Tuesday 22 January 2019

క్యాబినెట్ విస్తరణ జాప్యం వల్ల జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనను అడ్డుకోకపోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమని గవర్నర్ కు లేఖ రాసిన డాక్టర్ శ్రవణ్.


క్యాబినెట్ విస్తరణ జాప్యం వల్ల జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనను అడ్డుకోకపోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమని గవర్నర్ కు  లేఖ రాసిన డాక్టర్  శ్రవణ్.

టీఆర్ఎస్ సర్కార్ కు  గుడ్డిగా  వత్తాసు పలకడం గవర్నర్ కు సరికాదని వెల్లడి.
ఆర్టికల్ 163,164 ప్రకారం కనీసం 12 మంది మంత్రులను నియమించేలా చర్యలు తీసుకోవాలని విజ్నప్తి.
పంచాయితీఎన్నికల్లో మూడోవంతు స్ధానాల్లో  కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంలో కృషి చేసిన కార్యకర్తలకు  అభినందన.  
ఈవిఎంల టాంపరింగ్ జరిగిందని వస్తున్న ఆరోపణ ల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టాలని డిమాండ్.


ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కొనసాగాలంటే రాజ్యాంగ నిభంధనలకు లోబడి తప్పనిసరిగా క్యాబినెట్  విస్తరణ జరగాలని రాజ్యాంగం ప్రకారం కనీసం 12 మంది మంత్రులు ఉండాలని, రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్ రాజ్యాంగ పరిరక్షణకు పూనుకొని తక్షణమే కాబినెట్ మంత్రులను నియమించాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన  మంత్రుల నియామకం ప్రజల ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశమన్నారు, రాజ్యాంగంలో స్పష్టం గా ఉందని దీన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  బేఖాతర్ చేస్తున్నారని కనీసం రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు.  ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణాలో ప్రభుత్వం నడవడం లేదని గవర్నర్ కు తన పనితీరులో సహాయకులుగా ఉండాల్సిన మంత్రులు లేకపోవడం  సరికాదన్నారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి మాత్రమే ప్రమాణస్వీకారం చేశారని హోం మంత్రికి ఎలాంటి నిర్ణయాధికారాలు లేవని ముఖ్యమంత్రి ఫెడరల్ రాజకీయాలు, పూజలు పునస్కారాల పేరిట కాలం వెళ్లదీస్తున్నారని డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు.
ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే వత్తాసు పలుకుతున్న గవర్నర్... డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆరోపణ
తెలంగాణాలో మొత్తం 33 శాఖలు, 298 ఆర్గనైజేషన్లు ఉన్నాయన్నాయని, కాని టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం ఒకే ఒక మంత్రి మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారని ఆయనకు నాలుగుశాఖలు మాత్రమే కేటాయించారన్నారు. అయినే నిర్ణయాధికారం ముఖ్యమంత్రి చేతిలోనే ఉందని శ్రవణ్ ఆరోపించారు. కనీసం హోం గార్డునుకూడా ట్రాన్స్ఫర్ చేయించలేని హోం మంత్రి మినహా మరో మంత్రి లేక పోవడం దారుణమన్నారు. నిరంతరం మంత్రుల సలహాలు, సూచనలను అమలుచేయాల్సిన గవర్నర్ ఎవరి సూచనలు సలహాల ప్రకారం ప్రభుత్వాన్ని నడుపుతున్నారో స్ఫష్టం చేయాలన్నారు. గవర్నర్ పట్టింపులేనట్టు వ్యవహరించడం వల్ల తెలంగాణాలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదన్నారు.33 శాఖల్లోంచి సమాచారం తెప్పించుకోవడం, రివ్యూలు చేయడం కేవలం ఒక్క ముఖ్యమంత్రి, హోం మంత్రి వల్ల కాదని.. ఇవన్నీ ఒంటిచేత్తే చక్కబెట్టేందుకు ముఖ్యమంత్రి ఏమన్నా సూపర్ కంప్యూటరా అని శ్రవణ్ ఎద్దేవా చేశారు. ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారో స్పష్టంచేయాలని, రాజ్యాంగ ఉల్లంఘనను గవర్నర్ ఎందుకు వత్తాసు పలుకుతున్నరో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏడాదంతా ఎన్నికలతో ఎవరి ప్రయోజనాలు నెరవేరుస్తారని సూటి ప్రశ్న
2014 తర్వాత ఐదేళ్ల పాటు సుస్థిరపాలన కొనసాగుతుందని భావించి ప్రజలు నమ్మకంతో  ఓట్లేసి టీఆర్ఎస్ కు పట్టం కట్టారని, కాని అధికారం లోకి వచ్చింది  మొదలు తన నియంతృత్వ ఆలోచనతో  పాలన సాగించిన కేసీఆర్ అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు పోయిండన్నారు. దీంతో 9 నెలల పాలన కుంటుపడిందని మళ్లీ ఇప్పడు పంచాయితీ ఎన్నికలు, ఆతర్వాత ఎంపీటీసి, జెడ్పీటిసి, ఎంపీ ఎన్నికలు, మున్సిపాలిటి ఎన్నికలు ఇలా ఏడాదంతా ఎన్నికలు ఉండడం వల్ల  కోడ్ అమలులో ఉంటుందని ఇలాగయితే  పాలన సజావుగా  ఎలా సాగుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కూడా మంత్రులను నియమించక పోవడం వల్ల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.
అస్తవ్యస్థంగా ఆర్ధిక వ్యవస్థ.. డాక్టర్ శ్రవణ్
