Thursday 29 November 2018

దందాలకు కాలం చెల్లింది.. డాక్టర్ శ్రవణ్ దాసోజు

దందాలకు కాలం చెల్లింది.. డాక్టర్ శ్రవణ్ దాసోజు
ప్రజా కూటమి గెలుపుతోనే సుఫరిపాలన
ఖైరతబాద్ అభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తా.. శ్రవణ్ దాసోజు
ప్రజలకు మౌలిక వసతులు కల్పించలేని దానం, చింతలకు ఓట్లు అడిగే హక్కు లేదు..
పీజేఆర్ ఆశయాలను కొనసాగిస్తా..




ఖైరతబాద్ నియోజకవర్గంలో దందాలు, దౌర్జన్యాలకు కాలం చెల్లిందని, ప్రజా కూటమి గెలుపుతో ప్రజలకు సుఫరిపాలన అందిస్తామని ప్రజా కూటమి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ఖైరతబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. ఎన్నికలోల భాగంగా నియోజకవర్గంలోని సోమాజిగూడ బస్తీ, పంజాగుట్ట మార్కెట్, జాఫర్ ఆలీ బాగ్, మాతా నగర్, దుర్గానగర్ కాలనీ, ఎర్రమంజిల్, ఆనంద్ నగర్, నవీన్ నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో కార్యకర్తలతో కలిసి  బైక్ ర్యాలీ, పాదయాత్రతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ దందాలు, దౌర్జన్యాలు చేసే వారికి ఖైరతబాద్ లో స్థానం లేకుండా చేస్తామని హెచ్చరించారు.
ప్రజా కూటమి గెలుపుతోనే సుఫరిపాలన
ప్రజా కూటమి గెలుపుతో రాష్ట్రంలో సుఫరిపాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఏర్పడితే బంగారు తెలంగాణగా అభివృద్ధి చేస్తామని అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ తన నియంత పాలనతో తన కుటుంబాన్ని బంగారు కుటుంబాన్ని చేసుకున్నాడని దుయ్యబట్టారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత నిరాశ నిస్రృహతో ఆందోళనకు గురవుతుంటే.. కేసీఆర్ కు  తన ఇంట్లో నాలుగు ఉద్యోగాలు లభించాయని విమర్శించారు.
అభివృద్ధి నిరోదులకు కర్రుకాల్చి వాతపెట్టాలి
        ఖైరతబాద్  అభివృద్ధి పేరుతో చింతల, దానం వందల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో దందాలు, దౌర్జన్యాలు, కబ్జాలు పెరుగాయని, సామాన్యులు జీవించలేని దుస్థితికి ఖైరతబాద్ లో కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు  ప్రజలను వంచించడానికి చింతల, దానం  మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని.. వారికి ఈ ఎన్నికలలో  కర్రు కాల్చి, వాతపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పీజేఆర్ ఆశయాలు కొనసాగిస్తా..








     పీజేఆర్ ఆశయాలు కొనసాగించడానికి  తనను ఆశీర్వదించి  గెలిపించాలని  ప్రజలకు విజ్నప్తి చేశారు. ప్రజల ఆదరణతో  ఖైరతబాద్ అభివృద్దికి సేవకుడిగా పనిచేసి, రాష్ర్టంలో మోడల్ నియోజకవర్గంలో ఖైరతబాద్ ను నిలబెడతానని హామీ చేశారు.  పీజేఆర్ ను కించపరిచే విధంగా వ్యవహరించిన దానం నాగెందర్ కు, ప్రజలను వంచించిన చింతలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ సీనియర్ నేత  బిఎన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత  మధుకర్ యాదవ్,  రోహిన్ రెడ్డి,  సిపిఐ నేత హరినాధ్ గౌడ్, నాయకులు నరేష్, జ్నానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారంలో దాసోజు కుటుంబ సభ్యులు..
ప్రజా కూటమి మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ  ఖైరతబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రవణ్ దాసోజు గెలుపుకు ఆయన కుటుంబ సభ్యులు గురుబ్రహ్మ కాలనీ, నవనిర్మాణ నగర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. విద్యాధికుడు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన పోరాడే డాక్టర్ శ్రవణ్ దాసోజు కు ఓటేయాలని కోరారు. తెలంగాణా ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని ప్రాణాలకు తెగించి కొట్లాడిన శ్రవణ్ ను భారీ మెజార్టీ తో గెలిపిస్తే దివంగత నేత పీజేఆర్  ను మరిపించేలా పేదల పక్షాన నిలబడి పోరాడుతాడన్నారు.

No comments:

Post a Comment