పింక్ బాలెట్ పేపర్లను తక్షణమే రద్దుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి శ్రవణ్ దాసోజు లేఖ
పింక్ బాలెట్ ప్రవేశపెట్టడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్దమని ప్రకటన
గులాబీ రంగులో బ్యాలెట్ పేపర్ల కొనుగోలుకు జీవో ఎట్లా జారీ చేస్తారని నిలదీత
టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల కమీషన్ వత్తాసు పలుకుతోందని ఆరోపణ.
తెలంగాణాలో ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా జరిగే పరిస్థితి లేదని ఆవేదన
తెలంగాణాలో
ప్రజాస్వామ్య బద్దంగా, స్వేఛ్చాయుత వాతావరణంలో ఎన్నికల జరిగే పరిస్థితి
కనిపించడం లేదని స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమీషన్ టీఆర్ఎస్
పార్టీ చెప్పుచేతల్లో ఉన్నట్టు కనిపిస్తోందని టీపిసిసి కాంపైన్ కమిటీ
కన్వీనర్ శ్రవణ్ దాసోజు అన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో
పాల్గొన్న ఆయన ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఒక
పార్టిని ప్రతిబింబించే రంగును ఎన్నికల బ్యాలెట్ ను తక్షణమే తొలగించాలని
డిమాండ్ చేస్తూ కేంద్రఎన్నికల సంఘానికి రాసిన లేఖను ఆయన విడుదల చేశారు. ఈ
సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ ఎలాంటి
నోటీసులు
అందజేయకుండా లక్షలాది ఓట్లను తొలగించారని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా
తొలగించిన ఓటర్ల ను తిరిగి ఎన్ రోల్ చేయకుండా లక్షల సంఖ్యలో ఓటర్ల ను
గల్లంతు చేశారని ఆరోపించారు.
గులాబీ రంగులో బ్యాలెట్ పేపర్లు
తెలంగాణాలో
ఎన్నికలు పారదర్శకంగా జరగవనడానికి గత నెల తేది 26.10.2018 రోజున గులాబీ
రంగులో 90 లక్షల ఈ వీ ఎం బ్యాలెట్ పేపర్లను 75 పీఎస్ ఎం ప్రకారం, కొనుగోలు చేయాలని డిప్యూటీ చీఫ్ ఎన్నికల అధికారి, డిప్యూటి
సెక్రటరీకి జారీ చేసిన జీవో నెంబర్ 1605 ఉత్వర్వే సాక్ష్యమన్నారు.
టీఆర్ఎస్ జెండా రంగులో ఉన్న గులాబీ బ్యాలెట్ ప్రభావం ఓటర్ల పై పడే అవకాశం
ఉందన్నారు. ఏపార్టీకి చెందని రంగును వాడాలని గతంలొ లేఖ ఇచ్చినా ఎన్నికల
సంఘం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల సంఘం అప్రజాస్వామికంగా వ్యవహరించడం
తగదని హితవు పలికారు.
తెలంగాణాలో ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా జరిగే పరిస్థితి లేదని ఆవేదన
రాజ్యాంగ
బద్దంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఒక పార్టీకి వత్తాసు పలికినట్లు
వ్యవహరించడం సరికాదని దీన్ని సరిచేసుకుని ప్రజాస్వామికంగా, స్వేఛ్చాయుత
వాతావారణంలో ఎన్నికలు పూర్తిచేయాలని కోరుతుంటే మరోవైపు అదే రంగుతో బ్యాలెట్
పేపర్ల ముద్రణ చేపట్టం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
ఓవైపు ఆపద్దర్మ ప్రభుత్వం అనువైన ప్రతి చోట ఎన్నికల నిబంధనలను
అతిక్రమిస్తు ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తుంటే
పట్టించుకోకుండా ఇలాంటి జీవో లు జారీచేయడమేంటని ఎన్నికల కమీషన్ ను సూటిగా
ప్రశ్నించారు.
గులాబీ పార్టీకి గులాముగా వ్యవహరిస్తున్న ఎన్నికల కమీషన్
ఎన్నికల
కమీషన్ గులాబీ రంగుపార్టీకి గులాముగా మారిందని శ్రవణ్ అనుమానం వ్యక్తం
చేశారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కమీషన్ రాజ్యంగానికి, చట్టానికి
లోబడి ఎన్నికలు నిర్వహిస్తారా లేక టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్
కు అనుకూలంగా పనిచేస్తారో తేల్చుకోవాలని హితవు పలికారు.
కేసీఆర్ తో ఎన్నికల సంఘం కుమ్ముక్కయ్యిందేమోనని అనుమానం వ్యక్తం చేసిన శ్రవణ్
గత
సెప్టెంబర్ నెలలో ఏ తేదీన ఎన్నికలు జరుగుతాయో, ఏ తేదీన రిజల్ట్
వస్తుందోనని కేసీఆర్ ప్రకటించిన విధంగానే ఎన్నికల సంఘం వారు కూడా అవే
తేదీలను ప్రకటించడాన్ని ఇందుకు ఉదాహరణగాచెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చెబితేనే తప్పులు సరిదిద్దుతారా అంటూ ఎన్నికల సంఘం పై శ్రవణ్ ఆగ్రహం
ఎన్నికల
సంఘం వారు పింక్ పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేస్తామని ఒక పత్రిక లో
చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి తొలగించేలా చేసిందని, ఇలా
ప్రతీసారి ఎన్నికల సంఘం చేసే తప్పులు ఎత్తి చూపుతేనే తప్పులు
సరిదిద్దుకోవడం సరికాదన్నారు. తెలంగాణా లో ఎన్నికలు రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా, న్యాయపరంగా జరిగే పరిస్ధితి కనిపించడం లేదని , ప్రశాంతంగా
జరగాల్సిన ఎన్నికల వాతావరణాన్ని విధ్వంసంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న
ఆపద్దర్మ ప్రభుత్వానికి ఎన్నికల కమీషన్ వత్తాసు పలుకడం, రాజ్యాంగాన్ని
కాపాడాల్సిన ఎన్నికల కమీషన్ ఇలా వహరించడం దురదృష్టకరమన్నారు.ఎన్నికల
కమీషన్ ఏ పార్టీకి సంబంధం లేని మరో రంగును వాడాలని డిమాండ్ చేశారు. మీడియా
సమావేశంలో శ్రవణ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు సునితా రావు, ఇందిరాశోభన్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment