Sunday 4 November 2018

మారోజు వీరన్న, ఆచార్య జయశంకర్, శ్రీకాంతా చారి స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం పోరాడాలని శ్రవణ్ దాసోజు పిలుపు

మారోజు వీరన్న, ఆచార్య జయశంకర్, శ్రీకాంతా చారి స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం పోరాడాలని శ్రవణ్ దాసోజు పిలుపు
అడుక్కోవడం కాదు... బరిగీసి కొట్లాడి  రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని పిలుపు
త్యాగాలు మావి... భోగాలు మీవా అంటూ విశ్వకర్మబ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో ధ్వజమెత్తిన  శ్రవణ్ దాసోజు




మారోజు వీరన్న, ఆచార్య జయశంకర్ , శ్రీకాంతాచారి ముగ్గురు మహానుభావుల వల్లే సీమాంధ్ర ప్రాంత పాలకుల దాస్యశృంఖలాలు నుంచి తెలంగాణా రాష్ట్రం విముక్తి పొంది స్వేచ్చా వాయువులను పీలుస్తుందని వారి స్పూర్తి  విశ్వబ్రాహ్మణులంతా అందిపుచ్చుకోవాలని  శ్రవణ్ దాసోజు పిలుపు నిచ్చారు. ఇవాళ సాయంత్రం  నాగోల్ లోని సరూర్ నగర్ స్టేడియం లో జరిగిన విశ్వకర్మ బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న శ్రవణ్ తెలంగాణా వ్యాప్తంగా వెయ్యి సభలు పెట్టి యావత్ ప్రజానీకాన్ని చైతన్య పరిచి ఉద్యమాన్ని బతికించిన మారోజు వీరన్న తొలితరం మలితరం రెండు తరాలకు స్పూర్తి ప్రదాత గానిలిచిన ఆచార్య జయశంకర్ , తన నిండైన ప్రాణాన్ని భగభగ మండే పెట్రోల్ మంటల్లో కాల్చి ఆమంటల సాక్షిగా జైతెలంగాణా నినాదమిచ్చిన అమరుడు శ్రీకాంతాచారి  స్పూర్తితో వచ్చిన తెలంగాణాలో బిచ్చగాళ్లలా  చిన్న చిన్న కోర్కెలు తీర్చాలని కోరకుండా పోరాట స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం కొట్లాడాల్సిన అవసరముందన్నారు.
రాజ్యాధికారం ద్వారానే నిజమైన అభివృద్ది సాధించుకుందాం.. శ్రవణ్ దాసోజు
బీసీ బిడ్డలు త్యాగాలు ,ఆత్మబలిదానాలు చేసుకుంటే  ఆ త్యాగాలు  పునాదుల మీద పాలక వర్గం భోగాలు అనుభవిస్తుందని వారి ముందు మోకరిల్లి అడుక్కోకుండా అంబేథ్కర్ చెప్పినట్లు రాజ్యాధికారం ద్వారానే  నిజమైన అభివృద్ది సాధించుకోవాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న తీర్మానాలు చేసుకుని ఆత్మవంచన చేసుకోవడం సరికాదని , విశ్వకర్మ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని, కంసాలి సోదరులపై మాటి మాటికి పోలీసులు కేసులు పెట్టొద్దని  చట్టాలు చేయాలని బతిమిలాడడం కాదని ప్రాణత్యాగాలకు వెరవకుండా పోరాడిన బిడ్డలుగా హక్కుల సాధన కోసం   చట్టాలు చేసే అధికారమే కావాలని అందుకోసమే పోరాటం చేయాలన్నారు. చిన్నగా కోరికలు కోరుకుంటే పాలకుడు మరింత చిన్నగా ఆలోచిస్తాడన్నారు. తెలంగాణా సాయుధ పోరులో బల్లాలు, బరిశెలు, కత్తులు, కొడవళ్లు, బాంబులు తయారుచేసి  ఆధిపత్య వర్గాల గుండెల్లో బరిసెలు దింపిన వారసత్వం ఉన్న దమ్ము ధైర్యం తో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక నిలిచామని ఉద్వేగంగా మాట్లాడారు.


