Sunday 2 December 2018

ఖైరతబాద్ నియోజకవర్గ అభివృద్ధికి విజన్ 2023 కోసం సమగ్ర ప్రణాళిక(మానిఫెస్టో) ప్రకటించిన..డాక్టర్ శ్రవణ్ దాసోజు

ఖైరతబాద్ నియోజకవర్గ అభివృద్ధికి విజన్ 2023 కోసం సమగ్ర ప్రణాళిక(మానిఫెస్టో) ప్రకటించిన..డాక్టర్ శ్రవణ్ దాసోజు

నియోజకవర్గ అభివృద్ది ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన శ్రవణ్.  

స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని వెల్లడి..

యువత,మహిళలు, ఇళ్ల రెగ్యులరైజేషన్, మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తానని హామీ.

ప్రతి ఆరునెలలకోమారు తన ప్రగతి పత్రాన్ని ప్రజలముందుంచుతానన్న శ్రవణ్

నియోజకవర్గ అభివృద్ధికి టోల్ ఫ్రీ, మొబైల్ ఆప్ ఏర్పాటు చేస్తామని ప్రకటన.












తెలంగాణకు గుండెకాయ లాంటి ఖైరతబాద్  అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను ఏర్పరిచి ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తానని ప్రజాకూటమి తరుఫున పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రవణ్ దాసోజు తెలిపారు. ఆదివారం సాయంత్రం గాంధీభవన్ జరిగిన మీడియా సమావేశంలో పవర్ పాయింట్  ప్రజెంటేషన్ ఇచ్చిన శ్రవణ్  నియోజకవర్గంలో తాను చేపట్టబోయే అంశాలతో కూడిన (మానిఫెస్టోను) సమగ్ర ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ.. దానం, చింతల చిల్లర రాజకీయాలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల నిబంధలకు విరుద్ధంగా బీజెపీ అభ్యర్ధి  తాయిలాలు అందిస్తున్నారని, టోకెన్లు పంపిణీ చేస్తున్నారన్నారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్ధి మద్యంను ఏరులై పారిస్తున్నారని, బస్తీల్లో ప్రజలకు డబ్బులు ఎరచూపిస్తున్నారని ఆరోపించారు. యువజన, కుల, మహిళా సంఘాలను తమకు ఓటేయాలని దానం  బెదిరింపులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో దందాలు, దౌర్జన్యాలు, భూకబ్జాలతో స్మశానాలను సైతం ఆక్రమించుకున్నారని ఆరోపించారు.

తనను గెలిపిస్తే ఖైరతాబాద్ తాజ్ ఆఫ్ తెలంగాణ గా మారుస్తా...

ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని వచ్చే ఐదేళ్లలో తాజ్ ఆఫ్ తెలంగాణా మారుస్తానని శ్రవణ్ అన్నారు. గత దశాబ్ద కాలంగా ఉద్యమంలో లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి పోరాటం చేశానని, ఉద్యమ నేతగా ప్రజాసమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రజల సహకారంతో విజన్ 2023 ద్వారా  పక్కా ప్రణాళికతో నియోజకవర్గ అభివృద్ది కి చిత్తశుద్దితో పనిచేస్తానన్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా...

నియోజకవర్గంలో వేలాదిగా ఉన్నయువతకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, అలాగే మహిళా సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి కృషి చేస్తానన్నారు. విద్య, వైద్య సదుపాయాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు.

టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి

నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తానన్నారు. బస్తీల్లో రోడ్లు, మురగుకాల్వలు, నాలాలు క్రమబద్దీకరించి ఏళ్లుగా పేదలు నివసిస్తున్న ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరిస్తానన్నారు. గడిచిన నాలుగేళ్లుగా జీహెచ్ ఎంసీ అధికారులు రూ.1600 కోట్ల రూపాయలు లైబ్రరీ సెస్ వసూలు చేసినా ఒక్క లైబ్రరీని కూడా ఏర్పాటు చేయించడం లోగతంలో మంత్రి గా పనిచేసిన దానం నాగేందర్ తాజామాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. తనను గెలిపిస్తే ప్రతి డివిజన్ లోని ప్రధాన కేంద్రాల వద్ద లైబ్రరీల ఏర్పాటు కు కృషి చేస్తానన్నారు. ప్రజల రక్షణ కోసం  అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలు, షీటీంల విస్తరణ కు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

12 అంశాలతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా 12 అంశాలతో కూడిన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో భూ సమస్యల పరిష్కారం, ఇళ్ల క్రమబద్దీకరణ, కొత్త ఇళ్ల నిర్మాణం,  పారిశుధ్ద్య నిర్వహణ, మహిళా సాధికారికత, పచ్చదనం తదితర అంశాలతో ఖైరతబాద్ ను స్మార్ట్ ఖైరతబాద్ గా  సర్వతోముఖాభివృద్ధి సాధిస్తామని వెల్లడించారు. అలాగే, సమస్యలను గుర్తించడానికి ప్రత్యేకంగా మొబైల్ ఆప్ ను అందుబాటులోకి తెస్తామని వివరించారు.  ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పాలన కొనసాగుతుందని వెల్లడించారు.

పన్నెండు వజ్రాలుగా నియోజకవర్గం అభివృద్ది కు కృషి.

ఖైరతబాద్ నియోజకవర్గంలోని 12 ప్రాంతాలను  పన్నెండు వజ్రాలుగా  అభివృద్ధి  చేస్తానని హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే ప్రతి ఆరునెలల కోమారు చేసిన అభివద్ది పనుల ను ప్రగతి పత్రం రూపంలో ప్రజల ముందుంచుతానన్నారు. ఈ సందర్భంగా  5 ఏళ్లలో చేపట్టబోయే ప్రగతి పత్రంను అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా కార్యదర్శి షమీనా షఫీక్, టీడీపీ సీనియర్ నాయకులు బీఎన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రోహిణ్ రెడ్డి, మాజీ కార్పోరేటర్ షరీఫ్, అమీర్ జావీద్, ఓయూ జేయేసీ నేత కురవ విజయ్ కుమార్, అధికార ప్రతినిధి చరణ్ కౌషిక్ యాదవ్,  ఎమ్మార్పీఎస్ నేత ప్రకాష్, సీపీ ఐ నియోజకవర్గ కార్యదర్శి హరినాథ్ గౌడ్, మధుకర్ రెడ్డి, నరికెళ్ల నరేష్, గౌస్ తదితర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.


No comments:

Post a Comment