Saturday 9 May 2020

గల్ఫ్ కార్మికులను ఉచిత రవాణా ఖర్చులతో తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ : ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రావన్ దాసోజు

హైదరాబాద్, మే 9: తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఉచితం రవాణా ఖర్చులతో తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ బుధవారం డిమాండ్ చేసింది. ఈ విషయమై, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రావన్ దాసోజు మరియు టీపీసీసీ యెన్ఆర్ఐ సెల్ కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.



అనంతరం విలేకరుల సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రావన్ దాసోజు మాట్లాడుతూ, కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందడంతో గల్ఫ్ వలస కార్మికుల జీవిన విధానం అక్కడ ఆందోళనగా, కష్టతరంగా మరింత తీవ్రమయ్యాయిని మాట్లాడారు.

అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పురుషులు మరియు మహిళలతో సహా తెలంగాణ నుండి 12-15 లక్షలకు పైగా వలస కార్మికుల శక్తి ఉందని తెలిపింది. ఈ గల్ఫ్ వర్క్‌ఫోర్స్ నుండి దాదాపు ప్రతి నెలా రూ .1500 కోట్ల విలువైన విదేశీ మారకం తెలంగాణ రాష్ట్రానికి పంపబడుతుందని అంచనా అని తెలిపారు.

కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా బిన్నంగా మారిపోయాయని. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఒకేసారిగా కుప్పకూలిన చమురు ధరల వల్ల అరబ్ గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టపోవడం జరిగింది. దీని కారణంగా వారి వ్యాపార కార్యకలాపాల పరిధి కూడా ఒక్కసారి తగ్గడంతో దీని ఫలితంగా చాలా మంది కార్మికులను పనుల, ఉపాధి నుండి తొలగించారు. అలాగే కరోనా మహమ్మారి కొంత వరకు  తగ్గినప్పటికీ, చమురు ధరలు ఒక్కసారి తగ్గడం ద్వారా  తీవ్రమైన వ్యాపార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది మరియు గల్ఫ్ వలస కార్మికులు వారి ఉపాధిని మరియు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది తెలిపారు .

ఫలితంగా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాలలో ఉన్న కార్మికులు వారి  జీవితాల మరియు జీవనోపాధి గురించి  తీవ్ర వేదనలో ఉన్నారు. వారిలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు, సరైన జీవనోపాధి పొందడంలేదు మరియు ప్రస్తుత పరిస్థితుల్లో సరియైన వైద్య సంరక్షణ కూడా వారికీ లేదు మరియు చాలా ప్రమాదకర పరిస్థితులలో జీవించవలసి వస్తుంది అలాగే  కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ పరిస్థితులలో, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్య సహకారంతో సమన్వయ చేసుకొని, గల్ఫ్ లో ఉన్నటువంటి కార్మికులు భారతదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నారో వారిని ఉచిత రవాణా ఖర్చులతో తీసుకురావాలని శ్రావణ దాసోజు డిమాండ్ చేశారు.

ప్రపంచంలోని వివిధ దేశాలలో మరియు ప్రాంతాల నుండి కార్మికులను భారతదేశానికి తిరిగి రావడం కోసం విమానాల ఏర్పాట్లు  చేయడానికి, భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మేము స్వాగతిస్తున్నామని, అయితే భారతదేశానికి తిరిగి రావడానికి విమాన ఛార్జీలు  ప్రభుత్వం వసూలు చేయడం సరికాదని శ్రావన్ అన్నారు. కార్మికులు ప్రస్తుత పరిస్థితులలో వారికీ ఎలాంటి ఉపాధి,ఆదాయం లేకుండా ఉన్నారని అలాగే వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు .

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్  (జిసిసి) దేశాల నుండి విమానాల ద్వారా హైదరాబాదుకు తీసుకరావడం కోసం కేంద్ర ప్రభుత్వమే  కార్మికుల విమాన ఛార్జీలు చెల్లించే విధంగా  తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని మరియు హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఆయా గ్రామాలకు స్థానిక రవాణా ఏర్పాట్లను రాష్ట్రప్రభుత్వం చేయాలనీ  శ్రావణ్  దాసోజు సూచించారు..


తెలంగాణకు తిరిగి వచ్చిన తరువాత, ఆ కార్మికులకు గౌరవంగా మరియు మంచి జీవన ప్రమాణాలతో వారి స్వస్థలాలలో స్థిరపడటానికి వారికీ  పునరావాసం & పునర్వవస్థీకరణము ప్యాకేజీని ఇవ్వాలని శ్రావణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహకరించిన గల్ఫ్ కార్మికుల కోసం మనం చేయగలిగిన అతి చిన్న సహాయం అని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment