Saturday 24 November 2018

గాంధీభవన్ లో యాంటీ పీపుల్ గవర్నమెంట్ చార్జిషీట్ విడుదల

గాంధీభవన్ లో యాంటీ పీపుల్ గవర్నమెంట్ చార్జిషీట్ విడుదల
ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో





యాంటీ పీపుల్ గవర్నమెంట్ పేరిట కేసీఆర్ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ అవినీతి పై 24 అంశాలతో కూడిన చార్జిషీట్ ను ఏఐసిసి మీడియా ఇంఛార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా విడుదల చేశారు. అవినీతి పరుల్లో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణా సియం నిలిచారన్నారు కాగా మొదటి స్ధానం మోడీదేనని సూర్జేవాలా తెలపారు. ఇల్లీగల్ సాండ్ మాఫియా, మియాపూర్ భూకుంభకోణం, పోలీస్ వాహనాల కొనుగోలులో గోల్ మాల్, అటవీశాఖ భూములను రాజ్యసభ సభ్యులు కేకే కు అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. కమీషన్ ల కోసమే మిషన్ భగీరథ, కాకతీయ ప్రారంభించారన్నారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల పేరిట వేల కోట్ల రూపాయలను దోచుకున్నకేసీఆర్ బంగారు తెలంగాణా చేస్తానని తన బంగారు కుటుంబాన్ని తయారు చేసుకుని నాలుగున్నరేళ్లుగా తెలంగాణా ప్రజల ఆశలను వమ్ముచేసిన కేసీఆర్ పాలను కు చరమ గీతం పాడబోతున్నామని సూర్జేవాలా తెలిపారు. టీఆర్ఎస్, బీజేపి లోపాయి కారి ఒప్పందాల ద్వారా ప్రజలను మోసగిస్తాన్నారన్నారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనన్నారు. దేశంలో మోడీ,. రాష్ట్రంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు.కార్యక్రమంలో తెలంగాణా ఇంచార్జ్ ఆర్ సి కుంతియా, మాజీ ఎంపీ మధుయాష్కి, ఎన్నికల ప్రచారకమిటి కన్వీనర్ డాక్టర్ శ్రవణ్ దాసోజు, గూడూరు నారాయణ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment