Saturday 24 November 2018

మీ సమస్యల పరిష్కారం కోసం కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటా... శ్రవణ్ దాసోజు

రానున్నది సోనియా, రాహుల్ రాజ్యం.. శ్రవణ్ దాసోజు
సోనియా పర్యటన తర్వాత రాష్ట్రంలో ప్రజాకూటమి గెలుపు నమ్మకం పెరిగింది. శ్రవణ్ దాసోజు
వ్యాపారాలు పెంచుకొని బస్తీలను పట్టించుకోలేదని చింతల, దానం లపై శ్రవణ్ ఆగ్రహం. టీఆర్ఎస్ నేతలు స్మశానాలను కూడా ఆక్రమించి భూ కబ్జాలకు పాల్పడ్డారని మండిపాటు.
దందాలు చేసే దానం కావాలా.. ఓట్లు వేయిన్చుకొని మోసగించిన చింతల కావాలో.. ప్రజాసమస్యలపై పోరాడే శ్రవణ్ కావాలో ప్రజలారా ఆలోచించండి..
మీ సమస్యల పరిష్కారం కోసం కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటా... శ్రవణ్ దాసోజు..
ఖైరతాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి.. మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా...
జీహెచ్ఎంసీలో వేల కోట్ల నిధులు ఉన్నా.. స్లమ్ ల అభివృద్ధిని మరిచారు..


అర్బన్ సోషల్ ఆక్ట్ ఏర్పాటు చేసి పనిర్మాణాత్మకమైన ప్రణాళిక రూపొందించి  ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామని ఖైరతాబాద్ ప్రజాకూటమి అభ్యర్ధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. శనివారం రోజు ఫిలీం నగర్ బస్తీల్లో ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్ షోలు నిర్వహించిన దాసోజు ప్రజల నుద్దేశించి ప్రసంగించారు.  ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ,శ్రీమతి సోనియాగాంధీ పర్యటన తర్వాత ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటు పై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు.
పేదల పెన్నిధి పీజేఆర్ హయాంలోనే  బస్తీల ఏర్పాటు .. శ్రవణ్
పేదల పెన్నిధి పీజేఆర్ హాయాంలో ఫిలీంనగర్ లో బస్తీలు ఆవిర్భవించాయని శ్రవణ్ అన్నారు.  కాని 20 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న పేదలకు పక్కా ఇళ్లు, భూ పట్టాలు, మంచినీరు, డ్రైనేజీలను ప్రజలకు కనీస అవసరాలు కల్పించడంలో నాయకులు విఫలం చెందారని దుయ్యబట్టారు. తమ వ్యాపారాలను పెంచుకున్న నాయకులు ప్రజల బాగోగులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మశానాలను కూడా వదల కుండా టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
గత 2014 ఎన్నికల్లో టీడీపీ పుణ్యమా అని గత ఎన్నికలో  చింతల గెలిచారని, మంచి వ్యక్తిగా భావించి చింతలకు ఓట్లు వేసి గెలిపిస్తే ఖైరతాబాద్ లో ఒక్క సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు.








రానున్నది సోనియా, రాహుల్ రాజ్యం...దాసోజు
రానున్నది రాహుల్ సోనియా రాజ్యమేనన్నారు శ్రవణ్ దాసోజు. ఫిలిం నగర్లో పాదయాత్ర నిర్వహించి ఆయన మహాకూటమి గెలుపుతో పేదలకు పక్కా ఇళ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, రోడ్లు, డ్రైనేజీ అభివృద్ది  చేస్తామన్నారు గుక్కెడు పరిశుభ్రమైన మంచినీళ్లు తాగించలేని ప్రభుత్వాలు ఉండీ ఏం లాభమన్నారు.
దందాలు చేసే దానం కావాలా... ఓట్లేయించుకని మిమ్మల్ని మరిచిన చింతల కావాలా లేక   బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే శ్రవణ్ కావాలో నిర్ణయించాలని విజ్నప్తి.
దందాలు చేసే దానం కావాలా... ఓట్లు వేయించుకొని మరిచిపోయిన చింతల కావాలో.. 12 ఏళ్లుగా ప్రజల కోసం ప్రజా సమస్యలపై దాసుడిగా పోరుడుతున్న దాసోజు కావాలో
చిత్తశుద్ధితో ఆలోచించి ఓట్లు వేయాలని శ్రవణ్ దాసోజు  ప్రజలకు సూచించారు. అభివృద్ధి కోసం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్నప్తి చేశారు. మీ సమస్యల పరిష్కారం కోసం కుటుంబ సభ్యుడిగా, అన్నగా అండగా ఉంటానన్నారు. స్ధానిక సాయిబాబా దేవాలయంలో పూజచేసి ఆశీస్సులందుకున్న శ్రవణ్ దేవాలయాల అభివృద్దికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణాలో కవితమ్మ తప్ప మహిళలెవరు కనపడరా...దాసోజు సూటిప్రశ్న
కేసీఆర్ పాలనలో తెలంగాణలో కవితమ్మ తప్పా,  మహిళలు ఎవరూ ఎవరూ కనబడలేదని విమర్శించారు.  ప్రజా కూటమి అధికారంలోకి రాగానే మహిళల సాధికారికత, అభివృద్ధికి ప్రాధాన్యత ఉటుందని తెలిపారు. అలాగే, స్వయం సహాయక బృందాలకు రూ. 10 లక్షల గ్రాంట్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఉద్యోగాలు కావాలంటే.. కాంగ్రెస్ కు ఓటు వేయాలని యువతకు సూచించారు.
అవకాశమివ్వండి  సేవకుడిగా పనిచేస్తా...దాసోజు శ్రవణ్
రాత్రికి రాత్రి డబ్బులు, మందు బుడ్లు పంచడానికి వచ్చే నాయకుల మోసాలకు గురికాకుండా ఉండాలని, వారు పంచే డబ్బులు మన వద్ద దోచుకున్నవేనని తెలిపారు. దానం ను చూశారు.. చింతలను చూశారు.. నాకు ఒక్క అవకాశమిచ్చి చూడండి మీకు సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసోజు శ్రవణ్ వెంట కాంగ్రెస్ నేతలు సింగిరెడ్డి రోహిణ్ రెడ్డి, పిసిసి కార్యదర్శి మధుకర్ యాదవ్ , ఖైరతాబాద్ టిడిపి డివిజన్ అధ్యక్షుడు వంశీ, ఖైరతాబాద్ నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి జి.హరినాధ్ గౌడ్, ఓయూ జేయేసీ నేత కురువ విజయ్ కుమార్, ఎఐఎస్ఎఫ్ నాయకులు వి. సుమంత్,బి. అభి మరియు భారీ ఎత్తున మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment