Tuesday 4 December 2018

శ్రవణ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఏపీసీసీ అధ్యక్షులు ఎం రఘువీరారెడ్డి,మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు

పోలీసుల తీరుతో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం లేదని ఆగ్రహం.
దానం నాగేందర్ విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తేంటే గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా అంటూ ఎన్నికల సంఘాన్ని నిలదీత. 
శ్రవణ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన  ఏపీసీసీ అధ్యక్షులు ఎం రఘువీరారెడ్డి,మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు.
రేవంత్ అరెస్ట్ అప్రజాస్వామికమన్న ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దాసోజు శ్రవణ్ కుమార్ .  
పవన్ కల్యాణ్ నాకు సన్నిహితులు నాగెలుపుకు సహకరిస్తారని భావిస్తున్నా..శ్రవణ్ దాసోజు.
రేవంత్ అరెస్ట్ అప్రజాస్వామికం.. ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దాసోజు శ్రవణ్ కుమార్








రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసుల తీరు చూస్తుంటే ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. మంగళ వారం బంజారాహిల్స్ డివిజన్ లోని  ఎన్భీటీ నగర్ లో ఎన్నికల ప్రచారం నిమిత్తం పాదయాత్ర, ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన తెలంగాణాలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందన్నారు.
టీపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్న స్ధాయి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలను  వెంటనే మానుకోవాలన్నారు.  ఎంత అణిచేస్తా అంతగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు, ఉవ్వెత్తున ఎగిసి పడుతారన్నారు. రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడే రకం కాదన్నారు. ఎన్బీటి నగర్లో  పీజేఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన శ్రవణ్, పీజేఆర్ ఆశయాలకోసం పనిచేస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నా అరికట్టాల్సిన ఎన్నికల కమీషన్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడాన్ని తప్పు పట్టారు.
దానం నాగేందర్ విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తేంటే గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా అంటూ ఎన్నికల సంఘాన్ని నిలదీసిన శ్రవణ్ 
ఖైరతాబాద్ నియోజకవర్గంలో అక్రమాలు జరగుతున్నా ఎన్నికల కమీషన్ పట్టించుకోవడం లేదన్నారు శ్రవణ్., దానం నాగేందర్ ఆయన అనుచరులు ఓటర్లను ప్రలోభపెడుతూ విచ్చలవిడిగా డబ్బులు మద్యం పంపిణీ  చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అటు బీజెపి అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి ఓటర్లను మభ్యపెడుతూ గిప్ట్ కూపన్ లు ఇస్తున్నారని ఆధారాలతో సహా నిరూపించినా చర్యలు లేవన్నారు. ఇలా అయితే ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాగించగలదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసీఆర్ కు తాబేదార్లు గా మారారని దుయ్యబట్టారు.
పవన్ కల్యాణ్ నా శ్రేయస్సు కాంక్షిస్తారు..శ్రవణ్ దాసోజు
మార్పుకోరే రాజకీయాలకోసం రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కు మంచిస్నేహితుడని, తన శ్రేయస్సుకు పాటుపడుతారని భావిస్తున్నానని శ్రవణ్ అన్నారు. 2007 నుంచి సన్నిహితంగా ఉన్న పవన్ కల్యాణ్ మార్పు కోరే రాజకీయాల్లో భాగంగా తనలాంటి వారికి అండగా ఉంటారన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కే కే, జేడీ శీలం లను కలిసిన శ్రవణ్ దాసోజు
ఎన్నికల ప్రచారం లో భాగంగా టీఆర్ ఎస్ సీనియర్ నేత కే.కేశవరావును డాక్టర్ శ్రవణ్ దాసోజు కలిశారు. తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్ధించారు. ఆయన కూతురు, కార్పోరేటర్ విజయలక్ష్మి ని సైతం కలిసి తనకు ఓటేసి గెలిపించాలన్నారు. అలాగే రాజసభ మాజీ సభ్యులు జేడీ శీలం ను సైతం కలిసిన శ్రవణ్ తనకు ఓటేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన శ్రవణ్ కు మద్దతు తెలిపారు.
పాలన పరంగా వేరయినా ప్రజలంతా ఒక్కటే.. ఏపీసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి
పాలనాపరంగా వేరుగా ఉన్న తెలంగాణా, ఆంధ్రా ప్రజలంతా ఒక్కటేనని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు ఎం రఘువీరారెడ్డి అన్నారు. నాలుగు కోట్ల ప్రజల సుధీర్ఘ ఆకాంక్షలను నెరవేర్చేందుకు శ్రీమతి సోనియాగాంధీ తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, రెండు రాష్ట్రాల ఏర్పాటు ద్వారా ఇరు ప్రాంతాల అభివృద్ది ని కాంక్షించారన్నారు. ప్రజాకూటమి  ఆధ్వర్యంలో
2019 లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, తెలంగాణా, ఆంధ్రా ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ శ్రవణ్ దాసోజు ఎంతో కష్టపడ్డారని, విద్యావంతుడు, విజ్నాన ఖని , తెలంగాణా సమస్యల పట్ల పరిణితి ఉన్న నాయకుడు డాక్టర్ శ్రవణ్ ను ఎన్నుకోవాలన్నారు. డాక్టర్ శ్రవణ్ ను అసెంబ్లీకి పంపాల్సిన అవసరముందన్నరు. రోజుకో పార్టీ మారే వారిని ఎన్నుకోవద్దని, పెద్దయెత్తున ఓటింగ్ లో పాల్గొనాలని ఖైరతాబాద్ ప్రజలకు విజ్నప్తి చేశారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఖైరతాబాద్ లో డాక్టర్ శ్రవణ్ గెలుపుకోసం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేతలంతా తరలివచ్చామన్నారు. కేసీఆర్ కుటుంబ పాలననుంచి తెలంగాణా రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరముందన్నారు. రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారంటేనే కేసీఆర్ ఓటమిని అంగీకరించినట్లేనని ఎద్దేవా చేశారు. జగన్ తన వ్యాపారాలు కాపాడుకునేందుకే  కేసీఆర్ కు మద్దతు ప్రకటిస్తున్నారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా పై కేసీఆర్, కవిత  మద్దతిచ్చారన్న రఘువీరా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని స్వయంగా కేసీఆర్, కవితలే మద్దతు తెలిపారని, కాని ఎన్నికల వేళ మాట మార్చారన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఖలేజా ఉన్న నాయకులని అందుకే ప్రత్యేక హోదా పై కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారన్నారు. టీఆర్ఎస్, వైయస్సార్ సిపి పార్టీల నేతలు మోడీకి కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదన్నారు.
డాక్టర్ శ్రవణ్ కు మద్దతు తెలిపిన మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు
రఘువీరా రెడ్డి రోడ్ షోలో భాగంగా మద్దతు ప్రకటించిన మాజీ మంత్రి, టీటిడి మాజీ ఛైర్మెన్ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ విద్యావంతుడు, ఉద్యమవీరుడు డాక్టర్ శ్రవణ్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్నప్తిచేశారు. రోడ్ షోలో భాగంగా కాంగ్రెస్ నేతలు డాక్టర్ సింగిరెడ్డి రోహిణ్ రెడ్డి, ఆల్ ఇండియా మహిళా  కాంగ్రెస్ కార్యదర్శి షమీనా షఫీక్, టిడిపి నేత బిఎన్ రెడ్డి, పిసిసి నేత మధుకర్ యాదవ్, సిపిఐ ఖైరతాబాద్ నియెజకవర్గ కార్యదర్శి హరినాధ్ గౌడ్, తదితర కాంగ్రెస్ , టీడిపి, సిపిఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment