హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ 26వ జూన్, 2019 : ఈరోజు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆవరణలో రచయిత శ్రీ బోయపల్లి చక్రధారి చారి గారు రాసిన "దేవుడు .. మనీషి .. జ్యోతిష్యం" పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది . ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్ద్యేశం గురించి రచయిత మాట్లాడుతూ, మనిషి పై గ్రహముల ప్రభావం, గ్రహముల స్వభావం ఎలా ఉంటుంది,అలాగే మనిషి పై దేవుడి ప్రభావం , దేవుడి అంటే నిర్వచనం, దైవం లేకపోతే ఏమోతుంది అనే నూతన విషయాలతో ఈ పుస్తకం రాయడం జరిగింది అని తెలిపారు...అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రావణ్ దాసోజు గారు , మరియు తెలంగాణ ప్రెస్ క్లబ్, జనరల్ సెక్రటరీ బి రాజమౌళి ఆచారి గారు పాల్గొన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శ్రవణ్ దాసోజు గారు మాట్లాడుతూ శ్రీ బోయపల్లి చక్రధర చారి గారు జోతిష్యం ఫై లోతైన అవహగాన కలిగిన పండితుడు. వీరు రాసిన "దేవుడు -మనిషి - జోతిష్యం" అనే పుస్తకం జోతిష్యం మీద కనీస అవగాహన లేని వారికీ కూడా చాలసులువుగా అర్థమైయేలా రాసిండ్రుని . ఈ సృష్టిలో మానవ జీవనం మొదలైన దగ్గర నుంచి గ్రహముల ప్రభావం మనిషి పై ఎలా ఉంటుంది అనే అంశాన్ని చక్కగా వివరించారని. అలాగే కాల పురుషుఁడు అనేచాప్టర్లో మనిషి శరీర భాగాల పై నవ గ్రహముల ప్రభావం ఎలా పడుతుంది అనే అంశము & మనిషి పై దేవుడి ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలతో ఈ పుస్తకంలో చాలా గొప్ప వివరించారని.. సూర్యమండలం అనే చాప్టర్లో సూర్యోదయం, సూర్యాస్తమయం చిత్రం రూపంలో వివరించారని. అలాగే రాహుకేతువులను గురించి కూడా చిత్ర రూపంలో చూపడానికి ప్రయత్నించారు. జ్యోతీష్యుల బలహీనతలను ఎత్తిచూపుతునే, హేతువాదులు తరచు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం నిజంగా అభినదించ వలసిన విషయం అని మాట్లాడం జరిగింది . అలాగే బి రాజమౌళి ఆచారి గారు మాట్లాడుతూ ఈ పుస్తకం సాధారణ మనుషులకు కూడా అర్ధమయ్యే విధంగానూ రచయిత శ్రీ బోయపల్లి చక్రధర చారి గారు రాయడం అభినదించ వలసిన విషయం, ఇలాంటి పుస్తకాలు మరి రాయాలని మాట్లాడం జరిగింది .. అలాగే ఈ కార్యక్రమంలో విశ్వ విశ్వాణి ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజిమెంట్ ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆచార్య గారు, జాతీయ విశ్వకర్మ మహా సభ, జాతీయ కన్వీనర్ బొడ్డుపల్లి సుందర్ గారు , లాలకోట వెంకట చారి గారు, దేవినేని చంద్రశేఖర్ గారు , తదితరులు ప్రముఖులు పాల్గొనడం జరిగింది .
Subscribe to:
Post Comments (Atom)
-
Ø పోలీస్ నియామకాల్లో భారీగా అక్రమాలు Ø టీఎస్పీఆర్బీలో భారీ కుంభకోణం Ø నియామక ప్రక్రియ లోపాల్ని బట్టబయలు చేసిన శ్రవణ్ Ø అర్హ...
No comments:
Post a Comment