Monday 19 November 2018

డా శ్రవణ్ దాసోజు నామినేషన్ సందర్భంగా భారీగా హాజరయిన కార్యకర్తలు, నాయకులు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు

దాసోజుకు బ్రహ్మరథం పట్టిన ఖైరతాబాద్ ప్రజలు.
నామినేషన్ సందర్భంగా భారీగా హాజరయిన కార్యకర్తలు, నాయకులు,
మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు
నరికెళ్ల నరేశ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్  పార్టీ నుంచి భారీగా చేరిన ఫిల్మ్ నగర్ యువకులు
గడీల పాలన కూల్చి, సామాజిక తెలంగాణా కోసం పోరాడుదామన్న శ్రవణ్ దాసోజు
ప్రజాకూటమి తరఫున సోమవారం నామినేషన్ దాఖలు.


పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో హామీలిచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా మోసగించిన కేసీఆర్ కు ఎన్నికల్లో కర్రుగాల్చి వాతపెట్టాలని శ్రవణ్ దాసోజు పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల సమయంలో దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చి ఏఒక్కటి నెరవేర్చకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను మట్టికరిపించాలని పిలుపునిచ్చారు. ప్రజాకూటమి తరుఫున ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సోమవారం నాడు ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు.







ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించిన దాసోజు,
నామినేషన్ కు బయలు దేరే ముందు ఫిల్మ్ నగర్ లోని రాజరాజేశ్వరి దేవాలయంలో కుటుంబసభ్యులు, కార్యకర్తలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన దాసోజు బైక్ ర్యాలీ ప్రారంభించారు. వేలాది తరలివచ్చిన మహిళలు ఆయనకు బొట్టు పెట్టి ఘన స్వాగతం పలికారు.  
టీఆర్ఎస్ పార్టీనుంచి భారీగా చేరికలు
ఉద్యమ ద్రోహి దానం నాగేందర్ కు ఖైరతాబాద్ టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఫిల్మ్ నగర్  కు చెందిన వంద మంది టీఆర్ ఎస్ కార్యకర్తలు టీఆర్ ఎస్ ముఖ్య నేత నరికెళ్ల నరేశ్ నాయకత్వం లో శ్రవణ్ దాసోజు సమక్షంలో చేరారు. ఉద్యమంలో ప్రాణాలకు తెగించి  పోరాడిన శ్రవణ్ నాయకత్వంలో పనిచేస్తామని ఆయన గెలుపుకోసం కృషిచేస్తామన్నారు.  
పేదల పెన్నిధి పీజేఆర్ కు ఘన నివాళి
పేదల పెన్నిధి  దివంగత నేత పీజేఆర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసిన శ్రవణ్ అనంతరం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా భారీగా హాజరయిన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పీజేఆర్ సేవాదృక్ఫథాన్ని అలవరుచుకుని పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతానని, గడీల పాలనకు, రౌడీనాయకత్వానికి చరమగీతం పాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.
చింతల్ బస్తీలో మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు

అనంతరం చింతల్ బస్తీలో డాక్టర్ శ్రవణ్ కు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణా ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టాలని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్నప్తిచేశారు.
ఖైరతాబాద్ జీహెచ్ ఎంసీ కార్యాలయంలో తన నామినేషన్ దరఖాస్తు ఫారాన్ని దాఖలు చేశారు. డాక్టర్ శ్రవణ్ నామినేషన్ సందర్భంగా వేలాది గా హాజరయిన కార్యకర్తలతోపాటు ముఖ్య నాయకులు శ్రీ ప్రకాశ్ రావు, మాజీ కార్పోరేటర్ షరీఫ్, కార్యదర్శి శ్రీనివాస్ రావు, అధికార ప్రతినిధి శ్రీమతి సునిత, మధుకర్ యాదవ్, కృష్ణాయాదవ్, బబ్లూ,  పిసిసి సెక్రటరీ నిరంజన్, మహేశ్ యాదవ్, గంగాధర్,కమ్మరి వెంకటేశ్, కరీం, జకీర్, డేవిడ్, మురళీ, లక్ష్మన్ యాదవ్, లతో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లకు చెందిన ముఖ్యనేతలు, కార్యకర్తలు, మహిళలు, యువకులు  పెద్దయెత్తున హాజరయ్యారు.

No comments:

Post a Comment