Tuesday 26 May 2020

లక్షలాది మంది వలస కార్మికులు, రైతులు, అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు

ప్రియమైన సహచరులరా..

దేశంలో లక్షలాది మంది వలస కార్మికులు, రైతులు, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, చిన్న మధ్య తరహా పారిశ్రామిక కార్మికులు, చిన్న తరహా వ్యాపారాలు, మత్స్యకారులు, రోజువారీ వేతనదారులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.

డబ్బు, ఆహారం, ఉద్యోగం మరియు ఇతర నిత్యావసర వస్తువులు లేక పోవడంతో వారు చాలా కష్టపడుతున్నారు. రెండు నెలలుగా లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి దేశంలో వలస కార్మికులు మాహిళలు, పురుషులు మరియు పిల్లలు తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నిస్తు ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తున్న విషయాలు లక్షలాది మందిని ఫోటోలు మరియు వీడియోలలో చూసి మనం తీవ్రంగా ఆవేదన చెందాము.

రహదారులపై వందల కిలోమీటర్లు కాలి నడకన నడవడం నుండి, ట్రక్కులు, ట్రెయిలర్లు మరియు అందుబాటులో ఉన్న ఏదో ఒక్క రవాణ ద్వారా వారి గ్రామాలకు చేరేందుకు ప్రయత్నించారు. వారిలో చాలామంది వారి ఈ సుదీర్ఘ ప్రయాణంలో మరణించారు. వీరందరికీ సాధ్యమైనంత సహాయాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ సహాయక చర్యలు తీసుకుంటోంది.

కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీమతి. సోనియా గాంధీ మరియు ఎం.పీ రాహుల్ గాంధీ గార్లు వలస కార్మికులు, రైతులు, రోజువారీ వేతన దారుల బాధలను తీర్చాలని కేంద్ర ప్రభుత్వానికి అనేక సూచనలు చేశారు. కానీ కేంద్రం సహాయాన్ని అందించకుండా వలస కార్మికులను, వారి కష్టాలను విస్మరిస్తూనే ఉంది, అంతేకాకుండా వారిని ఆదుకునేందుకు సరైన చర్యలు తీసుకోలేకపోయింది.

మిత్రులారా రైతులు, వలస కార్మికులు, రోజువారీ వేతన దారులు, ఎంఎస్‌ఎంఇలు, చిన్న తరహా వ్యాపారాలు మరియు వ్యవస్థీకృత కార్మికుల గొంతుగా ఉండడం మన కర్తవ్యం, దానిని మనం నిరంతరం కొనసాగించాలి.

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో గురువారం 28 వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీ మీ సామాజిక మాధ్యమాల భారీ ఆన్‌లైన్ ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీని ద్వారా దేశంలో బాధపడుతున్న ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేద్దాము. వారి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రచారం చేద్దాం.


"ఆదాయపు పన్ను పరిధికి వెలుపల ఉన్న అన్ని కుటుంబాలకు రూ.10 వేలు ప్రత్యక్షంగా నగదు బదిలీ వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ మీరే స్వయంగా ఒక వీడియో రూపొందించి మీ సామాజిక మాధ్యమంలో ఏదైనా ఫేస్‌బుక్, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మొదలైన వాటిలో పోస్ట్ చేయగలరు"

వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకేసారి ఆన్‌లైన్‌లోకి వచ్చి బలమైన నిరసన తెలుపుదాం. ఈ ప్రచార కార్యక్రమంలో 50 లక్షల మంది పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు, నాయకులు మరియు సానుభూతిపరులను నమోదు చేయాలని మేము కోరుకుంటున్నాము.

దీని కోసం AICC సోషల్ మీడియా విభాగం మీతో సమన్వయం చేసుకుంటుంది, వివరాలను పంచుకుంటుంది. ఈ సందేశాన్ని ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు, పిసిసి ఆఫీస్ బేరర్లు, డిసిసి ఆఫీస్ బేరర్లు మరియు పార్టీ కార్యకర్తలకు పిసిసిలు మరింతగా తెలియజేయాలని అభ్యర్థించాము.

మీ భవదీయులు

 (కేసీ వేణుగోపాల్)
 ప్రధాన కార్యదర్శి
 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ

డా శ్రవణ్ దాసోజు
జాతీయ అధికార ప్రతినిధి
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ



No comments:

Post a Comment