Tuesday 4 December 2018

బిజెపి, టీఆర్ఎస్ అభ్యర్ధుల పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దాసోజు శ్రవణ్.
ఓటర్లను మభ్యపెట్టేందుకు తాయిలాలు పంచుతున్నారని ఆరోపణ.






ఖైరతాబాద్ నియోజకవర్గంలో బిజెపి, టీఆర్ఎస్ అభ్యర్ధులు ఓటర్లను మభ్యపెడుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురాశతో  ఓటర్లకు డబ్బులు ,మద్యం పంపిణీ చేసేందుకు పెద్దయెత్తున డంపులు ఏర్పాటు చేశారన్నారు. బస్తీల్లో తెల్లవారుఝామున, అర్ధరాత్రి వేళ డబ్బుల పంచుతున్నారన్నారు.  తమ మాట వినని ఓటర్లను బెదిరింపులకు  గురి చేస్తున్నా రన్నారు. టీఆర్ ఎస్, బీజెపి అభ్యర్దులు పెద్ద యెత్తున అక్రమాలకు పాల్పడుతున్నా పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలా జరిగితే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు బీజెపి అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి ఓటర్లను మభ్యపెడుతూ ఫ్రీ గిఫ్ట్ కూపన్ లు అందిస్తున్నారన్నారు. అందుకు సంబంధించిన కూపన్ ను ఎన్నికల అధికారికి అందజేశారు..ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు అభ్యర్ధులపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఎన్నికల అధికారికి వినతి పత్రం అందజేశారు. డాక్టర్ శ్రవణ్ దాసోజు వెంట  టీపీసీసీ కార్యదర్శులు మొగుళ్ల రాజిరెడ్డి, చరణ్ కౌషిక్ యాదవ్, మధుకర్ యాదవ్,  మాజీ కార్పోరేటర్ షరీఫ్, హరినాథ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment