Saturday 24 November 2018

యూత్ ఫుల్ సినిమా పాట ను తలపించే కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాప్ సాంగ్ ను రూపొందించిన డాక్టర్ శ్రవణ్ దాసోజు..


యూత్ ఫుల్ సినిమా పాట ను తలపించే కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాప్ సాంగ్ ను రూపొందించిన డాక్టర్ శ్రవణ్ దాసోజు..
వీడియో సాంగ్ ఆవిష్కరించిన  ఏఐసిసి మీడియా ఇంఛార్జి రణదీప్ సింగ్  సూర్జెవాలా, ఏఐసిసి ఇంఛార్జి ఆర్ సి కుంతియా. రాజ్యసభ మెంబర్ నసీర్ హుస్సేన్


తెలంగాణలో నాలుగున్నర ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగడుతూ ఆధునిక టెక్నాలజీ ద్వారా డాక్టర్ శ్రవణ్ దాసోజు రూపొందించిన కాంగ్రెస్ ప్రచార వీడియో పాటలను ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ ఆవరణలో ఏఐసిసి మీడియా ఇంఛార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా , తెలంగాణా ఇంచార్జ్ ఆర్ సి కుంతియా ఆవిష్కరించారు. ఏడబాయెరో..ఏడబాయెరో అంటూ, రాప్ సాంగ్ ను తలపిస్తూ రాసిన ఈ పాటలో  ప్రధానంగా కేసీఆర్ మోసపూరిత హామీలను, చేసిన అక్రమాలను వివరిస్తూ , ఆయన నియంతృత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో  ఖైరతబాద్ మహాకూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రవణ్ దాసోజు వీడియోను స్వయంగా రూపొందించారు. విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే తెలంగాణాలో వైరల్ గా మారిందన్నారు. యువతరాన్ని  ఆకట్టుకునే ఈ వీడియో పాటను ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రదర్శించనున్నామని శ్రవణ్ అన్నారు. వీడియో సాంగ్స్ కు చెందిన ఎల్ఈడీ వాహనాలను ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్ దాసోజు తో పాటుగా  మాజీ ఎంపీ మధుయాష్కి, గూడూరు నారాయణ రెడ్డి, ఓయూ జేయేసీ కురువ విజయ్ కుమార్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment