Tuesday 20 November 2018

టీటీడిపి రెబెల్ అభ్యర్ధి బీఎన్ రెడ్డి శ్రవణ్ దాసోజుకు మద్దతు

టీటీడిపి రెబెల్ అభ్యర్ధి బీఎన్ రెడ్డి శ్రవణ్ దాసోజుకు మద్దతు
ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ శ్రవణ్ దాసోజు కు మద్దతు ప్రకటిస్తున్నట్టు టీటీడిపి  రెబెల్ అభ్యర్ధి బీఎన్ రెడ్డి ప్రకటించారు.  ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ లో  టీటిడిపి అధ్యక్షులు ఎల్ రమణ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రవణ్ కు మద్దతుగా తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. మహాకూటమి తరుఫున బరిలో నిలిచిన డాక్టర్ శ్రవణ్ దాసోజు కు టీడిపి కార్యకర్తలు కృషిచేయాలని బీఎన్ రెడ్డి టీడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా శ్రవణ్ కు శాలువాతో సన్మానించారు.  బిఎన్ రెడ్డితో పాటు దీపక్ రెడ్డి తదితర సీనియర్ టీటిడిపి నేతలు శ్రవణ్ కు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.



బీఎస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన డాక్టర్  శ్రవణ్
ఖైరతాబాద్ నియోజకవర్గం లో ప్రజాకూటమి తరుఫున బరిలో ఉన్న తనకు మద్దతు పలికిన బిఎన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ శ్రవణ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజాకూటమి అభ్యర్ధిగా తన గెలుపుకు కృషి చేయాలని విజ్నప్తిచేశారు. ఈకార్యక్రమంలో టీటీడిపి సీనియర్ నేతలు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మండవ వెంకటేశ్వర్ రావు, కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డిలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment