Tuesday 20 November 2018

వందల కోట్లున్న దానం కావాలా..... వందల లాఠీ దెబ్బలు తిన్న శ్రవణ్ కావాలో ఖైరతాబాద్ ప్రజలే నిర్ణయించా లని విజ్నప్తి చేసిన శ్రవణ్

నామినేషన్ ఉపసంహరించుకుని దాసోజు కు మద్దతు తెలిపిన డాక్టర్ రోహిణ్ రెడ్డి
వందల కోట్లున్న దానం కావాలా..... వందల లాఠీ దెబ్బలు తిన్న శ్రవణ్ కావాలో ఖైరతాబాద్ ప్రజలే నిర్ణయించా లని విజ్నప్తి చేసిన శ్రవణ్
పీజేఆర్ కు దండే స్తే ఓట్లు పడుతాయా అంటున్న దానం తీరు.... కడుపులో కత్తులుపెట్టుకుని ముఖం పై చిరునవ్వు ప్రదర్శిస్తున్నట్టుందని విమర్శ
ఖైరతాబాద్ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్ దేనని.. మెజార్టీ లక్ష్యంగా పోరాడుతున్నామని వెల్లడి.  
పీజేఆర్ అంటేనే పడని దానం ఆయన ఆశయాలు ఎలా నెరవేరుస్తారని సూటిగా ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుకర్ యాదవ్
శ్రవణ్ దాసోజు గెలుపుకు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి



తన రాజకీయ భవిష్యత్తును పక్కన బెట్టి,నామినేషన్ ఉపసంహరించుకుని తనకు మద్దతు ప్రకటించిన డాక్టర్ రోహిణ్ రెడ్డి ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ శ్రవణ్ దాసోజు ధన్యవాదాలు తెలిపారు.  ఇవాళ టీపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో జరిగిన  నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమైన  డాక్టర్ శ్రవణ్, రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో తాను ఇక్కడినుంచి పోటీలో ఉన్నానని  తన గెలుపు కు నియాజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని విజ్నప్తి చేశారు.  ముఖ్య నేతల మద్దతుతో తన గెలుపు ఎప్పుడో ఖాయమైందని, ఇప్పడు తాము కేవలం మెజార్టీ కోసం మాత్రమే పోరాడుతున్నామన్నారు.
ఖైరతాబాద్ ప్రజల రక్తమాంసాలనుంచే వేలకోట్లు సంపాదించిన దానం.. శ్రవణ్ ఘాటువ్యాఖ్య
ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజల రక్త మాంసాలను, చెమటను పిండుకొని వేటకోట్లు సంపాదించు కున్నా రన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో అవే డబ్బులు వెదజల్లి మళ్లీ దోచుకునేందుకు వస్తున్నాడన్నారు. ఇలాంటి నేతలకు కర్రుగాల్చి వాతపెట్టాలని పిలుపు నిచ్చారు.
చింతల మాకు పోటీ యే కాదన్న శ్రవణ్
గత ఎన్నికల్లో టీడిపి సహకారంతో గట్టెక్కిన చింతల రామచంద్రారెడ్డి ఈ ఎన్నికల్లో తనకు ఏమాత్రం పోటీ కాదన్నారు. గత ఎన్నికల్ల్ ఆంధ్ర ప్రాంత ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ఆయన ప్రత్యేక హోదా ఇవ్వకుండా వాళ్ల నోటిలో మట్టి కొట్టిన పార్టీ ప్రతినిధని అక్కడి ప్రాంత ప్రజల జీవితాలను బర్ బాద్ చేసిన పార్టీ కి చెందిన వ్యక్తన్నారు.
ఖైరతాబాద్ చుట్టే తిరుగుతున్న పీజేఆర్ ఆత్మ
ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరో మారు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని, అందుకోసం దివంగత నేత పీజేఆర్ ఆత్మ ఇక్కడే తిరుగాడుతుందన్నారు.  ఆయన ఆశయాలను పునురుజ్జీవితం చేయడానికి, ఆయనను మరో మారు బతికించుకునేందుకు  తనను గెలిపించాలని విజ్నప్తి చేశారు.
5 ఏళ్లలో 5 వేల ఇళ్ళు నిర్మించలేని పార్టీ, నియోజకవర్గానికి 20 వేల ఇళ్లెలా కట్టిస్తుందని సూటి ప్రశ్న
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఇళ్లుకూడా కట్టలేని పార్టీ , ఒక్కఖైరతాబాద్ నియోజకవర్గంలో 20 వేల ఇళ్లు ఎలా కట్టిస్తుందని విమర్శించారు. దానం నాగేందర్ ఇళ్లపేరిట అమాయక ప్రజలను మోసగించి గంపగుత్తగా ఓట్లను దండుకోవాలని చూస్తున్నారని  ఆయన చెప్పే మాటలు విని ఓట్లేయడానికి ఇక్కడెవరు చెవిలో పూవులు పెట్టుకోలేదని ఎద్దేవా చేశారు.  
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 లక్షల ఇండ్లు నిర్మిస్తామన్న పార్టీ ఎందుకు ఇళ్లు నిర్మించ లేదని ప్రశ్నించారు.
పీజేఆర్ పట్ల వెకిలిమాటలు మానాలని  దానం కు హితవు
తాను పీజేఆర్ కు దండ వేస్తే ఆయన వచ్చి ఓట్లేస్తడా అంటున్న దానం తన వెకిలి మాటలు మానుకోవాలని హితవు పలికారు. పేదల పెన్నిధి పీజేఆర్ పట్ల ఆయనకున్న నిబద్దత, గౌరవం ఏపాటిదో ఈ వ్యాఖ్యలతో అర్దం చేసుకోవచ్చన్నారు. నోటితో వెక్కిరించడం,నొసటితో నవ్వడం దానం కుఅలవాటేనని, కడుపుతో కత్తులు పెట్టుకుని నోటితో నవ్వడం దానం నైజమన్నారు.ఆయనను మానసిక వేదనకు గురిచేసి చావుకు కారణమయిన దానం కు తగిన గుణపాఠం చెప్పాలని విజ్నప్తి చేశారు. దందాలు, దౌర్జన్యాలు చేసి వందల కోట్లు సంపాదించిన  దానం నాగేందర్  కావాలా.. ఉద్యమంలో వందల లాఠీ దెబ్బలు తిన్న దాసోజు శ్రవణ్ కావాలో నియోజకవర్గ ప్రజలు నిర్ణయించాలని కోరారు. రాజకీయం అంటే రౌడీయిజం, గూండాయిజం కాదని, నోట్లతో ఓట్లు కొనుక్కోవచ్చన్న చిల్లరరాజకీయాలకు తెరలేపిన దానం ను తరిమి కొట్టాలన్నారు. తన మేధాశక్తి ఉపయోగించి ప్రజల జీవితాలను బాగుచేస్తానని, నిరుద్యోగులకు అండగా నిలబడి వారికి ఉజ్వల భవిష్యత్త్ కలిపించేందకు కృషి చేస్తానన్నారు.  పదిహేను రోజుల సమయం నాకోసం వెచ్చించండి..  జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించేవరకు అవిశ్రాంతంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
నిబద్దత కల సైనికుడు దాసోజు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి
శ్రవణ్ దాసోజు అభ్యర్ధిత్వాన్ని బలపరచాలని ఆయన గెలుపు కోసం కృషి చేయాలని టీపిసిసి అధ్యక్షులు  కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖైరతాబాద్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రెబెల్ అభ్యర్ధులుగా నామినేషన్ వేసిన డాక్టర్ రోహిణ్ రెడ్డిని, నియోజకవర్గంలో కీలక నేత మధుకర్ యాదవ్ ల తో సమావేశం నిర్వహించి అందరిని నియోజకవర్గంలో అసమ్మతి లేకుండా చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ డాక్టర్ శ్రవణ్ గత నాలుగుసంవత్సరాలు గా పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తని, పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని టీఆర్ఎస్ పార్టీని ఎప్పడికప్పుడు ఎండగట్టడంలో శ్రవణ్ కీలక పాత్ర పోషించారన్నారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, విద్యుత్ ప్రాజెక్ట్ లు, రైతుబంధు, కాగ్ పవర్ ప్రజెంటేషన్ లు మరియు ఎస్సీలు, బీసీలు మైనార్టీలు తదితర కీలక అంశాలపై ప్రభుత్వంతో పోరాడారన్నారు.
రెబెల్ అభ్యర్ధి డాక్టర్ రోహిణ్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణ
ఉత్తమ్ నచ్చజెప్పడంతో ఖైరతాబాద్ నియోజకవర్గం రెబెల్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలుచేసిన డాక్టర్ రోహిణ్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకుంటానని మీడియా సమక్షంలో వెల్లడించారు. డాక్టర్ శ్రవణ్ దాసోజుకు తన మద్దతు ప్రకటించారు. ఆయన గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తానని  రోహిణ్ రెడ్డి అన్నారు. తన పోరాటం కేవలం టీఆర్ఎస్ పార్టీ పైనేనని కాంగ్రెస్ పార్టీ గెలుపే తన ధ్యేయమని రోహిన్ అన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నేత మధుకర్ యాదవ్ మద్దతు
నియోజకవర్గంలోని మరో కీలక నేత, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ మధుకర్ యాదవ్ సైతం డాక్టర్ శ్రవణ్ గెలుపుకు కృషి చేస్తానని వెల్లడించారు. పేదల పెన్నిధి పీజేఆర్ పేరెత్తితే నచ్చదనే వ్యక్తి దానం నాగేందర్ అని ఆయన ఆశయాలను దానం ఎలా నెరవేరుస్తారన్నారు. నీడ నిచ్చిన వ్యక్తికే ద్రోహం చేసిన వ్యక్తి దానం అని దుయ్యబట్టారు.  
రోహిణ్ రెడ్డి మధుకర్ యాదవ్ లు సహకారాన్ని తెలియజేయడం వల్ల శ్రవణ్ ఆనందం వ్యక్తంచేశారు. పీజేఆర్ ఆశయాలను నెరవేరుస్తానని, పేదల పక్షపాతి గా ఉంటానని అన్నారు.

No comments:

Post a Comment