Wednesday 23 January 2019

భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త అధ్యాయం ప్రారంభమయిందన్న ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.

ప్రత్యేక్ష రాజకీయాల్లో అడుగు పెట్టిన ఇందిరాగాంధీ మనుమరాలు శ్రీమతి ప్రియాంకాగాంధీ
ఉత్తర ప్రదేశ్  ప్రధానకార్యదర్శి గా ప్రియాంకను నియమించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు రాహుల్ గాంధీ.
భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త అధ్యాయం  ప్రారంభమయిందన్న ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.

మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మనుమరాలురాజీవ్,సోనియాగాంధీల కుమార్తె శ్రీమతి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించడం  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి  శుభ పరిణామమని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో  ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు రాహుల్ గాంధీ,  ప్రియాంకాను ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా, నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల  దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు  వ్యక్తం అవుతున్నాయన్నారు.త్వరలోనే ఇందిరమ్మ రాజ్యం సాకారమవుతుందని  దాసోజు ధీమా వ్యక్తం చేశారు.
రూపురేఖల్లో, ఆలోచనల్లో, హావభావాల్లో అచ్చం నాయనమ్మ, దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని పోలిఉన్న ప్రియాంకా గాంధీ మంచితనం,మానవత్వం, మర్యాద , హుందాతనం కలగలసిన నేత అని, త్వరలోనే దేశ ప్రజల మన్ననలు చూరగొంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఏప్రిల్ 5 2014న ప్రియాంకాగాంధీ గారితో భేటీ అయ్యాయని ఆసందర్భంగా ఆమె మాట తీరు, యువత, బడుగు బలహీన వర్గాల పట్ల కనబరిచిన శ్రద్ద పట్ల తీవ్రంగా ప్రభావితమయ్యానని, అదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీలో చేరానని డాక్టర్ శ్రవణ్ గుర్తుచేసుకున్నారు. రానున్న కాలంలో ప్రియాంకాగాంధీ ఒక బలమైన నాయకురాలుగా ఎదుగుతారన్నారు. గత 2014 ఎన్నికల ముందు నుంచే రాజకీయ వ్యూహాలు సిద్ధం చేయడంలోనూకమ్యూనికేషన్ పెంపోందించడం, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం తదితర అంశాల్లో కీలక పాత్ర పోషించారని, తెరవెనుక కాంగ్రెస్ పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న ప్రియాంకా గాంధీ ప్రస్తుతం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి  రావడం  ద్వారా భారత దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించడం ఖాయమన్నారు. రాబోయే కాలంలో దేశంలోని అరవై కోట్ల మంది మహిళలకు ప్రియాంకాగాంధీ ప్రతినిధిగా కనిపిస్తారన్నారు. ఓ వైపు పేద బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలన్ననాయనమ్మ బాటలో నడుస్తూ బలహీన వర్గాల ప్రజల కు దిక్సూచిగా వ్యవహరిస్తున్న ప్రియాంకాగాంధీ, మరోవైపు కులమతాలకతీతంగా ప్రతిభ కలిగిన యువత కు పెద్ద పీట వేయాలని చూస్తున్న రాహుల్ గాంధీ నేతృత్వంలొ త్వరలోనే సరికొత్త భారత్ ఆవిష్కృతం అవుతుందని, రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అజేయంగా మారుతుందని డాక్టర్ శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment