Tuesday 8 January 2019

ప్రొటెం స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను అనర్హుడుగా ప్రకటించాలి.......ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.


43 కేసులున్న వ్యక్తి  ఎందుకు శిక్షించడం లేదో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.

అసదొద్దీన్, రాజాసింగ్ లు  మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో పోటీ పడుతున్నారని వ్యాఖ్య.

బిజెపి అధినాయకత్వం రాజాసింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్.


హైదరాబాద్ : జనవరి 8. 2019. తెలంగాణా శాసన సభ సభ్యుడిగా మైనార్టీ కి చెందిన ప్రొటెం స్పీకర్ ముందు  ప్రమాణ స్వీకారం చేయనని  మత తత్వ బిజెపి పార్టీ కి చెందిన  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాజా సింగ్ వ్యాఖ్యలు యావత్ మైనార్టీ సమాజాన్ని కించ పరిచినట్లేనని, ఆసమాజం పై ఆయనకున్న ద్వేష భావాన్ని బహిర్గతం చేస్తున్నాయని, ప్రజాస్వామ్య సిద్దాంతాలకు, లౌకిక విధానాలకు ఆయువు పట్టైన శాసనసభ లో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కొనసాగే అర్హత లేదని ఆయననను తక్షణమే అనర్హుడుగా ప్రకటించాలని ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు డిమాండ్ చేశారు.

43 కేసులున్న వ్యక్తి  ఎందుకు శిక్షించడం లేదో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై దాదాపు 43 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వాటిలో ఎక్కువ మేరకు విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించినవేనని డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు.  2014 లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన  తర్వాత రాజాసింగ్ పై దాదాపు 24 కేసులు నమోదయ్యాయన్నారు. టీఆర్ఎస్ పాలన లో ఆయన పై నమోదయిన ఏ ఒక్క కేసుల్లో  కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవన్నారు. లౌకిక వాదం అంటూ గొప్పలు చెప్పే కేసీఆర్  ఎందుకు రాజాసింగ్ ను కాపాడుతున్నారని, పోలీసులు ఆయన పై చర్యలు తీసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీతో అంటకాగుతున్న ఎంఐఎం పార్టీ నేత అసదొద్దీన్ ఒవైసీ రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పై ఎందుకు వత్తిడి తేలేకపోతున్నారో, ఈ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటో స్పష్టం చేయాలన్నారు.

అసదొద్దీన్, రాజాసింగ్ లు  మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో పోటీ పడుతున్నారని వ్యాఖ్య.

ఓవైసీ సోదరులు, రాజాసింగ్ లు ఇరువురు  విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూఒకరికి మరోకరు సహకరించుకుంటున్నారన్నారు.  భవిష్యత్తులో ఈ ఇరువురు మట్టి కరువక తప్పదని హెచ్చరించారు. ద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలకు పూనుకోక పోతే  వీరి ఆగడాలకు అడ్డుండదన్నారు.చట్టంమంటే భయం లేకుండా వ్యవహరిస్తు సంఘ విద్రోహులుగా  పేట్రేగి పోతున్నారని ఆరోపించారు.
రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలి... డాక్టర్ శ్రవణ్ డిమాండ్
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో మాట్లాడిన రికార్డుల ఆధారంగా రాజాసింగ్ పై పెండింగ్ లో ఉన్న కేసుల పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను డాక్టర్ శ్రవణ్ కోరారు.  రాజాసింగ్ కేవలం మతం కారణంగా ప్రొటెం స్పీకర్ ముందు ప్రమాణం చేయననడం పై ఆయన సభ్యత్వాన్ని రద్దు పరిచేందుకు  అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఆయన్ను పదవిచ్యుతుణ్ని చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏ తప్పు చేయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దుచేసిన టీఆర్ఎస్ పార్టీ  ద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.
ద్వేష పూరిత వ్యాఖ్యలను సహించకూడదని ముఖ్యమంత్రికి సూచన.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం పార్టీ నేతలు ఓవైసీ సోదరులను జైలుకు పంపామని అలాంటి ద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని, ద్వేష భావాన్ని పెంపోందించే వ్యక్తులపై కనికరం చూపరాదని, ముఖ్యమంత్రి  వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రవణ్  సూచించారు. 
బిజెపి అధినాయకత్వం రాజాసింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్.
రాజాసింగ్ తన ప్రకటన ద్వారా ఒక కమ్యూనిటి పట్ల తన పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించారని డాక్టర్ శ్రవణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడి లు తమ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను సమర్దిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారో వెల్లడించాలని దేశంలోని అన్ని మతాలు ప్రజల పట్ల సమభావంతో ఉన్నట్లయితే వెంటనే రాజాసింగ్ ను పార్టీనుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒక వర్గం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించే రాజాసింగ్ లాంటి వ్యక్తులు  అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉండడం దురదృష్టకరమని ఇలాంటి వారి వల్ల దేశంలో జాతి సమగ్రతకు భగ్నం కలుగుతున్నదని డాక్టర్ శ్రవణ్ అన్నారు.

No comments:

Post a Comment