Monday 26 November 2018

మిషన్ భగీరధ మంచినీళ్లివ్వక పోతే ఓట్లడుగనన్న కేసీఆర్, కేటీఆర్ లు ఏముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లడుగుతున్నరో చెప్పాలని డిమాండ్: శ్రవణ్


మిషన్ భగీరధ మంచినీళ్లివ్వక పోతే ఓట్లడుగనన్న కేసీఆర్, కేటీఆర్ లు ఏముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లడుగుతున్నరో చెప్పాలని డిమాండ్ : శ్రవణ్.

బస్తీలో పుట్టిన దానం నాగేందర్ కోట్లకు ఎదిగి.... అభివృద్దిని గాలికొదిలేశారని విమర్శించిన ..శ్రవణ్

బస్తీల ఓట్లను కొల్లగొట్టి నియోజకవర్గ అభివృద్దిని మరిచిన చింతల.

ఎరవేసి చేపలు పట్టినట్లు డబ్బుల ఆశచూపి అమాయకులను మోసగిస్తున్న దానం..

బస్తీల్లో దుస్థితికి దానం, చింతల రామచంద్రారెడ్డిలే కారణమన్న శ్రవణ్.

వెంకటేశ్వర డివిజన్ లో ఇంటింటి ప్రచారం, పాదయాత్రల్లో పాల్గొన్నకాంగ్రెస్,టీడిపి, సిపిఐ నేతలు కార్యకర్తలు.







బస్తీల్లో పెరిగిన దానం నాగేందర్  బస్తీవాసుల కష్టార్జితం పై కోట్లకు ఎదిగాడని, తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్లు వారి సంక్షేమాన్ని మరిచిపోయారన్న ఖైరతాబాద్ ప్రజాకూటమి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. ఇవాళ వెంకటేశ్వరా డివిజన్ లోని బస్తీల్లో ఎన్నికల ప్రచారం చేసిన శ్రవణ్ రోడ్లు, నీటిసరఫరా దుస్థితి పై ధ్వజమెత్తారు. పేదలు నివసించే బస్తీల అభివృద్ది ని మరిచారని వారి కష్టార్జితం పై వేల కోట్లు సంపాదించుకుని కులుకుతున్నారన్నారు. బస్తీల్లో అధ్వాన్నంగా మారిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, అస్తవ్యస్తంగా మారిన నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా మరిచిపోయారన్నారు.

చింతల రామచంద్రారెడ్డి చేసిన అభివృద్ది శూన్యం

ఖైరతాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ది చేయకుండా చిన్న చిన్న తాయిలాలతో కాలం వెళ్లదీసారని, వేలాదిమంది నిరుద్యోగ యువత ఉన్న బస్తీల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి ఉపాధి అవకాశాలు చూపకుండా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డారన్నారు.  తనను మాటిమాటికి నాన్ లోకల్  అంటున్న నేతలు లోకల్ అయ్యుండి చేసిన అభివృద్ది పనులేంటో బహిరంగా చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు.








నీళ్లివ్వకపోతే ఓట్లడుగనన్న పెద్దమనిషి ఏముఖం పెట్టుకుని మళ్లీ వస్తున్నారంటు ధ్వజం

మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళివ్వక పోతే ఓట్లు అడుగనన్న పెద్దమనిషి మళ్లీ ఏం ముఖం పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ వందరోజుల ప్రణాళిక పేరిట జీహెచ్ ఎంసీ ఎన్నికల ముందు హంగామా చేశారని, ఓట్లేయించుకున్నాక ఆవిషయాన్నే మరిచారన్నరు. తండ్రి కొడుకులు అబద్దాలు మాట్లాడడంలో దిట్టలని వీరి మాటలు విని మోసపోవద్దని కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని విజ్నప్తి చేశారు. బస్తీల్లో కనీస వసతుల కల్పన లో చింతల రామచంద్రారెడ్డి వైఫల్యం స్ఫష్టంగా కనిపిస్తోందన్నారు. ఏ బస్తీలో చూసినా అడ్డదిడ్డంగా పారుతున్న మోరీలు, చెత్తా చెదారంతో కునారిల్లుతున్నాయన్నారు. మిత్తీల దందా నిర్వహించే చింతల, భూదందాలతో కోట్లు దండుకున్న దానం ఇద్దరూ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. పీజేఆర్ హయాంలో బస్తీల్లో చేసిన అభివృద్ది, ఇచ్చిన పట్టాలు మినహా కొత్త అభివృద్దేం లేదన్నారు.

ఇంటింటి ప్రచారంలో డాక్టర్ శ్రవణ్ దాసోజు

వెంకటేశ్వర డివిజన్ లో ఇంటింటి పాదయాత్ర చేసిన డాక్టర్ శ్రవణ్ గడపగడపకు వెళ్లి తనకు ఓటేయాలని అభ్యర్ధించారు. తనను ఓటేసి గెలిపిస్తే అన్నగా, బిడ్డగా తోడుంటానన్నారు. తన తొలిఅడుగు ఖైరతాబాద్ లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలోనే పడిందని, ఇవాళ మళ్లీ రాజకీయ తొలి అడుగు ఖైరతాబాద్ లోనే పడడం కాకతాళీయంగా జరిగిందన్నారు. తనను గెలిపిస్తే బస్తీల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. ముస్లీంలకుషాదీ ముబారక్ ద్వారా ఆర్ధిక సాయం సకాలంలో అందేలా చేస్తానన్నారు. హైదరాబాద్ కు తలమానికం గా ఉన్నఖైరతాబాద్ నియోజకవర్గం లో ఇంకా స్లమ్ లు ఉండడం భాదాకరమన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతంలో ఓపెన్ నాలాలు, ఇరుకైన రహదారులున్నాయన్నారు. నాయకులకు చిత్తశుద్ది ఉంటే ఇవన్నీ తీర్చలేని సమస్యలేం కావన్నారు.  జీహెచ్ ఎంసీలో వేలకోట్ల రూపాయలున్నా ఏనాడు ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించలేదన్నారు. ప్రచారంలో విస్రృతంగా పర్యటిస్తున్న శ్రవణ్ దాసోజుకు మహిళలు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదిస్తూ శ్రవణ్ దాసోజు పాదయాత్రలో పాల్గొన్నారు. శ్రవణ్ దాసోజు వెంట స్ధానిక నేతలతో పాటు మాజీ మేయర్ బండకార్తీక రెడ్డి, టిడిపి నేత బీఎన్ రెడ్డి, సిపిఐ నేత హరినాధ్ గౌడ్, తదితర నేతలు కార్యకర్తలు, ప్రజలు భారీ యెత్తున పాల్గొన్నారు.

No comments:

Post a Comment