Tuesday 2 April 2019

చక్రం తిప్పేవారు ఎవరూ లేరు,అనేక మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భూ కబ్జాదారులే : ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్


Ø చక్రం తిప్పేవారు ఎవరూ లేరు: దాసోజు శ్రవణ్ 

Ø అనేకమంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భూ కబ్జాదారులే : ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ 

Ø టీఆర్‌ఎస్‌ నల్లగొండ అభ్యర్థి ల్యాండ్‌ రికార్డులను ఫోర్జరీ చేశారు
Ø వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్‌
Ø ధనవంతులైన అభ్యర్థులతో రూ.100 కోట్ల క్లబ్‌ను రూపొందించిన కేసీఆర్‌
హైదరాబాద్ఏప్రిల్‌ 2,2019: టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్దుల పై  అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ  అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ విమర్శల వర్షం కురిపించారుఎంపీ అభ్యర్దులంతా భూ కబ్జాదారులుక్రిమినల్ చరిత్ర ఉవ్నవారేనన్నారు15 మంది ఎంపీలు ఉంటే కనీసంవిభజన హామీలు సాధించలేకపోయినవారు 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఏం చేయగలరని శ్రావణ్  ప్రశ్నించారు



టిఆర్ఎస్ 16 మంది ఎంపీ అభ్యర్దులలో చక్రం తిప్పేవారు ఎవరూ లేరు. అంతా భూ కబ్జా దారులే. వారంతా దోచుకోవడమే తప్ప ప్రజలకు ఏం చేయలేరు. కోట్ల రూపాయలు కేసీఆర్ కిచ్చి టికెట్లు తెచ్చుకున్నారు.

టీఆర్ఎస్అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి బంజారాహిల్స్లో రూ.1600 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు రికార్డులు తారుమారు చేసిన అంశంపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్అఖిలభారత కాంగ్రెస్పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్దాసోజు శ్రవణ్తీవ్రంగా ఖండించారు. 
మంగళవారం గాంధీభవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రవణ్మాట్లాడుతూ, కౌశిక్కో ఆప్బిల్డింగ్సొసైటీ పేరుతో సర్వే నంబరు 129/68లో బోగస్వివరాలను సృష్టించారని తెలిపారు. నకిలీ సర్వే నంబరుతో బంజారాహిల్స్లో అబ్దుల్బాసిత్, అబ్దుల్రబ్లకు చెందిన 129/51 మరియు 129/52 స్థలంలో ఆక్రమణ చేశారని వెల్లడించారు. దీంతో వేమిరెడ్డి నర్సింహారెడ్డికి చెందిన కౌషిక్కో ఆప్బిల్డింగ్సొసైటీపై సిటీ సివిల్కోర్టులో భూకబ్జా కేసు నమోదు అయిందని తెలిపారు. అనంతరం కేసు సుప్రీంకోర్టుకు చేరిందని పేర్కొన్నారు.  కౌశిక్కో ఆప్బిల్డింగ్సొసైటీ పేరుతో సర్వే నంబరు 129/68కి మాత్రమే యజమానులు అవుతారని,  129/51 మరియు 129/52 సర్వే నంబరుతో వారికి సంబంధం లేదని స్పష్టం చేసిందన్నారు. అనంతరం, ఆర్టీఐ చట్టం ద్వారా షేక్పేట్గ్రామంలోని బంజారాహిల్స్సర్వే నంబరు 129/68 స్థలం, యజమాని సహా ఇతర వివరాలు సేకరించామని శ్రవణ్తెలిపారు. అయితే, సమాచారం తమ వద్ద లేనందున వివరాలు ఇవ్వలేకపోతున్నామని పేర్కొన్నారని శ్రవణ్వివరించారు.

వేమిరెడ్డి నర్సింహారెడ్డి ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ చేసి 1600 కోట్ల విలువైన 16 ఎకరాల భారీ స్కాంకు పాల్పడినప్పటికీ ఆయనపై ఎలాంటి ఎఫ్ఐఆర్కానీ క్రిమినల్కేసు కానీ నమోదు కాలేదన్నారు. అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మార్చి 25 తేదీన ఫిర్యాదు చేశారని అయినా చర్యలు లేవన్నారు. మరోవైపు రాచకొండ పరిధిలో స్థలం కబ్జాకు పాల్పడినట్లు ఆయనే స్వయంగా ఎన్నికల అఫిడవిట్లో తెలిపారని అన్నారు. నిజాం మీర్మహబూబ్అలీఖాన్72 ఎకరాల స్థలం అనాథ శరణాలయానికి ఇస్తే, ప్రస్తుతం 40 ఎకరాలే మిగిలి ఉందని మిగిలింది ఆక్రమణకు గురయిందని పేర్కొన్నారని తెలిపారు. 1,665 చదరపు అడుగుల స్థలం తనకుందని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నది, నిజాం విరాళంగా ఇచ్చిన స్థలం ఒక్కటేనని శ్రవణ్పేర్కొన్నారు. టీఆర్ఎస్అభ్యర్థి ఉద్దేశపూర్వకంగా ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని శ్రవణ్ఆరోపించారు. తనకు టికెట్కోసం టీఆర్ఎస్పార్టీకి వంద కోట్ల రూపాయలు ఇచ్చారనే ప్రచారం ఉంది. ఇలాంటి భూకబ్జాదారులు ఎంపీగా ఎన్నికైతే రాబోయే కాలంలో ప్రభుత్వ భూములు, ఇతర స్థలాలకు రక్షణ సంగతి ఆలోచించుకోండి ని అన్నారు. వేమిరెడ్డితో పాటుగా చాలా మంది భూకబ్జాదారులు ఉన్నారని ఆరోపించారు. టికెట్ల కోసం వందల కోట్ల రూపాయలు తీసుకుంటూ రూ.100 కోట్ల క్లబ్ను కేసీఆర్ఏర్పాటు చేసి కేవలం కోటీశ్వరులకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఉన్నారని శ్రవణ్తెలిపారు. నమస్తే తెలంగాణలో సైతం ఆయన ఆర్థిక అవకతవకలు ప్రచురితం అయ్యాయని అన్నారు. వీటిని అడ్డం పెట్టుకొని సీఎం కేసీఆర్బ్లాక్మెయిల్చేసి టీఆర్ఎస్లో చేర్పించుకున్నారని, అనంతరం ఆరు గంటల వ్యవధిలో టికెట్ఇచ్చారన్నారు. చేవెళ్ల అభ్యర్థి రంజిత్రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. పౌల్ట్రీ వ్యాపారంతో ఉన్న ఆయన ఎంపీగా ఎన్నికైతే వ్యాపారంపై తప్ప ప్రజలపై దృష్టి పెట్టరన్నారు. మహబూబ్నగర్ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి సైతం టికెట్కోసం రూ. 100 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. మంత్రి మల్లారెడ్డి ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, ఆయన అల్లుడికి ఎంపీ టికెట్కేటాయించారన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్యాదవ్కుమారుడికి సికింద్రాబాద్ఎంపీ టికెట్ఇచ్చారని శ్రవణ్పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వందల కొద్ది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉండగా సాయికిరణ్కు టికెట్దక్కేందుకు ఆయన వంద కోట్ల క్లబ్లో సభ్యుడు అవడమే కారణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ వివేక్కు మొండి చేయి చూపారని ఆరోపించారు.

సారు కారు...పదహారు నినాదంతో టీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోందని, ప్రస్తుతం అదే సంఖ్య కలిగి ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణకు ఏదీ సాధించ లేకపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న దానిని సైతం టీఆర్‌ఎస్‌ఎంపీలు సాధించలేకపోయారన్నారు. ఇప్పుడు 16 సీట్లు గెలిపించాలని కోరుతున్న కేసీఆర్‌, కేటీఆర్‌లు తమ ఇప్పటివరకు ఏం చేయలేకపోయామని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్రిమినల్‌ నేరచరిత్ర ఉన్నవారు, మలిన చరిత్ర ఉన్న వారిని తిరస్కరించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని, ప్రజలకు పట్టం కట్టేవారికి అవకాశం కల్పించాలన్నారు.

పేదరిక నిర్ములన కోసమే పేద కుటుంబాలకు సంవత్సరానికి 72,000 వేల రూపాయల హమీని రాహుల్ గాంధీ మేనిఫెస్టో లో పెట్టారు.  ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ప్రజలు కూడా పని చేసే వారికి పట్టం కట్టాలి కానీ పదవులతో తరాలకు తరగని ఆస్తి కూడబెట్టే వారికి కాదు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం.అని దాసోజు శ్రవణ్ అన్నారు.

No comments:

Post a Comment