుల పాఠశాలలు సహా విద్యారంగానికి ఉన్న అధిక ప్రాధాన్యం దృష్ట్యా ప్రత్యేకంగా నిధులు అడిగినా కేంద్రం మొండి చెయ్యే చూపింది.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పుడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోడీ, తెలంగాణా ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యాయన్నారు. విభజన హామీ చట్టం ప్రకారం రావాల్సిన విద్యాసంస్ధలు, ప్రతిష్టాత్మక రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, తదితర సంస్ధలకు తగిన నిధులు కేటాయించడంలో గడిచిన ఆరుబడ్జెట్ లలో మోడీ ప్రభుత్వం ఉదాసీనవైఖరిని అవలంబించందన్నారు.

మొత్తమ్మీద దేశంలోని రైతులను, నిరుద్యోగులను మోసం చేసిన  మోడీ మరోమారు ఆశల బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఎన్నికల్లో లబ్ది పోందాలని మరో మారు ప్రజలను వంచించేందుకు సిద్దమయ్యారని డాక్టర్ దాసోజు శ్రవణ్ ఘాటుగా విమర్శించారు.