Wednesday 21 November 2018

తెలంగాణాకు తలమానికంగా ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని మారుస్తా.. శ్రవణ్ దాసోజు

తెలంగాణాకు తలమానికంగా ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని మారుస్తా.. శ్రవణ్ దాసోజు
పీజేఆర్ రాజకీయాల వారసుడిగా వచ్చాను.. నన్ను ఆశీర్వదించి గెలిపించాలని వినతి.  
అవకాశమిస్తే బీఎస్ మక్తా ను మోడల్ బీయస్ మక్తాగా మారుస్తానని హామీ. 
మోసపూరిత మాటలు నమ్మొద్దని పిలుపునిచ్చిన శ్రవణ్


మోసపూరిత మాటలతో మరో మారు మోసపోవద్దని, మక్తాలో ఉన్న సమస్యల పట్ల చిత్తశుద్దిలేని నాయకత్వాన్ని ఎన్నుకోవద్దని ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రజాకూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రవణ్ దాసోజుఅన్నారు.ఇవాళ సాయంత్రంనియోజకవర్గంలోని బీఎస్ మక్తాలో పాదయాత్ర నిర్వహించిన శ్రవణ్ నాలుగున్నర సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ది సాధించని నాయకత్వాన్ని ఎన్నుకోవద్దని మక్తా వాసులకు విజ్నప్తి చేశారు.
అస్తవ్యస్తంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్ధ
గత నాలుగున్నర సంవత్సరాలు గా బీఎస్ మక్తాలో అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్ధలను ఏమాత్రం మెరుగు పరచలేదన్నారు. వర్షాకాలంతో పాటు ఇతర కాలాల్లోకూడా రోడ్ల పై మురుగునీరు ప్రవహించడం దౌర్భాగ్యమని నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ లో ఇలాంటి దుస్తితికి గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన దానం, చింతల కారకులని దుయ్యబట్టారు.
తెలంగాణాకు తలమానికంగా ఖైరతాబాద్ ను తీర్చి దిద్దుతా.. శ్రవణ్
నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని తెలంగాణాకే తలమానికంగా తీర్చి దిద్దుతానని అహర్నిశలు నియోజకవర్గం కోసం కృషిచేస్తానని వెల్లడించారు. రోడ్డు,డ్రైనేజీ వ్యవస్ధ అధ్వాన్నంగా మారినా నాయకులు ఎవరూ పట్టించుకోలేదన్నారు. కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తానన్న పెద్దమనిషి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆమాటే మరిచిపోయారన్నారు. తనను గెలిపిస్తే ఉట్టిమాటలు చెప్పకుండా చేసిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తానన్నారు.
యువతకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ల ఏర్పాటు
బీఎస్ మక్తాతో పాటు నియోజకవర్గం మొత్తం అన్ని ప్రాంతాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇన్నాళ్లు మోసపూరిత వాగ్దానాలు చేసిన నాయకులకు ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలని పిలుపు నిచ్చారు.
పీజేఆర్ ఆశయాల నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చా... శ్రవణ్
దివంగత నేత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ పీజేఆర్ రాజకీయాల వారసత్వం కోసం రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలకోసం పోరాడుతానన్నారు. తెలంగాణా ఉద్యమంలో ఎంత క్రియాశీలకంగా వ్యవహరించానో అంతే క్రియాశీలకంగా నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. శ్రవణ్ దాసోజు వెంట మాజీ కార్పోరేటర్ షరీఫ్, కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి, టీడిపి నేత బీఎన్ రెడ్డి, కాంగ్రస్, టిడిపి, టీజెఎస్, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు

No comments:

Post a Comment