Thursday 22 November 2018

బలీ కా బక్రా దానం నాగేందర్... ఆయన్ను టీఆర్ఎస్ పార్టీయే ఓడిస్తుందన్న : డాక్టర్ శ్రవణ్ దాసోజు

ఖైరతాబాద్ లో పీజేఆర్ రాజకీయ వారసుడిని నేనే..డాక్టర్ శ్రవణ్ దాసోజు
బలీ కా బక్రా దానం నాగేందర్... ఆయన్ను టీఆర్ఎస్ పార్టీయే ఓడిస్తుందన్న శ్రవణ్ .
గ్లోబల్ సిటిని... గుంతల సిటీగా మార్చిన ఘనడు కేటీఆర్
సెంటిమెంట్ రగిల్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్న టీఆర్ఎస్  పార్టీకి కర్రుగాల్చి వాతపెట్టాలి.
దానం కంటి అద్దాలు తీయడు, కారు అద్దాలు దించడు.. శ్రవణ్ ఎద్దేవా
రాజ్యాంగాన్ని ఖూనిచేస్తూ దౌర్జన్యాలు చేస్తున్న దానం కు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి..
ప్రజాకూటమి ఏర్పాటు.. చారిత్రాత్మక అవసరమని వ్యాఖ్య
ఖైరతాబాద్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన శ్రవణ్ దాసోజు
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న దాసోజు కుటుంబ సభ్యులు..







దివంగత నేత పేదల పెన్నిధి పీజేఆర్ ఆశయాలను  సాధించేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో అడుగుపెట్టానని, ఆయన రాజకీయ వారసుడుగా తనను ఆశీర్వదించాలని ఖైరతాబాద్ ప్రజాకూటమి అభ్యర్ధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. నియోజకవర్గం అభివృద్ది కోసం తనను గెలిపించాలని కోరారు. ఇవాళ ఖైరతాబాద్ డివిజన్ లో ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్ షోలు నిర్వహించిన దాసోజు ప్రజల నుద్దేశించి ఆవేశంగా ప్రసంగించారు. దానం నాగేందర్ దందాలు,దౌర్జన్యాలు ఇక చెల్లవని ఘాటుగా వ్యాఖ్యానించారు. డిసెంబర్ 7 వ తేదీన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దివంగత పీజేఆర్ ను మళ్లీ బతికించాలని విజ్నప్తి చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఫ్రెండ్లీ పోటీలు నిర్వహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దానం నాగేందర్ ను టీఆర్ఎస్ పార్టీ బలివ్వనుందని, ఆయన ఈ ఎన్నికల్లో బలీకా బక్రా కానున్నారని ఎద్దేవా చేశారు. దందాలు అక్రమాలతో కాలం వెళ్ల దీసిన నాగేందర్ రాజకీయ భవిష్యత్తు ఈ ఎన్నికలతో పరిసమాప్తమవుతుందని శ్రవణ్ దాసోజు జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకుంటే వెన్నుపోటు పొడిచిన దానం..
కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ కు ఎన్నో పదవులు అనుభవించి, తన అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకు,టీఆర్ఎస్ పార్టీలో చేరి, తనను గుండెల్లో పెట్టుకుని గెలిపించిన ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం గౌరవించని దానంను ఆ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపు నిచ్చారు, ఖైరతాబాద్ కాంగ్రెస్ జెండాను అసెంబ్లీలో ఎగిరేసేందుకు తనకు అవకాశమివ్వాలన్నాలని ప్రజలకు విజ్నప్తి చేశారు.
నేను లోకల్...డాక్టర్ శ్రవణ్
ఖైరతబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను నాన్ లోకల్ అంటూ అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని. దేశ పౌరుడిగా ఎక్కడైనా పోటీ చేసే అర్హత తనకుందన్నారు. తనను విమర్శిస్తున్న వారు కూడా పక్క నియోజకవర్గాలకు చెందిన వారేనని మరి వారందరూ లోకల్ అయినప్పుడు నేనెందుకు లోకల్ కానో స్పష్టం చేయాలన్నారు.1990 లో  ఖైరతాబాద్ లో ఉన్నఅడ్మినిస్ర్టేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ద్వారా జీవితంలో తొలి అడుగు వేసి విజయం సాధించానని, మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖైరతాబాద్ నుంచే తొలి అడుగు వే స్తున్నానన్నారు. తనపై విమర్శలు చేస్తున్న నాయకులు దమ్ముంటే ముఖాముఖి చర్చకు రావాలని పిలుపు నిచ్చారు.
స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి  ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా.. డాక్టర్ శ్రవణ్
ఖైరతాబాద్ నియోజకవర్గంలో వేలాది మంది యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారని వారందరికి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి తద్వారా ఉద్యోగాలు
కల్పిస్తానన్నారు.నియోజకవర్గంలో ఉన్న యువకులందరికి అన్నగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.





సీసాలు అందించేవారు, బంగారం ఇస్తామని అశచూపేవారిని నమ్మొద్దు...శ్రవణ్
ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వేల కోట్లు దోచుకుని అమాయక ప్రజలకు రాత్రి కాగానే మందు సీసాలు పంపిణీ చేసేవారిని, బంగారం ఇస్తానని ఆశపెట్టే వారిని నమ్మెద్దని శ్రవణ్ సూచించారు. తనను గెలిపిస్తే ఆత్మగౌరవంతో బతికేందుకు యువకులందరికి ఉద్యోగావకాశాలు కల్పించి వారు సగౌరవంగా బతికేందుకు అవకాశాలు కల్పిస్తానన్నారు. చింతల చిల్లర మాటలకు చింతకాయలు రాలవని..ప్రజలకు నిజమైన సేవచేసే వారిని గెలిపించాలని విజ్నప్తి చేశారు.  
గ్లోబల్ సిటీ కాదు గుంతల సిటీగామార్చిన ఘనత కేటీఆర్ దే.. శ్రవణ్
నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇంకా స్లమ్ లు ఉండడం దౌర్భాగ్యమన్నారు. మున్సిపల్ శాఖా మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్ ను గ్లోబల్ సిటిగా మారుస్తామని గొప్పలు చెప్పారని,చివరకు గుంతల హైదరాబాద్ గా, మురికివాడల నగరంగా మార్చారని ఎద్దేవా చేశారు. వేల కోట్ల బడ్జెట్ పెడుతున్నామని గొప్పలు చెప్పిన కేటీఆర్ కనీసం దోమల నివారణ కు ఫాగింగ్ మిషన్ లను కూడా ఏర్పాటు చేయలేని వారికి ప్రజల ఓట్లడిగే హక్కెక్కడిదని  విమర్శించారు.  బస్తీల్లో నీళ్లు సక్రమంగా రావడంలేదని, మురుగు నీటితో డ్రైనేజ్ పొంగి పొరలుతున్నా ఎవరికి పట్టింపులేకుండా వ్యవహరించారన్నారు. ఈ దరిద్రాలన్నీపోవాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తనను గెలిపించాలని నియోజక వర్గ ప్రజలకు అండగా నిలబడి సమస్యలను పరిష్కారిస్తానన్నారు. దివంగత నేత పీజేఆర్ లా పేదలకు అండగా నిలబడి వారందరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
ప్రజాకూటమి ఏర్పాటు చారిత్రాత్మక అవసరం
ప్రజాకూటమి ఏర్పాటు చారిత్రాత్మక అవసరముందన్నారు డాక్టర్ శ్రవణ్ ,..ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పీజేఆర్ నగర్ లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  తెలంగాణా కోసం అన్ని పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేసాయన్నారు. ఆంధ్రా ప్రాంత ప్రజలను ఇష్టారీతిగా తిడుతూ పబ్బం గడుపుకునే టీఆర్ ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. అడ్డగోలుగా మాట్లాడుతూ ఆంధ్రా ప్రాంతం వారిని నిందిస్తున్నారని, ప్రాంతాలు గా విడిపోయినా.. ప్రజలుగా కలిసుండాలనే కనీస ధర్మం పాటించకుండా దుర్మార్గంగా వ్యవహరించే కేసీఆర్ ను, ఆయన పార్టీని తరిమి కొట్టాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడు
తున్నారని ఘాటుగా విమర్శించారు. ఎన్నికల కు ముందు ఇంటికో ఉద్యోగమిస్తానని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానని మోసపూరిత వాగ్ధానాలు చేసిన కేసీఆర్ నియంత పాలన నుంచి విముక్తి కలిగించేందుకు ముందుకు రావాలన్నారు. ప్రజాస్వామ్యం  పెంపొందాలంటే, సామాజిక న్యాయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్నప్తి చేశారు. .
అంతర్జాతీయ గణేశ్ మండపం ఇంటర్నేషనల టూరిస్ట్ స్పాట్ గా ఏర్పాటుకు కృషి
అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ మండపాన్ని సుందరీకరణ చేపట్టి అంతర్జాతీయ టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దుతామని, ఇందు కోసం ప్రత్రేక నిధులు కేటాయిస్తామని డాక్టర్ శ్రవణ్ హామీ ఇచ్చారు.
ఒక్క అవకాశం ఇవ్వండి జీవితాంతం గులాములా పనిచేస్తా
ఖైరతాబాద్ ఎమ్మెల్యే గా ఒక్క అవకాశం ఇవ్వండి జీవితాంతం గులాములా పనిచేస్తానని డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. నాలుగున్నరేళ్లుగా  ఖైరతాబాద్ బస్తీలో కూరగాయల మార్కెట్ కు ప్రత్యేకంగా స్ధలం కేటాయించలేదని సంత జరిగే సమయంలో ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. బస్తీలు, మక్తాలు అబివృద్ది చేసేందుకు ఎవరితోనైనా కొట్లాడి నిధులు తెస్తానని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేస్తానన్నారు. పదిమందికి సేవచేసి చచ్చిపోయినా ఫర్వాలేదని జీవితాంతం ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవచ్చన్నారు. ఖైరతాబాద్ అంటే పీజేఆర్ అని,, పీజేఆర్ అంటేనే ఖైరతాబాద్ అని అన్నారు. దానం మోసగించిక పోయుంటే ఇవాళ  పీజేఆర్ విగ్రహం ఉండక పోయేదని పీజేఆర్ సజీవంగా మన మధ్య తిరిగే వారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డివిజన్ లో పాదయాత్ర, రోడ్ షోలు నిర్వహించిన శ్రవణ్ బిజెపీ, టీఆర్ఎస్ ల వ్యవహారం పై తీవ్రంగా మండిపడ్డారు.
పేదల పెన్నిధి కాంగ్రెస్ పార్టీ...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 వేల రూపాయల భృతి అందిస్తామన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య శ్రీ పథకం 108,104 లను తీసుకవస్తే కేసీఆర్ వాటన్నింటిని  తుంగలో తోక్కారన్నారు. తెల్ల రేషన్ కార్డులున్న ప్రతిఒక్కరికి రూ.5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించనున్నామని,ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు లేరని కేసీఆర్ మాత్రం కోట్లాది రూపాయలతో బుల్లెట్ ఫ్రూఫ్ అద్దాల మేడ నిర్మించుకున్నారన్నారు. పేదలందరికి ఇళ్లనిర్మాణం చేపట్టేందుకు రాష్ట్రంలో ఎంత పెద్ద స్దాయిలోనైనా కొట్లాడుతామన్నారు. దళితులకు ఇళ్ల నిర్మాణం కోసం ఆరు లక్షల రూపాయలు ఇస్తామని, అలాగే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం బకాయిలను వెంటనే చెల్లిస్తామన్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఉన్నవారికి మరో గది నిర్మాణం కోసం అదనంగా రూ. 2 లక్షలు చెల్లిస్తామన్నారు. ఆటోల ఇచ్చినే రుణాల్లో రూ.50 వేల వరకు  రుణ మాఫీ ఇస్తం, మైనార్టీ సబ్ ప్లాన్,  అ సుధీర్ కమీటి రిపోర్ట్ అమలు చేస్తామన్నారు.. అలాగే వక్ఫ్ బోర్డ్ భూముల వెనక్కి తీసుకుని మైనార్టీల పరం చేస్తామన్నారు. యువతుల వివాహ ఆర్ధిక సాయాన్నిలక్షా యాబై వేలుగా మారుస్తామన్నారు. పేదలకు ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్ లు ఆందిస్తామన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన మహిళల అభ్యున్నతి కోసం మహిళా సంఘాల కు 50 వేల రుణ మాఫీ, వడ్డీలేని రుణ పరిమితి 10 లక్షల వరకు పెంచడం చేపడుతామన్నారు. నిజమైన అభివృద్ది సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ కే ఓటేసి గెలిపించాలన్నారు.
టీఆర్ ఎస్  పార్టీ యే దానం ను ఓడిస్తుంది.. జోస్యం చెప్పిన దాసోజు
దందాలు దౌర్జన్యాలు చేస్తూ వేల కోట్లు సంపాదించిన దానం నాగేందర్ రాజకీయ జీవితం  ఈ ఎన్నికలతో పరిసమాప్తం కానుందని శ్రవణ్ దాసోజు జోస్యం చెప్పారు.దానం నాగేందర్ ను మహా కూటమి ఓడించాల్సిన అవసరం లేదని, టీఆర్ఎస్ పార్టీ యే ఓడిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి బలి కా బక్రా దానం నాగేందర్ కాబోతున్నాడన్నరు. రోజుల తరబడి ఎదిరిచూపుల తర్వాత ఆయన కు  టికెట్ కేటాయించడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. దానం కాంగ్రెస్ లో కొనసాగితే మంచి భవిష్యత్తు ఉండేదని, చేజేతులా దానం మంచి అవకాశం కోల్పోయాడన్నారు. చెడుకాలం దాపురిస్తే మంచి విషయాలు అర్ధం కావన్నారు.  తెలంగాణ ఉద్యమం పేరెత్తితే దాడులకు తెగబడిన  దానం కు  తెలంగాణా పేరిట ఓట్లడిగే నైతికత ఎక్కడిదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరాడని, ఈ ఎన్నికల్లో ఆయన్నుటీఆర్ఎస్ పార్టీ వాళ్లే ఓడించబోతున్నారని శ్రవణ్ జోస్యం చెప్పారు.
మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చా.... శ్రవణ్ దాసోజు
ప్రజాస్వామిక పాలన, అభివృద్ధి లక్ష్యంగా మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని డాక్టర్  శ్రవణ్ దాసోజు అన్నారు. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని వందల కోట్లు ఖర్చు చేసి యువతను మద్యం మత్తులో ముంచే దురాలోచనలో  దానం నాగేందర్ ఉన్నాడన్నారు.
ఖైరతాబాద్ అభివృద్దికి పునాది.... నా గెలుపు..శ్రవణ్ దాసోజు
ఖైరతాబాద్ అభివృద్ధికి పునాదిరాయి గా నా గెలుపు ఉంటుందని డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. పన్నుల రూపంలో వందల కోట్లు చెల్లిస్తున్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలు అలాగే ఉన్నాయని విమర్శించారు. గత ఎన్నికల్లో  తెలుగు దేశం పార్టీ అండతో గెలిచిన చింతల కు ఈ సారి ఓటమి తప్పదన్నారు. గడిచిన నాలుగేళ్లుగా ఖైరతబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టలేదని, బడుగు బలహీన వర్గాల ప్రజలు సొంత ఇళ్లు లేక  అగ్గిపెట్టె లాంటి ఇళ్లలో రోజులు గడుపుతున్నారన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం  వీరి సమస్యను తీర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తుందన్నారు. డాక్టర్ శ్రవణ్ దాసోజు వెంట కాంగ్రెస్, టీడీపీ సీనియర్ నేతలు, మధుకర్ యాదవ్,మాజీకార్పోరేటర్ షరీఫ్, ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ అమృత ధవన్, అనిల్, జ్నానేశ్వర్, వంశీ, మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న దాసోజు కుటుంబ సభ్యులు..
ఎన్నికలో భాగంగా మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ పార్టీ ఖైరతబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శ్రవణ్ దాసోజు గెలుపు కోసం ఆయన కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.బంజారహిల్స్ లోని వివిధ కాలనీల్లో గడప..గడపకు వెళ్లి దాసోజు శ్రవణ్ కు ఓటేయాలని విజ్నప్తి చేశారు. వీరి వెంట జూబ్లీ హిల్స్  డివిజన్ జనరల్ సెక్రటరీ మహ్మద్ సలీం,నఫీజ్ బేగం, నూర్ బేగం,రఫియాబేగం, రాజేశ్వరి ఆనందమ్మ తదితర నేతలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment