Sunday 3 February 2019

ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్య పరిచి ప్రైవేట్ పరంచేయడమే మేకిన్ ఇండియా,స్టార్టప్ ఇండియా సాధిస్తారా : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.


·   ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్య పరిచి ప్రైవేట్  పరంచేయడమే  మేకిన్ ఇండియా,స్టార్టప్ ఇండియా  సాధిస్తారా ..ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.
 ·     జియో సంస్ధకు రెడ్ కార్పెట్ పరిచిన మోడీ తల్లిలాంటి సంస్ధను నిర్వీర్యపరుస్తున్నారని విమర్శ
  ·     బిఎస్ ఎన్ ఎల్ స్వంత ఆస్తులను వారికివ్వడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారన్న డాక్టర్ శ్రవణ్
  ·        దేశానికి గర్వకారణమైన బిఎస్ ఎన్ ఎల్ సంస్ధను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ.


దేశానికి గర్వకారణంగా నిలిచి, గ్రామాగ్రామాన విస్తరించిన బిఎస్ఎన్ ఎల్ సంస్ధను నిర్వీర్యపరిచేందుకు ప్రధాని మోడి నేతృత్వంలో కుట్ర జరుగుతోందని, అలాంటి కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టేందుకు దేశ వ్యాప్తంగా బిఎస్ ఎన్ ఎల్ వర్కర్స్ పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటి జాతీయ అధికార ప్రతినిధి  డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు అన్నారు.  ఇవాళ ఉస్మానియా యూనివర్శిటీలోని  ఐఈటీఈ ఆడిటోరియంలో జరిగినఆల్ ఇండియా నేషనల్  బిఎస్ఎన్ ఎల్ వర్కర్స్ 5 వ కాన్ఫరెన్స్ సమావేశంలో తెలంగాణా శాసనసభ ప్రతిపక్షనేత మల్లు భట్టివిక్రమార్క తో కలిసి ముఖ్య అతిధిగా హాజరయిన దాసోజు కార్మికుల హక్కుల తో పాటు సంస్ధను మనుగడ కోసం  పోరాడాల్సిన సమయం ఆసన్న మైందన్నారు.దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్య పరిచి ఉద్దేశ్యపూర్వకంగా వాటి స్ధానంలో ప్రైవేట్ సంస్ధలను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నస్తున్నారని ఆరోపించారు.
కార్మికుల పై రిసెర్చ్ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా..దాసోజు
1999 లో ఉస్మానియాలో పర్సనల్ మేనేజ్ మెంటు ఆఫ్ ఇండస్ట్రియల్ లో ఎంబీఏ చేశానని, ఆతర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో దాదాపు2 వేల మంది పై పరిశోధన చేసే అవకాశం వచ్చిందని ఆసందర్భంలోనే ఎన్ ఎఫ్ టీ యూ పెద్దలు సంజీవరెడ్డిగారితో తనకు అనుబంధం ఏర్పడిందని నాటి నుంచి నేటి వరకు 90 సంవత్సరాల వయస్సులోకూడా ఆయన కార్మికుల సేవలో తరిస్తున్నారని డాక్టర్ శ్రవణ్  కొనియాడారు. సంజీవరెడ్డిలాంటి పెద్దలు కష్టపడి నిర్మించిన సౌధంలో ఇతరులు తిష్టవేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రభుత్వ రంగసంస్ధలను కాపాడడానికి చేసిన శ్రమను ప్రైవేట్ సంస్ధలకు దోచిపెట్టేందుకు మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం సహకరించడం దురదృష్టకరమన్నారు.
గ్రామగ్రామాన విస్తరించిన బీఎస్ఎన్ ఎల్ ను నిర్వీర్యం చేసి ప్రైవేట్ కు పట్టం కట్టడం అన్యాయం.శ్రవణ్
దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 5లక్షల 90 వేల గ్రామాల్లో 99 శాతం బిఎస్ ఎన్ ఎల్ సంస్ధ సర్వీసుల అందిస్తున్నారు. గ్రామాల్లో  సేవలందించేందుకు బిఎస్ ఎన్ ఎల్ సర్వీసులు కావాలి,  కాని లాభాలొచ్చే పట్టణాల్లో మాత్రం ఇతర ప్రైవేట్ కంపెనీలు ఎందుకని డాక్టర్ శ్రవణ్  ప్రశ్నించారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాల వల్లే బిఎస్ ఎన్ ఎల్ సంస్ధ నష్టాల్లో కూరుకు పోయిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసి, ఏళ్ళుగా కష్టపడి నిర్మించుకున్న బీఎస్ ఎన్ ఎల్ సౌధాన్నిజీయో లాంటి ప్రైవేట్ సంస్ధలు ఆక్రమించుకునేలా చేసిన ప్రభుత్వ చర్యలను ఖండించాలని  వారి కుట్రలను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు.  




ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్య పరిచి, మోడీ ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తున్నరని విమర్శ
దేశంలో ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్య పరిచి ప్రైవేట్ రంగాలను అభివృద్ది చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారని దేశానికి గర్వకారణంగా ఉన్న డిఫెన్స్ పరికరాలు తయారు చేసే కంపెనీలు, హెలీకాప్టర్లు, ఓడలు, తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్దలున్నా వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ ని కాదని  30 వేల కోట్ల రూపాయల రఫేల్ యుద్ద విమానాల కాంట్రాక్ట్ ను అనిల్ అంబాని కంపెనీకి ఇప్పించారని విమర్శించారు. దీని వల్ల ప్రభుత్వ రంగ సంస్ధ అయిన హాల్ కంపెనీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. అలాగే  బీఎన్ ఎన్ ఎల్ ను నాశనం చేసి జీయోను పైకి తేవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్య పరిచి మేకిన్ ఇండియా,స్టార్టప్ ఇండియా  ఎలా సాధిస్తారన్న దాసోజు.


అదాని సంస్దలను కాపాడడం కోసం ప్రభుత్వ రంగ సంస్ధలయిన సెయిల్ ను భూస్ధాపితం చేసారని, అలాగే  బిఎస్ ఎన్  ఎఎల్ నాశనం చేసి ముఖేశ్ అంబానినికాపాడారని, హాల్ ను నిర్వీర్యపరిచి అనిల్ అంబాని రక్షించారని ఇలా మొత్తం ప్రభుత్వ రంగ సంస్ధలను  అంబానీ అదాని చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ యావత్ దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం కొనసాగుతోందన్నారు.  ఇందుకోసం ముందుగా తల్లితో సమాన మైన ప్రభుత్వ సంస్ధలను కాపాడుకుకునేందు ప్రతి ఒక్కరూ నడుంకట్టాలని ఇందుకోసం నిరంతరం పోరాటం చేయాల్సినఅవసరం ఉందన్నారు. మోడీ ప్రభుత్వ కంపెనీలను నాశనం చేసి మేకిన్ ఇండియా స్టార్టప్ ఇండియా  ఎలా సాధిస్తారని దాసోజు అన్నారు. అదాని అంబానీలు లాభాల బాటలో నడవడం వల్ల మేకిన్ ఇండియా సాధిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగసంస్ధలకు ప్రభుత్వ పూచికత్తుతో రుణాలు ఇప్పించకుండా రిలయన్స్ జియో  కోసం జపాన్ బ్యాంకులో రూ.3225 కోట్లు  ఇప్పించడాన్ని చూస్తే మోడీ కి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్ధలపై ఉన్న ప్రేమ ఏపాటిదో అర్ధం అవుతోందన్నారు. ఉద్యోగులంతా చిన్న చిన్న విషయాలకోసం పోరాడకుండా సంస్ధ నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాలన్నారు.
రాహుల్ నేతృత్వంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్ధ లను కాపాడుకునేందుకు కృషి చేస్తామని హామీ
కాంగ్రెస్ పార్టీ చాలా లిబరలైజేషన్ జరిగిందని అదే సమయంలో భాద్యతాయుతంగా వ్యవహరించిందని గుర్తుచేశారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి అధ్వర్యంలో శ్యాం పిట్రోడ్ దేశానికి టెలికాం రంగాన్ని పరిచయం చేసారని, ఎక్కడా ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్యం చేయకుండానే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించిందని గుర్తుచేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో రైల్వేలు, బిఎస్ ఎన్ ఎల్ , ఓఎన్ జీసి, అన్ని సంస్ధలు నష్టాల బాట పట్టాయని విమర్శించారు. వీటన్నింటిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా రాహుల్ నేతృత్వంలో కార్మికులకు తోడుగా ఉంటుందని దాసోజు హామీ ఇచ్చారు, బిఎస్ ఎన్ ఎల్ వర్కర్స్ 5 వ వార్షిక సమావేశంలో ఎఫ్ ఎన్ టీ వో జనరల్ సెక్రటరీ జయప్రకాశ్ గారితో  ఇతర  ప్రముఖులు శ్రీ సంజీవరెడ్డి, చండీశ్వర్ సింగ్, కబీర్ దాస్, ఆర్ సి పటేల్, మరియు ఇతర రాష్ట్రలనుంచి వచ్చిన ప్రముఖులు. వర్కర్స్ తదితరులు పెద్దయెత్తున పాల్గొన్నారు


No comments:

Post a Comment