Sunday 23 December 2018

పదవులున్నా లేకున్నా సమస్యలపై మడమతిప్పని పోరాటం చేస్తానని వెల్లడి :టిపిసిసి ముఖ్యఅధికార ప్రతినిది డాక్టర్ శ్రవణ్ దాసోజు

ఈవిఎంలో జరిగిన అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నాం.. టిపిసిసి ముఖ్యఅధికార ప్రతినిది డాక్టర్ శ్రవణ్ దాసోజు...
ఫ్రొఫెషనల్ గా , రాజకీయంగా జన్మనిచ్చిన తల్లి ఖైరతాబాదేనన్న. దాసోజు
పదవులున్నా లేకున్నా సమస్యలపై మడమతిప్పని పోరాటం చేస్తానని వెల్లడి.
అధికార పక్షం పై ప్రశ్నాస్త్రాలు గా మారుదాం..సమస్య ల సాధన కోసం బాణాలు ఎక్కుపెడుదామని కార్యకర్తలకు పిలుపు.
ఓట్లేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన దాసోజు.... జీవితాంతం ప్రజల వెంటే ఉంటానని వెల్లడి...
అర్భన్ సోషల్ ఆడిట్ నిర్వహించి సమస్యల సాధనకు కృషి.
రాహుల్ ప్రధాని కావడం చారిత్రిక అవసరం..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో  కష్టపడి పోరాడుదామని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన శ్రవణ్.
బూత్ లెవల్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ, గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి అంజన్ కుమార్ యాదవ్.
క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన శ్రవణ్, అంజన్ కుమార్ యాదవ్


ప్రొఫెషనల్ గా, రాజకీయ నాయకుడిగా ఆరంగేట్రం చేసిన తనకు ఖైరతాబాద్ నియోజకవర్గం  కన్నతల్లి లాంటిదని టిపిసిసి ముఖ్యఅధికార ప్రతినిధి, ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ శ్రవణ్ కుమార్ అన్నారు.  1990 నుంచి 1993 వరకు ఖైరతాబాద్ నడిబొడ్డున ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఇండియాలో  ప్రాజెక్ట్ ఎయిడ్ ఫ్యాకల్టీగా పనిచేశానని, మళ్లీ రాజకీయంగా తొలి అడుగుకూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచే వేసానని గుర్తుచేసుకున్నారు.  ఆదివారం మధ్యాహ్నం  ఇందిరాభవన్ ఆడిటోరియంలో జరిగిన విస్తృత స్ధాయి నియోజకవర్గ కార్యకర్తలు బూత్ కమిటి సభ్యుల సమావేశంలో మాజీ ఎంపీ గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి అంజన్ కుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్న ఆయన నియోజకవర్గంలో తనను అతి తక్కువ కాలంలో ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రజలందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.




పదవులున్నా లేకున్నా కార్యకర్తలకు అండగా నిలుస్తా.. సమస్యలపై మడమతిప్పని పోరాటం చేస్తా..
ప్రచారం లో ఉన్న సమయంలో ఓటింగ్ ముగిసిన తర్వాత ఎంతో మంది ఫోన్ లు చేశారని ఎమ్మెల్యే గా గెలవబోతున్నారని చెప్పారన్నారు. అలాగే ఇంటలిజెన్స్ అధికారులు కూడా  తన గెలుపు ఖాయమని చెప్పారని  కాని
ఏదో మాయ జరిగిందని ఫలితాలు తారుమారయ్యాయన్నారు. గెలుపు ఓటములు సహజమే అయినా నియోజకవర్గ ప్రజల సమస్యల సాధనలో మడమ తిప్పని పోరాటం చేస్తానని శ్రవణ్ అన్నారు. నియోజకవర్గంలో తన 20 రోజుల ప్రచారంలో రోడ్ల సమస్య, నాలాల సమస్య, డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య, ఇండ్ల సమస్య,  ఇళ్ల పట్టాల సమస్య, భూముల రెగ్యులరైజేషన్ సమస్యలను గుర్తించానని వాటన్నింటిని పరిష్కరించేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తానన్నారు.
అధికార పక్షానికి ప్రతిపక్షానికి తేడా ఉంటుందని  సమస్యల సాధనకోసం వత్తిడి తెచ్చే అవకాశం  ఉంటుందన్నారు.
మంచి నాయకులుగా ఎదగాలంటే ప్రతిపక్షంలోనే ఉండాలన్న శ్రవణ్
యువకులు మంచి నాయకులుగా ఎదుగాలంటే  అధికార పక్షంలో ఉంటే అసలు ఎదిగే అవకాశం రాదన్నారు శ్రవణ్ . నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలంటే ప్రతిపక్షం పెద్ద వేదిక అవుతుందన్నారు.  ప్రజా సమస్యలపై గళమెత్తితే ప్రజలే నెత్తికెత్తుకొని ఆదరిస్తారనన్నారు.  అధికార పక్షంలో ఉంటే పోలీసులు గన్ మెన్ లు  తిట్టుకుంటు వెనుక తిరుగుతారని కబ్జాలు లకు పాల్పడ్డాడనని  కాని  ప్రతి పక్ష నాయకలు కొట్లాడితే గౌరవిస్తారన్నారు.  
అర్భన్ సోషల్ ఆడిట్ నిర్వహించి సమస్యల సాధనకు కృషి
ఖైరతాబాద్ నియోజకవర్గ సమస్యలను గుర్తించేందుకు అర్భన్ సోషల్ ఆడిట్ నిర్వహించబోతున్నట్లు శ్రవణ్ దాసోజు తెలిపారు. వార్డుల వారిగా,డివిజన్ వారిగా  సమస్యలను గుర్తించేందుకు  ఓ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని కార్యకర్తలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.
రాహుల్ ప్రధాని కావడం చారిత్రిక అవసరం..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో  కష్టపడి పోరాడుదామని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన శ్రవణ్.
కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు  సమీపిస్తున్నాయని, రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన చారిత్రిక అవసరముందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా మోడీ పాలనలో ఆయన అవలంబించిన విధానాల వల్ల దేశంలో కులాలు మతాల పేరిట కొనసాగిన విధ్వంసం ఇకముందు కొనసాగరాదన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దయెత్తున ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేయించేందుకు ప్రతి కార్యకర్తా నడుం కట్టాలని, మోడీ దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడుదాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేద్దామని పిలుపు నిచ్చారు.
ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను గుర్తించడం లో కార్యకర్తలు సహకరించాలి
నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు పేదలకు సక్రమంగా అందించేందుకు రేషన్ కార్డులు, నిరుద్యోగుల కు రూ. 3వేల భృతి సక్రమంగా అందడంలో కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ళకు ఎంతమంది అర్హులున్నరో వారందరి వివరాలు డివిజన్ వారిగా సేకరించాలన్నారు. ఇందుకోసం ఓ ప్రొఫార్మాను సిద్దం చేస్తున్నట్లు శ్రవణ్ ప్రకటించారు.



కేసుల గురించి ఎవరూ భయపడవద్దు..కార్యకర్తలకు దాసోజు పిలుపు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తే ఎవరూ భయపడొద్దని న్యాయపరంగా పోరాటం చేద్దామని, కార్యకర్తల వెంటే ఉంటానన్నారు. కేసీఆర్ పార్టీని బలహీన పరిచే ప్రయత్నం చేస్తూ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీనుంచి ఎంతమంది పోయినా సుదీర్ఘ చరిత్రి కలిగిన కాంగ్రెస్ పార్టీ గంగ ప్రవాహం లాంటిదని మళ్లీ స్వచ్చంగా,నిరాటంకంగా ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కి బలం కార్యకర్తలేనన్నారు.
ఈవిఎంలో జరిగిన అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నామని వెల్లడి..
శాసనసభ ఎన్నికల్లో ఈవిఎంల గోల్ మాల్ జరిగిందన్నారు శ్రవణ్ ... ఖైరతాబాద్ నియోజకవర్గంలో 19 బూత్ లలో కౌంటింగ్ మిషన్ ఇచ్చిన ఫలితాలకు , ఆర్వో ఇచ్చిన ఫలితాలకు400 ఓట్ల తేడాను గుర్తించామన్నారు.  కోర్టుకు వెళుతున్నామని నిజానికి  కౌంటింగ్ లో తేడా వస్తే ఆ ఎన్నిక చెల్లదని రాజ్యాంగం చెబుతుందన్నారు.
ఒక్కో ఓటు వేయడానికి  1 నిమిషం పడుతుందని,. 3 గంటల వరకు 34 శాతం ఓటింగ్ అయితే.. 3 నుంచి 5 వరకు 52 వేల ఓట్ల పడ్డాయన్నారు. అంటే 20 శాతం అధికంగా ఎలా పడుతాయని ప్రశ్నించారు.నియోజకవర్గంలోని 238 బూత్ లలో ఒక్కోబూత్ లలో 218 ఓట్లు పడితే మొత్తం 52 వేల ఓట్లు అవుతాయన్నారు. ఇందుకు సాయంత్రం 7 గంటలవరకు పోలింగ్ జరుగాల్సి ఉంటుందని ఒకటి అర మినహా 99 శాతం బూత్ లలో 5 గంటలకే ముగిసిందన్నారు. రాష్ట్రం మొత్తంమీద జరిగిన అవకతవక లపై న్యాయపోరాటానికి సిద్దం అవుతున్నామని కాంగ్రెస్ పార్టీ జెండాను, ఎజెండాను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమం చివరగా క్రిస్మస్ వేడుకలను కార్యకర్తల సమక్షంలో డాక్టర్ శ్రవణ్ కేక్ కట్ చేసిన జరిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి, గ్రేటర్ హైదారబాద్ ఇంచార్జి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు టిపిసిసి నాయకులు మధుకర్ యాదవ్, మాజీ కార్పోరేటర్ షరీఫ్, మహేశ్ యాదవ్, ఇందిర, కోటేశ్వరమ్మ, కమ్మరి వెంకటేశ్, నరికెళ్ల నరేశ్, సుమన్, కవిత,  తదితర నాయకులు కార్యకర్తలు బూత్ కమిటి సభ్యులు పెద్దయెత్తున హజరయ్యారు.

No comments:

Post a Comment