Thursday 29 November 2018

Health


 వైద్యరంగం


ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించటం నాణ్యమైన వైద్య సేవలందించడం ప్రభుత్వ కనీస ధర్మం. కానీ దురదృష్టవశాత్తూ వైద్యరంగం ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి వెళ్ళింది. తద్వారా వైద్యరంగం పెట్టుబడి వ్యాపారంగా మారి అడ్డూఅదుపూ లేని దోపిడీ వ్యవస్థగా మారింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కేసీఆర్ పాలనలో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లుగా ప్రభుత్వ వైద్యం భ్రష్టు పట్టిపోయింది. ప్రముఖ ఆసుపత్రిగా పేరొందిన గాంధీ ఆసుపత్రిలో ఒకే రోజు 20 మందికి పైగా పేషెంట్లు చనిపోయారంటే, వైద్యరంగ పతనావస్థకు నిదర్శనం. ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్ లాంటి ఆసుపత్రుల్లో కూడా క్వాలిఫైడ్ స్పెషలిస్టు డాక్టర్లు లేక, కేవలం 50 శాతం మంది నర్సింగ్ సిబ్బంది తో అరకొర వైద్య సదుపాయాలను అందిస్తున్నరు. 2014 ఎన్నికల కాలంలో కేసీఆర్ ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, నలుగురు డాక్టర్లతో మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రులు, ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఏరియా ఆసుపత్రులు నిర్మిస్తామని శుష్క వాగ్దానాలు చేసి ఓట్లు దండుకున్నరు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108, 104 పధకాలను నిర్వీర్యం చేసిన్రు. ఆ సంస్థలలో పనిచేస్తున్న సిబ్బందిని నానా ఇబ్బందులకు గురి చేసిన్రు. ఎక్కడ ఆక్సిడెంట్ జరిగితే అక్కడ కుయ్ కుయ్ మంటూ వచ్చి బాధితులకు ప్రాణ రక్షణ కల్పించిన 108 అంబులెన్సులను మెకానిక్ గ్యారేజీలకే పరిమితం చేసిన్రు. గిరిజన ప్రాంతాలలో హెలికాప్టర్ అంబులెన్స్ ప్రవేశపెడతానని తద్వారా అత్యవసర వైద్య సేవలు అందిస్తానని నమ్మబలికి మోసం చేసిన్రు.

2014 నుండి 2018 వరకు రూ.20,884 కోట్లు కేటాయించి, కేవలం రూ.13,463 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దాదాపు 36 శాతం నిధులను పక్కదారి పట్టించి వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేసిన్రు. తెలంగాణా ఉద్యమ కాలంలో అత్యంత కీలక పాత్ర పోషించిన డాక్టర్లను, నర్సులను విస్మరించి వారి కనీస హక్కులను కాలరాస్తూ వైద్య రంగాన్ని తెరాస ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. నాణ్యమైన వైద్య సేవలందిస్తూ, తెరాస ప్రభుత్వ హయాంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో నుండి ప్రజలను రక్షించేందుకు రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రమైన వైద్య విధానాన్ని రూపొందించి ఈ క్రింది ప్రణాళికను అమలు చేస్తుంది.

