Sunday 25 November 2018

టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే.... బీజేపీ పార్టీకి వేసినట్లేనన్న శ్రవణ్ దాసోజు

హైద్రాబాద్ గల్లీలో తిడుతూ.. ఢిల్లీలో మోడీ కాళ్లు పట్టుకుంటున్న కేసీఆర్.. డాక్టర్ శ్రవణ్ దాసోజు
టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే... నాణానికి ఒక వైపు బీజెపీ మరో వైపు టీఆర్ఎస్ అన్న దాసోజు
టీఆర్ఎస్  పార్టీకి ఓటేస్తే.... బీజేపీ పార్టీకి వేసినట్లేనన్న శ్రవణ్.
అబద్ధాల ముఖ్యమంత్రిని తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్నప్తి
కాంగ్రెస్ పార్టీ కి ఓటేసి గెలిపించాలని విజ్నప్తి..



తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ లేవి నెరవేర్చలేదని,  ముస్లీం లకు నాలుగు నెలల్లో 12 శాతం రిజర్వేషన్లు తెస్తానని ఏనాడు ఆవిషయాన్ని ప్రస్తావించకుండా నాలుగున్నరేళ్ల కాలాన్ని గడిపేశారని ఖైరతాబాద్ ప్రజాకూటమి అభ్యర్ధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ బంజారా హిల్స్ లోని  సింగాడికుంట, ఉదయ్ నగర్, గౌరీ శంకర్ కాలనీ లో పర్యటించారు.
కేసీఆర్ హైదరాబాద్ గల్లీలో మోడీని తిడుతూ.. ఢిల్లీలోఆయన కాళ్లు పట్టుకుంటుండని ఎద్దేవా.
ప్రధాని మోడిని తిడుతున్నట్టు నటిస్తూ హైదరాబాద్ గల్లీలో తిడుతున్న కేసీఆర్, ఢిల్లీలో ఆయన కాళ్లు పట్టుకుంటున్నాడన్నారు. ముస్లీం మైనార్టీ ల సమస్యల పై పార్లమెంట్ లో ఏనాడు లేవనెత్తకుండా నాలుగేళ్ల కాలాన్ని వృధా చేశాడన్నారు. మైనార్టీ ప్రజలకిచ్చిన సమస్యలేవీ నెరవేర్చకుండా ప్రభుత్వాన్ని రద్దుచేసి వారందరిని మోసగించాడన్నారు. అల్లా దయవల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివస్తుందని జూటాకోర్ పాలననుంచి విముక్తి కలిగించేందుకు ప్రజలంతా కాంగ్రెస్  పార్టీకి ఓటేసి గెలిపించాలని శ్రవణ్ విజ్నప్తి చేశారు.
టీఆర్ఎస్ కు ఓటేస్తే.. బీజేపికి ఓటేసినట్టేనన్న శ్రవణ్
ముస్లీంలను మోసగిస్తూ కాలం గడిపిన కేసీఆర్ మోడీలు ఒక్కటేనన్న శ్రవణ్ టీఆర్ఎస్ పార్టికి ఓటేస్తే బీజెపి కి వేసినట్టేనన్నారు. 2019 లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే పోటీచేయబోతున్నాయన్నారు. కేసీఆర్ అమాయక ముస్లీం సోదరులను మోసం చేస్తూ ప్రజాస్వామ్యాన్నిఖూనిచేసిన పార్టీలను ఓడించాలన్నారు. ఈ ఇద్దరి మధ్య పోటీని డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ లాగా ఉందని ఎద్దేవా చేశారు.
బస్తీల సమస్యల పై ప్రత్యేక దృష్టి పెడుతామన్న శ్రవణ్
ఏళ్లుగా పేరుకు పోయిన బస్తీ సమస్యల పై కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు దృష్టి పెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సమస్య ల నివారణ కు కృషి చేస్తామన్నారు. ఇవాళ ఇంటింటి ప్రచారం రోడ్ షోలో భాగంగా ఆయన సింగాడి కుంట , ఉదయ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి పలు సమస్యలను గుర్తించారు.  తాను గెలిచిన తర్వాత మొట్టమొదటి చర్యగా ఓపెన్ నాలాలు పై కప్పు వేయిస్తానన్నారు. జీవో 58,59 లను సక్రమంగా అమలు చేయించి పేదలందరికి న్యాయం జరిపిస్తానన్నారు. ఏళ్లుగా రిజిష్ట్రేషన్ కు నోచుకోని ఇళ్లన్నింటిని రిజిష్ట్రేషన్ చేయిస్తాన్నారు. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలో గతంలో మంత్రి గా పనిచేసిన దానం నాగేందర్ గాని, తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కి చిత్తశుద్దిలేదన్నారు. మంచినీటి సమస్యను గుర్తించిన శ్రవణ్ తనను గెలిపించిన తర్వాత మురుగునీటి కాల్వలను క్రమబద్దీకరించి మంచినీటి సరఫరా పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానన్నారు. రోడ్లన్నీ గుంతల మయంగా మార్చారని అద్దాల రోడ్లు వేయిస్తానన్నమున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, రోడ్లన్ని  గుంతల మయంగా మార్చి నగరాన్ని గుంతల హైదరాబాద్ గా మార్చారన్నారువర్షం పడితే లోతట్టుప్రాంతాలు పూర్తిగానీట మునిగిపోతుండడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. డాక్టర్ శ్రవణ్ దాసోజు ఎన్నికల ప్రచారంలో ఆయన తోపాటు సిపిఐనేత హరినాధ్ గౌడ్. టిడిపి నేత బీఎన్ రెడ్డి, ఎన్నారైలు గంపవేణుగోపాల్, (యూకే), రఘు రెడ్డి (ఆస్ర్టేలియా), సుధాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment