Sunday 2 December 2018

ఐదు శాతం రిజర్వేషన్లు కూడా సాధ్యం కాదని తెలిసినా మైనర్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసిగించిన కేసీఆర్.. కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ అజాద్

ఐదు శాతం రిజర్వేషన్లు కూడా సాధ్యం కాదని తెలిసినా మైనర్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసిగించిన కేసీఆర్.. కేంద్ర మాజీ మంత్రి  గులాంనబీ అజాద్
కేంద్రంలో మోదీ, రాష్ర్టంలో కేసీఆర్ ప్రజలను మోస గించడంలో ఇద్దరూ.. ఇద్దరేనని ఎద్దేవ..
సీఎం కేసీఆర్.. కమీషన్  మ్యాన్ ఆఫ్ తెలంగాణ గా నిలిచాడన్న .. ఏఐసీసీ అధికార ప్రతినిధి కుష్బు సుందర్
ఎంఎస్ మక్తా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తానన్న శ్రవణ్ దాసోజు
దానం, చింతల మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని పిలుపు..


ఖైరతాబాద్  నియోజకవర్గం, ఎంఎస్ మక్తా లో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ దాసోజు శ్రవణ్ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి ఖుష్భూ సుందర్ పాల్గొన్నారు. దాసోజు శ్రవణ్ కుమార్ తరఫున ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ దేశంలో ప్రవేశ పెట్టిన సంస్కరణలన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని మోడీ చేసిందేమీ లేదన్నారు. దేశంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ లు ప్రజలను మోసగిస్తు కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు.  దేశంలో ఐటీ ని రాజీవ్ గాంధీ ప్రవేశ పెట్టారన్నారు. మోడీ చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో ఎందరో నిరుద్యోగులుగా మారారని ఆరోపించారు. సక్రమమైన ఆర్ధిక ప్రణాళిక లేకుండా చేశారని నెహ్రూ ప్రవేశపెట్టిన ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్ ను ప్రవేశ పెట్టారన్నారు. గడిచిన 70 ఏళ్లగా దేశంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు.  ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ల పేరిట మోసగించారన్నారు. 2003 లో కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఉన్నా కూడా ముస్లీంలఇక్కడ తక్కువ ఉన్నాయనే ఉద్దేశ్యంతోనే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తే అదికూడా కోర్టు ఒప్పుకోలేదని అందుకే కేవలం 4 శాతం రిజర్వేషన్లుకు కట్టుబడాల్సి వచ్చిందన్నారు. ఇది కేసీఆర్ కు కూడా తెలుసని, కాని కావాలనే ముస్లీం రిజర్వేషన్ల విషయంలో 12 శాతం ఇస్తానని మోసం చేసిన్రని దుయ్యబట్టారు.  ఏమన్నా చేసి ఓట్ల పొందాలని, సీట్లు గెలవాలని కేసీఆర్ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. ఉపాధి హామీ మొదలు అనేక వాగ్దానాలు చేయకున్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవన్నీ అమలు చేసి దేశంలో పేద ప్రజల పక్షాన నిలిచామన్నారు.
సీఎం కేసీఆర్.. కమీషన్  మ్యాన్ ఆఫ్ తెలంగాణ గా నిలిచాడు.. ఏఐసీసీ అధికార ప్రతినిధి కుష్బు సుందర్
రైతులు, దళితులు, మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిన సీఎం  కేసీఆర్ కమీషన్ ఆఫ్ తెలంగాణగా నిలిచాడని ఏఐసీసీ అధికార ప్రతినిధి కుష్బూ ఆరోపించారు. ఎంఎస్  మక్తాలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్  ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, మహిళలపై దాడుల్లో రాష్ర్టం రెండో స్థానంలో, అవినీతిలో మొదటి స్థానం నిలవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ర్టంలో ఇసుక మాఫియా పెరిగి దళితులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజా సేవ మరిచి కుటుంబ సేవ చేసుకుంటున్నాడని దుయ్యబట్టారు. నాలుగేళ్లలో రాష్ర్టంలో 4వేల పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయని విమర్శించారు. ప్రాథమిక వైద్యశాలల్లో వైద్యులు, సిబ్బంది కొరతను అదిగమించడంలో విఫలం చెందారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లోనూ అవినీతి జరిగిందని, ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేస్తామని మోసగించి,  తాను మాత్రం  రూ. 300 కోట్లతో బులెట్ ఫ్రూప్  బంగ్లాను నిర్మించుకున్నాడని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ అంబాసిడర్ కారు.. ఆ  కంపెనీ ఎప్పుడో మూతపడిందని ఎద్దెవ చేశారు. టీఆర్ఎస్ పార్టీను రాష్ర్టం నుంచి తరిమి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఎంఎస్ మక్తా వాసుల సమస్యలు చిత్తశుద్దితో పరిష్కరిస్తా... శ్రవణ్ దాసోజు
సుదీర్ఘకాలంగా ఎంఎస్ మక్తా వాసులు ఎదురుచూస్తున్న సమస్యలను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  అభ్యర్ధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు.ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నే ఈద్గాసమస్య, ఖబరస్తాన్, ఇళ్లరెగ్యులరైజేషన్ , హైటెన్షన్ విద్యుత్ లైన్ సమస్య, డ్రైనేజీ, మంచినీటి సమస్యలను పరిష్కరించి మక్తా వాసులు 

No comments:

Post a Comment