Tuesday 27 November 2018

పీపుల్స్ మేనిఫెస్టో విడుదల..

ప్రజా కూటమి నేతృత్వంలో రాష్ర్టంలో సుఫరిపాలన అందించేందుకు గాంధీభవన్ వేధికగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పీపుల్స్ మేనిఫెస్టోను విడుదల చేశారు.  కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు జైరాం రమేష్, తెలంగాణ ఇంఛార్జి ఆర్ సి కుంథియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పీపుల్స్ మేనిఫెస్టోను  ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రవణ్ దాసోజు విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత బండ్ల గణేష్, ఓయూ జేఏసీ నేత కురువ విజయ్ కుమార్, కేతిరి వెంకటేశ్ హజరయ్యారు.  ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ.. సమూల మార్పు, సుఫరిపరిపాలన  కోసం సమగ్ర ప్రణాళిక నినాదంతో సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహా నేతృత్వంలో అన్ని కులాలు, వర్గాల సంప్రదింపుల తర్వాత 35 అంశాలతో   ఉమ్మడి మేనిఫెస్టోను మీడియాకు వెల్లడించారు. 

పీపుల్స్ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..
·        ప్రభుత్వంలోని అన్ని శాఖలను ఆర్టీ ఐ పరిధిలోకి తీసుకువచ్చి సుఫరిపాలన.
·        లోకాయుక్త పరిధిలోకి సీఎం, మంత్రులు.
·        సీనియర్ ఐఏఎస్ అధికారి  పర్యవేక్షణలో పీపుల్స్ గ్రీవెన్స్  సెల్ ఏర్పాటు.
·        అందెశ్రీ రచించిన జయ..జయ.. జయహే గీతాన్ని  రాష్ట్ర గేయంగా అమలు.
·        తెలంగాణ (టీ ఎస్),ను టీ జీ గా మారుస్తాం.
·        జిల్లా కేంద్రాల్లో అమరులకు స్తూపాలు నిర్మాణం.,
·        1969 నుంచి 2009 వరకు  ఉద్యమంలో  పాల్గొన్న వారిని గుర్తించి సముచిత న్యాయం.
·        అమరులను గుర్తించి వారికి సంబంధిత జిల్లా మంత్రి ద్వారా నేరుగా రూ. 10 లక్షలు అందించడం. వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడం.

·        ఉద్యమ కారులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయడం.
·        ఉద్యమ నేతలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పనుల్లో కొంత శాతం  వాటా, ఆర్ధిక స్వావలంబన.
·        రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ.
·        రూ. 5వేల కోట్ల స్థిర నిధి ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యానికి  మద్ధతు ధర కల్పన.
·        రైతు బంధు పథకాన్ని విస్తృత పరిచి రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు  న్యాయం.
·        రైతు బంధు నగదును రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకు పెంపు.
·        వ్యవసాయ శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు.
·        వ్యవసాయ శాఖను రైతు సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి శాఖగా మార్పు.
·        వరికి రూ. 2వేలు, పత్తికి రూ. 6వేల తోపాటు 17 పంటలకు మద్ధతు ధర చెల్లింపు.
·        ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సామాజిక భద్రత.
·        నిరుద్యోగ యువతకు రూ. 3వేల నిరుద్యోగ భృతి,
·        ఏడాదిలోగా 20 వేల టీచర్ పోస్టులు భర్తీ.
·        ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు వార్షిక క్యాలెండర్, ఐదేళ్ల కాలంలో  లక్ష ఉద్యోగాలు భర్తీ.
·        వార్షిక బడ్జెట్లో 20 శాతం నిధులు విద్యాభివృద్ధికి కేటాయింపు.
·        ఐదేళ్లలో 100 శాతం అక్షరాస్యత సాధించడం.
·        రెండు దశల్లో ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు.
·        కార్పోరేట్, ప్రైవేటు  ఫీజుల నియంత్రణ కు రిటైర్డ విద్యాశాఖ అధికారుల కమిటీ ఏర్పాటు.
·        అర్హులకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అన్ని 5లక్షలు వర్తింపు.
·        ప్రతి మండలంలో 20-30 పడకల ఆసుపత్రి అలాగే నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం.
·        ప్రతి జిల్లాలో నిమ్స్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ స్థాయిలో ఆస్పత్రి మరియు వైద్యకళాశాల ఏర్పాటు.
·        ఎర్రగడ్డలో 1000 పడకల ఆస్పత్రి,మరియు ఉస్మానియా సమీపంలో పదమూడు ఎకరాల్లో  మోడల్ ఆస్పత్రి నిర్మాణం.
·        ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని (నిజాం వారసత్వ సంపద) మోడల్ హెరిటేజ్ గా గుర్తింపు.
·        గృహ నిర్మాణం కోసం స్వంత స్థలం ఉంటే 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు చెల్లింపు ఇందిరమ్మ ఇళ్ల పాత బకాయిలు చెల్లింపు.
·        అదనపు సౌకర్యాలకు రూ. 2 లక్షలు చెల్లింపు. ఇందిరమ్మఇళ్లకు  సబ్సిడీ ద్వారా సిమెంట్ సప్లయి.
·        కేంద్రంపై ఒత్తిడి చేసి ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషి.
·        అన్ని కులాలకు సమన్యాయం చేయడానికి ఎస్సీ వెల్ఫేర్ ద్వారా 3 ప్రత్యేక కార్పోరేషను ఏర్పాటు.
·        ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పకడ్బందిగా అమలు.
·        పెండింగ్ కేసులు అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు.  తో పాటు ఇంకా అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపడుతామని డాక్టర్ శ్రవణ్ దాసోజు మీడియా కు వివరించారు.

No comments:

Post a Comment