Saturday 2 February 2019

15 మంది నల్లకుబేరులకు 3.5 లక్షల కోట్లు రుణమాఫీ ప్రకటించిన మోడీ, రైతన్నకు రోజుకు 17 రూపాయలు ఇవ్వడం అన్నదాతను అవమానించడమే : ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు


           ·          కేంద్రం ప్రవేశ పెట్టింది ఓటాన్ బడ్జెట్ కాదు....రాబోయే ఎన్నికల్లో ఓట్ల వేటకోసం పెట్టిన బడ్జెట్టన్న...  ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.
           ·          15 మంది నల్లకుబేరులకు 3.5 లక్షల కోట్లు రుణమాఫీ ప్రకటించిన మోడీ, రైతన్నకు రోజుకు 17 రూపాయలు  ఇవ్వడం అన్నదాతను అవమానించడమే.. దాసోజు
           ·          ప్రతి రైతుపై తలసరి అప్పు రూ.47వేల రూపాయలు ఉంటె, ప్రభుత్వం ఇచ్చే రూ .6000వేల రూపాయలు సరిపోతాయా  ?
           ·          ఏడాదికి రెండు ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను ఊరించిన మోడీ, మొండి చేయి చూపారని విమర్శ.
           ·          విభజన హామీల్లో తెలంగాణాకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో స్పష్టం చేయాలని డిమాండ్. It is nothing but Failure of TRS MPs


ఎన్నికల నేపధ్యంలో ఇవాళ కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్  ఓటాన్ అకౌంట్ బడ్జెట్  కాదని కేవలం ఓట్ల వేట కోసం తాయిలాలు ప్రకటించి ప్రజలను మరో మారు మోసగించేందుకు మోడీ అండ్ కో చేసిన మోసపూరిత బడ్జెట్ అని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు విమర్శించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన 2014 ఎన్నికల సమయంలో రైతులను, నిరుద్యోగులను ఆశల పల్లకిలో ఊరేగించి అధికారంలోకి వచ్చిన మోడి అవేవీ తీర్చకుండానే మరో మారు ఎన్నికలకు సన్నద్దమవుతున్నారని అదే సమయంలో మరో మారు మోసపూరిత వాగ్ధానాలకు, బడ్జెట్ కేటాయింపులు అంటు నాటకాలాడుతున్నారన్నారు. వ్యవసాయ ప్రణాళికను అమలు చేస్తామని ఎందుకు అమలు చేయలేక పోయారో స్పష్టం  చేయాలన్నారు.  కేవలం 15 మంది నల్లకుబేరులకు 3.5 లక్షల కోట్లు రుణమాఫీ ప్రకటించిన మోడీ అన్నదాతకు రూ. 17 రూపాయలు కేటాయించడం వారిని అవమానించడమేనని విమర్శించారు.

స్వామినాధన్ సిఫారసులు ఎందుకు అమలు చేయలేదో స్పష్టం చేయండి.
2014 ఎన్నికల్లో ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని, రైతులకు 50 శాతం అదనపు మద్దతు ధరలు కల్పిస్తామని వాగ్ధానాలు చేశారని కాని కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలం అయ్యారని డాక్టర్ దాసోజు విమర్శించారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతుల మద్దతు పొందేందుకు ఏడాదికి రూ. 6 వేలు ఇస్తామని అది కూడా మూడు విడుతలుగా ఇస్తామని చెప్పడం రైతులను అవమానించడమేనని స్పష్టం చేశారు. గడిచిన కాలంలో కనీస మద్దతు ధర కల్పించక పోవడం వల్ల దేశ వ్యాప్తంగా ఒక్కో రైతు నెత్తిపై దాదాపు గా తలసరి అప్పు రూ.47వేల రూపాయలు ఉన్నాయని గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఏనాడు స్పందించని మోడీ ఎన్నికల వేళ తగుదునమ్మా అంటూ రైతులకు రూ. 6 వేలు ప్రకటించడం వెనుక ఎన్నికల్లో లబ్ది పొందాలనే కుట్ర దాగుందన్నారు. బడ్జెట్ లో ఏటా పెరుగుతున్న విత్తనాలు, ఎరువుల ధరల నియంత్రణ ప్రస్తావన లేదన్నారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో కల్తీ విత్తనాలు నకిలీ పురుగుల మందుల నివారణలో చేపట్టబోయే చర్యల ప్రస్తావనలేదన్నారు.  

ఎంఎస్పీ ధరలు పెంచాలని స్వామినాధన్ చేసిన సిఫారసులను తుంగలో తొక్కి తూతూ మంత్రంగా మద్దతు ధరలు ప్రకటించడం వల్ల  దేశవ్యాప్తంగా రైతులు సుమారు 2.5 లక్షల కోట్లు నష్టపోయారన్నారు. అదే సమయంలో దాదాపు 60 శాతం పైగా ఉన్న కౌలు రైతుల ప్రస్తావన బడ్జెట్ లో లేదని కేవలం 5 ఎకరాల లోపు ఉన్న రైతులకే రూ 6 వేల సహకారం అందిస్తే దేశవ్యాప్తంగా ఉన్న కౌలు రైతుల పరిస్ధితేంటని ప్రశ్నించారు. వ్యవసాయరంగంలో2017-18 లో మొత్తం జీడిపిలో 1.15  శాతం కేటాయిస్తే. 2018-19 కు వచ్చే సరికి 0.07 శాతం తగ్గించి కేవలం 1.08  శాతం నిధులు కేటాయించారన్నారు. కాని తామేదో రైతులను ఆదుకుంటున్నట్లు నటిస్తున్నారని, మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రైతు రుణమాఫీ ని అమలు చేసి తమ చిత్తశుద్దిని నిరూపించు కోవాలన్నారు. 180 కార్మిక సంఘాలున్న కిసాన్ సంఘర్ష్ సమితి వారు చేసిన సర్వేలో కేవలం  8 పంటలకు ఇచ్చిన మద్దతు ధరలను అంచనా వేస్తే దేశ వ్యాప్తంగా  రైతులు దాదాపు 2 లక్షల కోట్లు కోల్పోయినారని తేలిందన్నారు.

రైతు అనుబంధ రంగాల్లో జీఎస్టీ ప్రభావం...తల్లడిల్లుతున్న రైతాంగం
రైతు అనుబంధ రంగాల్లో ధరల పెరుగుదల జీఎస్టీ ప్రభావం బాగా పెరిగిపోయిందని దీంతో రైతాంగం కుదేలయ్యిందన్నారు. విత్తనాలు, ఫెర్టిలైజర్లు, పురుగుల మందుల ధరలు పెరగడం వల్ల రైతాంగంతీవ్రంగా నష్టపోయిందన్నారు. 
2014 మే నెలలో డీజిల్ ధర కేవలం రూ.56.71 పైసలుగా ఉంటే ప్రస్తుతం రూ.70 కి పైగా పెరిగిందన్నారు. అలాగే 50 కేజీల డిఎపీ ఫెర్టిలైజర్ ధర 2014 లో రూ.1075 ఉండగా ప్రస్తుతం రూ.1450 రూపాయలు పెరిగిందన్నారు. 
50 కిలోల పొటాష్ ధర 2014లో కేవలం రూ.450 ఉండగా.ప్రస్తుతం రూ.969 రూపాయలుగా ఉందన్నారు. అలాగే50కిలోల సూపర్ ఫెర్టిలైజర్ ధర 2014 లో రూ.260 రూపాయలుండగా రూ.310 గా పెరిగిందన్నారు.

అలాగే 50 కిలోల నీమ్ కోటెడ్ యూరియా బస్తాలోంచి 5 కిలోలు (దోపిడి చేసి) తగ్గించి రేటు మాత్రం యధాతధంగా పెంచేశారని ఆరోపించారు.
పురుగుల మందుల ధరలు కూడా 30 నుంచి 40 శాతం పెంచేశారన్నారు.
ఇలా రైతు సంబంధ రంగాల్లో ధరలు అడ్డగోలుగా పెరిగినందువల్ల రైతన్నలు పంటలు పండించలేని పరిస్థితికి దిగజారారన్నారు.
అలాగే ఫామ్ మెకనైజేషన్ లో బాగంగా రైతులకు ఇచ్చే
ట్రాక్టర్ల పై 12.5 శాతం జీఎస్టీ విధిస్తున్నారని,
ఫెర్టిలైజర్ల పై 5 శాతం జీఎస్టీ,
పురుగుల మందులు, ట్రాక్టర్ టైర్ల పై 18శాతం జీఎస్టీ వేశారని,
గడిచిన 71 సంవత్సరాలుగా ఏనాడు ఈ స్ధాయిలో టాక్స్ వేసిన దాఖలాలు లేవన్నారు.

రైతులకు సాయం చేస్తున్నారా లేక అవమానిస్తున్నారా కేంద్రానికి  దాసోజు సూటి ప్రశ్న.
అడ్డగోలుగా పెరిగిన ధరలను లెక్కిస్తే ప్రతి ఎకరాకు రూ. 6 వేల రూపాయలు, రెండు ఎకరాలకు రూ.12 వేలు, 2 హెక్టార్ లకు రూ.30 వేలుగా అదనపు భారం పడుతోందన్నారు.  కాని ప్రధాని మోడీ కేవలం రూ. 6 వేల రూపాయలు ఆర్ధిక సహకారం పేరిట ఇస్తే అవి ఏమూలకు సరిపోతాయన్నారు. ఇది ప్రతి రోజుకు లెక్కిస్తే ఒక్కో రైతుకు కేవలం రూ.17  మాత్రమే అందుతాయన్నారు. గడిచిన ఐదేళ్లుగా దేశంలో రైతులు ఆత్మహత్యల బాట పట్టినా మౌనం వహించి, ఏనాడూ  ఒక్క రైతుకుటుంబాన్ని పరామర్శించని మోడీ ఎన్నికల వేళ తగుదునమ్మా అంటూ రైతుల ఓట్లను గంపగుత్తగా కొట్టేయాలని సంవత్సరానికి రూ. 6 వేల ఆర్ధిక సాయం ప్రకటించారని ఇంత తక్కువ సాయం రైతులకు ఎలా మేలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు
దేశంలో కేవలం 15 మంది నల్లకుబేరుల కు ఏకంగా 3.5 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోడీకి అన్నం పెట్టే రైతన్నకు కేవలం రూ. 17 మాత్రమే ఇవ్వడం వారిని తీవ్రంగా అవమానించడమేనని దుయ్యబట్టారు. దేశంలో ఉన్న12 కోట్ల రైతులకు  కేవలం రూ. 75 వేల కోట్లు ఖర్చు చేయడమంటేనే వారిని ఆదుకునే ఉద్దేశ్యం లేదని అర్ధం చేసుకోవచ్చన్నారు. అంతే కాకుండా ఇచ్చే ఆర్ధిక సహకారం రూ. 6వేలను కూడా ఒక్కవిడతలో  కాకుండా మూడు విడతల్లో ఇవ్వనున్నారని రాబోయే పార్లమెంటు ఎన్నికల ముందు కేవలం రూ. 2 వేల రూపాయలు మాత్రమే ఇవ్వగలరని కాని రూ. 6 వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. అలాగే పంటలకు తగిన భీమా చెల్లించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యారన్నారు గడిచిన ఏడాది పంటలకు భీమా సొమ్మును ఇంకా చెల్లించలేదని రైతులంతా గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

పెచ్చరిల్లిన నిరుద్యోగం పట్టింపులేని మోడీ ప్రభుత్వం
నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఏటా రెండు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మోడీ గడిచిన నాలుగేళ్లలో కేవలం 2014-15 లో 1.55లక్షలు, 2015-16 లో 2.31 లక్షల ఉద్యోగాలు  మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఎన్నికల వాగ్దానాల్లో ఉద్యోగాలిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి ఉపాధి మాత్రమే కల్పిస్తామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. తాజా బడ్జెట్ లో అసలు ఉద్యోగాల ప్రస్తావన లేకుండానే నిరుద్యోగుల నోళ్లలో మన్ను కొట్టారని విమర్శించారు. గడిచిన 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగ సమస్య గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. 2017–2018 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ సమస్య 6.1 శాతానికి చేరుకుందని నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ నివేదిక ఇచ్చిందని, రానున్న రోజుల్లో ఈసమస్య మరింతగా పెరిగి 2019 చివరకు 8 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణ ప్రాంతాల్లో స్త్రీపురుషుల్లో నిరుద్యోగ శాతం గణనీయంగా పెరిగిందన్నారు. పురుషుల్లో నిరుద్యోగుల సంఖ్య 18.7 శాతానికి చేరుకోగామహిళల్లో ఏకంగా 27.2 శాతానికి చేరకుందన్నారు. ఇందుకు ఉదాహరణగా గతేడాది రైల్వేలో 63 వేల దిగువమధ్య స్థాయి ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా ఏకంగా కోటీ 90 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పీహెచ్‌డీలు కూడా చేసిన నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

టాక్స్ ఎక్జ్సెంప్సన్ ఓ బూటకమన్న డాక్టర్ శ్రవణ్
ఆదాయ పన్ను పరిమితిలో గతంలో ఉన్న 2.50 లక్షలనుంచి 5 లక్షల వరకు 5 శాతం అంటే రూ. 12.500 రిబేట్ ఇచ్చారని, ఆపై ఒక్కరూపాయి పెరిగినా  20 శాతం  అంటే రూ. 20,000 మరియు ఇచ్చిన రిబేటు కలుపుకుని  మొత్తం రూ.32,500 గా చెల్లించాల్సి ఉంటుందని డాక్టర్ శ్రవణ్ అన్నారు. కేవలం 5 లక్షల లోపు ఉన్న వారికే లబ్దిచేకూరేలా ఉందని కాని ఆర్ధిక మంత్రి పీయూష్ గోయెల్  2.50 నుంచి 5 లక్షల వరకు టాక్స్ ఎక్జ్జెంపన్ ఉందని గొప్పగా ప్రకటించడం పెద్దమోసమన్నారు. 2014 ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు టాక్స్ ఎక్జ్సెంప్సన్ లిమిట్ 2.5 నుంచి 5 లక్షలకు పెంచుతామన్నారని కాని దురదృష్ట వశాత్తూ గడిచిన ఐదేళ్ళుగా పెంచలేదన్నారు. 6.5 లక్షల ఆదాయం ఉన్నవారికి టాక్స్ ఎక్జ్సెంప్సన్ ఉంటుదని ఆర్ధిక మంత్రి ప్రకటించారని అది పూర్తిగా అబద్దమన్నారు.  5 లక్షల నుంచి 10 లక్షల వరకు టాక్స్ పరిమితుల్లో ఎలాంటి మార్పులేదని, అలాగే సీనియర్ సిటిజెన్స్ కూడా ఎలాంటి లాభం లేదని ఆర్ధిక మంత్రి టాక్స్ టేబుల్ ను ప్రదర్శించారు.


అసంఘటిత రంగాలను ఆదుకోని మోడీ ప్రభుత్వం
అసంఘటిత రంగంలో దాదాపు 51.7 కోట్ల మంది పనిచేస్తున్నారని  వీరిలో కేవలం 20 శాతం ఫించన్ దారులుగా గుర్తించినా.దాదాపు 10.34 కోట్ల మందికి ఒక్కక్కరికి రూ. 3 వేల చొప్పున ఏడాదికి 36 వేల రూపాయలు అవుతాయని, మొత్తం 3,72,240 కోట్లు అవసరం కాగా కేవలం రూ.500 కోట్లు తక్కువగా కేటాయించారన్నారు.
అలాగే  స్వచ్చ భారత్ లో కేవలం 16 శాతం ఓడిఎఫ్ గ్రామాలు గా నిర్ధారించబడ్డాయని కాని ఆర్ధిక మంత్రి 98 శాతం గ్రామీణ సానిటేషన్ పూర్తయ్యిందని అవాస్తవాలు చెప్పారన్నారు.

143 కోట్ల ఎల్ ఈడి బల్బుల సరఫరా చేశామని  పచ్చి అబద్దాలు చెప్పారని కేవలం 32 కోట్ల ఎల్ ఈ డి బల్బులు మాత్రమే సరఫరా చేశారని దాసోజుఆరోపించారు.

Minister also mislead the nation on functioning of 14 AIMS in the country

కరెప్సన్ ఫ్రీగా దేశాన్ని తయారుచేశామని చెప్పిన మోడీ దేశ వ్యాప్తంగా అదాని స్కాం నుంచి మొదలు కొంటే బాల్కో స్కాం, చిక్కిస్కాం, దాల్ స్కాం, ఎర్త్ క్వేక్ రిలీఫ్ ఫండ్ స్కాం, వ్యాపం స్కాం, హడ్కో స్కాం, మెట్రోరైల్ స్కాం, పీడిఎస్ స్కాం, కేరళ మెడికల్ స్కాం, ఎడ్యూరప్పాస్కాం ఇలా బోలెడన్ని స్కాంల తో దేశంలో నెంబర్ వన్ స్కాం ప్రభుత్వంగా ముద్రపడ్డారని ఎద్దేవా చేశారు.


తెలంగాణ కు మొండిచెయ్యి .. తెరాస వైఫల్యం :

తెలంగాణకు కేంద్ర నుంచి సరైన ఆర్థిక తోడ్పాటు కరవవుతోంది. ఐదేళ్లుగా ప్రతి సారీ బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశే మిగులుతోంది. పన్నుల్లో వాటాగా అందాల్సిన మొత్తం, అలాగే గ్రాంట్ రూపంలో వివిధ పథకాలకు అందే నిధులు మినహా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎలాంటి ఆర్థిక తోడ్పాటూ అందలేదు.

మిషన్కాకతీయ, మిషన్భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో బాటు రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరినా ప్రయోజనం ఉండలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు బాగున్నాయని, కేంద్రం వీటికి ప్రత్యేక నిధులు అందించాలని రెండేళ్ల కిందటే నీతి ఆయోగ్సిఫారసు చేసింది

మిషన్భగీరథ, మిషన్కాకతీయలకు రూ.24 వేల కోట్ల ఇవ్వాలని సూచించింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు. తెలంగాణలో సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులకు రూ.34 వేల కోట్లు ఇవ్వాలని, దాదాపు రూ.80 వేల కోట్లు ఖర్చవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లయినా ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించిందికాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే విజ్ఞప్తి పట్టించుకోలేదు.

గత 2018-19 బడ్జెట్లో రూ.39 వేల కోట్లు అందించాలని కోరినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక రోడ్ల వంటి మౌలిక సదుపాయాలకు, ఇవి కాకుండా మైనార్టీ విద్య, గురుకుల పాఠశాలలు సహా విద్యారంగానికి ఉన్న అధిక ప్రాధాన్యం దృష్ట్యా ప్రత్యేకంగా నిధులు అడిగినా కేంద్రం మొండి చెయ్యే చూపింది.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పుడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోడీ, తెలంగాణా ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యాయన్నారు. విభజన హామీ చట్టం ప్రకారం రావాల్సిన విద్యాసంస్ధలు, ప్రతిష్టాత్మక రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, తదితర సంస్ధలకు తగిన నిధులు కేటాయించడంలో గడిచిన ఆరుబడ్జెట్ లలో మోడీ ప్రభుత్వం ఉదాసీనవైఖరిని అవలంబించందన్నారు.

మొత్తమ్మీద దేశంలోని రైతులను, నిరుద్యోగులను మోసం చేసిన  మోడీ మరోమారు ఆశల బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఎన్నికల్లో లబ్ది పోందాలని మరో మారు ప్రజలను వంచించేందుకు సిద్దమయ్యారని డాక్టర్ దాసోజు శ్రవణ్ ఘాటుగా విమర్శించారు.

No comments:

Post a Comment