Friday 23 November 2018

తెలంగాణ రాష్ర్టంలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు..సోనియా ప్రసంగం


సోనియా ప్రసంగం... దాసోజు అనువాదం...
  • సంతానం దినదినాభివృద్ధితో గౌరవంగా జీవించాలని చూస్తుందో... అలాగే తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం నేను అలాగే కోరుకున్నాను. కానీ, మీ జీవితాలను దుర్భరం చేసే కుట్రపూరితమైన ప్రయత్నాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోంది.
  • నీళ్లు, నిధులు, నియామకాలు  అనే నినాదంతో ఉద్యమం చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయలేదు.
  • తెలంగాణ రాష్ర్టంలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు
  • కాంగ్రెస్ పార్టీ భూ సేకరణ చట్టం తీసుకువస్తే ఈ ప్రభుత్వం భూ సేకరణ చట్టంను తుంగలో తొక్కింది.
  • పేదల ఆకలి తీర్చేందుకు మహత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తెస్తే ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు
  • ప్రభుత్వ ఉద్యోగాలు లభించకపోవడంతో యువత నిరాశ, నిస్ఫ్రహలో ఉన్నారు.
  • భారతదేశంలో వివిధ రాష్ర్టాల్లో పర్యటించిన సమయంలోనూ  తెలంగాణ స్వయం సంఘాల గురించి గర్వంగా చెప్పుకున్నాను. కానీ,  టీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సహాయక బృందాల అభివృద్ధిని విస్మరించింది.
  • ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం.. ఈ ఎన్నికల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయండి.
  • తెలంగాణ రాష్ర్ట సాధనకు ఎలా ఉద్యమించారో అదే స్పూర్తితో మహాకూటమి గెలుపుకు కృషి చేయాలి. నేనే ఈ వేదికపై నుంచి విజ్నప్తి చేస్తున్నా..



తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా తెలంగాణకు వచ్చా.. తెలంగాణ ప్రజానీకానికి, వేదికపై ఉన్న పెద్దలందరికి గురుపౌర్ణమి, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
తెలంగాణ ఏర్పాటు ఎంత సమస్యగా ఉండేదో.. ఏపీ బాగోగుల గురించి అంతే ఆలోచించాను. ఉభయ రాష్ర్టాల బాగోగులు నా కళ్ల ముందు ఉండేవి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కలిసి తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షను గౌరవించి ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేశాం.  ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీకి  రాజకీయంగా నష్టం జరిగింది.  తెలంగాణ ఎర్పాటు నేపథ్యంలో ఏపీకి నష్టం జరగకుండా ఉండాలనే ముందుచూపుతో ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటన చేశాం. ఏపీ ప్రజలకు ఆరోజు ఏ వాగ్ధానం చేశానో ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం.  తన సంతానం దినదినాభివృద్ధితో గౌరవంగా జీవించాలని చూస్తుందో అలాగే తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం నేను అలాగే కోరుకున్నాను. కానీ, మీ జీవితాలను మృగ్యం చేసే కుట్రపూరితమైన ప్రయత్నాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోంది. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ ఒక్కటైనా అమలు చేశారాని మీ అందరని ప్రశ్నిస్తున్నా..నీళ్లు, నిధులు, నియామకాలు  అనే నినాధంతో ఉద్యమం చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయలేదు. తెలంగాణ రాష్ర్టంలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ భూ సేకరణ చట్టం తీసుకువస్తే ఈ ప్రభుత్వం భూ సేకరణ చట్టంను తుంగలో తొక్కింది. అలాగే, మహత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంను నిర్వీర్యం చేశారు. రాష్ర్టంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు లభించకపోవడంతో యువత నిరాశ, నిస్ఫ్రహలో ఉన్నారు. గతంలో నేను రాష్ర్టంలో పర్యటించిన సందర్భంగా స్వయం సహాయక బృందాల అభివృద్ధి చూసి ఎంతో గర్వపడ్డాను. భారతదేశంలో వివిధ రాష్ర్టాల్లో పర్యటించిన సమయంలోనూ  తెలంగాణ స్వయం సంఘాల గురించి గర్వంగా చెప్పుకున్నాను. కానీ,  ఈ ప్రభుత్వం స్వయం సహాయక బృందాల అభివృద్ధిని విస్మరించింది. నేనే  ఈ వేదికపై నుంచి ప్రశ్నిస్తున్నా.. దళితులు, రైతుల అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఏదైనా చేసిందా.. విద్యార్థుల నిరుద్యోగ సమస్యను విస్మరించి కుటుంబ బాగోగుల కోసమే కేసీఆర్ పనిచేశారు. మీ అందరికి తెలుసు మాటల మీద నిలబడని వారి వాగ్ధానాలను నమ్మి మోసపోవద్దు. చిన్న పిల్లవాడి పెంపకంలో లోపం ఉంటే పిల్లాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో, అలాగే మీ భవిష్యత్తు అలాగే కుంటుపడే ప్రమాదం ఉంది. ఇదొక నిర్ణయాత్మక పరిస్థితి, ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం.. ఈ ఎన్నికల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలి. కాంగ్రెస్ అధినాయకులు రానున్న ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తారో ఈ మేనిఫెస్టో ద్వారా వెల్లడైంది. తెలంగాణ రాష్ర్ట సాధనకు ఎలా ఉద్యమించారో అదే స్పూర్తితో మహాకూటమి గెలుపుకు కృషి చేయాలి. నేనే ఈ వేదికపై నుంచి విజ్నప్తి చేస్తున్నా.. విచక్షణతో ఆలోచించి మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలి.

No comments:

Post a Comment