తెలంగాణా రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి లోటు బడ్జెట్ తో కొట్టుమిట్టాడుతోందని డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు. డబ్బులు లేక వేల కోట్ల కాంట్రాక్ట్ లు అన్నీ ఆగిపోయాయన్నారు. ఒకటో తారీఖున రావాల్సిన ఫించన్లు  సకాలంలో విడుదల చేయలేకపోతున్నారన్నారు. ఆర్ధిక మంత్రి ని నియమించకపోతే బడ్జెట్ ఎవరు తయారుచేస్తున్నారో స్పష్టత లేదన్నారు. ఒక పక్కన సిబ్బందికి  జీతాలు ఇవ్వడంలో ఆలస్యం అవుతోందని, ఇంతా జరుగుతున్నా ముఖ్యమంత్రి పై ఒత్తిడి తెచ్చి మంత్రి వర్గ విస్తరణ చేపట్టాల్సిన గవర్నర్ స్పందించక పోవడం సరికాదన్నారు. అలాగే 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో  ఎన్నో వాగ్దానాలు చేశారని  వాటన్నింటిని కొనసాగిస్తారా లేక వదిలేస్తారో తెలియడం లేదని డాక్టర్ శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతు బంధు పథకానికి సంబంధించిన అంశంలో ఎన్నికల కు ముందు  రైతులకు డబ్బులు వచ్చినట్లు మెసేజ్ లు పంపారని కాని ఇంతవరకు ఎవరి ఖాతాల్లో  డబ్బులు జమకాలేదని ఆరోపించారు.  
నిరుద్యోగ సమస్యలపై శాసనసభలో ఎందుకు ప్రస్తావించలేదని గవర్నర్ కు సూటి ప్రశ్న.
తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదిరి చూస్తున్నారని కాని వారి సమస్యను నివారించేదిశగా ఎలాంటి ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేదని డాక్టర్ శ్రవణ్ దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగం చూస్తే ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాకుండా. ప్రభుత్వం ఏం చెబితే అదే వేదంగా నడుచుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు చేయడం వారికి కొమ్ముకాయడం గవర్నర్ వ్యవస్థ ను దిగజారుస్తుందన్నారు.
163,164 ఆర్టికల్ ప్రకారం క్యాబినెట్ విస్తరణ వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న శ్రవణ్
టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఆర్టికల్ 163,164 ప్రకారం
క్యాబినెట్ విస్తరించేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రవణ్ సూచించారు. కనీసం  పన్నెండు మంది మంత్రులను నియమించేలా వత్తిడి చేయాలన్నారు. రాజ్యాంగానికి కస్టోడియన్ అయిన గవర్నర్ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని రాజ్యాంగ సాంప్రదాయాలను కాపాడాలని మొద్దు నిద్రను వీడాలని సూచించారు.
పంచాయితీఎన్నికల్లో మూడోవంతు స్ధానాల్లో  కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంలో కృషి చేసిన కార్యకర్తలకు  అభినందన.  
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండాను పల్లెపల్లెకు మోసుకు పోయి పంచాయతీరాజ్ ఎన్నికల్లో అనేక గ్రామాల్లో సర్పంచ్ లను గెలిపించుకున్నకార్యకర్తలను డాక్టర్ శ్రవణ్ అభినందించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య నాయకులంతా ఓటమి బాధతో ఉన్నా కార్యకర్తలు మాత్రం ఎత్తిన జెండా విడవకుండా సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగిరేసిన్రన్నారు. బెదిరించి భయపెట్టి 800 పై చిలుకు ఏకగ్రీవం చేసినా పోటీచేసిన 1800 సర్పంచ్ స్ధానాల్లో 900 స్థానాల్లో కాంగ్రెస్  పార్టీ గెలిచిందని దీన్ని బట్టి  చూస్తే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దొడ్డి దారిన గెలిచిందని స్పష్టం అవుతోందన్నారు. విచ్చల విడిగా మద్యాన్ని ఏరులై పారించినా అడుగడుగునా పోలీసులను మోహరించినా  పెద్దయెత్తున సీట్లు గెలుచుకోవడం చూస్తే గ్రామాల్లో కాంగ్రెస్  పార్టీకి ఉన్న ఆదరణ ఏంటో స్పష్టం అవుతోందన్నారు. ఇంకా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను బెదిరించి భయపెట్టి తమ పార్టీలోకి లాక్కున్నారని లేకుంటే మరిన్ని సీట్లు గెలుచుకునే వారమన్నారు. రెండు, మూడు విడుతల్లో జరుగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషిచేయాలని పిలుపు నిచ్చారు.
ఈవిఎం ల హాకింగ్ నిజమేనని నిపుణులు తేల్చినందున రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పెట్టాలని డిమాండ్.
లండన్ లో నిర్వహించిన హాకతాన్ లో  ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్ లను హాకింగ్ చేయడం సాధ్యమేనని ప్రముఖ నిపుణుడు సయ్యద్ షుజా తేల్చిన నేపధ్యంలో రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ప్రవేశ పెట్టాలని ఎన్నికల కమీషన్ ను డాక్టర్ శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈవిఎంలు టాంపరింగ్ చేశారని వివిపాట్ స్లిప్పులు లెక్కించాలని తాము చేసిన విజ్నప్తి ని ఎన్నికల కమీషన్ బేఖాతర్ చేసిందని  ఆయన ఆరోపించారు. అలాగే సయ్యద్ షుజా చెప్పినట్లు హాకింగ్ వెనుక కుట్ర కోణం ఉందని గోపీనాధ్ ముండే, గౌరీలంకేశ్ హత్యల వెనుక ఉన్న గూడు పుఠాణీ వెలికి తీయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ శ్రవణ్ వెంట కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు సయ్యద్ నిజాముద్దీన్,  చరణ్ కౌశిక్ యాదవ్ లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.






No comments:

Post a Comment