Friday 25 October 2019

ఆర్టీసీ ఆస్తులపై, అప్పులపై, ఆదాయం పై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జి తో సమగ్ర విచారణ జరిపించాలి... శ్రవణ్ డిమాండ్

హై కోర్ట్ తీర్పులను బేఖాతరు చేస్తూ ఆర్టీసీ కార్మికులకు జీతం ఇవ్వకుండా కెసిఆర్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డట్లే - శ్రవణ్ ఆరోపణ


ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజంహుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచినంత మాత్రానతెలంగాణ సమాజం మొత్తం ఆమోదించినట్టు కాదని గుర్తు పెట్టు కోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారుసముద్రంలో అలలు ఉన్నట్టు ఆటుపోట్లు సహజంఓటమిని  హుందాగా స్వీకరించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉంటుందన్నారుఅందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా  అపజయాన్ని స్వీకరిస్తోందని చెప్పారుఎన్నికలలో గెలిచినంత  మాత్రాన కెసిఆర్ నియంతృత్వ ప్రభుత్వ విధానాల కు ప్రజల మద్దతు ఉన్నట్టు కాదు అని శ్రవణ్ అన్నరు.

నిన్న ముఖ్యమంత్రి చాలా అహంకార పూరితంగాఅప్రజస్వామికంగా మాట్లాడారు.  పైగా ఆర్టీసీ కార్మికులుయూనియన్ నాయకులువిపక్షాలపై , జర్నలిస్టులపై నోరు పారేసుకోవడం బాధాకరమని అన్నారు

 ప్రతిపక్షాలు ప్రతి పక్ష పార్టీలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలనితమ పంథా మార్చు కోవాలని కెసిఆర్ అన్న మాటలకుసమాధానంగా  సంతలో గొడ్లను కొనుగోలు చేసినట్లుప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడం  పంథా అని ఎద్దేవా చేసారుసీఎం ను చూస్తూ వుంటే గురువింద సామెత గుర్తుకు వస్తోందిప్ర నీతులు చెప్పే ముందు తాను వెనక్కి చూసుకోవాలన్నారుఅత్యంత భాద్యతా రాహిత్యంతోగెలుపు అహంభావంతో కేసీఆర్ మాట్లాడారుఆయన చేసేవన్నీ నీతి మాలిన పనులుమరో వైపు నీతులు వల్లె వేస్తూ విపక్షాలపై నోరు పారేసు కోవడం ఆయనకే చెల్లిందన్నారుకిలో చికెన్ ఇవ్వకుండామద్యం ఇవ్వకుండా, 2 వేల నోటు ఇవ్వకుండా ఎలా గెలిచారో ఆయన అంతరాత్మకు వదిలేస్తున్నామని అన్నారుతాను కొలిచే యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ్మ స్వామిలేదా తాను కొలిచే అమ్మ వారిపై ప్రమాణం చేసి చెప్పమనండి ఇవేవి లేకుండా హుజూర్ నగర్ లో గెలిచానని కెసిఆర్ చెప్పాలని సవాల్ విసిరారు దాసోజు.

ఒక తిమింగలం వలె వ్యవహరిస్తూప్రతిపక్షాలను అణచివేస్తూప్రశ్నించే గొంతులను కాలరాస్తూఆధిపత్య అహంకారంతో ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారుకార్మికులకు కూడా రాజ్యాంగ పరమైన హక్కులు ఉంటాయని మరిచి పోయి కనీస ఇంగితం  లేకుండా మాట్లాడారుముఖ్యమంత్రి స్థాయిని మరిచి పోయి దిగజారి మాట్లాడారుతనను దిక్కరంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతారా అనే అక్కసు తోఇష్టం వచ్చినట్టు మాట్లాడారుబేవకూఫ్ లనిబుద్ధి  జ్ఞానం లేదనిఇష్టానుసారం మాట్లాడారు.

సీయం అనే వ్యక్తి తండ్రి లాంటి వారుపిల్లలు అలిగితే తండ్రి సముదాయించడం సహజంకడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన వ్యక్తి కార్మికుల కడుపులో తన్నినట్లు వ్యవహారం చేస్తూతన మాట వినకపోతే కానీ వినక పోతే వాల్ల జీవితాలు నాశనం చేస్తాను అన్నట్లు రెచ్చి పోయి వ్యవహరించడం సబబు కాదన్నారు.

కరీంనగర్ ఎన్నికల సభలో ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పిన మీరే మాట మార్చారుకార్మికులను తక్కువ చేసి టార్గెట్ చేశారుయూనియన్ల వల్లనే ఆర్టీసీ కి నష్టం అన్న కెసిఆర్ టీఎంయూ ను ఎందుకు ఏర్పాటు చేసినట్లు అని నిలదీశారు. .  సంఘానికి హరీష్ రావు గౌరవ అధ్యక్షుడు గా యెట్లా ఉన్నారుఆర్టీసీ కార్మికులు కూడా సకల జనుల సమ్మెలో పాల్గొనాలని కోరలేదానువ్వు ఉద్యమ సమయంలో వారితో కలిసి భోజనం చేయలేదా అని ప్రశ్నించారు.  సరే నీ అవసరం కోసం వారిని వాడుకున్నావుఇప్పుడు పవర్ లోకి వచ్చాక వారిని వదిలేశావుఇప్పుడు సమ్మె చేయడం నేరమంటున్నావుఇదెక్కడి నీతి అని దాసుజు నిలదీశారు.

ఎవడయ్యా అని ఒక జర్నలిస్టును బేవకూఫ్ అంటూ మాట్లాడారు. . దసరా పండుగ చేసుకోకుంట కార్మికులువారి కుటుంబాలు   వైపు పస్తులు పడుతుంటేవారి బాధను గుర్తించ కుండా కెసిఆర్ తో సహా తెరాస పెద్దలు వెకిలి నవ్వులు నవ్వుకుంటూ మాట్లాడారుజర్నలిస్టులని అందరిని బెదిరిస్తూ కేసీఆర్ మాట్లాడారుకడుపు మండి కార్మికులు ఒక మాట మాట్లాడితే  ఒక్క దానిని మనసులో పెట్టుకుని 50 వేల మంది కార్మికులను పొట్ట గొట్టాడన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియా గాంధీని దయ్యం అని,, మన్మోహన్ సింగ్ ని అటెండర్ అని  కెసిఆర్ పలుమార్లు అనరాని మాటలు అన్నారని, . అయినా భేషజాలకు పోకుండా కేసీఆర్ తో చర్చలు జరిపితెలంగాణ రాష్ట్రం ఇచ్చిన విషయాన్నీ  కేసీఆర్ మర్చి పోయారా అని ప్రశ్నించారు.

ఆర్టీసీకి సంబంధించిన లెక్కలను కాగ్ కు కూడా  ఇవ్వడం లేదన్నారుఆర్టీసీకి సంబంధించి అప్పుల మీద ఆస్తుల మీద ఆదాయం మీద ఒక శ్వేతపత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అని సవాల్ విసిరారుమీరేమో చెట్ల మీద విస్తరాకులు కుట్టినట్లు ఇష్టం వచ్చినట్లు మారుతున్నారుకెసిఆర్ 5 ఏళ్లలో 4250 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెబుతుంటేఆర్టీసీ కార్మికులు కేవలం 5 ఏళ్లలో 712 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వాళ్ళ వాదనఎవరు నిజం ఎవరు అబద్ధంఅందుకే హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ తో ఆర్టీసీ ఆస్తులపైఅప్పులపైఆదాయం పై  సమగ్ర విచారణ జరిపించాలని శ్రవణ్ డిమాండ్ చేసిండు.

వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఆర్టీసీ కి ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడి అయ్యిందన్నారువాటన్నింటిని ప్రైవేట్ పరం చేయాలనీ కుట్ర కు తెర తీసింది అని ఆరోపించాడుఆర్టీసీ సేవా సంస్థ నాలేక లాభాపేక్ష ఉన్న ప్రైవేట్ సంస్థ నా అని ప్రశ్నించారుఈరోజు వరకు పూర్తి స్థాయిలో ఎండీని నియమించలేదుసీఎం రోజు వారీగా  సంస్థను మానిటరింగ్ చేయలేడుకావాలని ఆర్టీసీని సమ్మెలోకి నెట్టి వేసిన ఘనత కేసీఆర్ దే నని ధ్వజమెత్తారుప్రైవేట్ ట్రావెల్స్ ప్రజలను నిలువు దోపిడీకి పాల్పడుతు లాభాలు ఆర్జిస్తున్రు ఇది సీఎం కు తెలియదా అని ప్రశ్నించిండ్రు.

కార్మికులపట్ల  ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా వక్ర భాష్యాలు మాట్లాడటం భావ్యం కాదన్నారుఆర్టీసీకార్మిక శాఖల మంత్రిగా పనిచేసిన కెసిఆర్ కు కార్మిక చట్టాల పై కనీస అవగాహన లేనట్లు,  సోయి లేకుండా సమ్మెలు చేయొద్దనిట్రేడ్ యూనియన్లు వద్దంటున్నారులక్షల్లో జీతం తీసుకుంటున్న మీరు ఆఫీస్ కు రాకుండా ఉంటున్నారుమరి మీకెందుకు జీతమని దాసుజు నిలదీశారు.

అత్యున్నత న్యాయ స్థానం ఆర్టీసీ కార్మికులకు జీతం ఇవ్వమని ఆదేశించిన స్పందించక పోగా,  ఇవ్వకపోతే కోర్టు కొడుతదా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం కోర్టు ధిక్కారం కాదా అని ప్రశ్నించిండుకేంద్రం కొత్తగా తెచ్చిన  మోటార్ వెహికిల్ చట్టం తెలంగాణకే  వర్తిస్తదా ..మరి ఏపీలో జగన్ కు వర్తించదా అని ప్రశ్నించిండుమరి ఏపి లో ప్రభుత్వం లో విలీనం చేసినట్లు  తెలంగాణ లో ఎందుకు చేయడం లేదు అని నిలదీసింది.

తాను రోడ్డు రవాణా శాఖా మంత్రిగా ఆరోజు విశాఖ పోయినటాయిలెట్స్ చూశానని తద్వారా ఆర్టీసీ ని లాభాల బాటలో పెట్టానని చెప్పిన కెసిఆర్,  మరి ముఖ్యమంత్రిగా ఆర్టీసీ ని లాభాల బాటలో పెట్టేందుకు అదే  తెలివిని ఎందుకు రావాణా శాఖా అధికారులురవాణా మంత్రికి ఇవ్వలేక పోయారని ప్రశ్నించిండు.  ఒక వేళ వాళ్లు దద్దమ్మలు అయితేస్వయంగా కెసిఆర్  ఆరేళ్లుగా తాను ఎందుకు తాను మంత్రిగా చేసిన ప్రయత్నం చేయలేక పోయారని దాసోజు ప్రశ్నించారు.

సంఘాలు వద్దుయూనియన్లు వద్దు అంటున్న కేసీఆర్ టీఎన్ జిఓ , టీజీవో సంఘాల నేతలతో సీఎం ఎందుకు పిలిచి మాట్లాడుతున్నారంటూ నిలదీశారుడూడూ బసవన్నలతో మాట్లాడతాడు..కానీ హక్కులను ప్రశ్నించే వారిని మాత్రం ఒప్పుకోడు అని నిలదీసిండు.

తెలంగాణను అప్పుల రాష్ట్రం గా మార్చిన  కెసిఆర్  ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలా అని దాసుజు ప్రశ్నించారునిజం షుగర్ ఫ్యాక్టరీ తో సహా నిజాం వారసత్వ సంపద ని అయిన ఆర్టీసీ ని   ప్రైవేట్ పరం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు.  ఇలాగే చేస్తే కాసిం రజివికి   పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని హెచ్చరించారుఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చించాలని డిమాండ్ చేసారు.

No comments:

Post a Comment