Wednesday 5 December 2018

కాంగ్రెస్ పార్టీ ని గెలిపిద్దాం....పీజేఆర్ విగ్రహానికి ప్రాణం పోద్దాం.. శ్రవణ్ పిలుపు.

రెండు రోజులు అప్రమత్తంగా ఉండండి.. విజయం మనదే..డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్.
కాంగ్రెస్ పార్టీ ని గెలిపిద్దాం....పీజేఆర్ విగ్రహానికి ప్రాణం పోద్దాం.. శ్రవణ్ పిలుపు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుడి గాలి ప్రచారం నిర్వహించిన శ్రవణ్
మాజీ మంత్రి మైసురారెడ్డిని కలిసిన శ్రవణ్ దాసోజు







పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చివరికంటా పీజేఆర్ పోరాడిన తరహాలో తాను కూడా బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాడుతానని ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్ధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఇవాళ చివరి రోజు ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆయన ఖైరతాబాద్ లోని బడాగణేశ్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ముందుగా స్ధానిక పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసిన శ్రవణ్ పీజేఆర్ ఆశయాల కోసం చివరికంటా పోరాడుతానన్నారు.
రెండు రోజులు అప్రమత్తంగా ఉండండి.. విజయం మనదే..డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్.
అరాచక శక్తులు పొంచి ఉన్నాయని, రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. బస్తీల్లో అమాయక ప్రజలకు డబ్బులు ఎరచూపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. డబ్బులు, మద్యం విచ్చల విడిగా పంపిణీ చేస్తున్నారని ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. బిజెపీ అభ్యర్ధి ఓటర్లను మభ్యపెడుతూ కూపన్లు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.
పీజేఆర్ విగ్రహానికి ప్రాణం పోద్దాం..కాంగ్రెస్ పార్టీ ని గెలిపిద్దాం....
పేద బడుగుల కోసం జీవితాంతం కష్టపడిన పీజేఆర్ ఆశయాలను బతికించడం కోసం , ఆయన విగ్రహంలో ప్రాణం పోయడం కోసం  ఈవీఎం యంత్రంలో 4 వ నెంబర్ లో ఉన్న చెయ్యిగుర్తు పై ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్నప్తి చేశారు. దాదాగిరి దందాగిరి లు చేసేవారిని తరిమికొట్టాలన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుడి గాలి ప్రచారం నిర్వహించిన శ్రవణ్
నియోజకవర్గంలోని బడాగణేశ్, ఖైరతాబాద్ రైల్వేక్రాస్, షాదన్ కాలేజీ, ద్వారకహోటల్, టెలీఫోన్ భవన్, సెక్రటేరియట్, బీఆర్ అంబేథ్కర్ విగ్రహం, లిబర్టీ, హిమాయత్ నగర్, కెఎన్ సీ, నారాయణ్ గూడ, మేల్ కోఠి పార్క్, కింగ్ కోఠి, షేర్ గేట్, బషీర్ బాగ్ ప్లైఓవర్, అసెంబ్లీ, లక్డికాపూల్, ఖైరతాబాద్ చౌరస్తా, ఆనంద్ నగర్ కాలనీ, వెంకట్రమణ కాలనీ, ఎర్రమంజిల్ కాలనీ, తాజ్ కృష్ణా, కార్వీ రోడ్, జహీరానగర్, నందినగర్, కాన్సర్ హాస్పిటల్, టీఆర్ఎస్ భవన్ ,రోడ్ నెంబర్ 12, ఎన్ బీ టీ నగర్, ఎమ్మెల్యే కాలనీ, లోటస్ పాండ్, అపోలో హాస్పిటల్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిఆఫీస్, ఫిల్మ్ నగర్,  జూబ్లీ చెక్ పోస్ట్, ఇందిరానగర్, రోడ్ నెంబర్ 2, ఎంజే కాలేజ్, అమీర్ పేట, బీయస్ మక్తా, ఎంఎస్ మక్తా,  లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ యెత్తున టీడిపి,కాంగ్రెస్ సిపిఐ శ్రేణులు,నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో డాక్టర్ శ్రవణ్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ సింగిరెడ్డి రోహిణ్ రెడ్డి,  పీసీసీ కార్యదర్శులు మొగుళ్ల రాజిరెడ్డి, మధుకర్ యాదవ్, నరికెళ్ల నరేశ్, తదితర నాయకులు కార్యకర్తలు భారీసంఖ్యలో పాల్గొన్నారు. 

No comments:

Post a Comment