Ø తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వెళ్లి ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయ కేసులో, అమెరికాలో జైల్లో చిక్కుకున్న విద్యార్థులను వెంటనే విడిపించాలి - ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు.
Ø విదేశాంగ శాఖ మంత్రి శ్రీమతి సుష్మా గారికి, హైదరాబాద్ అమెరికా కౌన్సిల్ జనరల్ క్యాథరిన్ బి హెడ్డా గారికి, తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్ర శేఖర రావు గారికి, బహిరంగ లేఖ రాసిన డాక్టర్ శ్రవణ్
Ø విద్యార్ధులను కాపాడేందుకు అవసరమైతే శ్రీమతి ఇవాంక ట్రంప్ ను సంప్రదించి తక్షణమే విద్యార్థులను కాపాడాలని ముఖ్యమంత్రికి విజ్నప్తి.
విద్యాభ్యాసం కోసం అమెరికా లోని ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు పొందిన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులను అక్కడి ప్రభుత్వం తమ ఇమ్మిగ్రేషన్ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నారన్న నెపంతో అరెస్ట్ చేయడాన్నిఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు తీవ్రంగా ఖండించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన వారిలో దిగువ, మధ్యతరగతికి చెందిన వారున్నారని వీరంతా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరిని తక్షణమే విడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి శ్రీమతి సుష్మాస్వరాజ్, హైదరాబాద్ లోని అమెరికన్ కౌన్సిల్ జనరల్ క్యాథరిన్ బి హెడ్డా, మరియు తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్ర శేఖర రావు, గారికి ఆయన బహిరంగ లేఖలు రాసారు.
అమెరికాలో తెలుగు విద్యార్ధుల నిర్భంధం విచారకరం..డాక్టర్ శ్రవణ్
రెండు వారల కిత్రం అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దాదాపు వందలాది మంది తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్ధులను నిర్భంధించారని వారంతా ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా దేశంలోని ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయంలో చేరారన్నారు. అమెరికా ప్రభుత్వంలోని హోంలాండ్ సెక్యూరిటీ ద్వారా ఏర్పాటయిన ఫార్మింగ్టన్ యూనివర్శిటీ, నకిలీ యూనివర్శిటీ అని తెలియక అందులో చేరిన అమాయకులైన విద్యార్ధులు మోసానికి గురయ్యారన్నారు. యూనివర్శిటిలో చేరిన తర్వాత రోజు వారి తరగతులకు హాజరుకాకున్నా, పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటైనా విద్యాభ్యాసం కొనసాగించవచ్చన్న యూనివర్శిటీ అధికారుల మాటలు నమ్మి విద్యార్ధులంతా మోసపోయారన్నారు.
రెండు వారాలుగా విద్యార్ధులను వేధింపులకు గురిచేయడం సరికాదన్న డాక్టర్ శ్రవణ్
దాదాపు రెండు వారాలుగా విద్యార్దులంతా ప్రభుత్వం నిర్భందించినా ఇప్పటివరకు వారందరిని అమెరికన్ కోర్టులో ప్రవేశపెట్టకపోవడం దారుణమన్నారు. విద్యార్ధులను విడుదల చేయకుండా నిర్భందించి వేధించడం తగదని డాక్టర్ శ్రవణ్ అన్నారు. విద్యార్దులంతా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారని డాక్టర్ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ కాబడిన విద్యార్ధులంతా దిగువ, మధ్య తరగతికి చెందిన వారేనని, వీరిలో రైతులు, చిన్న స్ధాయి వ్యాపారాలు చేసుకునే కుటుంబాలకు చెందిన వారన్నారు. తమ బిడ్డలు బాగా చదువుకుని ఉత్తమ భవిష్యత్తు పొందే అవకాశం ఉందని వారంతా తమ వారిని అమెరికా కు పంపించారని గడిచిన రెండు నెలలుగా వారి బాగోగులు తెలియన తీవ్రమనోవేదనకు గురవుతున్నారని డాక్టర్ శ్రవణ్ తన లేఖలో పేర్కొన్నారు.
