Tuesday 27 November 2018

కేటీఆర్, దానం నాగేందర్ లు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తున్నారని సూటి ప్రశ్న:శ్రవణ్ దాసోజు

నాలుగున్నరేళ్లు గుడ్డిగుర్రం పళ్లు తోమారా.. శ్రవణ్ దాసోజు
కేటీఆర్, దానం నాగేందర్ లు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తున్నారని సూటి ప్రశ్న.
హామీలు నెరవేర్చని నాయకులకు కర్రుగాల్చి వాత పెట్టాలని ప్రజలకు పిలుపు.
ఒక్క సారి అవకాశం ఇవ్వండి... పీజేఆర్ ఆశయాలు కోసం పనిచేస్తానని  వెల్లడి.
మీర్ ఉస్మాన్ అలీఖాన్ సమాధివద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసిన శ్రవణ్.
ఉస్మాన్ అలీఖాన్ స్పూర్తితో ఖైరతాబాద్ అభివృద్దికి కృషి చేస్తా.. శ్రవణ్ దాసోజు





ఖైరతాబాద్ ఎన్నికల  ప్రచారంలో భాగంగా ప్రజాకూటమి తరఫున పోటీచేస్తున్నకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రవణ్ దాసోజు హిమాయత్ నగర్, నారాయణగూడ, హైదర్ గూడ, కింగ్ కోఠి, బషీర్ బాగ్, గాంధీకుటీర్, షేర్ గేట్ తదితర ప్రాంతాల్లో పెద్ద యెత్తున కాంగ్రెస్ టీడిపి, సిపిఐ కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ, పాదయాత్ర కొనసాగించారు. ముందుగా హిమాయత్ నగర్ లోని వెంకటేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రవణ్ అనంతరం కింగ్ కోఠిలోని మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ సమాధిని సందర్శించారు. నాలుగున్నర ఏళ్లుగా నియంత పాలన కొనసాగించిన టీఆర్ఎస్ పార్టీ నేతలు తగుదునమ్మా అంటూ  ఈ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు  చిల్లర మాటలతో  ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకోడానికి మోసగించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏప్రిల్ లో  డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేస్తామని ప్రకటన చేస్తున్న మంత్రి కేటీఆర్... నాలుగున్నర ఏళ్ల కాలంలో గుడ్డి గుర్రం పళ్లు తోమారా.. హైద్రాబాద్ పార్కుల్లో గడ్డి పీకారా.. అని డాక్టర్ శ్రవణ్ దాసోజు  ఘాటుగా వ్యాఖ్యానించారు. వచ్చేది ఏ ప్రభుత్వమో తెలియక ముందే ఏప్రిల్ నెలలో ఎలా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తారో చెప్పాలన్నారు. ఎల్లకాలం ఎవరిని మోసగించలేరన్నారు. ప్రజలు వారి మాటలు నమ్మి ఐదేళ్ల కాలం అవకాశమిస్తే.. 2 లక్షల ఇళ్లు నిర్మాస్తామని హామీ చేసి నాలుగున్నరేళ్లలో గడిచిన నాలుగున్నరేళ్లలో కనీసం 20 వేల ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు.  మోసపూరిత మాటలు చెప్పి మోసగించిన టీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, దానం నాగేందర్ ల మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.  టీఆర్ ఎస్ పార్టీ నేతలకు ఈ ఎన్నికల్లో ప్రజలే కర్రుగాల్చి వాతపెడుతారన్నారు.
మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ స్ఫూర్తితో ఖైరతాబాద్ అభివృద్ధి చేస్తా.. డాక్టర్ శ్రవణ్ దాసోజు
మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేశానని డంబాలు పలుకుతున్నారని, నిజానికి ఖైరతాబాద్ నిర్మాత మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ హాయాంలో జరిగిన అభివృద్ది తప్పకొత్తగా జరిగిన అభివృద్దేం లేదని శ్రవణ్ ఆరోపించారు. హైద్రాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని ప్రకటించి, గుంతల నగరంగా తీర్చిద్దిన ఘనడు కేటీఆరేనని ఎద్దేవా చేశారు. ఉస్మాన్ ఆలీఖాన్ స్ఫూర్తితో ప్రజలకు సుఫరిపాలన అందిస్తానని శ్రవణ్ దాసోజు ప్రజలకు హామీ ఇచ్చారు.  
ఒక్క సారి అవకాశం ఇవ్వండి... పీజేఆర్ ఆశయాలు నెరవేరుస్తా...శ్రవణ్ దాసోజు
దివంగత నేత, పేదల పెన్నిధి  పీజేఆర్ ఆశయాలు నెరవేర్చేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని శ్రవణ్ అభ్యర్థించారు. పీజేఆర్ హయాంలోనే ఖైరతబాద్ డివిజన్ లో పేదలకు  బస్తీలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. కాని బస్తీల అభివృద్ధిని దానం, చింతల నిర్లక్ష్యం చేశారన్నారు. బస్తీల్లోని ప్రజలు నిత్యం సమస్యలతో కాలం వెళ్లదీస్తున్నారని నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలు దుర్భర పరిస్థితులు గడపాల్సి రావడం దురదృష్టకరమన్నారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రజల ఆశలను, పీజేఆర్ ఆశయాలను నెరవేరుస్తాననని శ్రవణ్ హామీ ఇచ్చారు. బైక్ ర్యాలీ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ దాసోజు వెంట, సికింద్రాబాద్ మాజీ ఎంపీ, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు అంజన్ కుమార్ యాదవ్, సిపిఐ నేత హరినాధ్ గౌడ్, ఓయూ జేయేసీ నేత కురువ విజయ్ కుమార్ ఇందిరా మేడం మరియు పెద్దయెత్తున సిపిఐ, టిపిపి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment