Wednesday 28 November 2018

మంచినీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వానికి ఓటడిగే హక్కు లేదన్న దాసోజు శ్రవణ్ కుమార్.

మంచినీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వానికి ఓటడిగే హక్కు లేదన్న దాసోజు శ్రవణ్ కుమార్.
ప్రాజెక్టుల పేరుతో  దండుకున్నారు.. టీఆర్ఎస్ నేతల పై దాసోజు ఆగ్రహం
జన బలం ముందు వారి ధన బలం నిలవదని...పీజేఆర్ ఆశయాలే ఆదర్శంగా పనిచేస్తానని వెల్లడి.
గుడి బడి  పేరు చెప్పి చింతల ప్రజల నెత్తిన శఠగోపం పెట్టారని ఆరోపణ.
రియల్ ఎస్టే ట్ వ్యాపారాల మీద ఉన్న శ్రద్ద నియోజకవర్గ అభివృద్ది పై లేదని విమర్శ.
దానం ధన బలంతో దౌర్జన్యాలు, దందాలు తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శ.
ఖైరతబాద్ లో ప్రజా కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన శ్రవణ్ ..
ఉర్ధూ కరపత్రాలను పంపిణీ చేసిన శ్రవణ్ దాసోజు





నాలుగున్నరేళ్లుగా యావత్ తెలంగాణాకు నీళ్లందిస్తామని కాలాయాపన చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదని ప్రజాకూటమి తరుఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఇవాళ ఖైరతాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిస్తీ వాడ, సప్తమాత, భోళాశంకర్ బస్తీ, అంబేధ్కర్ నగర్, తుమ్మల బస్తీ ప్రేమ్ నగర్, ఆనంద్ నగర్, ఎంఎస్ మక్తా తదితర బస్తీల్లో పాదయాత్ర, ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ పలు కాలనీల్లో దుస్థితికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన దానం నాగేందర్, తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలే కారణమన్నారు. ధన బలంతో కోట్లు పెట్టి ఓట్లు కొనుగోలు చేయొచ్చన్న దుర్మార్గపు ఆలోచనతో దానం ఉన్నారన్నారు. 
జన బలం ముందు వారి ధన బలం నిలవదని...పీజేఆర్ ఆశయాలే ఆదర్శంగా పనిచేస్తా.. దాసోజు.
దివంగత నేత పేదల పెన్నిధి పీజేఆర్ ఆశయాలే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తానని, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఉద్యగిగా తొలి మెట్టు వేసిన ఖైరతాబాద్ లో మళ్లీ 30 సంవత్సరాల  తర్వత కాకతాళీయంగా రాజకీయంగా మళ్లీ మొదటి అడుగు వేశానన్నారు.
జన బలం ముందు వారి ధన బలం నిలవదనే విషయాన్ని గమనించాలని కోరారు.
డబ్బులు పెట్టి ఓట్లు కొనుగోలు  చేసే నాయకులకు ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. ప్రజల డబ్బులతో వారిపైనే జులుం చలాయించడం ఇకపై చెల్లదన్నారు. ప్రజా బలంతో ఎదిగిన దివంగత నేత పీజేఆర్ ఆశయ సాధకుడిగా ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.
దందాల ,రియల్ ఎస్టే ట్ వ్యాపారాల మీద ఉన్న శ్రద్ద నియోజకవర్గ అభివృద్ది పై లేదన్న శ్రవణ్
2014 ఎన్నికల్లో  టీడీపీ సాయంతో గెలిచిన చింతల రామచంద్రారెడ్డి టీడీపీ  కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదని శ్రవణ్ విమర్శించారు. ఖైరతబాద్ నుంచి గెలిచిన  దానం, చింతల తమ వ్యాపార దృక్ఫతంతోనే రాజకీయాల్లోకి వచ్చారన్నారు.పేదల చెమట కష్టంతో కోట్లకు పడగలెత్తిన దానం,  బస్తీల అభివృద్దిని పట్టించుకోని చింతల రామచంద్రారెడ్డిలకు ఈ ఎన్నికలో కర్రు కాల్చి వాతపెట్టాలని  శ్రవణ్ పిలుపునిచ్చారు.
మంచినీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వానికి ఓటడిగే హక్కు లేదు...దాసోజు శ్రవణ్ కుమార్.
ఇంటింటికి మంచినీరు ఇవ్వకుండా ఓట్లు అడగబోమని ప్రకటించిన కేసీఆర్, కేటీఆర్ ఏం మొఖం పెట్టుకొని ఈ ఎన్నికలలో ఓట్లు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల ప్రణాళికతో హైద్రబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పిన టీఆర్ఎస్ నేతలు కమీషన్లతో తమ జేబులు నింపుకున్నారని ఆరోపించారు. టీఆర్ ఎస్ నేతలకు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి నెలకొంటే ర్యాలీల పేరిట పట్టణాల్లో తిరుగుతున్నారని విమర్శించారు.
గుడి బడి  పేరు చెప్పి చింతల ప్రజల నెత్తిన శఠగోపం పెట్టారని ఆరోపణ.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అండతో గెలిచిన చింతల రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఒక్కస్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను కూడా ఏర్పాటు  చేయలేకపోయారన్నారు. కేంద్రం ప్రభుత్వం కోట్లాది రూపాయలు స్కిల్ డెవలప్ మెంట్ కోసం విడుదల చేస్తుందని కాని ఏ ఒక్కనాడు యువత అభివృద్దికోసం చింతల పనిచేయలేదన్నారు. బస్తీల్లో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయలేదన్నారు. అలాగే రోడ్లు, నాలాల విషయంపై  ఏనాడూ జీహెచ్ ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన దాఖలాలు లేవన్నారు. ప్రత్యమ్నాయ రాజకీయ వారసుడిగా తనను ప్రజలు ఆదరిస్తున్నారని, పీజేఆర్ ఆశయ సాధనకు నిరంతర ప్రజా సేవ చేస్తామని హమీ చేశారు. ఖైరతబాద్ ను సమూల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోహిన్ రెడ్డి , నరికెల్ల నరేష్, టీడీపీ, సీపీఐ, నేతలు, కార్యకర్తలు, బస్తీ ల్లోని ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment