Monday 3 December 2018

ధనిక రాష్ర్టాన్ని అప్పులపాలు చేశారు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు..

ధనిక రాష్ర్టాన్ని అప్పులపాలు చేశారు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు..
దూరదృష్టితో సైబరాబాద్ ను అభివృద్ధి చేశానని వెల్లడి..
ప్రజలు గుర్తుంచుకునే అభివృద్ధి పని ఒక్కటైనా చేశారని కేసీఆర్ను ప్రశ్నించిన చంద్రబాబు..
అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు మద్ధతగా నిలిచాని స్పష్టం చేసిన చంద్రబాబు..







దనిక రాష్ర్టంగా ఉన్న తెలంగాణను తన అసమర్థ పాలనతో రాష్ర్టాన్ని అప్పుల పాలు చేశారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఖైరతబాద్ నియోజకవర్గంలో ప్రజా కూటమి బలపర్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసోజు శ్రవణ్ తో కలిసి  ఫిలీంనగర్ శంకర్ విలాస్ సమీపంలో  రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసమే ప్రజా కూటమి ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 ఏళ్లు సీఎంగా, దశాబ్ధకాలంగా ప్రతిపక్ష నేతగా ప్రజా సేవ చేశానని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి దూరదృష్టితో సైబరాబాద్ ను అభివృద్ధి చేశానని వివరించారు. సైబరాబాద్, హైటెక్ సిటి, మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఏయిర్ పోర్టుకు శ్రీకారం చుట్టడంతో నేడు హైద్రబాద్ అంతర్జాతీయ నగరంగా ఖ్యాతి పొందిందని వివరించారు.
కేసీఆర్ నాలుగున్నర ఏళ్ల పాలనలో గుర్తుండిపోయే ఒక్క పని చేశారా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఊసెత్తకుండా  ప్రగతి భవన్ నిర్మించుకున్నాడని విమర్శించారు. కేసీఆర్ అసమర్థ నిర్ణయాలతో ప్రజల ఆదాయం కన్నా.. 23 శాతం అప్పులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు పెట్టుబడి సాయం కోసం రూ. 10వేలు అందించానని, కేసీఆర్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను   నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 6 వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తామని తెలిపారు.

No comments:

Post a Comment