  1.  ఆరోగ్య శ్రీ పధకం కింద అన్ని రకాల వ్యాధులకు రూ.5 లక్షల వరకు వర్తింపు.
  2.  ప్రతి మండలానికి 20-30 పడకల ఆసుపత్రులను నిర్మిస్తం.
  3.  ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తం.
  4. ప్రతి జిల్లాలో నిమ్స్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తం.
  5. ఎర్రగడ్డలో ఉన్న చెస్ట్ హాస్పిటల్ పరిధిలో అధునాతనమైన వెయ్యి పడకల మెడికల్ కాలేజీని నిర్మిస్తం.
  6. ఉస్మానియా ఆసుపత్రి పక్కనే ఉన్న 12 ఎకరాల స్థలంలో కొత్త బిల్డింగులు కడతం. నిజాం వారసత్వ సంపదైన ఉస్మానియా ఆసుపత్రి బిల్డింగ్ ను కాపాడుకుంటం.
  7. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఎమర్జెన్సీ ట్రౌమా సెంటర్స్ ను ఏర్పాటు చేస్తం. వాటిలో CT స్కాన్/MRI వంటి సర్వీసులు ఉండేలా చర్యలు తీసుకుంటం.
  8. పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లిస్తం.
  9. 108/104 సర్వీసులను గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా సమర్ధవంతంగా నిర్వహిస్తం. అంబులెన్సులలో తప్పనిసరిగా క్వాలిఫైడ్ డాక్టర్లను నియమిస్తం. 108/104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తం. అర్హులైన వారిని రెగ్యులరైజ్ చేస్తం.
  10. నిలోఫర్ లాంటి ప్రసూతి మరియు పిల్లల దవాఖానాలు ప్రతీ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటుచేస్తం. వాటిలో అర్హులైన గైనకాలజిస్ట్, పీడియాట్రీషియన్, మత్తు డాక్టర్లను మరియు నర్సింగ్ సిబ్బందిని నియమిస్తం.
  11. ESI హాస్పిటల్స్ పటిష్ట పరిచి అసంఘటిత కార్మికులకు ఉచిత వైద్యం అందిస్తం.
  12. ప్రస్తుత మంజూరైన సెమీ అటానమస్ వైద్య టీచింగ్ కాలేజీలను (మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట్, ఆదిలాబాద్) ప్రభుత్వ కాలేజీలుగా మారుస్తం.
  13. ఆరోగ్య రంగం ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ రంగంలోని ఆస్పత్రులకు అధిక నిధులు కేటాయించి బలోపేతం చేసేందుకు కృషి చేస్తం.
  14. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన తెలంగాణా స్టేట్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSMIDC) ను రద్దు చేస్తూ ఆయా వైద్యశాలల సూపరింటెండెంట్స్ కు TSMIDC అధికారాలను బదలాయిస్తం.
  15. వైద్యశాలల పనితీరుపై మరియు వైద్య విభాగాలలో అవినీతిని అరికట్టేందుకు మెడికల్ విజిలెన్స్ ను ఏర్పాటు చేస్తం.
  16. సియాటికా వెన్నెముక బాధితులను ఆదుకుంటాం. వారికి ఆర్థిక సహాయం, బ్యాటరీ వీల్ చెయిర్స్, ట్రై సైకిల్స్ ఇస్తం. ఫిజియో తెరఫి ట్రీట్మెంట్ ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువస్తం.
  17. గ్రామీణ పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందించే ఏర్పాటు చేస్తం.
  18. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డెంటల్ హాస్పిటల్ ను నెలకొల్పి ప్రభుత్వ డెంటల్ డాక్టర్ల ఉద్యోగాలను భర్తీ చేస్తం. ప్రైవేటు డెంటల్ హాస్పిటల్స్ కు ట్రేడ్ లైసెన్స్ రుసుమును రద్దు చేస్తం. డెంటల్ ప్రభుత్వ ఉద్యోగాలను పెంచుతం. దంత చికిత్స వైద్యం చిన్న క్లినిక్స్ లో కూడా ఆరోగ్య శ్రీ ద్వారా వర్తింపజేస్తం.
  19. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డెంటల్) ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తం.
  20. RMP, PMP డాక్టర్స్ కు ప్రాథమిక చికిత్స (FIRST AID) చేయడానికి అర్హులైన వారికి 3 నెలల వొకేషనల్ లేదా ఇంటర్న్ షిప్ ద్వారా శిక్షణ ఇస్తూ శిక్షణ కాలంలో నెలకు రూ.3 వేల చొప్పున honorarium ఇస్తం. తదనంతరం ప్రతి సంవత్సరం RMP, PMP ఆధునిక వైద్య విధానాలపై అవగాహనా సదస్సులను నిర్వహిస్తం.
  21. గిరిజన ప్రాంతాలలో, తండాలలో PHC లలో వైద్య సదుపాయాలను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటం.
  22. కిడ్నీ పేషెంట్స్ కు ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ సెంటర్లలో సింగిల్ యూజ్ క్యాతటర్ వాడతం. అదే విధంగా డయాలసిస్ సెంటర్లలో విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తం. అంతే కాక, అక్యూట్ మరియు క్రానిక్ రోగులకు ఉచితంగా లేదా నామమాత్రపు ధరలకే మందులను అందజేస్తం. ప్రతీ డయాలసిస్ సెంటర్ లో  నెఫ్రాలజి స్పెషలిస్ట్ డాక్టర్లను నియమిస్తం.
  23. తెలంగాణా వ్యాప్తంగా అనేక వైద్యశాలలలో ఉన్న డాక్టర్లు మరియు పారా మెడికల్ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడం కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను చేపడతం.
  24. సివిల్ అసిస్టెంట్ సర్జెన్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో కొత్తగా నియమింపబడే డాక్టర్లకు కనీస జీతం నెలకు రూ.లక్షా యాభై వేలు ఇవ్వాలనే ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తం. అదే విధంగా అన్ని టీచింగ్ హాస్పిటల్లలో సూపర్ స్పెషలిటి సర్వీసులను అందరికీ అందుబాటులో ఉండే విధంగా నెలకు రూ.2 లక్షల కనీస జీతం ఇస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటం.
  25. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ స్టాఫ్ ను, క్లాస్ - 4 స్టాఫ్ ను MCI నార్మ్స్ ప్రకారం నియమిస్తం.
  26. నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రతీ ప్రభుత్వ వైద్యశాలలో అవసరమైన నర్సింగ్ సిబ్బందిని రిక్రూట్ చేసి, సీనియారిటీ మేరకు అర్హులైన నర్సింగ్ సిబ్బందికి అసిస్టెంట్ డాక్టర్స్ హోదాను కల్పిస్తం.
  27. కేన్సర్, డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ లాంటి జీవన శైలి వ్యాధుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి "స్పెషల్ డ్రైవ్"లు ఏర్పాటు చేస్తం.
  28. వరంగల్ లో ప్రభుత్వ కేన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తం.
  29. రెండు పెద్ద  మానసిక వికలాంగుల దవాఖానాలు ఏర్పాటుచేస్తం.
  30. ప్రతి జిల్లాకు ఒక "24 గంటలు" (అన్ని వేళలా) రక్త పరీక్ష, అల్ట్రా సౌండ్ పరీక్షలు నిర్వహించేలా డయాగ్నాస్టిక్ క్లినిక్ లు ఏర్పాటు చేస్తం. దాంతో పాటు బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసి వాటిలో నాణ్యమైన సేవలు అందించేలా మూడు షిఫ్టులలో పని చేసేందుకై తగిన సిబ్బందిని నియమిస్తం.
  31. ఔట్సొర్సింగ్ విధానాన్ని ఎత్తివేస్తూ నిబంధనలకు అనుగుణంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తం. ఉద్యోగస్థులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి, సమాన వేతనాన్ని వర్తింపచేస్తం.
  32. ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేస్తున్న తెలంగాణా నర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సమాన పనికి, సమాన వేతనాన్ని కల్పిస్తం.
  33. తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ కు 750 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించదానికి చర్యలు తీసుకుంటం.
  34.  ప్రైవేటు ఫార్మసీ ఉద్యోగులకు ESI, PF సౌకర్యాలు కల్పించే చర్యలు తీసుకుంటం.
  35. ఆరోగ్య వైద్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను నిబంధనల ప్రకారం వారి విద్యార్హతలలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రెగ్యులరైజ్ చేస్తం.
  36. డాక్టర్ల రిటైర్మెంట్ వయోపరిమితిని 65 సంవత్సరాలకు పెంచి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న డాక్టర్లకు ప్రమోషన్లు ఇస్తం.
  37. అన్ని ఆసుపత్రులలో  రోగి  మెడికల్ రికార్డు మాన్యువల్ (manual) గా చేయకుండా మొత్తం రోగి  రికార్డు ఎలక్ట్రానిక్/కంప్యూటరైజ్డ్ విధానం తెచ్చి అమలు చేస్తం.ఆసుపత్రులలో మరమ్మతులు లేక చాలా చోట్ల  వైద్య పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి, ప్రతి టీచింగ్ హాస్పిటల్లో Biomedical Engineer ఉద్యోగులను ఏర్పాటు చేస్తం.
  38. ప్రతి స్కూల్ లో వారానికి 5 రోజులు బాలబాలికలకు పాలు ఉచితంగా పంపిణీ చేయబడును. రైట్ టూ హెల్త్ అమలు చేస్తం.
  39. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విధిగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు తగు పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్య సలహాలు అవసరం మేరకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తం.
  40. ఐరన్ మరియు పౌష్టికాహార లోపం ఉన్న  గర్భిణీ స్త్రీలకు, బాలికలకు MILLET ఆధారిత PRE-COOCKED పొట్లాలు మరియు ఇతర విటమిన్ మందులు ప్రైమరీ హెల్త్ సెంటర్ల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తం.
  41. ఆయుర్వేద, యునాని మరియు హోమియో వైద్యశాలలను ప్రోత్సహిస్తం.
  42. సుప్రీం కోర్టు తీర్పులకనుగుణంగా ప్రభుత్వం కేటాయించిన భూములలో నిర్మింపబడిన ప్రైవేటు ఆసుపత్రులలో 25 శాతం పేదలకు ఔట్ పేషెంట్ (OPD) ట్రీట్మెంట్ మరియు 10 శాతం మంది పేదలకు ఇన్-పేషెంట్ (IPD) ట్రీట్మెంట్ ఉచితంగా అందజేసే విధంగా కఠిన చర్యలు చేపడతం.
  43. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేస్తం.
  44. పాము, తేలు, కుక్క కాటుకు మందులు ప్రతి పల్లెలో అందుబాటులో ఉంచుతం.


Health


It is the duty of the government to protect public health and provide standard medical services. It is highly regrettable that just like education segment, the entire health sector has gone into the hands of private parties. This has turned the noble profession into a commercial activity with common people being subjected to organised loot and exploitation.

After the formation of Telangana, KCR Government made several tall claims on improving medical services and kept the people in dark. The deteriorating condition of public health in Telangana can be guaged from fact that the mortality rate in famous Gandhi Hospital is more than 20 patients per day. There are not enough number of qualified doctors in Osmania, NIMS and Niloufer Hospitals. Medical services are being run with only 50% of the nursing staff.

In the 2014 elections, KCR had promised to set up a Superior Security Hospital at every district headquarter. He had also promised a 30-bedded hospital with 4 doctors at Mandal Headquarters and 100-bedded area hospital in each Assembly segment. He had also promised to introduce Helicopter Ambulance Services in Tribal areas. However, none of these promises have been fulfilled and proved hollow.

In the erstwhile united Andhra Pradesh, 108 and 104 ambulance services were introduced. Hundreds of lives were saved due to these services in the last so many years. But, due to the negligent attitude of TRS Government, 108 Ambulances are now parked in garages. The staff of these services is forced to live in penury.

The spending on public health by the TRS Government was quite pathetic and inhuman. Of Rs. 20,884 crore allocated from 2014-2018, only Rs. 13,463 Crore and a whopping 36% funds, meant for public health, were diverted for other purposes. Doctors, nurses and other medical staff, who played an active role in statehood movement, only faced disappointment under TRS rule. The standard medical services have hit an all time low.

The next Congress Government, will come up a comprehensive Public Health Policy to bring a much needed turn around by implementing the following promises:

