Saturday 22 December 2018

ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ పర్యటన

ఇందిరాభవన్ లోఆదివారం మధ్యాహ్నం జరిగే సమావేశం లో పాల్గొనాలని  కార్యకర్తలకు పిలుపు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్  పర్యటన
శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్  సందర్శన.. బ్లాంకెట్ల పంపిణీ,
బడా గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన దాసోజు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్,
నియోజవర్గంలో యువత స్కిల్ బిల్డింగ్ సెంటర్ లను ఏర్పాటు చేస్తామని హామీ.



ఖైరతాబాద్ నియోజకవర్గంలో  నిరుద్యోగ యువత కు నైపుణ్యాల శిక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని  ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన నియోజవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బడాగణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కంప్యూటర్  శిక్షణా  కేంద్రాన్ని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో కలిసి సందర్శించారు.  ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కంప్యూటర్ శిక్షణా కేంద్రం నడుపుతున్న తీరు తెన్నులను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.   ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్ లలో యువత నైపుణ్యాల కోసం మరిన్ని శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే ఆయా ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.




శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్  సందర్శన.. బ్లాంకెట్ల పంపిణీ
ఖైరతాబాద్ నియోజకవర్గ పర్యటన లో భాగంగా దాసోజు శ్రవణ్ మరియు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లు
శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ను సందర్శించారు.  చారిటబుల్ ట్రస్ట్  అధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ చెక్ క్యాంప్ ను సందర్శించి పలువురికి బ్లాంకెట్ లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు ద్వారా ఎంతో మందికి జరుగుతున్న లబ్దిని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో దాసోజు వెంట  కాంగ్రెస్ సీనియర్ నేత మధుకర్ యాదవ్, శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ మహేశ్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇందిరాభవన్ లోఆదివారం మధ్యాహ్నం జరిగే సమావేశం లో పాల్గొనాలని   కార్యకర్తలకు పిలుపు.
ఆదివారం మధ్యాహ్నం  3 గంటలకు గాంధీభవన్ లోని  ఇందిరా భవన్ ప్రాంగణంలో  ఖైరతాబాద్ నియోజకవర్గ స్ధాయి కార్యకర్తలు,సీనియర్ నాయకులు, బూత్ కమిటి మెంబర్లు, ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్ నాయకులు  సమావేశాన్ని ఏర్పాటుచేశామని డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ తెలిపారు.  ఈ సమావేశానికి  నియోజకవర్గంలోని అందరూ పెద్ద యెత్తున తరలిరావాలని పిలుపు నిచ్చారు.

No comments:

Post a Comment