Monday 3 December 2018

ప్రజా కూటమికి ప్రజలు బహ్రరథం పడుతున్నారు.. డాక్టర్ శ్రవణ్ దాసోజు

ప్రజా కూటమికి  ప్రజలు బహ్రరథం పడుతున్నారు.. డాక్టర్ శ్రవణ్ దాసోజు
ఖైరతబాద్ లో ప్రజా కూటమిదే విజయమని ధీమా..
దానం, చింతలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని వెల్లడి..





 
జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలోని  ప్రజా కూటమి గెలుపు ఖాయమైందని ప్రజా కూటమి మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ  ఖైరతబాద్  ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తున్న డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. జూబ్లిహిల్స్ డివిజన్ లోని ఫిలీం నగర్ లో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజెఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ ప్రజా కూటమి దెబ్బకు టీఆర్ఎస్ మట్టి కొట్టుకు పోతుందని హెచ్చరించారు. 1500 ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఈనగాసినంక నక్కల పాలైనట్లు తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యయని, ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా అణిచివేతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  కేసీఆర్ తన స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ, ఆంద్ర ప్రాంత ప్రజల మధ్య వైశమ్యాలు తీసుకువస్తున్నారని విమర్శించారు.  ప్రాంతాలు గా విడిపోయిన బిన్నత్వంలో ఏకత్వంగా ప్రజలు కలిసుండాలనే సంకల్పంతో ప్రజా కూటమి పనిచేస్తుందని వివరించారు.  అధికార టీఆర్ ఎస్ బీజేపీ పార్టీ కోవర్టుగా పనిచేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు లోపాయికారిగా సహకరిస్తుందని ఆరోపించారు. టీడీపీ పుణ్యమా అని గత ఎన్నికల్లో గెలిచిన చింతలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.  
టీఆర్ ఎస్ ముస్లీం మైనార్టీలను మోసం చేసింది..
అధికారంలోకి రాగానే ముస్లీం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఓట్లు దండుకున్న కేసీఆర్ ముస్లీం మైనార్టీలను వంచనకు గురిచేశారని  దుయ్యబట్టారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ముస్లీం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేసి వారి అభివృద్దికి కృషి చేసిందని గుర్తు చేశారు.  
దందాలు, దౌర్జన్యాలతో ప్రజలు విసుగు చెందారు..
దానం, చింతల పాలనలో ఖైరతబాద్ లో దౌర్జన్యాలు, దందాలు, కబ్జాలతో ప్రజలు విసుగు చెందారని,  ప్రజలను ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తున్న తనకు ప్రజలు ఆశీర్వదించి ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. ఖైరతబాద్ ను తాజ్ ఆఫ్ తెలంగాణగా అభివృద్ధి సాధించడానికి విజన్ 2023 సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.
ప్రజాసేవ చేసే చేసే అవకాశం కల్పించాలని విజ్నప్తి
దశాబ్ధకాలంగాతెలంగాణ ఉద్యమం, ప్రజా సమస్యలపై నిరంతర పోరాడుతున్న తనను ఎమ్మెల్యేగా  గెలిపించి ప్రజా సేవ చేసే అవకాశం కల్పించాలని ఖైరతబాద్ ప్రజలకు శ్రవణ్ దాసోజు  విజ్నప్తి చేశారు. దానం, చింతల  దందాలు, దౌర్జన్యాలతో ఖైరతబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజేఆర్ ఆశయ సాధనకు ఖైరతబాద్ అభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ,  కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, టీడీపీ నేతలు బీఎన్ రెడ్డి, జీహెచ్ఎంసీ మహిళా అధ్యక్షురాలు షకిలా రెడ్డి, కాంగ్రెస్ నేతలు రోహిణి రెడ్డి, ఖైరతబాద్ సీపీఐ కార్యదర్శి హరినాథ్ గౌడ్, కాంగ్రెస్, టీడీపీ,ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్ రాజకీయ ఆత్మహత్య చేసుకున్నడు.. సీపీఐ జాతీయ ప్రదాన కార్యదర్శి నారాయణ.
కేసీఆర్  తొమ్మిది నెలల ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని  సీపై జాతీయ ప్రదాన కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఇది మల్లయుద్ధం కాదూ.. రాజకీయ యుద్ధం అనే విషయాన్న గుర్తుంచు కోవాలని కేసీఆర్ కు హితవు పలికారు. తన రౌడీయిజంతో తెలంగాణవాదులపై దాడులు చేసిన దానం నాగెందర్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం సిగ్గుచేటుగా ఉందన్నారు. కేసీఆర్   చర్యతో  1500 మంది అమరుల ఆత్మఘోషిస్తోందని విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే బీజేపీ పార్టీకి కేసీఆర్  లోపాయికారిగా కే పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం, మోడీలను చూస్తే కేసీఆర్ కు వణుకు వస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ అవకాశాలకు వేదికగా ఉందని, ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని దుయ్యబట్టారు.  ప్రజా కూటమి అధికారంలోకి వస్తే ఆంద్రప్రాంతాలకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజలను రెచ్చగొడుతూ కేసీఆర్ తలకాయల లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా వంచక పాలనకు చరమగీతం పాడాలి.. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి
రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా వంచక పాలనకు చరమగీతం పాడాలని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి  ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను విస్మరించి కుటుంబ పాలన కొనసాగించిందని ఆరోపించారు. దళిత సీఎం,  దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం తదితర హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ర్టంలో సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఏ విధంగా అడ్డుకున్నాడో సమాదానం చెప్పాలని ప్రశ్నించారు.

No comments:

Post a Comment