Friday 23 November 2018

టీఆర్ఎస్ రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం :రాహుల్ గాంధీ


రాహుల్ గాంధీ స్పీచ్ .. దాసోజు అనువాదం
  • తెలంగాణ ఆవిర్భావంలో మీ పోరాటాల తో పాటు సోనియాగాంధీ పాత్ర అనిర్వచనీయమయంది.
  • టీఆర్ఎస్ రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం. 
  • ఈ ఎన్నికల్లో ఈ రాక్షస రాజ్యాన్ని, దొర గడీని కూల్చివేసి మహాకూటమి జట్టుకు పట్టాం కడుదాం.
  • మీ కలలు, ఆకాంక్షలు అమలు కోసం,  నాలుగేళ్ళ రాక్షస పాలన అంతం కోసం కొట్లాడుదాం.
  • తెలంగాణలో ఒకే వ్యక్తి తన నియంత పాలనకు దుర్మార్గం పాలన నడుపుతున్నాడు.
  • ప్రజా కూటమి ప్రభుత్వం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తుంది.
  • తెలంగాణ ప్రజల ఆలోచనలను అనుగుణంగా మహాకూటమి భాగస్వామ్య ప్రభుత్వంలో సుఫరిపాలన అందిస్తాం.





ఇది చారిత్రాత్మక సమావేశం.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడికి వచ్చిన సోనియాగాంధీ తెలంగాణ అభివృద్ధిపై తన ఆకాంక్షను స్పష్టం చేశారు.  మీఅందరికి తెలుసు తెలంగాణా రాష్ట్ర సాధన కోసం  మీరంతా ఉద్యమిస్తే  సోనియాగాంధీగారు మీపక్కన నిలబడ్డారు.
ఎన్నో త్యాగల ఫలితంగా తెలంగాణ ఎర్పడిందని నేను భావిస్తున్నా. నేను గర్వంగా చెబతున్నా తెలంగాణ ఆవిర్భావంలో మీ పోరాటాల తో పాటు సోనియాగాంధీ పాత్ర అనిర్వచనీయమయంది.
మొదటి మాట నేనే చెబుతున్నా.. టీఆర్ఎస్ రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం. ఈ ఎన్నికల్లో ఈ రాక్షస రాజ్యాన్ని, దొర గడీని కూల్చివేసి మహాకూటమి జట్టుకు పట్టాం కడుదాం. ఈ ప్రజా కూటమిలో విద్యార్ధలు, రైతులు నిరుద్యోగులు భాగస్వామ్యం గా ఉన్నారు. మీ కలలు, ఆకాంక్షలు అమలు కోసం,  నాలుగేళ్ళ రాక్షస పాలన అంతం కోసం కొట్లాడుదాం. తెలంగాణలో ఒకే వ్యక్తి తన నియంత పాలనకు దుర్మార్గం పాలన నడుపుతున్నాడు. రానున్న రోజుల్లో ప్రజా కూటమి ప్రభుత్వం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తుంది. తెలంగాణలో రైతుల సమస్యను పరిష్కరిస్తాం. లక్షలాధి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం. తెలంగాణ ప్రజల ఆలోచనలను అనుగుణంగా మహాకూటమి భాగస్వామ్య ప్రభుత్వంలో సుఫరిపాలన అందిస్తాం. ప్రజా కూటమిలో భాగస్వామ్యమైన నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్నతలు.



No comments:

Post a Comment