Saturday 13 April 2019

పోలీస్‌ నియామక ప్రక్రియలో, లోపాల్ని బట్టబయలు చేసిన :ఆలిండియా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌


Ø పోలీస్‌ నియామకాల్లో భారీగా అక్రమాలు
Ø టీఎస్‌పీఆర్‌బీలో భారీ కుంభకోణం
Ø నియామక ప్రక్రియ లోపాల్ని బట్టబయలు చేసిన శ్రవణ్‌
Ø అర్హులైన అభ్యర్థులకు తీరని అన్యాయం
Ø ఉన్నత స్థాయి దర్యాప్తునకు కాంగ్రెస్‌ డిమాండ్‌



హైదరాబాద్, ఏప్రిల్13: పోలీస్కానిస్టేబుళ్లు, సబ్ఇన్స్పెక్టర్ల నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో కుంభకోణం జరిగిందని ఆలిండియా కాంగ్రెస్పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్దాసోజు శ్రవణ్ఆరోపించారు. వాటి భర్తీని సజావుగా జరపాల్సిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్రిక్రూట్మెంట్బోర్డు (టీఎస్పీఆర్బీ) అనుసరించిన తీరుపై ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. బాగోతంపై ఉన్న స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన కేసీఆర్ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. 
గాంధీభవన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్శ్రవణ్మాట్లాడుతూ, పోలీస్రిక్రూట్మెంట్బోర్డు ద్వారా 18,435 కానిస్టేబుల్పోస్టుల భర్తీతోపాటు సబ్ఇన్స్పెక్టర్ఇతర పోస్టుల భర్తీకి అయిదు ప్రత్యేక నోటిఫికేషన్లు వెలువరించారని, ఒకో దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయల చొప్పున 7,19,840 దరఖాస్తులు వచ్చాయన్నారు. అయితే దరఖాస్తుదారులకు శాస్త్రీయ విధానంలో సమర్ధంగా పరీక్షలు నిర్వహించడంలో బోర్డు ఘోరంగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. 
మొత్తం 2,24,741 మంది అభ్యర్థులు శరీరదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారని, వారిలో 1,17,660 మందిని అర్హులుగా పోలీస్రిక్రూట్మెంట్బోర్డు తేల్చిందని, ఒక నిర్ధిష్ట విధానం లేదా శాస్త్రీయ పద్ధతి లేకుండా ఎంపిక ప్రక్రియను అనుసరించారని డాక్టర్దాసోజు శ్రవణ్విమర్శించారు. పోలీస్రిక్రూట్మెంట్బోర్డు తొలిసారిగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్ఎఫ్ఐడి) ట్యాగ్స్ద్వారా అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించారని, కానిస్టేబుళ్లు, సబ్ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి వచ్చిన అభ్యర్థులకు నిర్వహించిన ఫిజికల్ఫిట్నెస్టెస్ట్కు వినియోగించిన ఆర్ఎఫ్ఐడి ఒక ప్రైవేట్ఏజెన్సీ సాఫ్ట్నియంత్రణలో ఉందనే విషయాన్ని డాక్టర్దాసోజు శ్రవణ్బట్టబయలు చేశారు. ఆర్ఎఫ్ఐడి ట్యాగ్వినియోగం వల్ల వేలాది మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఎంతోమందికి ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వేరువేరు పోస్టులకు అయిదు వేరువేరు నోటిఫికేషన్లు జారీ చేసిన బోర్డు... కానిస్టేబుల్‌/సబ్ఇన్స్పెక్టర్వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ మూకుమ్మడిగా ఒకేసారి ఫిజికల్టెస్ట్లు నిర్వహించారని, ఎలాంటి వ్యవధి లేకుండానే పరీక్షలు నిర్వహించారని, ఆయా పోస్టులకు వేరువేరుగా నిర్వహించపోవడమే కాకుండా సగటు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి సగటు వయసును కూడా పరిగణనలోకి తీసుకోలేదని డాక్టర్శ్రవణ్తీవ్రంగా తప్పుపట్టారు. 
ఎనిమిది వందల మీటర్లు (400/2) అర్హత సమయం 170 సెకన్లు, నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్పై ఒకేసారి 50–60 మంది అభ్యర్థులతో పరుగులు తీయించారని, దీని వల్ల అభ్యర్థులు సజావుగా పరుగుపెట్టలేకపోయారని, తప్పుడు విధానం ద్వారా పరుగు పోటీ నిర్వహించారని, దీని వల్ల ఎంతోమంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని ఆయన చెప్పారు. విధానం వల్ల అభ్యర్థి నాలుగైదు సెకన్ల సమయాన్ని నష్టపోయారని, దీని వల్ల ఫలితమే తారుమారు అవుతుందన్నారు. ఆర్ఎఫ్ఐడీ విధానం ద్వారా అభ్యర్థులకు పరుగు పోటీ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొనలేదని ఆయన తప్పుపట్టారు. ఒలింపిక్వంటి ప్రతిష్టాత్మక పోటీల్లో సైతం మిల్లీ నానో సెకన్సమయాన్ని కూడా వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని, అయితే తెలంగాణ సర్కార్పోలీస్రిక్రూట్మెంట్లో ఆర్ఎఫ్ఐడి విధాన ంలో అభ్యర్థులు నష్టపోయేలా అశాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ద్వారా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని డాక్టర్శ్రవణ్మండిపడ్డారు. ఆర్ఎఫ్ఐడి విధానం ఎలా మొదలు అవుతుందో.. ఎలా ముగుస్తుందో తెలియని గందరగోళ పరిస్థితిలో పరుగు పోటీ నిర్వహించారని, చివరికి అభ్యర్థుల ఎంపిక అనుకున్న వారినే చేశారని ఆయన ఆరోపించారు. కొన్ని సెంటర్లల్లో విజిల్వేసి పరుగు పోటీ ప్రారంభించారని, అయితే చివరికి ముగింపు మాత్రం ఆర్ఎఫ్ఐడి చేతుల్లోనే ఉందన్నారు. 
మంత్రి రజిత 2016 రిక్రూట్మెంట్కు హాజరైందని, మెయిన్కు కూడా ఎంపిక అయ్యిందని, అదే వ్యక్తి 2018లో దరఖాస్తు చేసుకుంటే ఎత్తు లేదని చెప్పి (ఒక అంగుళం తక్కువగా ఉందని చెప్పి) అనర్హురాలిగా ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆయన ఉదహరించారు. 2016లో మెయిన్కూడా అర్హత సాధించిన అభ్యర్థిని 2018 పరీక్షల్లో ఎలా అనర్హురాలు అవుతారో అర్ధం కావడం లేదని, ఒక్క కేసును చూస్తే చాలు పోలీస్రిక్రూట్మెంట్లో అక్రమాలు ఏవిధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చునన్నారు. 
నిఖిల్రాజ్ఎత్తు 168 సెంటీమీటర్లని, అర్హతల్లో ఎత్తు 167.8 సెంటీమీటర్లని, అయితే ఆర్ఎఫ్ఐడి విధానంలో అతని ఎత్తు 172.5గా చూపిందని డాక్టర్శ్రవణ్మరో ఉదాహరణ చెప్పారు. రిక్రూట్మెంట్ఎంపిక విధానం లోపభూయిష్టంగా ఉందని, ముఖ్యంగా సంగారెడ్డి, నల్లగొండ ఎంపిక కేంద్రాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, వంద మీటర్ల బిగినింగ్పాయింట్ను ముగింపునకు వచ్చే సరికి సెన్సర్బేస్అమలు చేశారని, ఇలాంటి అనేక మంది ఎంపిక విధానంలో తీవ్రంగా నష్టపోయినట్లుగా ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 
ఆర్ఎఫ్ఐడి విధానం వల్ల లక్షల మంది అర్హులైన అభ్యర్థులు దారుణంగా నష్టపోయారని, పోలీస్రిక్రూట్మెంట్బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయని, బోర్డు చైర్మన్శ్రీనివాస్రావు ఫిర్యాదుదారులైన బాధిత అభ్యర్థులను మార్చి 28, 29 తేదీల్లో స్వయంగా పలిపించుకున్నారని, అయిదు వేల మందికిపైగా అభ్యర్థులు వెడితే వారిని లోపలికి కూడా అనుమతించలేదని డాక్టర్శ్రవణ్విమర్శించారు. 
పోలీస్రిక్రూట్మెంట్లో జరిగిన ఈబోగాతాలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని, అభ్యర్థులందరికీ తిరిగి పరీక్షలు నిర్వహించాలని డాక్టర్శ్రవణ్తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని ఆయన ప్రకటించారు. 

అంబేద్కర్విగ్రహ కూల్చివేతను ఖండించిన కాంగ్రెస్  
పంజాగుట్ట ఏరియాలో డాక్టర్బీఆర్అంబేద్కర్విగ్రహాన్ని జీహెచ్ఎంసీ కూల్చివేయడాన్ని కాంగ్రెస్పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని డాక్టర్శ్రవణ్ప్రకటించారు. జైభీమ్సొసైటీ 9 అడుగుల అంబేద్కర్విగ్రహ ఏర్పాటుకు అనుమతి తీసుకుందని, అంబేద్కర్జయంతి ఏప్రిల్14 సందర్భంగా ప్రారంభించేందుకు అనుమతి కోరిందని, పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ విగ్రహాన్ని కూల్చివేయడం దారుణమని ఆయన అన్నారు. కూల్చిన విగ్రహాన్ని జవహర్నగర్డంపింగ్యార్డ్దగ్గర పడేయడం, చర్యకు నిరసన తెలిపిన వారిపై లాఠీలు ప్రయోగించడం దారణమని శ్రవణ్తీవ్రంగా ఖండించారు.
అంబేద్కర్విగ్రహాన్ని కూల్చివేయడంపై ముఖ్యమంత్రి కల్లకుంట్ల ంద్రశేఖర్రావు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్నాయకులు డిమాండ్చేశారు. 


No comments:

Post a Comment