Tuesday 27 November 2018

అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే ....మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే ....మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

ఖైరతాబాద్ ప్రజాకూటమి అభ్యర్ధి డాక్టర్  శ్రవణ్ దాసోజు ఎన్నికల ప్రచాంరంలో భాగంగా ముఖ్య అతిధి గా హాజరయిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు,  సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్,  హిమాయత్ నగర్, వెంకటేశ్వర స్వామి దేవస్ధానం వద్ద  బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయ బోతున్నామన్నారు. ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని టీఆర్ ఎస్ బీజేపీ పార్టీలకు ఓటేయిద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కు ఓటేసినా అది బీజెపి కి వేసినట్టేనన్నారు. డబుల్ బెడ్రూం. మూడెకరాల భూమి. దళితుడే ముఖ్యమంత్రి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు లాంటి ఏ ఒక్క హామీ ని నెరవేర్చలేదన్నారు.  నగరాన్ని డల్లాస్ చేస్తానని, ఉస్మానియా, గాంధీ,నీలోఫర్  ఆసుపత్రులన్ని శిధిలావస్థలో ఉన్నాయని వాటిని పట్టించుకోకుండా  వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. మెట్రో రైల్, కృష్ణా జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, హైదరాబాద్ ను అభివృద్ధి పరిచింది తామేనని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. గుంతల కనిపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తామన్న టీఆర్ఎస్ నేతలకు, తాము ఛాలెంజ్ చేసి చెబుతున్నామని గుంతలు లేకుంటే లక్ష రూపాయలు చెల్లిస్తామని సవాల్ స్వీకరించే దమ్ముందా అని ప్రశ్నించారు. చాలా కాలనీలు వర్షం వస్తే చెరువులు తలపిస్తున్నాయన్నారు. మూసినదిని సుందరంగా తీర్చిదిద్దుతానని మురికి కూపంగా మార్చారన్నారు. హైదరాబాద్ ను నందనవనం, బృందావనం చేస్తానని నాలుగేళ్ల మూడు నెలలకే పాలన చేతకాక చేతులెత్తేశాడని ఎద్దేవా చేశారు. ఏనాడు సెక్రటేరియట్ కు రాని ముఖ్యమంత్రి డెవలప్ మెంట్ అంతా ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ వరకు చేసుకున్నారని ఆరోపించారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రజాసమస్యల కోసం తపించే డాక్టర్ శ్రవణ్ దాసోజు ను గెలిపించాలని విజ్నప్తి చేశారు.. ఖైరతాబాద్ ప్రజాకూటమి అభ్యర్ధి డాక్టర్  శ్రవణ్ దాసోజు ఎన్నికల ప్రచాంరంలో భాగంగా ముఖ్య అతిధి గా హాజరయిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు,  సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్,  హిమాయత్ నగర్, వెంకటేశ్వర స్వామి దేవస్ధానం వద్ద  బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయ బోతున్నామన్నారు. ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని టీఆర్ ఎస్ బీజేపీ పార్టీలకు ఓటేయిద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కు ఓటేసినా అది బీజెపి కి వేసినట్టేనన్నారు. డబుల్ బెడ్రూం. మూడెకరాల భూమి. దళితుడే ముఖ్యమంత్రి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు లాంటి ఏ ఒక్క హామీ ని నెరవేర్చలేదన్నారు.  నగరాన్ని డల్లాస్ చేస్తానని, ఉస్మానియా, గాంధీ,నీలోఫర్  ఆసుపత్రులన్ని శిధిలావస్థలో ఉన్నాయని వాటిని పట్టించుకోకుండా  వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. మెట్రో రైల్, కృష్ణా జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, హైదరాబాద్ ను అభివృద్ధి పరిచింది తామేనని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. గుంతల కనిపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తామన్న టీఆర్ఎస్ నేతలకు, తాము ఛాలెంజ్ చేసి చెబుతున్నామని గుంతలు లేకుంటే లక్ష రూపాయలు చెల్లిస్తామని సవాల్ స్వీకరించే దమ్ముందా అని ప్రశ్నించారు. చాలా కాలనీలు వర్షం వస్తే చెరువులు తలపిస్తున్నాయన్నారు. మూసినదిని సుందరంగా తీర్చిదిద్దుతానని మురికి కూపంగా మార్చారన్నారు. హైదరాబాద్ ను నందనవనం, బృందావనం చేస్తానని నాలుగేళ్ల మూడు నెలలకే పాలన చేతకాక చేతులెత్తేశాడని ఎద్దేవా చేశారు. ఏనాడు సెక్రటేరియట్ కు రాని ముఖ్యమంత్రి డెవలప్ మెంట్ అంతా ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ వరకు చేసుకున్నారని ఆరోపించారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రజాసమస్యల కోసం తపించే డాక్టర్ శ్రవణ్ దాసోజు ను గెలిపించాలని విజ్నప్తి చేశారు.. 

No comments:

Post a Comment