1. Under Aarogyasri, free treatment up to Rs 5 Lakh will be provided for all diseases.
2. A 20-30 bedded hospital will be constructed in each mandal.
3. A 100-bedded hospital will be constructed in each Assembly segment.
4. In each district, a NIMS-level Super Speciality Hospital and medical college will be established.
5. The Chest Hospital at Erragadda will be upgraded to 1000-bedded hospital besides having a medical college.
6. Aarogyasri Scheme will be reviewed and it will be made more useful for the poor and deserving persons.
7. A new building for Osmania Hospital will be constructed on 12 acres of adjacent land. The old building of Nizam's Era will be preserved.
8. Emergency Trauma Centers will be set up on the outskirts of Hyderabad. These centres will have the facility of CT Scan/MRI.
9. All dues of Aarogyasri Scheme will be cleared.
10. The emergency 108 and 104 ambulance services will be restored as they were in the past. Qualified doctors will be deployed for ambulance. The problems being faced by 108 and 104 employees will be solved and the services of eligible qualified persons will be regularised.
11. Maternity and Children hospital like Niloufer Hospital will be started in all Assembly segments. Gynaecologist, Paediatricians, Anaesthesiologist and specialists will be appointed besides deputing nursing staff.
12. ESI Hospitals will be upgraded and employees, workers and labourers of unorganized sector will be provided free treatment.
13. Semi-autonomous medical colleges, located in Mahabubnagar, Siddipet, Nalgonda, Suryapet and Adilabad, will be converted into medical colleges.
14. In order to prevent privatisation of health sector, the government hospitals will be allocated more funds to improve the services.
15. Telangana State Medical Infrastructure Development Corporation (TSMIDC), which has become a synonym for irregularities, will be scrapped. The Superintendents of hospitals will be given the powers which are now being executed by TSMIDC.
16. Medical Vigilance Wing will be set up to check corruption and irregularities in teaching and non-teaching hospitals.
17. Patients suffering from spinal cord diseases will be given financial assistance. They will also be given battery wheelchair, tri-cycle. Physiotherapy will be brought under the purview of Aarogyasri.
18. Steps will be taken to provide nutritional food to children and pregnant women in rural areas.
19. A governmental dental hospital will be set up in each Assembly constituency and dental doctors will be recruited. Trade License Fee will be cancelled for private dental hospitals. Posts in governmental dental hospitals will be increased. Small dental clinics will also be brought in the purview of Aarogyasri. Subsidy will be given for purchase of Dental equipment and dentists will be provided interest-free loan.
20. Directorate of Medical Education (Dental) will be specially established.
21. Eligible RMP and PMP doctors will be given three month vocational training or internship in First Aid. They will be paid a monthly honorarium of Rs. 3,000. Annual sessions will be conducted to enlighten RMP and PMP on modern medicine.
22. Steps will be taken to improve medical facilities in PHCs located Tribal areas and Tandas.
23. For kidney patients, under Aarogyasri, single use catheter will be used at Dialysis Centres. For critically ill patients, medicines will be provided at free of cost or at nominal rates. A Nephrologist will be appointed in every Dialysis Centre.
24. Special recruitment drive will be taken up to fill vacant posts of doctors and para-medical staff in government hospitals across Telangana State.
25. The proposal to give Civil Assistant Surgeons and Assistant Professors a minimum monthly pay of Rs. 1.5 Lakh  will be considered.
26. Doctor, Nurses, Para Medical Staff, Class-IV staff will be appointed according to MCI's rules and regulations.
27. Required nursing staff will be appointed in all government hospitals as per the norms of Nursing Council. Eligible staff will be appointed as Assistant Doctors on the basis of seniority.
28. Special awareness campaign will be launched on life-threatening diseases such as cancer, diabetes and blood pressure.
29. A Government Cancer Hospital will be established in Warangal.
30. Two major hospitals will be established for patients with mental disabilities.
31. A 24-hour blood testing lab and ultra-sound diagnostic clinics will be set up in every district. Apart from this, blood banks will be a set up by deploying staff to work in three shifts.
32. Outsourcing Policy will be completely scrapped and all contract employees will be regularised as per the rules. They will be paid salaries as per the directives of Supreme Court verdict.
33. Nursing Staff working in private hospitals will be given job security. They will be ensured salaries on Equal Pay for Equal Work basis. They will also get PF, ESI and duty uniform.
34. Steps will be taken to clear Rs. 750 crore dues to the Telangana Network Hospitals Association.
35. Steps will be taken to provide ESI and PF facility to employees of private pharmacies.
36. The service of contract employees working in different health sectors will be regularised as per the rules and their academic qualifications.
37. The doctors' retirement will be increased to 65 years. Government Doctors will be given promotion.
38. A Medical Card Manual will be introduced for all patients so as to digitise the medical records of a patient.
39. Several medical devices in hospitals have been lying unused pending repairs. a Bio-Medical Engineer will be appointed in every teaching hospital. These engineers will repair medical devices and make them re-usable.
40. Children studying in all government schools will be provided milk for five days in a week. Right to Health will be implemented.
41. In each public school, besides conducting medical check-ups, students will also be given free medicines.
42. Pregnant women and girls facing deficiencies of iron and nutrition will be provided pre-cooked Millet packets and other vitamin supplements at free of cost through the primary health centers.
43. Ayurveda, Unani and Homeo hospitals will be promoted.
44. As per an order of Supreme Court, it is mandatory for private hospitals, built on land allocated by the government on concessional rates, to provide 10 per cent treatment to In Patient Department (IPD) and 25 per cent to Out Patient Department (OPD) for free. Steps will be taken to strictly implement these orders.
45. Facility of free medical examinations will be made available at all Primary Health Centres.
46. Medicines to treat snake, scorpion and dog bites will be made available in every village.

Prof. Sravan Dasoju
MLA Contestant, Khairatabad Assembly Constituency
Convenor, Election Campaign Committee,
Telangana Pradesh Congress Committee.

No comments:

Post a Comment