కేంద్రమంత్రి, తెలంగాణా ముఖ్యమంత్రి,మరియు కాన్సులేట్ జనరల్ కు దాసోజు లేఖలు
అరెస్ట్ కాబడ్డ విద్యార్ధులకు అధికారులు పెట్టే వేధింపులు భరించలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యే ప్రమాదముందన్నారు. సరైన వసతులు ఏర్పాటుచేయకుండా తగిన ఆహారం ఇవ్వకుండా వేధించడం తగదన్నారు. అలాగే చాలామంది విద్యార్ధుల్లో చిన్నపిల్లల తల్లితండ్రులు, గర్భిణీలు కూడా ఉన్నట్లు తెలిసిందని వారందరిని వెంటనే విడుదల చేయించేందుకు కేంద్రవిదేశాంగ శాఖ మంత్రి శ్రీమతి సుష్మాస్వరాజ్, హైదరాబాద్ లోని అమెరికన్ కౌన్సిల్ జనరల్ క్యాథరిన్ బి హెడ్డా, మరియు తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్ర శేఖర రావు, గారు తగిన చొరవ చూపాలని దాసోజు లేఖలు రాసారు. తమ కుటుంబసభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించేందుకు తగిన కృషి చేయాలన్నారు. అక్కడి అధికారులతో మాట్లాడాలనుకుంటే భాషాపరమైన ఇబ్బందులు,చట్టాల పై సక్రమంగా అవగాహన లేమితో ఇక్కడి వారంతా అయోమయానికి గురవుతున్నారని తమ లేఖలో పేర్కొన్నారు.
ఫార్మింగ్టన్ యూనివర్శిటీ నకిలీదని తెలియక విద్యార్దులు అందులోచేరారన్న డాక్టర్ శ్రవణ్
ఫార్మింగ్లన్ విశ్వవిద్యాలయం పూర్వాపరాలు తెలియక విద్యార్ధులు అందులో చేరారని అది అమెరికా ప్రభుత్వమే స్ధాపించిందువల్ల నకిలీ యూనివర్శిటీ గా దాన్ని విద్యార్ధులు గుర్తించలేకపోయారని దాసోజు అన్నరు. కేవలం తమకు ఉజ్వల మైన భవిష్యత్తు ఉంటుందన్న కారణంతో అందులో చేరారని వారెవరు నేరస్తులు కారని విద్యార్ధుల వల్ల అమెరికా దేశానికి ఎలంటి ప్రమాదం వాటిల్లే అవకాశం లేదని విద్యార్ధులను విడిపించేందకు తక్షణమే ఈ కింది చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రవణ్ తన లేఖలో డిమాండ్ చేశారు.
1. విద్యార్దులను తక్షణమే విడిపించి వారికి తగిన వైద్య సహాకారం అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
2. విద్యార్దులకు తక్షణమే బెయిల్ ఇచ్చి వారందరిని విడుదల చేయాలి.
3. తెలంగాణా ప్రభుత్వం వెంటనే ఒక బృందాన్ని అమెరికా పంపించి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపాలి.
4. విద్యార్ధుల కుటుంబాలతో మాట్లాడేందుకు తగిన సమాచార వ్యవస్ధను పటిష్టపరిచి వారిలో మనో ధైర్యాన్ని నింపాలి.
5. విద్యార్దులు సాదారణ జీవితాన్ని గడిపేందుకు మరియు ఆర్ధిక, న్యాయ సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలి.
2017 లో తెలంగాణా ప్రభుత్వం ఆతిధ్యమిచ్చిన అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె శ్రీమతి ఇవాంకా ట్రంప్ సహకారం తీసుకునేందుకు కూడా కృషి చేయాలని డాక్టర్ దాసోజు తన లేఖలో పేర్కొన్నారు. అలాగే మోసపూరితంగా విద్యార్దులను చేర్చుకుంటున్న విశ్వవిద్యాలయాల పై చర్యలు తీసుకోవాలని అలాంటి సంస్ధల వివరాలను ప్రచురించాలని కోరుతున్నాము.విద్యార్ధులు,మరియు వారి తల్లితండ్రుల శ్రేయస్సు కోసం తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్దులను కాపాడాలని డాక్టర్ దాసోజు విజ్నప్తి చేశారు.
No comments:
Post a Comment