తెలంగాణా జాతిపిత ఆచార్య జయశంకర్ ను అవమానించిన కేసీఆర్
తొలితరం, మలితరం తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తన జీతాన్ని, జీవితాన్ని కోల్పోయిన ఆచార్య జయశంకర్ గారిని యావత్ సమాజమంతా  తెలంగాణా జాతిపిత గా  గుర్తించినా, ఆయనే జాతిపిత అంటూ అధికారికంగా ప్రకటించాల్సిన కేసీఆర్ మాత్రం తానే  జాతిపిత అంటూ ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా,నిరంతరం తెలంగాణా శ్వాసగా, ధ్యాసగా  పోరాడిన మహానుభావుడిని  జాతిపితగా గౌరవించడానికి టీఆర్ఎస్ పార్టీకి మనసు రావడంలేదన్నారు. ఎందుకు ఆచార్య జయశంకర్ గారిని జాతిపిత గా ప్రకటించడం లేదని టీఆర్ఎస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణా కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుడు శ్రీకాంతాచారిని అవమానించిన కేసీఆర్
తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఒకసారి కాదు మళ్లీ చావడానికి వెనుకాడనని  వయస్సు లో  చిన్నవాడయిన ఆకాశమంత ఎత్తైన సమున్నత ఆశయాన్ని భగ భగ మండుతున్న మంటల సాక్షిగా శ్రీకాంతాచారి వెల్లడించిన  విషయాలను గుర్తుచేసుకున్న శ్రవణ్,  ఒక బ్రిడ్జ్ కు ఆయన పేరు పెట్టి శ్రీకాంతా చారి ఆత్మత్యాగాన్ని ప్రభుత్వం అవహేళన చేసిందని మండి పడ్డారు.


అమరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు అన్యాయం
చెట్టంత ఎదిగిన కొడుకు ను తెలంగాణా ఉద్యమానికి త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఒక మరుగుజ్జు నాయకుడు జగదీశ్వర్ రెడ్డి మాటలు  విని కేసీఆర్ అన్యాయం చేసిండని  శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  శంకరమ్మ అడిగిన సీటు కాకుండా కుట్ర పూరితంగా ఒక బలమైన నాయకుడిపై పోటీకి నిలిపారన్నారు. ఎంపీ గా పోటీచేసి ఓడిపోయిన  ఉద్యమ ద్రోహి మైనం పల్లి హన్మంత రావు, ఉద్యమంతో సంబందం లేని పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారని అదే సమయంలో శంకరమ్మకు అన్యాయం చేశారన్నారు. ఉద్యమం కోసం కొడుకును కోల్పోయిన తల్లి శంకరమ్మను గౌరవించలేని కుసంస్కారులు టీఆర్ఎస్ నేతలని దుయ్యబట్టారు. త్యాగాలు ,రక్తతర్పణాలకు విలువ ఇవ్వాలన్నకనీస ఇంగితం లేదని విమర్శించారు. ఆచార్య జయశంకర్, అమరుడు శ్రీకాంతాచారి, బతికున్న శంకరమ్మల ఆత్మఘోషల ఉసురు టీఆర్ఎస్ నేతలకు తగులుతుందన్నారు.


త్యాగాలు మావి భోగాలు మీవా అంటూ  సూటి ప్రశ్న
తెలంగాణా ఉద్యమంలో దాదాపు 1500 మంది బిడ్డలు చనిపోతే వారిలో దాదాపు 90 శాతం మంది బీసీ బిడ్డలేనన్నారు. వారి త్యాగాల పునాదుల మీద భవంతులు నిర్మించుకుని భోగాలు అనుభవిస్తున్నారన్నారు.
సమాజంలో సగ శాతం ఉన్న బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారని అధికారం ఇవ్వకుండా అణిచివేతకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

గొర్లు బర్లు కాదు ఉద్యోగాలు కావాలి
బీసీ లకు చదువుకునే అవకాశం, ఉద్యోగావకాశం కల్పించాలని కోరితే గొర్లు, బర్లు, చేపలు పెంచుకోమంటున్నారని, గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని తుంగలో తొక్కి పేదలకు చదువు దూరం చేసిండన్నారు.  పేద పిల్లలు చదువుకునే వందలాది ప్రభుత్వ కళాశాలలు మూసేసిండన్నారు. ప్రభుత్వంలో ఖాళీలను భర్తీచేయకుండా తాత్సారం చేసి తన కుటుంబానిక నాలుగు ఉద్యోగాలు తీసుకున్నాడని విమర్శించారు. అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ కు రాబోయే ఎన్నికల్లో కర్రు గాల్చి వాతపెట్టాలని శ్రవణ్ పిలుపు నిచ్చారు.
 కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో  డ్రాప్టింగ్ కమిటీ లో తాను సభ్యుడినేనని టీపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు విశ్వకర్మలకు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంచేయబోతుందో వివరించారు.


విశ్వకర్మ ఆత్మగౌరవ సభలో శ్రవణ్ చదివి వినిపించిన మానిఫెస్టో అంశాలు
1.     శాస్త్రీయ పద్దతిలో కులగణన చేపట్టి వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతి కులం  యొక్క సామాజిక, వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసి ,తదనుగుణంగా ప్రణాళికలు రచించి వాటిన అమలు చేయడానికి చట్టబద్ద కమిటీ ఏర్పాటుచేస్తాం.
2.    25 వేల కోట్ల తో బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి మరో వెయ్యి కోట్లతో విశ్వకర్మ కార్పోరేషన్ ఏర్పాటు
3.    స్ధానిక సంస్ధ ఎన్నికల సీట్లలో A,B,C,D,E వర్గీకరణ అమలు చేస్తూ బిసీ ల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాం.
4.    కుల వృత్తులకు సంబందించిన శిక్షణా కేంద్రాలను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి వృత్తి విద్య విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తం
5.    వెనుకబడిన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికనసామాజికఆర్ధిక స్తితిగతుల నేపథ్యంలో ప్రత్యేకించి ఒక్కో వర్గానికి ఒక విస్తృతమైన అభివృద్ధి ప్రణాళికను అమలుపరుస్తం
6.    వెనుక బడిన తరగతుల కార్పోరేషన్లు పరిధిలో ఒక్కో కులానికి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేస్తాం.
7.    దేవాలయాల నిర్మాణం పునరుద్దరణ జరిగితే మను, మయ శిల్పలుకే అవాకాశాలు ఇచ్చేలా చట్టం చేస్తాం.
8.    బ్యాంకుల్లో గొల్డ్ లోన్ అప్రైజర్లు కంసాలి వారికే అవకావాలు ఇచ్చేట్లుగా  మానిపెస్లో పెడ్తం.
9.    పుస్తెమెట్టెలు తప్పనిసరిగా కంసాలి చేసే విధంగా రెడీ మడ్ దుకాణల్లో నియంత్నణ.
10.  స్వర్ణకారులు , వడ్రంగుల పై నోటీసులు వేదింపులు లేకుండా  ప్రత్యేక నియంత్రణ చేపడుతున్నాం.
11.   సమగ్ర మైన అభివౄదద్ కోసం పాటు పడుతాం.

వీరబహ్మేంద్ర స్వామి వారసులుగా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి బరిగీసి కొట్లాడాలని అడుక్కోవద్దన్నారు. తెలంగాణా విశ్వకర్మ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన విశ్వకర్మబ్రాహ్మణ సంఘం ఆత్మగౌరవ సభలోశ్రవణ్ తోపాటు  మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్.టీటిడిపి అధ్యక్షులు ఎల్ రమణ..బీజెపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆచారీ జీ..టీఆర్ ఎస్ లీడర్ కాసోజు శంకరమ్మ.. ఇతర సంఘాల నాయకులు హాజరయ్యారు.

No comments:

Post a Comment